RBI Penalty On Indian Overseas Bank For Non Compliance, Know Full Details Inside - Sakshi
Sakshi News home page

RBI Penalty On IOB: ఐవోబీకి ఆర్‌బీఐ షాక్‌! భారీ జరిమానా

Published Sat, Jun 3 2023 10:22 AM | Last Updated on Sat, Jun 3 2023 12:07 PM

RBI penalty on IOB For Non Compliance - Sakshi

ముంబై: ఆదాయ గుర్తింపు, అసెట్‌ వర్గీకరణ నిబంధనల అమల్లో లోపాల కారణంగా ప్రభుత్వ రంగ ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌ (ఐవోబీ)కి రిజర్వ్‌ బ్యాంక్‌ రూ. 2.20 కోట్ల జరిమానా విధించింది. 2021 మార్చి 31న నాటికి బ్యాంకు పరిస్థితి సమీక్షించిన మీదట ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

ఇదీ చదవండి: 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో నెక్సన్‌ ఈవీ మ్యాక్స్‌: ధర ఎంతో తెలుసా?

ఆర్‌బీఐ నిర్వహించిన తనిఖీల సందర్భంగా ఐవోబీ 2020–21 ఆర్థిక సంవత్సరంలో ప్రకటించిన లాభాల్లో 25 శాతం మొత్తాన్ని రిజర్వ్‌ ఫండ్‌కు బదిలీ చేయడంలో బ్యాంకు విఫలమైంది. అలాగే, మొండిబాకీలకు సంబంధించి బ్యాంకు రిపోర్టు చేసిన వాటికి, వాస్తవ ఎన్‌పీఏలకు మధ్య వ్య త్యాసం ఉండటం తదితర లోపాలు తనిఖీల్లో బైటపడ్డాయి.

రెజ్లర్ల ఆందోళన: ఐకానిక్‌ క్రికెటర్స్‌ స్పందించకపోతే ఎలా? పారిశ్రామికవేత్త ట్వీట్‌ వైరల్‌   

 డోంట్‌ మిస్‌ టు క్లిక్‌: సాక్షిబిజినెస్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement