attack on lovers
-
ప్రేమజంటపై దుండగుల అఘాయిత్యం
కర్ణాటక, యశవంతపుర: ప్రేమికులను బెదిరించి డబ్బులు, బంగారు నగలను దోచుకెళ్లడంతో పాటు యువతిని వివస్త్రను చేసి వీడియో తీసిన ఘటన ఘటన కెంగేరి పోలీసుస్టేషన్ పరిధిలో అలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఆమె ప్రియుడైన క్యాబ్ డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఊరికి పంపాలని వస్తే.. వివరాలు.. క్యాబ్ డ్రైవర్, ఒక యువతి ప్రేమలో ఉన్నారు. తనను కలవడానికి వచ్చిన యువతిని ఆదివారం సాయంత్రం ఊరికు పంపడానికి కారులో కెంగేరి రైల్వేస్టేషన్‌కు తీసుకెళ్లాడు. అప్పటికే రైలు వెళ్లిపోవటంతో సోమవారం తెల్లవారుజామున మరో రైలు ఉండగా అందులో పంపాలని అక్కడే ఉన్నాడు. కాలక్షేపం కోసం రైల్వే గేటు పక్కలో కారు కూర్చుని మాట్లాడుతూ ఉండగా నలుగురు దుండగులు వచ్చారు. చాకుతో బెదిరించి డబ్బు, బంగారు నగలు లాక్కున్నారు. చాకును యువతి గొంతుపై పెట్టి డబ్బులు, బంగారం ఇవ్వకుంటే ఆమెను చంపుతామంటూ బెదిరించారు. దీనితో ప్రియుడు తన ఎటీఎం కార్డును దుండగులకు ఇచ్చాడు. వారు సమీపంలోని ఎటీఎం కేంద్రానికి వెళ్లిన రూ. 25 వేలు నగదు డ్రా చేసుకున్నారు. ప్రియుని ముందే ప్రియురాలిని వివస్త్రను చేసి మొబైల్ఫోన్లో వీడియో తీశారు. దోపిడి విషయాన్ని ఎవరికైనా చెబితే వీడియోను వాట్సప్, ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తామని భయపెట్టారు. దీనితో ఒక రోజంతా మౌనంగా ఉండిపోయారు. డ్రైవర్ చివరకు పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు బాధిత యువతిని స్టేషన్‌కు పిలిపించి వివరాలను సేకరించారు. రాత్రి సమయంలో జనసంచారం లేకపోవడంతో దుండగులు ఈ ఘాతుకానికి తెగబడ్డారు. ఈ మార్గంలో అమర్చిన సీసీ కేమరా రికార్డులను పోలీసులు పరిశీలిస్తున్నారు. దుండగుల కోసం గాలిస్తున్నారు. -
ప్రియుడిపై దాడి, ప్రియురాలిపై అత్యాచారం
సేలం: తమిళనాడు రాష్ట్రం సేలం జిల్లా ఏర్కాడుకు పర్యటనకు వచ్చిన ప్రేమ జంటపై ఆటో, కారు డ్రైవర్లు అఘాయిత్యానికి పాల్పడ్డారు. పోలీసులు ఇద్దరినీ గురువారం అరెస్టు చేశారు. వివరాలు.. ఈరోడ్‌కు చెందిన వాసుదేవన్ (27) బయనియన్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇతను ప్రియురాలితో కలిసి బుధవారం ఏర్కాడు పర్యటనకు వచ్చాడు. అక్కడి పర్యాటక ప్రాంతాలను చూసిన తర్వాత రాత్రి ఒక గెస్ట్‌హౌస్‌లో బసచేశారు. ఆ సమయంలో వాసుదేవన్ మద్యం సేవించాడు. దీన్ని ప్రశ్నించడంతో వాసుదేవన్‌కు ప్రియురాలితో గొడవ జరిగింది. దీంతో అలిగిన ప్రేయసి గెస్ట్‌హౌస్ నుంచి బయటికి వచ్చి, అన్నా మార్కు వద్దకు చేరుకుంది. ఆమె వెంటే వాసుదేవన్ కూడా అక్కడికి చేరుకున్నాడు. ఇది గమనించిన అక్కడి ఆటో డ్రైవర్ జెరినాకాడుకు చెందిన మాధవన్ కుమారుడు నాచ్చన్ (అలియాస్) విజయ్‌కుమార్ (37), కారు డ్రైవర్ లూకాస్ కుమారుడు కుమార్ (అలియాస్) ఆరోగ్యదాస్ (32) వాసుదేవన్ ప్రియురాలి వద్దకు వచ్చి విచారించారు. తర్వాత ఇద్దరూ కలిసి వాసుదేవన్‌పై దాడి చేసి డబ్బు లాక్కున్నారు. ఇద్దరూ ఆమెను సేలంలో దింపుతామని నమ్మబలికి ఆటో ఎక్కించుకున్నారు. మార్గం మధ్యలో కుమార్ ఆటో దిగి వెళ్లిపోయాడు. తర్వాత నాచ్చన్ ఆమెను ఓ లాడ్జీకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం గురువారం వేకువజామున ఆమెను సేలం బస్టాండ్‌లో వదిలి పెట్టి పరారయ్యాడు. దీనిపై ఆమె సేలం మహిళా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అదే సమయంలో తన ప్రియురాలు కనిపించలేదని వాసుదేవన్ ఏర్కాడు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసుల సమాచారం మేరకు ఇద్దరు ఒకే ప్రాంతానికి చేరుకున్నారు. పోలీసులు ఓట్టికడై ప్రాంతానికి చెందిన నాచ్చన్పై అత్యాచారం, కుమార్‌పై దోపిడీ కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. -
మోరల్ పోలీసింగ్ పేరుతో జంటపై దాడి
రూర్కెలా: ఉత్తరాఖండ్ లో మోరల్ పోలీసింగ్ పేరుతో ఓ జంటను స్థానికులు చితకబాదారు. యువతీ, యువకుడిని నడివీధిలోకి లాగిన స్థానికులు వారిని నోటికొచ్చిన బూతులు తిట్టారు. తలో చేయి వేసి ఇష్టం వచ్చినట్లు కొట్టారు. రూర్కీ ఏరియాకు చెందిన యువకుడు ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు సమాచారం. ఈ విషయంపై గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆ యువతీ, యువకుడు ఒకే గదిలో ఉన్న సమయంలో పట్టుకున్న స్థానికులు వారిని చితక బాదారు. పైగా ఆ దృశ్యాలన్నింటినీ చిత్రీకరించారు. తమను వదిలిపెట్టాలని వారు వేడుకున్నా కనికరించలేదు. మహిళ అని కూడా చూడకుండా చితకబాదారు. యువకులతో పాటు, మహిళలు కూడా ఈ దాడిలో పాల్గొన్నారు. చిట్టచివరకు పెద్ద మనుషుల జ్యోకం చేసుకొని సర్థి చెప్పటంతో ఆ జంటను వదిలిపెట్టారు. ఈ నెల 17న ఈ ఘటన జరిగింది. వారం రోజుల తర్వాత ఈ విషయం బయటపడింది. -
లైంగికదాడి కేసులో మరో నలుగురి అరెస్టు
పోలీసుల అదుపులో మొత్తం ఏడుగురు వివరాలు వెల్లడించిన డీఎస్పీ సౌజన్య తెనాలిరూరల్ : ప్రేమజంటను అటకాయించి, యువతిపై సామూహిక లైంగికదాడికి పాల్పడిన కేసులో మరో నలుగురు నిందితులను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసులో మొత్తం ఏడుగురిని అరెస్టు చేసినట్టయింది. డీఎస్పీ సీహెచ్ సౌజన్య తన కార్యాలయంలో బుధవారం విలేకరులకు వివరాలను తెలియజేశారు. వేమూరు నియోజకవర్గలోని కొల్లూరుకు చెందిన యువతి ప్రేమికుడు రాజేష్‌తో కలసి జూన్ 26వ తేదీ రాత్రి లారీలో వేమూరు వచ్చింది. రైల్వే గేటు వద్ద వారిని రేపల్లెకు చెందిన అడుసుమల్లి వెంకటేశ్వరరావు అలియాస్ వెంకటేష్, భూపతి గోపి అటకాయించారు. తాము పోలీసులమని బెదిరించడంతో ఐడీ కార్డులు చూపించమని ప్రేమ జంట అడిగింది. దీంతో వారు సమీప పొలాల్లో అప్పటికే మరో యువతితో గడుపుతున్న ఆర్మీ జవాను రాతంశెట్టి సుధాకర్, భూపతి వెంకటరత్నంలకు ఫోను చేసి పిలిపిం చారు. సుధాకర్ తన ఐడీ కార్డు చూపించి పోలీసులుగా నమ్మించి, ఆ మరుసటి రోజు భట్టిప్రోలు పోలీస్స్టషన్కు రమ్మని రాజేష్‌తో చెప్పి, అతడి వెంట ఉన్న యువతిని వెంకటేశ్వరరావు మోటారుసైకిల్‌పై ఎక్కించి రావికంపాడు సమీప పొలాల్లోకి తీసుకువెళ్లారు. ఆందోళనపడిన రాజేష్ వెంటనే 100కు ఫోను చేసి సమాచారం అందించారు. వేమూరు పోలీసులు రంగంలోకి దిగి యువతిని రక్షించారు. అయితే అప్పటికే వెంకటేశ్వరరావు, సుధాకర్ యువతిపై లైంగికదాడికి పాల్పడ్డారు. గోపి, రత్నం అంతకుముందే వారు తెనాలి నుంచి తీసుకొచ్చిన యువతి దగ్గర ఉన్నారు. వీరికి కొద్ది దూరంలో గూడవల్లి వెంకటప్రసాద్, నెల్లూరు అనిల్‌కుమార్ కాపలా ఉన్నారు. మొదట ఈ కేసులో నలుగురిని నిందితులుగా భావించామని, దర్యాప్తులో మరో ఇద్దరు కాపలా ఉన్న విషయం తేలిందని డీఎస్పీ చెప్పారు. ఘటన జరిగిన మరుసటి రోజే వెంకటేశ్వరరావు, సుధాకర్, వారితో ఉన్న యువతిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచామని, గోపి, వెంకటరత్పంలను 7వ తేదీన, వెంకటప్రసాద్, అనిల్‌కుమార్‌ను 8వ తేదీన రేపల్లెలో అరెస్ట్ చేసినట్టు డీఎస్పీ వివరించారు.నిందితులపై కిడ్నాప్, మో సం,ఇంపర్సనేషన్, లైంగికదాడి, నిర్భయ, ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాల కింద కేసులు నమోదు చేసినట్టు చెప్పారు. దర్యాప్తు త్వరితగతిన పూర్తి చేసిన తాలూకా సీఐ యు.రవిచంద్ర, కొల్లూరు, వేమూరు ఎస్ఐలు ఎ. వెంకటేశ్వర్లు, ఎం.మోహన్‌ను డీఎస్పీ అభినందించారు.