
సేలం: తమిళనాడు రాష్ట్రం సేలం జిల్లా ఏర్కాడుకు పర్యటనకు వచ్చిన ప్రేమ జంటపై ఆటో, కారు డ్రైవర్లు అఘాయిత్యానికి పాల్పడ్డారు. పోలీసులు ఇద్దరినీ గురువారం అరెస్టు చేశారు. వివరాలు.. ఈరోడ్‌కు చెందిన వాసుదేవన్ (27) బయనియన్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇతను ప్రియురాలితో కలిసి బుధవారం ఏర్కాడు పర్యటనకు వచ్చాడు. అక్కడి పర్యాటక ప్రాంతాలను చూసిన తర్వాత రాత్రి ఒక గెస్ట్‌హౌస్‌లో బసచేశారు. ఆ సమయంలో వాసుదేవన్ మద్యం సేవించాడు. దీన్ని ప్రశ్నించడంతో వాసుదేవన్‌కు ప్రియురాలితో గొడవ జరిగింది. దీంతో అలిగిన ప్రేయసి గెస్ట్‌హౌస్ నుంచి బయటికి వచ్చి, అన్నా మార్కు వద్దకు చేరుకుంది. ఆమె వెంటే వాసుదేవన్ కూడా అక్కడికి చేరుకున్నాడు.
ఇది గమనించిన అక్కడి ఆటో డ్రైవర్ జెరినాకాడుకు చెందిన మాధవన్ కుమారుడు నాచ్చన్ (అలియాస్) విజయ్‌కుమార్ (37), కారు డ్రైవర్ లూకాస్ కుమారుడు కుమార్ (అలియాస్) ఆరోగ్యదాస్ (32) వాసుదేవన్ ప్రియురాలి వద్దకు వచ్చి విచారించారు. తర్వాత ఇద్దరూ కలిసి వాసుదేవన్‌పై దాడి చేసి డబ్బు లాక్కున్నారు. ఇద్దరూ ఆమెను సేలంలో దింపుతామని నమ్మబలికి ఆటో ఎక్కించుకున్నారు. మార్గం మధ్యలో కుమార్ ఆటో దిగి వెళ్లిపోయాడు. తర్వాత నాచ్చన్ ఆమెను ఓ లాడ్జీకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు.
అనంతరం గురువారం వేకువజామున ఆమెను సేలం బస్టాండ్‌లో వదిలి పెట్టి పరారయ్యాడు. దీనిపై ఆమె సేలం మహిళా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అదే సమయంలో తన ప్రియురాలు కనిపించలేదని వాసుదేవన్ ఏర్కాడు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసుల సమాచారం మేరకు ఇద్దరు ఒకే ప్రాంతానికి చేరుకున్నారు. పోలీసులు ఓట్టికడై ప్రాంతానికి చెందిన నాచ్చన్‌పై అత్యాచారం, కుమార్‌పై దోపిడీ కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment