న్యూఢిల్లీ: నగరంలో ‘లిప్‌లాక్’ హాట్ టాపిక్‌గా మారిపోయింది. బహిరంగంగా జంటలు ముద్దు పెట్టుకోకూడదని, ఇది హిందూ సంస్కృతికి వ్యతిరేకమని కొందరు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడంపై (మోరల్ పోలిసింగ్‌పై) నిరసన వ్యక్తమవుతోంది. ‘కిస్ ఆఫ్ లవ్’ పేరుతో కేరళలోని కోచిలో ఈ నెల 2వ తేదిన ఉద్యమం మొదలైంది. బహిరంగంగా ఒకరికొకరు ముద్దు పెట్టుకోవడాన్ని అనైతిక చర్యగా బావిస్తూ కొన్ని శక్తులు వ్యతిరేకిస్తున్నాయి. దీన్ని వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పలుచోట్ల ‘ముందుల ఉద్యమం’ పేరుతో యువత జంటలుగా ‘లిప్‌లాక్’ చేస్తూ బహిరంగాగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ముంబై, కోల్‌కత్తాతోపాటు తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో హల్‌చల్ చేసిన ‘లిప్‌లాక్’ సందడి దేశరాజధానికి విస్తరించింది. శనివారం వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జంటలు రోడ్లమీదికి వచ్చి నిరసన వ్యక్తం చేశాయి. ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగడంతో విద్యార్థుల అరెస్టులు, విడుదల జరిగిపోయాయి.
దీనికి కొనసాగింపుగా ఆదివారం జవహర్‌లాల్ నె హ్రూ యూనివర్సిటీకి చెందిన విద్యార్థి యువజంటలు గంగాదాబా ఎదుట ముద్దులు పెటుకొని నిరసన కొనసాగించారు. ‘ప్రేమను వ్యక్తం చేసే స్వేచ్ఛ’ కావాలని నినదించారు. మన వేదాల్లో కూడా ఈ స్వేచ్ఛ ఉన్నదని, ప్రముఖ ఖజురాహో దేవాలయంపై కూడా ముద్దుల సన్నివేశాలతో కూడిన శిల్పాలు ఉన్నాయని విషయాన్ని విద్యార్థి యువజంటలు గర్తుచేశారు. కాగా, వామపక్ష విద్యార్థి సంఘాలు లిప్‌లాక్ ఉద్యమాన్ని బలపర్చుతుండగా, మితవాద విద్యార్థి సంఘాలు, ఆర్‌ఎస్ లాంటి శక్తులు అడ్డుకోవడంతో చర్చనీయాంశంగా మారింది.
హాట్ హాట్‌గా..‘లిప్‌లాక్’
Published Sun, Nov 9 2014 10:10 PM | Last Updated on Sat, Sep 2 2017 4:09 PM
Advertisement
Advertisement