వద్దని వేడుకున్నా ప్రేమికులను వీడియో తీసి.. | In Video, Moral Police Allegedly Harass Couple In Tamil Nadu | Sakshi
Sakshi News home page

వద్దని వేడుకున్నా ప్రేమికులను వీడియో తీసి..

Published Tue, Aug 1 2017 12:40 PM | Last Updated on Wed, Jul 10 2019 7:55 PM

(ఇన్‌సెట్‌లో నిందితుడు వేలుమురుగన్‌) - Sakshi

(ఇన్‌సెట్‌లో నిందితుడు వేలుమురుగన్‌)

- కులం పేరుతో దూషణలు.. బెదిరింపులు..
- పరారీలో నిందితులు.. వీడియోను తొలగించిన ఫేస్‌బుక్‌


చెన్నై:
బైక్‌పై వెళుతోన్న ప్రేమికులను అడ్డగించి, వారిని కులం పేరుతో దూషించి, బెదిరింపులకు పాల్పడిన ‘మోరల్‌ పోలింగ్‌ వీడియో’ ఒకటి తమిళనాడులో సంచలనం రేపింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో స్పందించిన పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల అభ్యర్థన మేరకు ఫేస్‌బుక్‌ సంస్థ సదరు వీడియోను తొలగించింది.

పెరంబలూరుకు చెందిన వేలుమురుగన్‌ కోలంగినాథ్‌ అనే యువకుడి ఫేస్‌బుక్‌ ఖాతా నుంచి వీడియో పోస్ట్‌ అయింది. అందులో.. తమను అడ్డుకున్న యువకుల బృందాన్ని ప్రేమజంట బతిమాలుతున్న దృశ్యాలు నమోదయ్యాయి. తాము ప్రేమికులమని, కేవలం మాట్లాడుకోవడానికే వచ్చామని వివరించారు. ‘ప్లీజ్‌.. ఈ అమ్మాయి భవిష్యత్తు నాశనం అవుతుంది. దయచేసి వీడియో తీయకండి..’ అని వేడుకున్నా ముష్కర బృందం వినిపించుకోలేదు. కులం పేరుతో తీవ్రంగా దూషించి, బెదిరించిన దృశ్యాలు కూడా రికార్డయ్యాయి.

రంగంలోకి దిగిన పోలీసులు.. వేల్‌మురుగన్‌ అడ్రస్‌ను కనిపెట్టి ఇంటికి వెళ్లగా, అప్పటికే విషయం తెలుసుకున్న అతను ఊరు విడిచి పారిపోయాడు. నిందితుడి బంధువుల ద్వారా అతని ఆచూకీ కనిపెడతామని, నలుగురైదుగురు కలిసి ఈ దుశ్యర్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వీడియోలో కనిపించిన మరో బైక్‌ ఎవరిదో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. కాగా, ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. బహుశా పెరంబలూరు సమీప గ్రామంలో ఇది జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement