కొచ్చి:'నైతిక పో్లీసింగ్'కు నిరసనగా కిస్ ఆఫ్ లవ్ కార్యక్రమానికి తెరలేపిన పేస్ బుక్ బృందం సభ్యులకు మరో ఆటంకం ఎదురయ్యింది. ఆ ఖాతాలో ఉన్న మరో ఐదుగురు సభ్యుల వివరాలు హ్యాకింగ్ గురయినట్లు ఆర్గనైజేషన్ ప్రధాన సభ్యుడు రాహుల్ పసుపాలన్ మీడియాకు తెలిపాడు. దీని వెనుక ఉగ్రవాద సంస్థల ప్రమేయం ఉందని అనుమానిస్తున్నట్లు బృంద సభ్యుడు రాహుల్ పసుపాలన్ చెప్పారు. హ్యాకింగ్‌కు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కేరళ హోం మంత్రి రమేష్ చెన్నితాలకు ఫిర్యాదు చేశామని చెప్పారు.
అలాగే, తమపై దాడి చేసే ఉద్దేశంతో ఆదివారం కార్యక్రమం జరిగే వేదిక వద్దకు కొందరు మారణాయుధాలతో వచ్చారని ఆరోపించారు. కోచిలోని సాగర తీరంలో కిస్ ఆఫ్ లవ్ కార్యక్రమం ఆదివారం నిర్వహించాలని ఈ గ్రూప్ భావించగా పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. అయితే కిస్ ఆఫ్ లవ్ కు తొంభై వేల వరకూ లైక్ లు వచ్చినట్లు రాహుల్ పసుపాలన్ స్పష్టం చేశాడు.