
సాక్షి, హైదారాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్( టీఎస్‌పీఎస్సీ) కార్యాలయం ముట్టడికి బీజేవైఎం కార్యకర్తలు యత్నించారు. పెద్ద ఎత్తున బీజేవైఎం కార్యకర్తలు టీఎస్‌పీఎస్సీ కార్యాలయం వద్దకు చేరుకొని ఆందోళన చేశారు. అప్పటికే భారీగా మోహరించిన పోలీసులు రంగంలోకి దిగి పలువురు బీజేవైఎం కార్యకర్తలను అడ్డుకొని అరెస్ట్ చేశారు. తెలంగాణ వెంటనే ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి చెల్లించాలని బీజేవైఎం డిమాండ్ చేస్తోంది. ఈ సందర్భంగా బీజేవైఎం అధ్యక్షుడు భాను ప్రకాష్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం నిరుద్యోగుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న దాదాపు 2 లక్షల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
నిరుద్యోగ భృతి వెంటనే చెల్లించాలని, రోజురోజుకు నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని మండిపడ్డారు. ఉద్యోగాల భర్తీ కోసం కమిటీ వేసిన ప్రభుత్వం నోటిఫికేషన్లు ఎందుకు విడుదల చేయడం లేదని సూటిగా ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగాల భర్తీ కోసం ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, అన్ని జిల్లా కలెక్టర్ల ముందు నిరసన తెలుపుతామని పేర్కొన్నారు.
చదవండి: వ్యూహాత్మక అడుగులు: వ్యతిరేకులు, సీనియర్లతో భేటీ
Comments
Please login to add a commentAdd a comment