ఢిల్లీ: ఆదర్శ్ కుంభకోణంలపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తన వైఖరి చెప్పాలంటూ భారతీయ జనతా యువ మోర్చా ఆందోళన చేపట్టింది. కుంభకోణం అంశానికి సంబంధించి రాహుల్ తన వైఖరి తెలియజేయాలని ఢిల్లీలోని బీజేపీ జాతీయ కార్యాలయం నుంచి ర్యాలీ చేపట్టారు.ఆయన నివాసం వైపునకు ర్యాలీగా దూసుకువెళ్లడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఆదర్శ్ కుంభకోణం దెబ్బ కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే ప్రక్షాళనకు అడుగులు వేస్తోంది.
అవినీతి ఆరోపణలతో మకిలపడుతున్న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను పునరుద్ధరించడంపై అధిష్టానం దృష్టి సారించింది. వచ్చే ఎన్నికల్లోపు ప్రజల్లో పార్టీకి ఆదరణ పెంచే దిశగా చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతమున్న రాష్ట్ర మంత్రి వర్గాన్ని పునర్వ్యవస్థీకరించి అవినీతి రహిత పాలన అందించాలని వడివడిగా అడుగులు వేస్తోంది. దీంతో ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీజేపీ సైతం ఆదర్శ్ కుంభ కోణంపై రాహుల్ వైఖరి చెప్పాలంటూ డిమాండ్ చేస్తోంది.