న్యూఢిల్లీ: ఆదర్శ్ కుంభకోణంపై విచారణకు నియమించిన ద్విసభ్య కమిటీని నివేదిక తిరస్కరించడంపై మహారాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలన్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ఎన్సీపీ సమర్థించింది. నివేదికను సమీక్షించాలని ఎవరు వాదించినా తాము మద్దతు తెలుపుతామని, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం తొందరపాటని ఎన్సీపీ ఎంపీ తారిఖ్ అన్వర్ సోమవారం అన్నారు. చవాన్ ప్రభుత్వం ఈ విషయంలో తన నిర్ణయాన్ని పునఃపరిశీలించే అవకాశాలున్నాయని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ సైతం శనివారం పేర్కొన్నారు. పలువురు రాష్ట్ర మంత్రులు, అధికారులకు ఈ కుంభకోణంతో ప్రమేయముందని న్యాయవిచారణ సంఘం నివేదికలో పేర్కొంది.