
( ఫైల్ ఫోటో )
నెల్లూరు జిల్లా: మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను 95 శాతం నెరవేర్చిన ఘనత సీఎం జగన్‌మోహన్‌రెడ్డిదేనని మంత్రి ఆర్‌కే రోజా మరోసారి గుర్తుచేశారు. చేజార్ల మండలం యనమదల, ఎర్రబల్లిలోమేకపాటి విక్రమ్‌రెడ్డికి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్న ఆర్‌కే రోజా.. ఈనెల 23వ తేదీ ఆత్మకూరు ప్రజలు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి కమలం కమిలిపోయేలా మెజార్టీ ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌కు ధీటుగా తీర్చిదిద్దారని, అమ్మ ఓడి పథకం పక్క రాష్ట్రాల్లో ఎక్కడా లేదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు మంత్రి రోజా. ఆరోగ్య శ్రీ ద్వారా కరోనా నుంచి క్యాన్సర్ వరకూ ఉచిత వైద్యం అందిస్తున్న ఏకైక సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment