నెల్లూరు (సెంట్రల్): ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డికి వచ్చే మెజార్టీ చూసి రాజకీయ పార్టీలు రానున్న రోజుల్లో ఇక్కడ పోటీ చేయడానికి కూడా భయపడే విధంగా తీర్పు ఇవ్వాలని వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇదే మీ ఆత్మీయ నాయకుడు గౌతమ్‌కు ఇచ్చే భారీ నివాళి అని చెప్పారు.
సోమవారం ఉప ఎన్నికల్లో కార్యాచరణపై ఆత్మకూరులో అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి, మంత్రులు మేరుగ నాగార్జున, జోగి రమేష్, కారుమూరి నాగేశ్వరరావు, ఆర్‌కే రోజా, చెల్లుబోయిన వేణుగోపాల్ కృష్ణ, రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి, జిల్లా సమన్వకర్త, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, గంగుల బిజేంద్రరెడ్డి, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య, పి అనిల్‌కుమార్, మానుగుంట మహిధర్‌రెడ్డి, ఎమ్మెల్సీ బల్లి కల్యాణ్ చక్రవర్తితో కలిసి నియోజకవర్గంలోని ప్రధాన నేతలతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
చదవండి: (పవన్ కల్యాణ్‌కు కేఏ పాల్ భారీ ఆఫర్.. రూ.1000 కోట్ల నజరానా)
ఈ సందర్భంగా ఉప ఎన్నికల్లో మేకపాటి విక్రమ్‌రెడ్డి గెలుపు నల్లేరు మీద నడకే అన్నారు. అయితే మనకు వచ్చే మెజార్టీపైనే దృష్టి పెట్టాలన్నారు. ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని లక్ష ఓట్ల పైచిలుకు మెజార్టీ తీసుకుని వచ్చి దివంగత మేకపాటి గౌతమ్ ఆత్మకు శాంతి చేకూరేలా నివాళి అర్పిద్దామన్నారు. ఆత్మకూరు వైఎస్సార్‌సీపీకి అడ్డాగా చేద్దామన్నారు. రానున్న రోజుల్లో ఇక్కడ పోటీ చేయడానికి కూడా ఇతన పార్టీ నేతలు వెనుకాడే విధంగా ఒక చారిత్రాత్మక తీర్పును ఇద్దామని పిలుపునిచ్చారు. మేకపాటి కుటుంబానికి రాజకీయాలు కొత్త కాదని, కాని అనుకోని విషాదంతో జరుగుతున్న ఎన్నికలన్నారు. విక్రమ్‌రెడ్డి రాజకీయాలకు కొత్త అయినా.. నియోజకవర్గ ప్రజలతో మమేకమవుతూ ముందుకు పోతున్నారన్నారు. ప్రజలు కూడా తక్కువ కాలంలోనే విక్రమ్‌రెడ్డిని ఆదరిస్తున్నారని కొనియాడారు.
బద్వేలు కంటే ఎక్కువగా మెజార్టీ
►బాలినేని శ్రీనివాసరెడ్డి
ఈ ఉప ఎన్నికలు అత్యంత విషాదం కారణంగా జరుగుతున్నాయని, ఈ ఉప ఎన్నికల్లో బద్వేలు ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి వచ్చిన మెజార్టీ కన్నా ఎక్కువగా ఉండాలని మాజీ మంత్రి, జిల్లా సమన్వయకర్త బాలినేని శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. గౌతమ్‌రెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో ఎంతో బాగా పనిచేస్తూ ముఖ్యమంత్రి వద్ద మంచి పేరు తెచ్చుకున్నారన్నారు. ఆత్మకూరుకు కూడా ఎంతో పని చేశారని, మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆశయాలకు అనుగుణంగా విక్రమ్‌రెడ్డి ప్రజలకు సేవ చేస్తారన్నారు. ప్రజలు సైతం గౌతమ్‌రెడ్డి మరణాన్ని ఇంకా జీర్ణించుకోలేకున్నారన్నారు. ఆయన సోదరుడు విక్రమ్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి గౌతమ్‌కు ఘన నివాళి అర్పించాలని కోరారు.
గౌరవ ప్రదమైన మెజార్టీ
►మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి
ఈ ఉప ఎన్నిక ఎంత విషాదం తరువాత వచ్చిందో ప్రతి ఒక్కరికీ తెలుసునని మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. ఎంతో భవిష్యత్ ఉన్న గౌతమ్‌రెడ్డి అకాల మరణంతో ఎన్నిక అనివార్యంగా జరుగుతుందన్నారు. గతంలో తిరుపతి పార్లమెంట్, బద్వేలు ఉప ఎన్నికలు జరిగాయని, వాటిలో వైఎస్సార్ సీపీకి ఎంత భారీ మెజార్టీ వచ్చిందో అందరం చూశామన్నారు. ఈ ఉప ఎన్నికల్లో కూడా గౌరవ ప్రదమైన మెజార్టీని నియోజకవర్గ ప్రజలు ఇస్తారని నమ్మకం ఉందన్నారు. గౌతమ్ ఏ విధంగా మీకు పని చేశారో, ఏఏ పనులు చేశారో మీకు తెలుసని, విక్రమ్ కూడా గౌతమ్ అడుగు జాడల్లో నడుస్తారన్నారు.
విక్రమ్‌ను ఆశీర్వదించాలని కోరారు. ఈ సమావేశంలో జెడ్పీ చైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ, డీసీసీబీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ దొంతు శారద, విజయ డెయిరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతి, డీఏఏబీ చైర్మన్ నిరంజన్‌బాబురెడ్డి, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు మెట్టుకూరు చిరంజీవిరెడ్డి, మేరిగ మురళీధర్, పోట్టేళ్ల శిరీషా, షేక్ సైదాని, వావిలేటి ప్రసన్న, ఆసిఫా, కిషోర్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment