ఎంజీఆర్‌ సంగం బ్యారేజీ ఆత్మకూరుకే తలమానికం | We Will Grand Welcome For CM YS Jagan To Inaugurate Sangam Barrage | Sakshi
Sakshi News home page

ఎంజీఆర్‌ సంగం బ్యారేజీ ఆత్మకూరుకే తలమానికం

Published Sat, Sep 3 2022 4:06 PM | Last Updated on Sat, Sep 3 2022 4:11 PM

We Will Grand Welcome For CM YS Jagan To Inaugurate Sangam Barrage - Sakshi

నెల్లూరు (సెంట్రల్‌): ఆత్మకూరు నియోజకవర్గానికే ఎంజీఆర్‌ సంగం బ్యారేజీ తలమానికమని, బ్యారేజీ ప్రారంభోత్సవానికి వస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఘన స్వాగతం పలుకుదామని ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి అన్నారు. నెల్లూరులోని ఎమ్మెల్యే నివాసంలో సంగం, ఏఎస్‌పేట, చేజర్ల మండలాల ముఖ్య నాయకులతో ఎమ్మెల్యే విక్రమ్‌రెడ్డి శుక్రవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎప్పటి నుంచో కలలు కంటున్న ఎంజీఆర్‌ సంగం బ్యారేజీ ప్రారంభం ఈ నెల 6న ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రజలకు అంకితం కాబోతుందన్నారు. ముఖ్యంగా ఈ బ్యారేజీకి మన దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజీగా నామకరణం చేశారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి, మేకపాటి గౌతమ్‌రెడ్డి విగ్రహాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. అటువంటి మంచి కార్యక్రమానికి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేద్దామన్నారు. ఈ కార్యక్రమంలో  పలువురు నాయకులు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement