Sangam Barrage
-
టీడీపీ రాక్షసానందం
-
పేరు తొలగించిన మాత్రాన..!
నెల్లూరు, సాక్షి: అధికారం చేపట్టిన వెంటనే.. కొనసాగుతున్న సంక్షేమ పథకాలను ఆపేయడం, వ్యవస్థలను నిర్వీర్యం చేయడం.. ఆఖరికి గత ప్రభుత్వ ఆనవాలు లేకుండా చేయడం పనిగా పెట్టుకున్నారు చంద్రబాబు. తాజాగా.. మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజీ వద్ద నేమ్ బోర్డులోంచి దివంగత మేకపాటి గౌతమ్ రెడ్డి పేరును తొలగించడం విమర్శలకు తావిస్తోంది.వైఎస్సార్ హయాంలో 2008లో బ్యారేజ్ పనులు ప్రారంభమైనప్పటికీ.. ఆయన మరణాంతరం ఆ పనులు అటకెక్కాయి. ఆయన వైఎస్సార్ తనయుడు వైఎస్ జగన్ సీఎం అయ్యాక.. రూ.131 కోట్ల వ్యయంతో సంగం బ్యారేజీని పూర్తి చేయించారు. అలాగే 1195 మీటర్ల పొడవుతో రెండు లైన్ల బ్రిడ్జి రోడ్ కూడా నిర్మించారు.ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల 3.85 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతోంది.నాడు సీఎంగా బ్యారేజ్ వద్ద గౌతమ్ రెడ్డి విగ్రహావిష్కరణలో వైఎస్ జగన్.. మేకపాటి కుటుంబ సభ్యులుఇక.. మంత్రి మేకపాటి గౌతంరెడ్డి సంగం బ్యారేజీ నిర్మాణం కోసం నిరంతరం శ్రమించారు. ఆయన హఠాన్మరణం జిల్లావాసులను కలచివేసినా… గౌతంరెడ్డి పేరు చిరస్థాయిగా ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ బ్యారేజ్‌కు ఆయనపేరు పెట్టాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం పట్ల నెల్లూరు వాసులు, రైతాంగం హర్షం వ్యక్తం చేశారు. నేడు.. కక్షపూరితంగా ఆ పేరు తొలగించడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన పేరు చెరిపినా.. ప్రాజెక్టు కోసం ఎవరు నిజంగా కృషి చేశారనే చరిత్రను మాత్రం చెరపలేరని స్థానికులు అంటున్నారు. -
టీడీపీ నిర్లక్ష్యం.. జగన్ సంపూర్ణం
లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించి అన్నదాత ముఖాల్లో ఆనందం చూడాలనే సంకల్పంతో దివంగత నేత వైఎస్సార్ సంగం బ్యారేజ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అనంతరం అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు వివిధ కారణాలతో బ్యారేజ్ నిర్మాణ పనులపై నిర్లక్ష్యం చూపాయి. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారం చేపట్టాక తండ్రి ఆశయాన్ని నెరవేరుస్తూ రైతులకు అవసరమైన మేర సాగునీరందించాలనే లక్ష్యంతో సంగం బ్యారేజ్ నిర్మాణాన్ని పూర్తి చేసి రైతుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. సంగం: రైతులకు ఇచ్చిన మాటను నెరవేర్చేందుకు అప్పట్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, ప్రస్తుతం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విశేష కృషి చేశారు. వీరి కృషి ఫలితంగానే సంగం వద్ద మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజ్ నిర్మితమై రైతుల పొలాలకు సాగునీరు అందుతుండడంతో వారి ఆనందానికి అవధులు లేవు. 2004వ సంవత్సరంలో సంగంకు వచ్చిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు, ప్రజలు సంగం వద్ద పెన్నానదిపై నిర్మించిన ఆనకట్ట శిథిలమైందని, బ్యారేజ్‌ను నిర్మించాలని విన్నవించారు. అప్పటికే ఉన్న పాత ఆనకట్టను నిర్మించి 125 సంవత్సరాలు దాటడంతో ప్రమాదకరంగా తయారైంది. ఆనకట్ట దెబ్బతింటే లక్షలాది మంది రైతులు ఇబ్బందులు పడతారని గ్రహించిన ఆయన 2006లో సంగం వద్ద రూ.90 కోట్ల నిర్మాణ వ్యయంతో నూతన బ్యారేజ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టి శంకుస్థాపన చేశారు. మొదట్లో బ్యారేజ్ నిర్మాణం గిట్టుబాటు కాదని కాంట్రాక్టర్ నిర్మాణం చేపట్టకపోవడంతో వైఎస్సార్ అధికారులతో చర్చించి 2008లో బ్యారేజ్ నిర్మాణ వ్యయాన్ని రూ.110 కోట్లకు పెంచి మరో సంస్థకు పనులు అప్పగించారు. దీంతో నూతన బ్యారేజ్ నిర్మాణ పనులు జోరందుకున్నాయి. 2009లో వైఎస్సార్ అకాల మృతితో ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం సంగం బ్యారేజ్ నిర్మాణంపై శీతకన్ను వేయడంతో రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చెందారు. టీడీపీ హయాంలో కాలయాపన 2009లో వైఎస్సార్ మృతి అనంతరం వచ్చిన ముఖ్యమంత్రులు బ్యారేజ్ నిర్మాణంపై సక్రమంగా దృష్టి సారించలేదు. దీంతో పనులు నత్తనడకన సాగాయి. తదుపరి 2014లో ఏర్పాటైన తెలుగుదేశం ప్రభుత్వం సైతం బ్యారేజ్ నిర్మాణం పూర్తయితే జిల్లాలోని 6 నియోజకవర్గాల్లోని అన్నదాతల దృష్టిలో వైఎస్సార్ దేవుడవుతారనే భయంతో పనులు సక్రమంగా జరగకుండా ప్లాన్, డిజైన్ల మార్పుల పేరుతో కాలయాపన చేసింది. దీంతో బ్యారేజ్ నిర్మాణం ఇక జరగదని రైతులు భావించారు. హామీ ఇచ్చి.. ధైర్యం నింపి.. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా అప్పట్లో ప్రతిపక్షనేతగా ఉన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి సంగం వచ్చి అసంపూర్తిగా ఉన్న బ్యారేజ్ నిర్మాణ పనులను పరిశీలించారు. తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే త్వరగా బ్యారేజ్ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఆత్మకూరు నియోజకవర్గ సమస్యలను తెలుసుకునేందుకు పాదయాత్ర చేసిన వైఎస్సార్సీపీ నేత మేకపాటి గౌతమ్‌రెడ్డి సైతం సంగం బ్యారేజ్‌ను తమ ప్రభుత్వంలో పూర్తి చేస్తామని చెప్పారు. ఆనందంలో అన్నదాతలు నూతన బ్యారేజ్‌ను ప్రారంభించిన తరువాత రెండు పంటలు పండించుకుంటున్న అన్నదాతల్లో ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. జిల్లాలోని ఆత్మకూరు, సర్వేపల్లి, కావలి, నెల్లూరు, నెల్లూరురూరల్, కోవూరు నియోజకవర్గాల్లో 5 లక్షల ఎకరాలకు పైగా అధికార ఆయకట్టు రైతులకు, అనధికారికంగా మరో లక్ష ఎకరాలకు పైగా ఆయకట్టుకు నూతన బ్యారేజ్ ద్వారా సాగునీటి సరఫరా జరుగుతోంది. కావలి, నెల్లూరు పట్టణ ప్రజలకు తాగునీరు సైతం ఇక్కడి నుంచే సరఫరా చేస్తున్నారు. దీంతోపాటు బ్యారేజ్ వద్ద 0.5 టీఎంసీల నీరు నిల్వ ఉండడంతో భూగర్భజలాలు పెరిగి సంగం ప్రాంతంలో సాగు, తాగునీటి సమస్యలు తొలగిపోయాయని రైతులు, ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నూతన బ్యారేజ్ నిర్మాణ పనులు పరుగులు పెట్టాయి. తన తండ్రి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను, కాంట్రాక్ట్ సంస్థలను సమన్వయపరిచి ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరిస్తూ బ్యారేజ్ నిర్మాణ పనులను వేగవంతం చేశారు. అంతేకాకుండా 850 మీటర్లు ఉన్న బ్యారేజ్‌ను 1185 మీటర్లకు పైగా పెంచి రూ.340 కోట్ల వ్యయంతో నిర్మించేలా చర్యలు తీసుకున్నారు. అప్పటి ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి సైతం ఆత్మకూరు తన నియోజకవర్గం కావడంతో సంగం బ్యారేజ్ నిర్మాణం త్వరగా పూర్తి చేసేందుకు పూనుకున్నారు. ఇరిగేషన్‌శాఖ మంత్రిగా ఉన్న పి.అనిల్‌కుమార్‌యాదవ్ సైతం బ్యారేజ్‌ను పరిశీలించి పనులు వేగవంతం చేశారు. తండ్రి వైఎస్సార్ ఇచ్చిన మాటను కుమారుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నెరవేరుస్తూ బ్యారేజ్ నిర్మాణాన్ని పూర్తి చేయించారు. ఈ సమయంలో ఐటీ శాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణంతో సంగం బ్యారేజ్‌కు ఆయన పేరు పెడుతూ 2022 సెప్టెంబర్ 6వ తేదీన బ్యారేజ్‌ను ప్రారంభించి స్నేహధర్మాన్ని సైతం చాటుకున్నారు. రైతులకు పూర్తిస్థాయిలో సాగునీరు మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజ్ వల్ల జిల్లాలోని 5 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నాం. పాత ఆనకట్ట శిథిలమైన సమయంలో సాగునీరు అందించాలంటే ఆనకట్ట వద్ద ఇసుక బస్తాలు వేసి నీరు సరఫరా పరిస్థితి ఉండేది. ప్రస్తుతం బ్యారేజ్ నిర్మాణం పూర్తి కావడం వల్ల జిల్లాలోని రైతాంగానికి పూర్తిగా సాగునీరు, అవసరమైన చోట్ల తాగునీటిని సైతం అందిస్తున్నాం. – మేకల అనిల్‌కుమార్‌రెడ్డి, రుణపడి ఉన్నారు సంగం బ్యారేజ్‌కు శంకుస్థాపన చేసిన వైఎస్ రాజశేఖరరెడ్డికి, బ్యారేజ్ నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించిన వైఎస్ జగన్మోహన్రెడ్డికి జిల్లా రైతాంగం, ప్రజలు రుణపడి ఉన్నారు. 5 లక్షలకు పైగా ఎకరాలకు సాగునీరు సరఫరా అవుతుండడం చాలా సంతోషకరం. – పులగం శంకర్‌రెడ్డి. అన్నారెడ్డిపాళెం, సంగం అపర భగీరథుడు వైఎస్సార్ సంగం వద్ద పాత ఆనకట్ట శిథిలావస్థకు చేరడంతో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నూతన బ్యారేజ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి మా ప్రాంతానికి నీరందించేలా కృషి చేసిన అపర భగీరథుడు. ఎన్ని ప్రభుత్వాలు మారినా బ్యారేజ్ నిర్మాణాన్ని ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పూర్తి చేసి తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నారు. – మెట్టుకూరు వాసుదేవరెడ్డి, సంగం -
నెల్లూరు, సంఘం బ్యారేజీలకు కేంద్రం అవార్డులు..
-
నెల్లూరు, సంగం బ్యారేజ్‌లకు ప్రతిష్టాత్మక సీబీఐపీ అవార్డు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని నెల్లూరు, సంగం బ్యారేజీలు ప్రతిష్టాత్మక సీబీఐపీ అవార్డుకు ఎంపికయ్యాయి. పెన్నా డెల్టా ఆధునికీకరణలో భాగంగా నెల్లూరు (0.4 టీఎంసీలు), సంగం బ్యారేజ్ (0.45 టీఎంసీలు)లను వైఎస్ జగన్ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసింది. యాజమాన్య పద్ధతుల ద్వారా నీటి వృథాకు అడ్డుకట్ట వేసింది. 4.22 లక్షల ఎకరాలకు సమర్థంగా నీటిని అందిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ.. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ (సీబీఐపీ) ప్రశంసించింది. అత్యుత్తమ ప్రాజెక్టులుగా నెల్లూరు, సంగం బ్యారేజ్‌లను ప్రకటించి సీబీఐపీ–2022 అవార్డుకు ఎంపిక చేసింది. ఈ అవార్డును మార్చి 3న సీబీఐపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ రాష్ట్ర అధికారులకు ప్రదానం చేయనున్నారు. సీబీఐపీ.. దేశంలో నీటివనరులు, విద్యుత్, సంప్రదాయేతర ఇంధన వనరుల విభాగంలో అత్యుత్తమ ప్రాజెక్టులను గుర్తించి అవార్డులను ప్రదానం చేస్తోంది. కరోనాను, ఆర్థిక ఇబ్బందులను అధిగమించి.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞంలో భాగంగా పెన్నా డెల్టా ఆధునికీకరణ పనులను చేపట్టారు. నెల్లూరు, సంగం బ్యారేజ్‌ల నిర్మాణ పనులను చేపట్టారు. ఆయన హఠాన్మరణంతో ఆ బ్యారేజ్‌ల పనులకు గ్రహణం పట్టుకుంది. తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ సర్కార్ వీటిని పట్టించుకోలేదు. సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక.. కరోనా వంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ.. ఆరి్థక ఇబ్బందులను అధిగమించి సంగం, నెల్లూరు బ్యారేజ్‌లను 2022, ఆగస్టు 31 నాటికి పూర్తి చేశారు. సెపె్టంబర్ 6న ఆయన వాటిని జాతికి అంకితం చేశారు. సీఎం జగన్ దార్శనికతకు పట్టం నెల్లూరు, సంగం బ్యారేజ్‌లను చిత్తశుద్ధితో యుద్ధప్రాతిపదికన సీఎం వైఎస్ జగన్ పూర్తి చేశారు. బ్యారేజ్‌లతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. సీఎం జగన్ దార్శనికతకు పట్టం కడుతూ సీబీఐపీ ప్రతిష్టాత్మక అవార్డును ప్రకటించింది. – శశిభూషణ్‌కుమార్, ముఖ్య కార్యదర్శి, జలవనరుల శాఖ -
Fact Check: ఆ బ్యారెజ్ల నిర్మాణంలో ఎవరి భాగస్వామ్యం ఎంత..?
ఆ రెండు ప్రాజెక్టులు నెల్లూరు జిల్లాకు మణిహారాల్లా నిలుస్తున్నాయి. ఈ మధ్యనే వాటిని ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వాటిని జాతికి అంకితం చేసి జలయజ్ఞం ప్రాజెక్టులను పూర్తి చేయడంలో తన ప్రభుత్వ చిత్తశుద్ధిని చాటారు. ఇంతవరకూ బాగానే వుంది. సీఎం ఆ రెండు ప్రాజెక్టులను ప్రారంభించారో.. ఆ వెంటనే ఆ ఘనత తమదేనని తెలుగుదేశం పార్టీ నేతలు చెప్పుకోవడం ప్రారంభించారు. మేకపాటి గౌతంరెడ్డి సంగం బ్యారేజ్, నెల్లూరు పెన్నా బ్యారేజ్ నిర్మాణంలో ఎవరి భాగస్వామ్యం ఎంత ...? సాక్షి ఫ్యాక్ట్ చెక్ చూద్దాం. ఈ మధ్యనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించిన సంగం , నెల్లూరు బ్యారేజీలివి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞం ప్రాజెక్టుల్లో భాగంగా వీటికి శంకుస్థాపన చేసి నిధులు కేటాయించి పనులు ప్రారంభించారు. అయితే రాష్ట్ర ప్రజల దురదృష్టం కొద్దీ ఆయన అకాల మరణం చెందారు. దాంతో కొంతకాలంపాటు మూలన పడిన జలయజ్ఞం ప్రాజెక్టుల్లో ఇవి కూడా వున్నాయి. 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏర్పడిన తెలుగుదేశంపార్టీ ప్రభుత్వం నెల్లూరు, సంగం బ్యారేజీలను పూర్తి చేస్తామని పదే పదే ప్రకటనలు చేశారుగానీ పూర్తి చేయలేదు. 2019లో వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చింది. వైఎస్సార్ స్ఫూర్తిని ప్రతి ఫలించేలా ప్రాధాన్యతా క్రమంలో జలయజ్ఞం పనులను ప్రారంభిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన మాట నిలబెట్టుకున్నారు. ఈ రెండు బ్యారేజీల నిర్మాణంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. కరోనా, వరదల్లాంటి ప్రతికూల పరిస్థితులున్నప్పటికీ ఎక్కడా వెనకడుగు వేయకుండా వీటిని పూర్తి చేయించారు. అవసరమైన నిధులను కేటాయించి పనులయ్యేలా చూశారు. దాంతో సంగం, నెల్లూరు బ్యారేజీలు రెండూ ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఇంతవరకూ బాగానే వుంది. రెండు జలయజ్ఞం ప్రాజెక్టులు కళకళలాడుతూ, ఐదు లక్షల ఎకరాలకు సాగునీరు... నెల్లూరు నగరానికి పుష్కలంగా తాగునీరు అందించడానికి సిద్ధం కావడం తెలుగుదేశం పార్టీకి మింగుడు పడడం లేదు. ఇక వెంటనే ఈ రెండూ పూర్తవ్వడం తెలుగుదేశం ఘనతే అని చెప్పుకోవడం ప్రారంభించారు. వారికి ఎల్లో మీడియా కూడా తానా అంటే తందాన అనేసింది. నెల్లూరు, సంగం బ్యారేజీల నిర్మాణం విషంలో తెలగుదేశం పార్టీ నేతలు, వారికి కొమ్ముకాసే పచ్చ మీడియా ప్రచారంలో ఎంత నిజం వుందో చూద్దాం. నెల్లూరు బ్యారేజీ నిర్మాణ సవరించిన అంచనా విలువ రూ. 274.83 కోట్లు. ఇందులో 2008-2014 వరకూ అంటే రాష్ట్ర విభజన కి ముందు రూ. 86.62 కోట్లు ఖర్చు చేశారు. ఇక చంద్రబాబు హయాంలో 2014-2019 వరకూ అంటే ఐదు సంవత్సరాల్లో రూ. 71.54 కోట్లు వ్యయం చేశారు. 2019లో వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడింది.. అప్పటినుంచీ ఇప్పటివరకు ఈ మూడేళ్లలో కరోనా ప్రతికూల పరిస్థితుల్లో రూ. 77.37 కోట్లు ఖర్చు చేసి నెల్లూరు బ్యారేజీని పూర్తి చేశారు. జాతికి అంకితం చేశారు.. మేకపాటి గౌతంరెడ్డి సంగం బ్యారేజీ నిర్మాణ వ్యయాన్ని చూద్దాం. ఈ ప్రాజెక్టు సవరించిన అంచనా విలువ రూ. 335.80 కోట్లు. ఇందులో 2008-2014 వరకూ అంటే రాష్ట్ర విభజన కి ముందు రూ. 30.85 కోట్లు ఖర్చు చేయగా 2014-2019 వరకూ అంటే చంద్రబాబు హయాంలో ఐదు సంవత్సరాల్లో రూ. 86.10 కోట్లు వ్యయం చేశారు. 2019లో వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడింది. అప్పటినుంచీ ఇప్పటివరకూ అంటే సంగం ప్రాజెక్ట్ ప్రారంభమయ్యేవరకూ ఈ మూడేళ్లలో కరోనా ప్రతికూల పరిస్థితుల్లో సైత రూ. 131.12 కోట్లు ఖర్చు చేశారు. ఇవీ వాస్తవాలు. అటు వైఎస్ఆర్ హయాన్ని, ఇటు వైఎస్ జగన్ హయాంను కలుపుకుంటే నెల్లూరు, సంగం బ్యారేజీలకోసం సింహభాగం డబ్బులు ఖర్చు చేశారు. ప్రాజెక్టులు పూర్తి కావడానికి చిత్తశుద్ధితో కృషి చేశారు. అంతే కాదు కరోనా, వరదల్లాంటి ప్రతికూల పరిస్థితుల్లో..అన్ని సమస్యలు పరిష్కరించి చకచకా పనులు చేసి ఈ రెండు ప్రాజెక్టులను అందుబాటులోకి తెచ్చారు సీఎం వైఎస్ జగన్. కళ్ల ముందు లెక్కలు తప్పులు చెప్పవు కదా.. కానీ చంద్రబాబు నాయుడు ఆయన కోటరీ మాత్రం ఈ రెండు ప్రాజెక్టులు మా ఘనతే అని చెప్పుకుంటున్నారు. ఇతరుల కష్టాన్ని తమ ఖాతాలో వేసుకోవడానికి ఏమాత్రం సందేహించకపోవడం వారి దిగజారుడు తనానికి నిదర్శనమనే విమర్శలు వస్తున్నాయి. -
అలా చెప్పడానికి సిగ్గుండాలి.. టీడీపీపై మంత్రి అంబటి ఫైర్
సాక్షి, అమరావతి: బ్రిటీష్ కాలంలో కట్టిన ఆనకట్టలకు కాలం చెల్లిందని.. వాటి స్థానంలో కొత్త బ్యారేజీలను కట్టి ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నామని ఏపీ జల వనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఈ క్రమంలోనే సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీ పూర్తి చేశామన్నారు. ఏపీ సచివాలయంలో బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాకే బ్యారేజీ పనులను పూర్తి చేశామన్నారు. చదవండి: ‘అది ఐ-టీడీపీ’ పనే బ్యారేజీలను చంద్రబాబే పూర్తి చేశారని చెప్పడానికి టీడీపీ నేతలకు సిగ్గుండాలని మంత్రి మండిపడ్డారు. 14 ఏళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్‌నూ చేపట్టలేదన్నారు. ప్రాజెక్టులపై టీడీపీ అవాస్తవాలు ప్రచారం చేస్తోంది. చేయని పనులను చేసినట్టు చెప్పుకుంటున్నారు. కనీసం రైతులకు నీళ్లు ఇవ్వాలనే ఆలోచన కూడా బాబు చేయలేదన్నారు. ఇవాళ జరుగుతున్న ప్రాజెక్టులన్నీ దివంగత వైఎస్సార్ ప్రారంభించినవేనన్నారు. ‘‘కేంద్రం పూర్తి చేయాల్సిన పోలవరంను తామే కడతామని చంద్రబాబు ప్రగల్భాలు పలికారు. కాఫర్ డ్యామ్ పూర్తి చేయకుండా డయాఫ్రం వాల్ ఎందుకు కట్టారో చెప్పాలి. పోలవరంపై ఏదో జరిగిపోతున్నట్లు పచ్చమీడియా రాస్తోంది. ప్రాజెక్టులు పూర్తికావద్దని ,పరిశ్రమలు రావొద్దని ఎల్లోమీడియా కుట్రలు పన్నుతోంది. బల్క్ డ్రగ్ పరిశ్రమపైనా దుష్ప్రచారం చేస్తున్నారని అంబటి రాంబాబు మండిపడ్డారు. -
రెండు బ్యారేజీలను జాతికి అంకితం చేసిన సీఎం జగన్
-
నెల్లూరు జిల్లా బ్యారేజ్‌ల ప్రారంభోత్సవంలో సీఎం జగన్ (ఫొటోలు)
-
సంగం బ్యారేజ్ కు చేరుకున్న సీఎం జగన్
-
CM Jagan Nellore Tour: దశాబ్దాల స్వప్నం సాకారం
-
నెరవేరిన సింహపురి వాసుల దశాబ్దాల కల
-
Mekapati Goutham Reddy Sangam Barrage: పెన్నా పారవశ్యం!
సాక్షి, అమరావతి: పెన్నా యవనికపై చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జీవనాడులైన మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజ్, నెల్లూరు బ్యారేజ్‌లను జలయజ్ఞంలో భాగంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టారు. ఈ రెండు బ్యారేజీలను పూర్తి చేసిన ఆయన తనయుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం జాతికి అంకితం చేశారు. తండ్రి చేపట్టిన రెండు బ్యారేజీలను తనయుడు పూర్తి చేసి జాతికి అంకితం చేయడం దేశ చరిత్రలో ఇదే ప్రథమమని అధికారవర్గాలు చెబుతున్నాయి. వందేళ్ల స్వప్నమైన రెండు బ్యారేజీలు సాకారమవడంతో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సంగం బ్యారేజ్ కింద 3.85 లక్షల ఎకరాలు, నెల్లూరు బ్యారేజ్ కింద 99,525 ఎకరాల ఆయకట్టుకు సమృద్ధిగా నీళ్లందించేందుకు మార్గం సుగమమైంది. ఏటా ఇసుక బస్తాలకు భారీ వ్యయం ► నెల్లూరు జిల్లాలో కనిగిరి, కావలి, కనుపూరు కాలువల ద్వారా ఆయకట్టుకు నీళ్లందించేలా పెన్నా నదిపై సంగం వద్ద 1882–83లో 846 మీటర్ల పొడవు, 0.9 మీటర్ల ఎత్తుతో బ్రిటీష్ సర్కార్ ఆనకట్ట నిర్మించింది. ఆనకట్టకు దిగువన నదీ గర్భంలో నిర్మించిన రోడ్డు ద్వారా సంగం–పొదలకూరు మండలాల మధ్య రాకపోకలు సాగించేవారు. సంగం ఆనకట్ట శిథిలమవడంతో 0.3 మీటర్ల ఎత్తున ఇసుక బస్తాలు వేసి నీటిని నిల్వ చేసినా ఆయకట్టుకు సక్రమంగా నీళ్లందేవి కావు. పెన్నాకు వరద వస్తే ఇసుక బస్తాలు కొట్టుకుపోయేవి. ఇసుక బస్తాల కోసం ఏటా రూ.50 లక్షల నుంచి రూ.కోటికిపైగా వ్యయమయ్యేది. వరద వస్తే సంగం–పొదలకూరు మండలాల మధ్య రాకపోకలు పూర్తిగా స్తంభించేవి. ఆనకట్టలో నీళ్లు లేక తాగునీటికి తీవ్ర ఇక్కట్లు ఎదురయ్యేవి. ► సంగం ఆనకట్టకు 20 కి.మీ. దిగువన నెల్లూరు సమీపంలో 1854–55లో 481.89 మీటర్ల పొడవు, 0.7 మీటర్ల ఎత్తుతో ఆనకట్టను నిర్మించిన బ్రిటీష్ సర్కార్ సర్వేపల్లి, జాఫర్ సాహెబ్ కాలువల ద్వారా ఆయకట్టుకు నీళ్లందించింది. 1862లో వరదలకు కొట్టుకుపోవడంతో అదే ఏడాది మళ్లీ కొత్తగా 621.79 మీటర్ల పొడవుతో ఆనకట్ట నిర్మించారు. ఈ ఆనకట్ట కూడా శిథిలమవడంతో ఆయకట్టుకు నీళ్లందించడం సవాలుగా మారింది. ఇసుక బస్తాలు వేసి నీటిని నిల్వ చేసినా వరద వస్తే కొట్టుకుపోయేవి. దీనికోసం చాలా ఖర్చయ్యేది. పెన్నాకు ఏమాత్రం వరద వచ్చినా నెల్లూరు–కోవూరు మధ్య రాకపోకలు స్తంభించిపోయేవి. ఆనకట్టలో నీరు లేక నెల్లూరు దాహార్తితో తల్లడిల్లేది. ► సాగు, తాగునీరు, రవాణా, ముంపు ముప్పు సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు ఆనకట్టల స్థానంలో సంగం బ్యారేజ్, నెల్లూరు బ్యారేజ్‌ను నిర్మించాలని వందేళ్లుగా నెల్లూరు ప్రజలు కోరుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోలేదు. 2004 మే 14న సీఎంగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేసిన దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి నెల్లూరు జిల్లా ప్రజల వందేళ్ల కలను సాకారం చేస్తూ సంగం, నెల్లూరు బ్యారేజ్‌ల పనులకు శ్రీకారం చుట్టారు. ఆయన హఠాన్మరణంతో పనులకు గ్రహణం పట్టింది. నాటికి, నేటికి ఇదీ తేడా... సంగం, నెల్లూరు బ్యారేజ్‌ల పనులను 2014 నుంచి 2016 వరకూ అధికారంలో ఉన్న చంద్రబాబు సర్కార్ పూర్తిగా నిలిపివేసింది. ఆ తర్వాత కమీషన్లు వసూలు చేసుకునేందుకు వీలున్న పనులను మాత్రమే చేపట్టారు. చివరకు రెండు బ్యారేజ్‌లను పూర్తి చేయలేక చేతులెత్తేశారు. 2019 మే 30న సీఎంగా బాధ్యతలు చేపట్టాక జలయజ్ఞం ప్రాజెక్టులపై వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. 2008 ఏప్రిల్ 29న నెల్లూరు బ్యారేజ్ పనులకు శంకుస్థాపన చేసిన వైఎస్సార్ సంగం, నెల్లూరు బ్యారేజ్‌లను ప్రాధాన్యతగా చేపట్టి యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశారు. కరోనా, పెన్నాకు మూడేళ్లుగా వరదలు వంటి ప్రతికూల పరిస్థితులను అధిగమిస్తూ రెండు బ్యారేజ్‌లను సీఎం జగన్ పూర్తి చేశారు. సాగు, తాగునీటితోపాటు రవాణా సమస్యలను శాశ్వతంగా పరిష్కరించారు. బ్యారేజ్‌ల ద్వారా వరదను సమర్థంగా నియంత్రించి ముంపు ముప్పు తప్పించేలా మార్గం సుగమం చేశారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పూర్తి చేసిన నెల్లూరు బ్యారేజ్ మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజ్ ఎక్కడ : శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం వద్ద పెన్నా (సోమశిల రిజర్వాయర్‌కు 40 కి.మీ. దిగువన) పరీవాహక ప్రాంతం: 50,122 చదరపు కిలోమీటర్లు బ్యారేజ్ పొడవు : 1,195 మీటర్లు (బ్యారేజ్‌కు అనుబంధంగా రెండు వరసల రోడ్ బ్రిడ్జి) గేట్లు : 85 గేట్లు(12 మీటర్లు ఎత్తు, 2.8 మీటర్ల వెడల్పుతో 79 గేట్లు.. 12 మీటర్ల ఎత్తు, 3.8 మీటర్ల వెడల్పుతో 6 స్కవర్ స్లూయిజ్ గేట్లు) గేట్ల మరమ్మతుల కోసం సిద్ధం చేసిన స్టాప్ లాగ్ గేట్లు : 9 గేట్ల నిర్వహణ విధానం : వర్టికల్ లిఫ్ట్ గరిష్ట వరద విడుదల సామర్థ్యం : 7,50,196 క్యూసెక్కులు గరిష్ట నీటి మట్టం : 35 మీటర్లు గరిష్ట నీటి నిల్వ : 0.45 టీఎంసీలు కనీస నీటి మట్టం : 32.2 మీటర్లు ఆయకట్టు : 3.85 లక్షల ఎకరాలు అంచనా వ్యయం : రూ.335.80 కోట్లు వైఎస్సార్ హయాంలో వ్యయం : రూ.30.85 కోట్లు టీడీపీ హయాంలో వ్యయం : రూ.86.10 కోట్లు (కాంట్రాక్టర్ నుంచి కమీషన్లు వసూలు చేసుకోవడానికి సులభమైన పనులను మాత్రమే చేపట్టారు) వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన వ్యయం : రూ.131.12 కోట్లు నెల్లూరు బ్యారేజ్ ఎక్కడ : నెల్లూరు నగరానికి సమీపంలో పెన్నా నదిపై (మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజ్‌కు 20 కి.మీ. దిగువన) పరీవాహక ప్రాంతం : 51,800 చదరపు కిలోమీటర్లు బ్యారేజ్ పొడవు : 640 మీటర్లు (బ్యారేజ్‌కు అనుబంధంగా రెండు వరుసల రోడ్ బ్రిడ్జి) గేట్లు : 51 (పది మీటర్లు ఎత్తు, మూడు మీటర్ల వెడల్పుతో 43 గేట్లు.. పది మీటర్లు ఎత్తు, 4.3 మీటర్ల ఎత్తుతో ఎనిమిది స్కవర్ స్లూయిజ్ గేట్లు) గేట్ల మరమ్మతుకు సిద్ధం చేసిన స్టాప్‌లాగ్ గేట్లు: 6 గేట్ల నిర్వహణ : వర్టికల్ లిఫ్ట్ గరిష్ట వరద విడుదల సామర్థ్యం : 10,90,000 క్యూసెక్కులు గరిష్ట నీటి మట్టం : 14.3 మీటర్లు గరిష్ట నీటి నిల్వ : 0.4 టీఎంసీలు కనీస నీటి మట్టం : 11.3 మీటర్లు ఆయకట్టు : 99,525 ఎకరాలు అంచనా వ్యయం : రూ.274.83 కోట్లు వైఎస్సార్ హయాంలో చేసిన వ్యయం : రూ.86.62 కోట్లు టీడీపీ హయాంలో చేసిన వ్యయం : రూ.71.54 కోట్లు (కాంట్రాక్టర్ నుంచి కమీషన్లు వసూలు చేసుకోవడానికి సులభమైన పనులను మాత్రమే చేశారు) వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన వ్యయం : రూ.77.37 కోట్లు. -
సీఎం జగన్ నెల్లూరు జిల్లా పర్యటన
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. పెన్నానదిపై సంగం వద్ద నిర్మించిన మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజ్‌ను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. అనంతరం అక్కడ బహిరంగసభలో మాట్లాడతారు. తరువాత ముఖ్యమంత్రి జగన్ నెల్లూరు చేరుకుని నెల్లూరు బ్యారేజ్ కమ్ బ్రిడ్జిని ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. సీఎం జగన్ పర్యటన ఇలా.. ► ఉదయం 9.30 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి 10.40 గంటలకు సంగం చేరుకుంటారు. ► 11–1.10 గంటల మధ్య మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజ్‌ను ప్రారంభించి, బహిరంగసభలో ప్రసంగిస్తారు. ► 1.20 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 1.45 గంటలకు నెల్లూరు బ్యారేజ్ వద్దకు చేరుకుంటారు. ► 1.50–2.20 గంటల మధ్య నెల్లూరు బ్యారేజ్ కమ్ బ్రిడ్జిని ప్రారంభిస్తారు. ► 2.20 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం 4.15 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. -
దశాబ్దాల కల ‘సంగం’ సాకారం
మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజ్ నిర్మాణం పూర్తి కావడంతో పెన్నా డెల్టాలోని 2.47 లక్షల ఎకరాలు, కనుపూరు కాలువ కింద 63 వేలు, కావలి కాలువ కింద 75 వేలు వెరసి మొత్తంగా 3.85 లక్షల ఎకరాల ఆయకట్టుకు సమృద్ధిగా నీళ్లందించడానికి మార్గం సుగమం అయ్యింది. ప్రధానంగా నెల్లూరుకు ముంపు ముప్పు తప్పింది. చెప్పిన మాట మేరకు యుద్ధ ప్రాతిపదికన బ్యారేజ్ నిర్మాణం పూర్తి చేయడం ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన నిబద్ధతను చాటుకున్నారు. దీనికి తోడు నెల్లూరు బ్యారేజీ కమ్ బ్రిడ్జి కూడా రికార్డు సమయంలో పూర్తి కావడం విశేషం. (మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజ్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి రామగోపాలరెడ్డి ఆలమూరు): శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ప్రజల దశాబ్దాల స్వప్నం సాకారమైంది. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞంలో భాగంగా చేపట్టిన మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజ్ పనులను ఆయన తనయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పూర్తి చేశారు. ఈనెల 6న బ్యారేజ్‌ను జాతికి అంకితం చేయనున్నారు. దీంతో పాటు నెల్లూరు బ్యారేజీ కమ్ బ్రిడ్జిని కూడా రికార్డు సమయంలో పూర్తి చేశారు. సంగం బ్యారేజీ నిర్మాణం ద్వారా పెన్నా వరదలను సమర్థవంతంగా నియంత్రించి, ముంపు ముప్పు నుంచి నెల్లూరు జిల్లా ప్రజలను తప్పించవచ్చు. బ్యారేజ్‌లో 0.45 టీఎంసీల నీటిని నిల్వ చేసే అవకాశం ఉండటం వల్ల పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరగడం ఖాయం. తద్వారా తాగునీటి ఇబ్బందులు తీరుతాయి. మేకపాటి గౌతమ్‌రెడ్డి బ్యారేజ్ కమ్ బ్రిడ్జిని పూర్తి చేయడం ద్వారా సంగం, పొదలకూరు మండలాల మధ్య రాకపోకల సమస్యను సీఎం వైఎస్ జగన్ శాశ్వతంగా పరిష్కరించారు. శిథిలమైనా పట్టించుకోని దుస్థితి నెల్లూరు జిల్లా సంగం వద్ద పెన్నా నదిపై 1882–83లో బ్రిటీష్ సర్కార్ 0.9 మీటర్ల ఎత్తున ఆనకట్టను నిర్మించి.. పెన్నా డెల్టా, కనుపూరు, కావలి కాలువల కింద ఆయకట్టుకు 1886 నుంచి నీళ్లందించడం ప్రారంభించింది. ఈ ఆనకట్టకు దిగువన నదీ గర్భంలో నిర్మించిన రోడ్డు ద్వారా సంగం–పొదలకూరు మండలాల మధ్య రాకపోకలు సాగుతున్నాయి. పెన్నాలో వరద పెరిగితే ఈ రెండు మండలాల మధ్య రాకపోకలు స్తంభించిపోయేవి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఆనకట్ట శిథిలావస్థకు చేరుకోవడంతో.. దానిపై 0.3 మీటర్ల మేర ఇసుక బస్తాలు వేసి, నీటిని నిల్వ చేసినా.. ఆయకట్టుకు నీళ్లందించడం కష్టంగా మారింది. సంగం ఆనకట్ట స్థానంలో బ్యారేజ్ నిర్మించి, ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీళ్లందించాలని నెల్లూరు జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తూ వచ్చారు. అయితే ఆ డిమాండ్‌ను 2006 వరకూ ఎవరూ పట్టించుకోలేదు. సీఎం వైఎస్ జగన్ పూర్తి చేసిన మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజీ స్వప్నం సాకారం దిశగా అడుగులు.. నెల్లూరు జిల్లా ప్రజల చిరకాల స్వప్నాన్ని సాకారం చేసే దిశగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2006 మే 28న సంగం బ్యారేజ్‌కు శంకుస్థాపన చేశారు. రూ.147.50 కోట్ల అంచనా వ్యయంతో 2008 మే 21న పనులు చేపట్టారు. మహానేత వైఎస్ హయాంలో బ్యారేజ్ పనులు పరుగులు తీశాయి. ఈ పనులకు అప్పట్లో రూ.30.85 కోట్లు వ్యయం చేశారు. అయితే మహానేత వైఎస్ హఠాన్మరణం సంగం బ్యారేజ్ పనులకు శాపంగా మారింది. కమీషన్లు వచ్చే పనులకే టీడీపీ హయాంలో పెద్దపీట సంగం బ్యారేజ్‌ను నిర్మిస్తున్న ప్రాంతంలో పెన్నా నది వెడల్పు 1,400 మీటర్లు. కానీ.. అప్పట్లో సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీవో) చీఫ్ ఇంజనీర్ 846 మీటర్ల వెడల్పుతో బ్యారేజ్ (కాంక్రీట్ నిర్మాణం), ఇరువైపులా 554 మీటర్ల వెడల్పుతో మట్టికట్టలు నిర్మించేలా డిజైన్‌ను ఆమోదించారు. బ్యారేజ్ నిర్మాణ సమయంలో ఇబ్బందులు ఏర్పడటంతో డిజైన్లలో మార్పులు చేయాలని 2013లో అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం 2013 నవంబర్ 23న నిపుణుల కమిటీని నియమించింది. బ్యారేజ్ నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించిన నిపుణుల కమిటీ.. 1,195 మీటర్ల వెడల్పుతో బ్యారేజ్ (కాంక్రీట్ కట్టడం) నిర్మించాలని 2014లో నివేదిక ఇచ్చింది. ఈ నివేదికను ఆమోదించడంలో రెండేళ్ల పాటు జాప్యం చేసిన టీడీపీ సర్కార్.. ఎట్టకేలకు 2016 జనవరి 21న బ్యారేజ్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో అంచనా వ్యయాన్ని రూ.335.80 కోట్లకు పెంచింది. బ్యారేజ్‌ను 2017కు పూర్తి చేస్తామని ఒకసారి.. 2018కి పూర్తి చేస్తామని మరోసారి.. 2019కి పూర్తి చేస్తామని ఇంకోసారి ముహూర్తాలను మారుస్తూ వచ్చింది. టీడీపీ సర్కార్ కేవలం కమీషన్లు వచ్చే పనులకే అధిక ప్రాధాన్యం ఇచ్చింది. బ్యారేజ్‌లో 85 పియర్స్(కాంక్రీట్ దిమ్మెలు)ను సగటున 22 మీటర్ల చొప్పున అరకొరగా పూర్తి చేసింది. చేసిన పనుల కంటే.. ధరల సర్దుబాటు(ఎస్కలేషన్), పనుల పరిమాణం పెరిగిందనే సాకుతో అధికంగా బిల్లులు చెల్లించింది. రూ.86.10 కోట్లను ఖర్చు చేసినా బ్యారేజ్ పనులను ఒక కొలిక్కి తేలేకపోయింది. పెన్నా నదిపై సంగం బ్యారేజీ దిగువ వైపు నుంచి... అటు కరోనా, ఇటు వరద.. అయినా పూర్తి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించాక సంగం బ్యారేజ్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ప్రాధాన్యత ప్రాజెక్టుగా ప్రకటించి, శరవేగంగా పూర్తి చేయాలని జల వనరుల శాఖ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. 2020 మార్చి నుంచి 2021 ఆఖరుదాకా కరోనా మహమ్మారి విజృంభించింది. గతంలో ఎన్నడూ లేని రీతిలో 2019–20, 2020–21, 2021–22లో పెన్నా నది ఉప్పొంగి ప్రవహించింది. 2019–20 లో 42.52, 2020–21లో 301.52, 2021–22లో 373.52 టీఎంసీల నీరు నెల్లూరు బ్యారేజీ నుంచి సముద్రంలో కలిసిందంటే ఏ స్థాయిలో వరద వచ్చిందో అంచనా వేసుకోవచ్చు. ఓ వైపు కరోనా మహమ్మారి తీవ్రత.. మరో వైపు పెన్నా వరద ఉధృతితో పోటీ పడుతూ సంగం బ్యారేజ్ పనులను సీఎం వైఎస్ జగన్ పరుగులెత్తించారు. బ్యారేజ్ 85 పియర్లను 43 మీటర్ల ఎత్తుతో పూర్తి చేయించారు. ఈ పియర్స్ మధ్య 12 మీటర్ల ఎత్తు, 2.8 మీటర్ల వెడల్పుతో 79 గేట్లు, కోతకుగురై వచ్చిన మట్టిని దిగువకు పంపడానికి 12 మీటర్ల ఎత్తు, 3.8 మీటర్ల వెడల్పుతో 6 గేట్లు (స్కవర్ స్లూయిజ్) బిగించారు. వరద ప్రవాహం వచ్చినప్పుడు దిగువకు విడుదల చేయడానికి వీలుగా గేట్లను ఎత్తడానికి, దించడానికి విద్యుత్‌తో పనిచేసే హాయిస్ట్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. బ్యారేజ్‌కు ఎగువన ఎడమ వైపున 3.17 కిలోమీటర్లు, బ్యారేజ్‌కు కుడి వైపున 3 కిలోమీటర్ల పొడవున కరకట్టలను పటిష్టం చేశారు. సంగం నుంచి పొదలకూరుకు రాకపోకలు సాగించడానికి వీలుగా బ్యారేజ్‌పై రెండు వరుసల రోడ్ బ్రిడ్జిని పూర్తి చేశారు. కనిగిరి, కావలి కాలువలకు సంయుక్తంగా నీటిని సరఫరా చేసే రెగ్యులేటర్, కనుపూరు కాలువకు నీటిని సరఫరా చేసే రెగ్యులేటర్లను పూర్తి చేశారు. ఈ పనులను రూ.131.12 కోట్ల ఖర్చుతో పూర్తి చేసి.. నెల్లూరు ప్రజల దశాబ్దాల స్వప్నాన్ని సాకారం చేశారు. నెల్లూరు బ్యారేజీ కమ్ బ్రిడ్జి ప్రాజెక్టు సైతం రికార్డు సమయంలో నెల్లూరు బ్యారేజీ కమ్ బ్రిడ్జిని కూడా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పూర్తి చేసింది. జలయజ్ఞంలో భాగంగా దివగంత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2008–09లో ప్రారంభించిన ఈ ప్రాజెక్టును పదేళ్ల తర్వాత ఆయన తనయుడు జగన్మోహన్రెడ్డి సీఎంగా పూర్తి చేశారు. నెల్లూరు నగరానికి సమీపాన ఇప్పటికే ఉండే పాత ఆనకట్టకు వంద మీటర్ల ఎగువున ఇంకొక కొత్త బ్యారేజీ కమ్ బ్రిడ్జి ప్రాజెక్టు పనులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చి పూర్తి చేసింది. ఈ ప్రాజెక్టును కూడా ఈ నెల 6న జాతికి అంకితం చేయనున్నారు. 13 ఏళ్ల క్రితం మొదట్లో రూ.147.20 కోట్ల అంచనాతో మొదలు పెట్టిన ఈ ప్రాజెక్టులో 2014కు ముందే రూ.86.62 కోట్ల మేరకు పనులు పూర్తయ్యాయి. తర్వాత ప్రాజెక్టు వ్యయం రూ.274.83 కోట్లకు పెరిగింది. 2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం రూ.71.54 కోట్లు ఖర్చు చేసినా ప్రాజెక్టు పూర్తి చేసే ఆలోచనతో కాకుండా ప్రాజెక్టు నిర్మాణంలో కేవలం కమీషన్లకు అవకాశం ఉన్న పనులు చేపట్టేందుకు ఆసక్తి చూపింది. అయితే 2019లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఈ ప్రాజెక్టును ప్రాధాన్యత ప్రాజెక్టుగా గుర్తించారు. కేవలం మూడేళ్లలో రూ.77.37 కోట్లు ఖర్చు చేసి ప్రాజెక్టు ప్రధాన కాంక్రీట్, ఇతర మట్టి పనులన్నింటినీ ప్రభుత్వం పూర్తి చేసింది. ఈ ప్రాజెక్టు పూర్తి చేయడం ద్వారా 72 గ్రామాల పరిధిలోని 99,525 ఎకరాల్లో సాగు నీటి పారుదల అవకాశాలు మెరుగు పడతాయి. నెల్లూరు– కోవూరుల మధ్య రాకపోకల ఇబ్బందులు పూర్తిగా తొలగిపోనున్నాయి. ఆనకట్టకు ఎగువన ఇన్ఫిల్ట్రేషన్ బావులు నిండడం వల్ల ఆ ప్రాంతంలో భూగర్భ జల మట్టం పెరిగి నెల్లూరు çనగరం.. ఆ చుట్టు పక్కల ప్రాంతాలకు తాగునీటి అవసరాలు తీరే అవకాశం ఉంది. ఇదో మహోజ్వల ఘట్టం సంగం బ్యారేజ్ నిర్మాణాన్ని మహానేత వైఎస్సార్ ప్రారంభిస్తే.. ఆయన తనయుడు సీఎం వైఎస్ జగన్ పూర్తి చేసి ఈ నెల 6న జాతికి అంకితం చేయనుండటం మహోజ్వల ఘట్టం. కరోనా తీవ్రత, పెన్నా వరద ఉధృతిని తట్టుకుని.. బ్యారేజ్‌ను పూర్తి చేశాం. నెల్లూరు జిల్లా ప్రజలకు మేకపాటి గౌతమ్‌రెడ్డి చేసిన సేవలను స్మరించుకుంటూ బ్యారేజ్‌కు ఆయన పేరు పెట్టాం. పెన్నా డెల్టా, కనుపూరు, కావలి కాలువల ఆయకట్టుకు నీళ్లందించి సస్యశ్యామలం చేస్తాం. – అంబటి రాంబాబు, జల వనరుల శాఖ మంత్రి రికార్డు సమయంలో పూర్తి సీఎం ఆదేశాల మేరకు బ్యారేజ్‌ను రికార్డు సమయంలో పూర్తి చేశాం. 3.85 లక్షల ఎకరాలకు నీళ్లందించడానికి ఇది దోహదపడుతుంది. బ్యారేజ్‌లో నిత్యం 0.45 టీఎంసీలను నిల్వ చేయడం వల్ల భూగర్భ జలాలు పెరుగుతాయి. సాగు, తాగునీటికి ఇబ్బంది ఉండదు. బ్రిడ్జితో సంగం–పొదలకూరు మధ్య రవాణా సమస్యకు పరిష్కారం లభించింది. – సి.నారాయణరెడ్డి, ఈఎన్సీ నాణ్యతకు ప్రాధాన్యత సంగం బ్యారేజ్ పనులను అత్యంత నాణ్యతతో శరవేగంగా పూర్తి చేశాం. సీఎం వైఎస్ జగన్ ప్రాధాన్యత ప్రాజెక్టుగా సంగం బ్యారేజ్‌ను ప్రకటించి.. గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆ మేరకు గడువులోగా పూర్తి చేశాం. నెల్లూరు జిల్లా ప్రజల దశాబ్దాల కలను సీఎం వైఎస్ జగన్ నిజం చేశారు. – హరినారాయణ రెడ్డి, సీఈ, తెలుగుగంగ -
ఎంజీఆర్ సంగం బ్యారేజీ ఆత్మకూరుకే తలమానికం
నెల్లూరు (సెంట్రల్): ఆత్మకూరు నియోజకవర్గానికే ఎంజీఆర్ సంగం బ్యారేజీ తలమానికమని, బ్యారేజీ ప్రారంభోత్సవానికి వస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఘన స్వాగతం పలుకుదామని ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి అన్నారు. నెల్లూరులోని ఎమ్మెల్యే నివాసంలో సంగం, ఏఎస్‌పేట, చేజర్ల మండలాల ముఖ్య నాయకులతో ఎమ్మెల్యే విక్రమ్‌రెడ్డి శుక్రవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎప్పటి నుంచో కలలు కంటున్న ఎంజీఆర్ సంగం బ్యారేజీ ప్రారంభం ఈ నెల 6న ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రజలకు అంకితం కాబోతుందన్నారు. ముఖ్యంగా ఈ బ్యారేజీకి మన దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజీగా నామకరణం చేశారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి, మేకపాటి గౌతమ్‌రెడ్డి విగ్రహాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. అటువంటి మంచి కార్యక్రమానికి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేద్దామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. -
దివంగత నేత వైఎస్సార్ కలలు నెరవేరబోతున్నాయి: మాజీ మంత్రి అనిల్
సాక్షి, నెల్లూరు: పెన్నా బ్యారేజ్ పనులను మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్, జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అనిల్ మాట్లాడుతూ.. 'సంఘం, పెన్నా బ్యారేజ్‌లకు 2006లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేశారు. 16 సంవత్సరాల తర్వాత సీఎం వైఎస్ జగన్ చొరవతో బ్యారేజ్ పనులు పూర్తి అయ్యాయి. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి కన్న కలలు నెరవేరబోతున్నాయి. వైఎస్సార్ మరణం తర్వాత రెండు బ్యారేజీల పనులు నత్తనడకన సాగాయి. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు మూడు సార్లు బ్యారేజీలను సందర్శించారు. పూర్తి చేస్తాం, ప్రారంభిస్తాం అని మాటలతో సరిపెట్టారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు తీసుకున్న తర్వాత పనుల్లో వేగం పెంచాము. ఈ నెల 30న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ ప్రాజెక్టులను ప్రారంభిస్తారు' అని మాజీమంత్రి అనిల్‌కుమార్ యాదవ్ తెలిపారు. చదవండి: (పవన్ తనకు తాను పెద్ద పుడింగి అనుకుంటున్నాడు: మంత్రి రాజా) -
సీఎం జగన్‌ను కలిసిన ఎమ్మెల్యే విక్రమ్‌రెడ్డి
సాక్షి, నెల్లూరు(సెంట్రల్): ఆత్మకూరు నియోజకవర్గంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజీని ఈనెల 30వ తేదీన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రిని బుధవారం ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా బ్యారేజీ నిర్మాణం గురించి, దాని రైతాంగం ఎలా లబ్ధిపొందుతుంది తదితర వివరాలను విక్రమ్‌రెడ్డి సీఎం జగన్‌కు వివరించారు. అనంతరం ఆత్మకూరు నియోజకవర్గంలో ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి పనుల గురించి చెప్పారు. ఇంకా చేయాల్సిన వాటిని సీఎం దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించారు. ముఖ్యంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా తాను నియోజకవర్గంలో తిరుగుతున్న సమయంలో స్థానిక ప్రజల నుంచి వస్తున్న స్పందన, సంక్షేమ పథకాల లబ్ధిదారులు వ్యక్తం చేస్తున్న సంతోషాన్ని ముఖ్యమంత్రికి చెప్పారు. త్వరలో బ్యారేజీని ప్రారంభిస్తున్న నేపథ్యంలో జగన్మోహన్రెడ్డికి విక్రమ్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. చదవండి: (సంక్రాంతి నుంచి ‘ఫ్యామిలీ డాక్టర్’) -
సస్యశ్యామలం.. సిరుల పంటలకు సంగం బ్యారేజీ సిద్ధం
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ప్రతిష్టాత్మకమైన సంగం బ్యారేజీ చివరి దశ పనులు చురుగ్గా సాగుతున్నాయి. పెన్నా డెల్టాకు జీవనాడిగా అభివర్ణించే ఈ బ్యారేజీ పనులు 95 శాతానికి పైగా పూర్తయ్యాయి. మిగిలిన పనులను శరవేగంగా పూర్తిచేసి.. ఈ సీజన్లోనే ప్రారంభించేందుకు జలవనరులశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. సంగం వద్ద పెన్నానదిపై 1882–86 మధ్య బ్రిటిష్ సర్కార్ బ్యారేజీ నిర్మించింది. ఈ బ్యారేజీ ద్వారా లక్షలాది ఎకరాలకు నీళ్లందుతాయి. బ్యారేజీ శిథిలావస్థకు చేరుకోవడంతో నీటినిల్వ సామర్థ్యం కనిష్ట స్థాయికి చేరుకుంది. దీంతో ఆయకట్టుకు నీళ్లందించడం కష్టంగా మారింది. జలయజ్ఞంలో భాగంగా కొత్త బ్యారేజీకి దివంగత సీఎం వైఎస్ రాజశేఖరర్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. ఆయన మరణానంతరం వచ్చిన ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి. బ్యారేజీ పనులు చేయడంలో టీడీపీ సర్కార్ పూర్తిగా విఫలమైంది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక సంగం బ్యారేజీని ప్రాధాన్య ప్రాజెక్టుగా చేపట్టిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి త్వరలో జాతికి అంకితం చేయనున్నారు. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రైతుల కలల బ్యారేజీ నిర్మాణం పూర్తయింది. బీడు భూముల్లో సిరుల పంటలు పండనున్నాయి. ఐదున్నర లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు యోగ్యకరం కానుంది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అంకరార్పణ చేస్తే, ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్మాణ పనులు పూర్తిచేశారు. శిథిలావస్థలో ఉన్న 135 ఏళ్ల నాటి ఆనకట్ట కమ్ బ్యారేజీ సరికొత్త హంగులతో రూపుదిద్దుకుంది. త్వరలో మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా జాతికి అంకితం కానుంది. బ్రీటీష్ కాలంలో సింహపురి ప్రాంత అన్నదాతల కోసం నిర్మించిన సంగం బ్యారేజ్ శిథిలావస్థకు చేరుకుంది. సాగునీటి కోసం అన్నదాతలు, తాగునీటి కోసం నెల్లూరు ప్రజలకు ఇబ్బందులు మొదలయ్యాయి. ఈనేపథ్యంలో 1999లో అప్పటి ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి సంగం బ్యారేజీ నుంచి హైదరాబాద్‌కు పాదయాత్ర చేపట్టారు. సంగం బ్యారేజీ నిర్మించాలని డిమాండ్ చేశారు. అప్పటి టీడీపీ ప్రభుత్వంలో చలనం లేకపోయింది. రాష్ట్రవ్యాప్త పర్యటనలో భాగంగా ప్రతిపక్షనేత హోదాలో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సంగం పర్యటించారు. అన్నదాతల అభ్యర్థన మేరకు తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే సంగం వద్ద పెన్నానదిలో నూతన బ్యారేజ్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. మాట తప్పని, మడమ తిప్పని దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం రూ.122.50 కోట్ల వ్యయంతో 2006లో నూతన బ్యారేజ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత వైఎస్సార్ అకాల మరణంతో బ్యారేజీ పనులు నత్తనడకన సాగాయి. బ్యారేజ్‌పై రాకపోకల కోసం ఏర్పాట్లు నిర్మాణం పూర్తి సంగం నూతన బ్యారేజ్ నిర్మాణ పనులను వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పూర్తిచేసింది. 1,195 మీటర్ల పొడవుతో పెన్నానదిలో బ్యారేజ్ నిర్మాణం చేపట్టారు. ఈ బ్యారేజ్‌కి 85 గేట్లు ఏర్పాటుచేసి వాటి నిర్వహణకు మోటార్లు సైతం ఏర్పాటు చేశారు. బ్యారేజ్ నుంచి కుడివైపు కనుపూరు కాలువ, నెల్లూరు చెరువుకు నీటిని విడుదల చేసే రెగ్యులేటర్లు, ఎడమ వైపు కనిగిరి రిజర్వాయర్, బెజవాడ పాపిరెడ్డి కాలువలకు నీటిని విడుదల చేసే నిర్మాణాలు పూర్తయ్యాయి. సంగం పాత ఆనకట్ట జిల్లాలో 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తుంటే నూతన బ్యారేజ్ నిర్మాణం వల్ల జిల్లాలో 5.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి దూరదృష్టి అందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. నిధుల వృథాకు చెక్ పాత ఆనకట్ట వల్ల కనుపూరు కాలువ, బెజవాడ పాపిరెడ్డి కాలువకు నీరు అందించేందుకు ప్రతి సంవత్సరం రూ.50 లక్షలకు పైగా నిధులతో ఇసుక బస్తాలు ఏర్పాటుచేసి నీరు అందించేవారు. నూతన బ్యారేజ్ నిర్మాణం వల్ల ఇసుక బస్తాలతో పనిలేకపోవడంతో ప్రతి సంవత్సరం రూ.50లక్షలకు పైగా ప్రజాధనం వృథా కాకుండా నిలిచిపోతుంది. పైగా సంగం బ్యారేజ్ వద్ద 0.45 టీఎంసీల నీరు నిల్వ ఉండనుంది. మరోవైపు భూగర్భజలాలు పెరిగి నీరు మోటార్లకు సైతం అందుతుందని అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాకపోకల సమస్యకు బ్రేక్ నిత్యం సంగం పాత బ్యారేజ్ పైన రాకపోకలు స్తంభించేవి. ప్రజలకు తీవ్ర అసౌకర్యాలు ఉండేది. త్వరలో ఈ సమస్య తీరిపోనుంది. నూతన బ్యారేజ్ మీద రాకపోకల కోసం 7.5 మీటర్ల వెడల్పుతో 1,195 మీటర్ల పొడవున రోడ్డు నిర్మించారు. రెండు వైపులా వాహనాలు తిరిగే వీలు ఏర్పడింది. పాదచారులు నడిచేందుకు వీలుగా 1.5 మీటర్ల నడక దారిని సైతం నిర్మించారు. సంగం నుంచి పొదలకూరు, చేజర్ల, రాపూరు, వెంకటగిరి మండలాలకు రాకపోకలు సౌకర్యం మెరుగుపడుతుంది. ఆనందంలో అన్నదాతలు కలలు కార్యరూపం దాల్చడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శంకుస్థాపన చేసిన దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి, పనులు పూర్తిచేసిన ఆయన తనయుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. నూతన బ్యారేజ్‌కు దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి పేరు పెట్టడం జగన్మోహన్రెడ్డి మంచితనానికి నిలువెత్తు నిదర్శనమని అన్నదాతలు, ప్రజలు హర్షాతిరేకాల మధ్య చెబుతున్నారు. అపర భగీరథుడు డాక్టర్ వైఎస్సార్ సంగం బ్యారేజ్ స్థానంలో నూతన బ్యారేజ్‌కు శంకుస్థాపన చేసిన దివంగత మహానేత, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అపర భగీరథుడు. అన్నదాతల కష్టాలు తెలిసిన నేత నూతన బ్యారేజ్‌తో సాగు, తాగునీటి సమస్యలను పరిష్కరించి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు. సాగునీరు పొందిన ప్రతి రైతు ఆ మహానుభావుడి పేరును చిరకాలం గుర్తుంచుకుంటారు. – పులగం శంకర్‌రెడ్డి, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ తండ్రికి మించిన తనయుడు తండ్రి శంకుస్థాపన చేసిన సంగం నూతన బ్యారేజ్‌ను దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి చొరవతో ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్టుదలతో పూర్తిచేసి ప్రారంభానికి సిద్ధం చేయించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి తండ్రికి మించిన తనయుడు. అన్నదాతల కష్టాలు తీర్చిన తండ్రి, తనయులను ఎప్పుడూ గుర్తించుకుంటారు. – కంటాబత్తిన రఘునాథరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు గౌతమ్‌రెడ్డి పేరు పెట్టడం శుభపరిణామం సంగం నూతన బ్యారేజ్‌కి దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి పేరు పెట్టడం శుభపరిణామం. దీని ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తనను నమ్ముకున్న వారికి ఎంతటి మర్యాదనిస్తారో తెలియచెప్పారు. అంతేకాకుండా తన దగ్గరి వారిని ఎప్పుడు గుర్తుంచుకుంటారనే విషయం మరోమారు రుజువైంది. – ముడి మల్లికార్జునరెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు, మర్రిపాడు