
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. పెన్నానదిపై సంగం వద్ద నిర్మించిన మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజ్‌ను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. అనంతరం అక్కడ బహిరంగసభలో మాట్లాడతారు. తరువాత ముఖ్యమంత్రి జగన్ నెల్లూరు చేరుకుని నెల్లూరు బ్యారేజ్ కమ్ బ్రిడ్జిని ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు.
సీఎం జగన్ పర్యటన ఇలా..
► ఉదయం 9.30 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరి 10.40 గంటలకు సంగం చేరుకుంటారు.
► 11–1.10 గంటల మధ్య మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజ్‌ను ప్రారంభించి, బహిరంగసభలో ప్రసంగిస్తారు.
► 1.20 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 1.45 గంటలకు నెల్లూరు బ్యారేజ్ వద్దకు చేరుకుంటారు.
► 1.50–2.20 గంటల మధ్య నెల్లూరు బ్యారేజ్ కమ్ బ్రిడ్జిని ప్రారంభిస్తారు.
► 2.20 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం 4.15 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.