Breadcrumb
CM Jagan Nellore Tour: దశాబ్దాల స్వప్నం సాకారం
Published Tue, Sep 6 2022 8:26 AM | Last Updated on Tue, Sep 6 2022 5:57 PM
Live Updates
SPSR Nellore District: ముగిసిన సీఎం జగన్ నెల్లూరు పర్యటన
ముగిసిన సీఎం జగన్ నెల్లూరు పర్యటన
సీఎం జగన్ నెల్లూరు జిల్లా పర్యటన ముగిసింది. మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీల ప్రారంభ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన.. తిరిగి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఆయన గన్నవరం(విజయవాడ)కు చేరుకుంటారు. రాష్ట్ర డిప్యూటీ సీఎం నారాయణస్వామి, రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బియ్యపు మధుసూదన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎస్సీబీ నాయుడు,జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్ అంజూరి శ్రీనివాసులు తదితరులు సీఎం జగన్‌కు ఎయిర్‌పోర్ట్‌లో వీడ్కోలు పలికారు.
నెల్లూరు బ్యారేజ్‌ను ప్రారంభించిన సీఎం జగన్
నెల్లూరు నగరానికి సమీపంలో పెన్నా నదిపై నెల్లూరు బ్యారేజ్‌ను ప్రారంభించారు సీఎం జగన్. దీంతో దశాబ్దాల నెల్లూరు వాసుల కల నెరవేరింది. సాగు నీటితో పాటు నెల్లూరు, మరో 77 గ్రామాల తాగునీటి అవసరాలు తీరనున్నాయి. నెల్లూరుతో పాటు సంగం ప్రాజెక్టులను మూడేళ్లలోనే వైఎస్సార్సీపీ ప్రభుత్వం పూర్తి చేసింది.
నెల్లూరు బ్యారేజ్ కమ్ రోడ్ బ్రిడ్జి ప్రారంభం
నెల్లూరు బ్యారేజ్ కమ్ రోడ్ బ్రిడ్జిని ప్రారంభించిన సీఎం జగన్
నెరవేరిన సింహపురివాసుల కల
1904 నుంచి బ్యారేజ్ కమ్ రోడ్ బ్రిడ్జ్‌ను నిర్మించాలని డిమాండ్ ఉంది. ఆ కలను సీఎం జగన్ నెరవేర్చారు. నెల్లూరు బ్యారేజ్ ద్వారా 99,525 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. అలాగే నెల్లూరుతో పాటు 77 గ్రామాలకు తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది.
నెల్లూరు బ్యారేజ్ వద్దకు సీఎం జగన్
సింహపురికి జలసిరులు.. సుదీర్ఘ కలను నెరవేర్చిన సీఎం జగన్. నెల్లూరు బ్యారేజ్ వద్దకు చేరుకున్న సీఎం జగన్.. శాస్త్రోక్తంగా పూలు జల్లి పూజ నిర్వహించారు.
అందుకు గర్వపడుతున్నా: సీఎం జగన్
సంగం, నెల్లూరు బ్యారేజ్‌లను జాతికి అంకితమిస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్జగన్మోహన్రెడ్డి తెలిపారు. రూ. 380 కోట్లు ఖర్చు చేసి సంగం, నెల్లూరు బ్యారేజ్ పూర్తి చేశామన్నారు. 5 లక్షల ఎకరాల సాగు భూమి స్థిరీకరించామని పేర్కొన్నారు.
'నెల్లూరు జిల్లాలో కరువు మండలమే ఉండదు. వైఎస్సార్ సీఎం అయ్యాక నెల్లూరు జిల్లా గురించి ఆలోచించారు. వైఎస్సార్ ప్రారంభించిన ప్రాజెక్ట్‌ను పూర్తి చేసినందుకు గర్వపడుతున్నా. ప్రతికూల పరిస్థితలను ఎదురొడ్డి రెండు ప్రాజెక్ట్‌లను పూర్తి చేశాం. మూడేళ్లలోనే సంగం, నెల్లూరు బ్యారేజ్‌లను పూర్తి చేశాం. గౌతమ్‌రెడ్డి మన మనసులో చిరస్థాయిగా ఉండిపోతారు. సంగం బ్యారేజ్‌కు మేకపాటి గౌతమ్‌రెడ్డిగా నామకరణం చేసుకున్నామని సీఎం జగన్ వ్యాఖ్యానించారు.
చివరగా ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి సీఎం జగన్ ముందుంచిన అన్నిప్రతిపాదనలకు బహిరంగ సభ వేదికగా వాటికి ఆమోదం తెలిపారు.
సీఎం జగన్ కుటుంబానికి అండగా నిలిచింది వారే: మంత్రి అంబటి
ఈ రోజు ఇది ఒక అద్భుత సంఘటన, సన్నివేశమని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి శంకుస్థాపన చేస్తే, ఆయన వారసుడిగా సీఎం జగన్ మోహన్ రెడ్డి నేడు ఆ బ్యారేజ్‌లను ప్రారంభించారు. బ్రిటిష్ పాలనలో నిర్మాణం చేసిన ప్రాజెక్ట్‌లను తిరిగి వైఎస్ హయాంలో శంకుస్థాపన చేశారు. 2006లో సంగం, 2008లో నెల్లూరు బ్యారేజిను ఆనాడు వైఎస్సార్ శంకు స్థాపన చేశారు.
సీఎం జగన్ మూడేళ్లలో శర వేగంగా పాలన అందిస్తున్నారు. సీఎం జగన్ కుటుంబానికి మొదట అండగా నిలిచిన కుటుంబం మేకపాటి కుటుంబం. జలయజ్ఞంలో ప్రారంభమైన పోలవరం, వెలిగొండ ప్రాజెక్ట్‌లు అన్నింటిని కూడా సీఎం జగన్ చేతులు మీదుగా ప్రారంభిస్తారు అని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు.
సుదీర్ఘకాలం సీఎంగా కొనసాగాలని కోరుకుంటున్నా: మేకపాటి
సంగం మూడు నదుల పవిత్ర సంగమ పుణ్యక్షేత్రం. మాజీ మంత్రి గౌతం రెడ్డి చితా భస్మం సంగం వద్దనే మొదటగా కలిపామని మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి తెలిపారు. 'సంగం, ఏ.ఎస్.పేటలను టూరిస్ట్ ప్రాంతాలుగా అభివృధి చేయాలని సీఎంకు విన్నవిస్తున్నాను. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ మెట్ట ప్రాంతాలకు హైలెవల్ కెనాల్ ఏర్పాటు చేశారు. వైఎస్సార్ మొదలు పెట్టిన అన్ని ప్రాజెక్టులు రాబోయే రోజుల్లో పూర్తవుతాయి. గౌతమ్‌రెడ్డి లేని కొరత విక్రమ్‌రెడ్డి తీరుస్తారు.
కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే హోదా వస్తుంది. ప్రత్యేక హోదా వచ్చి ప్రాజెక్టులు పూర్తయితే రాష్ట్రం సుభిక్షం అవుతుంది. ప్రజా స్పందన చూస్తుంటే వైఎస్సార్సీపీ 175 అసెంబ్లీ 25 పార్లమెంటు స్థానాలు గెలిచే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రజలు మీకు అండగా నిలుస్తున్నారు. విద్య, వైద్య రంగంలో తీసుకుంటున్న నిర్ణయాలను ప్రజలు అందరూ స్వాగతిస్తున్నారు. ఒడిశా సీఎం లాగే జగన్ సుదీర్ఘకాలం కొనసాగాలని కోరుకుంటున్నాను' మేకపాటి రాజమోహన్‌రెడ్డి పేర్కొన్నారు.
మొదటి పది స్థానాల్లో ఆత్మకూరు: మేకపాటి విక్రమ్‌రెడ్డి
మేకపాటి గౌతం రెడ్డి సంగం బ్యారేజ్‌కు పేరు పెట్టడం పట్ల సీఎం జగన్‌కు ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. 'గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా ప్రజలు ఎంతో స్వాగతిస్తున్నారు. ప్రతి పేద కుటుంబంలో సంతోషం వ్యక్తం చేస్తున్నారు, డాక్టర్, ఇంజనీర్లు అవుతున్నారు. సంగం బ్యారేజి నుంచి ఎన్‌హెచ్‌గా గుర్తించాలి. నారంపేటలో ఎం.ఎస్.ఎం.ఈ ప్రాజెక్ట్ పనులు ఏడాదిలో.. ఇండస్ట్రియల్ పార్క్ సీఎం చేత త్వరలో ప్రారంభిస్తాం. ఆత్మకూరు స్థానికులకు యాభై శాతం కేటాయించాలి. ఎం.ఎస్.ఎం.ఈ ప్రాజెక్ట్‌కు ప్రత్యేక నిధులు కేటాయించాలి. ఆత్మకూరు నియోకవర్గం వచ్చే ఎన్నికల్లో మొదటి పది స్థానాల్లో నిలుస్తుంది అని ఎమ్మెల్యే విక్రమ్‌రెడ్డి అన్నారు.
జిల్లా ప్రజల తరపున సీఎం జగన్‌కు ధన్యవాదాలు
సంగం బ్యారేజి, పెన్నా బ్యారేజి ద్వారా ఆరు లక్షలు ఎకరాలు సాగునీరు, త్రాగునీరు అందుతుంది అని నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు తెలిపారు. రూ.500 కోట్లతో రెండు బ్యారేజ్‌లు ప్రారంభం చేస్తున్నారు. ఇవి వరద ఉధృతి సమయంలో చాలా ఉపయోగపడుతాయి. వీటికి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి శంకుస్థాపన చేస్తే, ఆయన కుమారుడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించడం జిల్లా ప్రజలు తరపున ధన్యవాదాలు తెలియజేశారు.
సభాస్థలికి సీఎం జగన్
మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజీ సభాస్థలికి సీఎం వైఎస్ జగన్ చేరుకున్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకున్నారు. స్టేజీ మీద దివంగత వైఎస్సార్, మేకపాటి గౌతమ్‌రెడ్డిలకు పుష్ఫాంజలి అర్పించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా నాయకులు పాల్గొన్నారు. మరికాసేపట్లో బహిరంగ సభను ఉద్ధేశించి సీఎం జగన్ ప్రసంగించనున్నారు.
విగ్రహాల ఆవిష్కరణ
నెల్లూరు జిల్లాలో మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజ్ ప్రారంభం అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. బ్యారేజ్ వద్ద ఏర్పాటు చేసిన దివంగత వైఎస్సార్, మేకపాటి గౌతమ్‌రెడ్డిల విగ్రహాలను ఆవిష్కరించారు.
మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజ్‌ను ప్రారంభించిన సీఎం జగన్
నెల్లూరు: ఎన్నో దశాబ్దాల సింహపురి వాసుల కల ఇవాళ్టితో నెరవేరింది. నెల్లూరు జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా మంగళవారం మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజ్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మేకపాటి కుటుంబ సభ్యులు, జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అధికారులు పాల్గొన్నారు. అనంతరం వీటిని జాతికి అంకితమిచ్చారు. వేదపండితుల ఆశీర్వచనాల మధ్య సీఎం జగన్ కొబ్బరికాయ కొట్టి బ్యారేజ్‌ను ప్రారంభించారు. అనంతరం పెన్నా నదికి హారతినిచ్చారు.
సంగం బ్యారేజ్ వద్దకు సీఎం జగన్
సంగం బ్యారేజ్ వద్దకు సీఎం జగన్
సీఎం జగన్.. మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజ్ వద్దకు చేరుకున్నారు. సంగం బ్యారేజ్ నిర్మాణం వల్ల ఏఏ ప్రాంతాలు సస్యశ్యామలం కాబోతున్నాయి.. తాగు, సాగునీరు సమస్యను ఏ విధంగా అధిగమించబోతున్నారు అనే విషయాలను అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను సీఎం జగన్ తిలకించారు.
హెలిప్యాడ్ వద్దకు చేరుకొన్న సీఎం జగన్
నెల్లూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంగం హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నారు. జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు సీఎంకు ఘన స్వాగతం పలికారు. ఆ వెంటనే సీఎం జగన్ హెలిప్యాడ్ నుంచి రోడ్డుమార్గాన మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజ్ వద్దకు బయల్దేరి వెళ్లారు.
కడప విమానాశ్రయం చేరుకున్న సీఎం వైఎస్ జగన్
వైఎస్సార్ జిల్లా: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కడప విమానాశ్రయం చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక ఫ్లైట్ ద్వారా కడపకు వచ్చి.. అక్కడ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా నెల్లూరు జిల్లా బయల్దేరి వెళ్లారు. కడప ఎయిర్‌పోర్ట్‌లో సీఎం జగన్‌ను జిల్లా కలెక్టర్ విజయరామ రాజు, ఎస్పీ అన్బురాజన్, పార్లమెంట్ అధ్యక్షుడు సురేష్ బాబు, జడ్పీ చైర్మన్ ఆకేపాటి అమరనాథ్ రెడ్డి, ఎమ్మెల్యే రవీంద్రనాధ్ రెడ్డి కలిశారు.
నెల్లూరుకు బయల్దేరిన సీఎం జగన్
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నెల్లూరు జిల్లా పర్యటనకు బయల్దేరారు. జిల్లా పర్యటనలో భాగంగా మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజ్, నెల్లూరు బ్యారేజ్‌లను ప్రారంభిస్తారు.
చిరకాల స్వప్నం సాకారం
దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞంలో భాగంగా 2006 మే 28న శంకుస్థాపన చేశారు. 2008లో పనులు ప్రారంభించారు. శరవేగంగా కొనసాగిన ఆ పనులు వైఎస్సార్ హఠాన్మరణంతో ప్రాజెక్ట్‌ల పనులన్నీ అర్ధాంతరంగా నిలిచిపోయాయి. 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం సైతం కమీషన్లు దక్కే పనులకే ప్రాధాన్యం ఇచ్చి పనులను నత్తనడకన సాగించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రి అయిన మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజీ ఆవశ్యకతను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి వివరించారు.
చిత్తశుద్ధితో బ్యారేజీ పనులకు శ్రీకారం చుట్టారు. అప్పటి భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా జిల్లాకు చెందిన డాక్టర్ అనిల్‌కుమార్‌యాదవ్ కొనసాగుతుండడంతో అటు సంగం, ఇటు నెల్లూరు బ్యారేజీ పనులకు అత్యంత ప్రాధాన్యత లభించింది. ఈలోపు మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం చెందడంతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సంగం బ్యారేజీకి మేకపాటి గౌతమ్‌రెడ్డి పేరును నామకరణం చేసి, శరవేగంగా ప్రాజెక్టు పనులు పూర్తి చేశారు. దీంతో పెన్నాడెల్టాలోని 2.47 లక్షలు, కనుపూరు కాలువ కింద 63 వేలు, కావలి కాలువ కింద 75 వేలు మొత్తంగా 3.85 లక్షల ఎకరాల ఆయకట్టుకు సమృద్ధిగా సాగునీరు అందించేందుకు మార్గం ఏర్పడింది. మరో వైపు పెన్నానది వరదలను సమర్థవంతంగా నియంత్రించి, వరద ముంపు ముప్పునకు శాశ్వత పరిష్కారం దక్కింది. నెల్లూరు బ్యారేజీ ద్వారా సర్వేపల్లి, కోవూరు, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల పరిధిలో 99,525 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరగనుంది.
నెల్లూరు బ్యారేజ్
ఎక్కడ : నెల్లూరు నగరానికి సమీపంలో పెన్నా నదిపై (మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజ్‌కు 20 కి.మీ. దిగువన)
పరీవాహక ప్రాంతం : 51,800 చదరపు కిలోమీటర్లు
బ్యారేజ్ పొడవు : 640 మీటర్లు (బ్యారేజ్‌కు అనుబంధంగా రెండు వరుసల రోడ్ బ్రిడ్జి)
గేట్లు : 51 (పది మీటర్లు ఎత్తు, మూడు మీటర్ల వెడల్పుతో 43 గేట్లు.. పది మీటర్లు ఎత్తు,
4.3 మీటర్ల ఎత్తుతో ఎనిమిది స్కవర్ స్లూయిజ్ గేట్లు)
గేట్ల మరమ్మతుకు సిద్ధం చేసిన స్టాప్‌లాగ్ గేట్లు: 6
గేట్ల నిర్వహణ : వర్టికల్ లిఫ్ట్
గరిష్ట వరద విడుదల సామర్థ్యం : 10,90,000 క్యూసెక్కులు
గరిష్ట నీటి మట్టం : 14.3 మీటర్లు
గరిష్ట నీటి నిల్వ : 0.4 టీఎంసీలు
కనీస నీటి మట్టం : 11.3 మీటర్లు
ఆయకట్టు : 99,525 ఎకరాలు
అంచనా వ్యయం : రూ.274.83 కోట్లు
వైఎస్సార్ హయాంలో చేసిన వ్యయం : రూ.86.62 కోట్లు
టీడీపీ హయాంలో చేసిన వ్యయం : రూ.71.54 కోట్లు (కాంట్రాక్టర్ నుంచి కమీషన్లు వసూలు చేసుకోవడానికి సులభమైన పనులను మాత్రమే చేశారు)
వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన వ్యయం : రూ.77.37 కోట్లు.
మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజ్
ఎక్కడ : శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం వద్ద పెన్నా (సోమశిల రిజర్వాయర్‌కు 40 కి.మీ. దిగువన)
పరీవాహక ప్రాంతం: 50,122 చదరపు కిలోమీటర్లు
బ్యారేజ్ పొడవు : 1,195 మీటర్లు (బ్యారేజ్‌కు అనుబంధంగా రెండు వరసల రోడ్ బ్రిడ్జి)
గేట్లు : 85 గేట్లు(12 మీటర్లు ఎత్తు, 2.8 మీటర్ల వెడల్పుతో 79 గేట్లు.. 12 మీటర్ల ఎత్తు, 3.8 మీటర్ల వెడల్పుతో 6 స్కవర్ స్లూయిజ్ గేట్లు)
గేట్ల మరమ్మతుల కోసం సిద్ధం చేసిన
స్టాప్ లాగ్ గేట్లు : 9
గేట్ల నిర్వహణ విధానం : వర్టికల్ లిఫ్ట్
గరిష్ట వరద విడుదల సామర్థ్యం : 7,50,196 క్యూసెక్కులు
గరిష్ట నీటి మట్టం : 35 మీటర్లు
గరిష్ట నీటి నిల్వ : 0.45 టీఎంసీలు
కనీస నీటి మట్టం : 32.2 మీటర్లు
ఆయకట్టు : 3.85 లక్షల ఎకరాలు
అంచనా వ్యయం : రూ.335.80 కోట్లు
వైఎస్సార్ హయాంలో వ్యయం : రూ.30.85 కోట్లు
టీడీపీ హయాంలో వ్యయం : రూ.86.10 కోట్లు (కాంట్రాక్టర్ నుంచి కమీషన్లు వసూలు
చేసుకోవడానికి సులభమైన పనులను మాత్రమే చేపట్టారు)
వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన వ్యయం : రూ.131.12 కోట్లు
నాటికి, నేటికి ఇదీ తేడా...
సంగం, నెల్లూరు బ్యారేజ్‌ల పనులను 2014 నుంచి 2016 వరకూ అధికారంలో ఉన్న చంద్రబాబు సర్కార్ పూర్తిగా నిలిపివేసింది. ఆ తర్వాత కమీషన్లు వసూలు చేసుకునేందుకు వీలున్న పనులను మాత్రమే చేపట్టారు. చివరకు రెండు బ్యారేజ్‌లను పూర్తి చేయలేక చేతులెత్తేశారు. 2019 మే 30న సీఎంగా బాధ్యతలు చేపట్టాక జలయజ్ఞం ప్రాజెక్టులపై వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.
సంగం, నెల్లూరు బ్యారేజ్‌లను ప్రాధాన్యతగా చేపట్టి యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశారు. కరోనా, పెన్నాకు మూడేళ్లుగా వరదలు వంటి ప్రతికూల పరిస్థితులను అధిగమిస్తూ రెండు బ్యారేజ్‌లను సీఎం జగన్ పూర్తి చేశారు. సాగు, తాగునీటితోపాటు రవాణా సమస్యలను శాశ్వతంగా పరిష్కరించారు. బ్యారేజ్‌ల ద్వారా వరదను సమర్థంగా నియంత్రించి ముంపు ముప్పు తప్పించేలా మార్గం సుగమం చేశారు.
1,443 మందితో బందోబస్తు
ఎస్పీ పర్యవేక్షణలో సంగం వద్ద ఏఎస్పీలు డి.హిమవతి, కె.చౌడేశ్వరి, శ్రీనివాసరావు, 8 మంది డీఎస్పీలు, 25 మంది సీఐలు, 61 మంది ఎస్ఐలు, 153 మంది ఏఎస్ఐ/హెచ్‌సీలు, 331 మంది కానిస్టేబుల్స్, 174 మంది హోంగార్డులు, 49 మంది మహిళా ఏఎస్ఐ/హెచ్‌సీ/పీసీలు, 135 మంది ఏఆర్ సిబ్బంది మొత్తంగా 939 మందితో బందోబస్తును ఏర్పాటు చేశారు. నెల్లూరు పెన్నాబ్యారేజీ వద్ద ఒక ఏఎస్పీ, నలుగురు డీఎస్పీలు, 14 మంది సీఐలు, 40 మంది ఎస్ఐలు, 113 మంది ఏఎస్ఐ/హెచ్‌సీలు, 138 మంది కానిస్టేబుల్స్, 43 మంది హోమ్‌గార్డులు, 48 మంది మహిళా సిబ్బంది, 100 మంది ఏఆర్ సిబ్బంది మొత్తంగా 504 మంది సిబ్బంది బందోబస్తు విధుల్లో పాల్గొంటున్నారు.
సీఎం పర్యటనకు పటిష్ట బందోబస్తు
నెల్లూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం జిల్లాకు రానున్నారు. సంగం వద్ద పెన్నానదిపై నిర్మించిన మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజీని, నెల్లూరు వద్ద నిర్మించిన òనెల్లూరు బ్యారేజీను ముఖ్యమంత్రి ప్రారంభించనున్న నేపథ్యంలో ఎస్పీ సీహెచ్ విజయారావు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
సీఎం పర్యటించే ప్రాంతాలన్నింటిని సోమవారం నుంచే సిబ్బంది తమ అధీనంలోకి తీసుకున్నారు. బాంబ్ స్క్వాడ్, డాగ్స్క్వాడ్లతో అడుగడుగున క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. సభాప్రాంగణం, హెలిప్యాడ్, ప్రారంభోత్సవ కార్యక్రమాల వద్ద ముందస్తు అనుమతి పొందిన వారిని మాత్రమే అనుమతించాలని ఇప్పటికే సిబ్బందిని ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయం నుంచి ట్రయల్ కాన్వాయ్ నిర్వహించారు. సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించార
సీఎం పర్యటనకు ఏర్పాట్లు పూర్తి
మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, సీఎం కార్యక్రమాల కో– ఆర్డినేటర్ తలశిల రఘురామ్ పర్యవేక్షణలో జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేశారు. మంగళవారం ఉదయం 9.30 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరనున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి 10.40 గంటలకు సంగం వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు.
11 – 1.10 గంటల మధ్య మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజీను ప్రారంభించిన అనంతరం, సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. 1.20 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 1.45 గంటలకు నెల్లూరు బ్యారేజీ వద్దకు చేరుకుంటారు. 1.50–2.20 గంటల మధ్య నెల్లూరు బ్యారేజీ కమ్ బ్రిడ్జిని ప్రారంభిస్తారు. 2.20 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం 4.15 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
వరద ముంపు ముప్పునకు ఫుల్‌స్టాఫ్
సంగం, నెల్లూరు బ్యారేజీల నిర్మాణం వల్ల సోమశిల ప్రాజెక్టు వరద ప్రవాహాన్ని ఎక్కడికక్కడ నియంత్రణకు అవకాశం ఉంది. పెన్నానది లోతట్టు ప్రాంతాల ముప్పునకు శాశ్వత పరిష్కారం లభించింది. వరద ఉధృతి ముప్పును తప్పించేందుకు అడ్డుకట్టలుగా రెండు బ్యారేజీలు నిలవనున్నాయి. పెన్నానదికి వరదలు వస్తే వణికిపోయే నెల్లూరు నగర లోతట్టు ప్రాంతాలు ఇక నిశ్చింతగా ఉండనున్నారు. 10.95 లక్షల క్యూసెక్కుల నీటిని ఏక కాలంలో డిశ్చార్జి చేసేలా బ్యారేజీ రూపకల్పన చేయడం, 3 కి.మీ. కరకట్టలు నిర్మించడంతో వరదకు పుల్‌స్టాఫ్ పడినట్లు నిపుణులు వివరిస్తున్నారు.
మహోజ్వల ఘట్టం నేడు ఆవిష్కృతం
జిల్లా ప్రజల దశాబ్దాల స్వప్నం సాకారం. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి సంకల్పించిన జలయజ్ఞంను ఆయన తనయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పూర్తి చేసి స్ఫూర్తిగా నిలిచారు. ప్రాజెక్ట్‌లు పూర్తి చేయాలనే చిత్తశుద్ధి లేని గత పాలకుల దుర్నీతి పాలనకు దశాబ్ద కాలంపాటు గ్రహణం పట్టింది. తన తండ్రి సంకల్పించిన ప్రాజెక్ట్‌లను పూర్తి చేయాలనే దృఢ నిశ్చయంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వడివడిగా పనులు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తున్న మహోజ్వల ఘట్టం నేడు ఆవిష్కృతమవుతోంది.
Related News By Category
Related News By Tags
-
'వైఎస్సార్ ప్రారంభించిన ప్రాజెక్ట్‌ను పూర్తి చేసినందుకు గర్వపడుతున్నా'
సాక్షి, నెల్లూరు జిల్లా: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం నెల్లూరు జిల్లా పర్యటనలో సంగం వద్ద పెన్నానదిపై నిర్మించిన మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజీని, నెల్లూరు వద్ద నిర్మించిన నెల్లూరు...
-
పేరు తొలగించిన మాత్రాన..!
నెల్లూరు, సాక్షి: అధికారం చేపట్టిన వెంటనే.. కొనసాగుతున్న సంక్షేమ పథకాలను ఆపేయడం, వ్యవస్థలను నిర్వీర్యం చేయడం.. ఆఖరికి గత ప్రభుత్వ ఆనవాలు లేకుండా చేయడం పనిగా పెట్టుకున్నారు చంద్రబాబు. తాజాగా.. మేకపాటి ...
-
నెల్లూరు, సంగం బ్యారేజ్‌లకు ప్రతిష్టాత్మక సీబీఐపీ అవార్డు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని నెల్లూరు, సంగం బ్యారేజీలు ప్రతిష్టాత్మక సీబీఐపీ అవార్డుకు ఎంపికయ్యాయి. పెన్నా డెల్టా ఆధునికీకరణలో భాగంగా నెల్లూరు (0.4 టీఎంసీలు), సంగం బ్యారేజ్ (0.45 టీఎంసీలు)లను వైఎస్...
-
Fact Check: ఆ బ్యారెజ్ల నిర్మాణంలో ఎవరి భాగస్వామ్యం ఎంత..?
ఆ రెండు ప్రాజెక్టులు నెల్లూరు జిల్లాకు మణిహారాల్లా నిలుస్తున్నాయి. ఈ మధ్యనే వాటిని ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వాటిని జాతికి అంకితం చేసి జలయజ్ఞం ప్రాజెక్టులను పూర్తి చేయడంలో తన ప్రభుత్వ చిత్తశ...
-
ప్రాజెక్టులన్నీ చకచకా
దేవుడి దయ వల్ల వరుసగా నాలుగో ఏడాది కూడా రాష్ట్రంలో మంచి వర్షాలు కురుస్తున్నాయి. రైతన్నల మొహంలో చిరునవ్వు కనిపిస్తోంది. గత మూడేళ్లలో రాష్ట్రంలో ఏ ఒక్క మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాల్సిన అవసరం రాలేద...
Comments
Please login to add a commentAdd a comment