Nellore Barrage
-
నెల్లూరు బ్యారేజ్ తో లక్ష ఎకరాలు సస్య శ్యామలం
-
లక్ష ఎకరాలు సస్యశ్యామలం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వాసుల వందేళ్ల స్వప్నం నెల్లూరు బ్యారేజీ సాకారం కావడంతో దాదాపు లక్ష ఎకరాల ఆయకట్టుకు సమృద్ధిగా నీళ్లు అందుతున్నాయి. పెన్నా డెల్టాను సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా జలయజ్ఞంలో భాగంగా దివంగత వైఎస్సార్ చేపట్టిన నెల్లూరు బ్యారేజీ పనులను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ రికార్డు సమయంలో పూర్తి చేశారు. 2022 సెపె్టంబరు 6న బ్యారేజీని జాతికి అంకితం చేశారు. అప్పటి నుంచి వరుసగా మూడేళ్లుగా సర్వేపల్లి, జాఫర్ సాహెబ్ కాలువల కింద సర్వేపల్లి, కోవూరు, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల పరిధిలోని ముత్తుకూరు, టీపీ గూడూరు, వెంకటాచలం, ఇందుకూరుపేట, నెల్లూరు మండలాల్లోని 77 గ్రామాల్లో 99,525 ఎకరాల ఆయకట్టుకు పుష్కలంగా నీళ్లు అందడంతో విస్తారంగా పంటలు సాగు అవుతున్నాయి. నెల్లూరు బ్యారేజీలో ఏడాది పొడవునా 0.4 టీఎంసీలను నిల్వ చేయడం ద్వారా నెల్లూరుతోపాటు 77 గ్రామాల్లో తాగునీటి సమస్యను సీఎం జగన్ శాశ్వతంగా పరిష్కరించారు. నెల్లూరుతోపాటు బ్యారేజీ దిగువ గ్రామాలను ముంపు నుంచి కాపాడారు. నెల్లూరు బ్యారేజీ కమ్ రెండు వరసల రోడ్డు బ్రిడ్జిని పూర్తి చేయడం ద్వారా నెల్లూరు–కోవూరు మధ్య రవాణా సమస్యను సీఎం జగన్ శాశ్వతంగా పరిష్కరించారని నెల్లూరు జిల్లా వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. – సాక్షి, అమరావతి శిథిలమైన ఆనకట్ట స్థానంలో బ్యారేజీ.. నెల్లూరు నగరానికి సమీపంలో పెన్నా నదికి అడ్డంగా 1854–55లో 481.89 మీటర్ల వెడల్పుతో ఆనకట్టను నిర్మించిన బ్రిటిష్ సర్కార్ అరకొరగా ఆయకట్టుకు నీళ్లందిస్తూ వచ్చి ంది. పెన్నా నదికి 1862లో వచ్చి న భారీ వరదలకు ఆనకట్ట దెబ్బతినడంతో 621.79 మీటర్ల వెడల్పుతో 0.7 మీటర్ల ఎత్తుతో కొత్త ఆనకట్టను నిర్మించారు. పూడిక పేరుకుపోవడం, శిథిలమవడంతో ఆయకట్టుకు నీళ్లందించడం 1904 నాటికే సవాల్‌గా మారింది. నెల్లూరు తాగునీటి కోసం తల్లడిల్లింది. ఈ ఆనకట్టకు దిగువన ఉన్న రోడ్డు ద్వారా నెల్లూరు–కోవూరు మధ్య రాకపోకలు సాగించేవారు. పెన్నా నదికి కాస్త వరద వచ్చినా నెల్లూరు–కోవూరుల మధ్య రాకపోకలు స్థంభించిపోయేవి. ఆనకట్ట వల్ల వరద వెనక్కి ఎగదన్ని నెల్లూరు నగరాన్ని ముంచెత్తేది. ఈ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు ఆనకట్ట స్థానంలో బ్యారేజ్ కమ్ రోడ్ బ్రిడ్జిని నిర్మించాలని 1904 నుంచి నెల్లూరు జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. 2004 వరకూ దీన్ని ఎవరూ పట్టించుకోలేదు. జలయజ్ఞంలో భాగంగా నెల్లూరు బ్యారేజ్ కమ్ రోడ్ బ్రిడ్జి నిర్మాణాన్ని రూ.147.20 కోట్లతో దివంగత వైఎస్సార్ 2008 ఏప్రిల్ 24న చేపట్టారు. బ్యారేజీ పనుల కోసం రూ.85.82 కోట్లు ఖర్చు చేశారు. ఆయన హఠాన్మరణం నెల్లూరు బ్యారేజీకు శాపంగా మారింది. కరోనా.. భారీ వరదల్లోనూ.. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించాక నెల్లూరు బ్యారేజీని ప్రాధాన్యతగా చేపట్టి యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని జలవనరుల శాఖను ఆదేశించారు. కరోనా ప్రతికూల పరిస్థితులు, పెన్నా చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా వరుసగా మూడేళ్లు భారీ వరదలు ఆటంకాలు సృష్టించినా బ్యారేజీలో రెండు మీటర్ల మందంతో 57 పియర్లను ప్రభుత్వం పూర్తి చేసింది. 51 గేట్లను, ఎలక్ట్రిక్ విధానంలో హాయిస్ట్‌ను ఏర్పాటు చేసింది. రెండు వరుసల రోడ్ బ్రిడ్జిని నిర్మించారు. సర్వేపల్లి, జాఫర్ సాహెబ్ కాలువలకు నీటిని సరఫరా చేసే రెగ్యులేటర్‌ను పూర్తి చేశారు. 0.4 టీఎంసీలను నిల్వ చేయడానికి వీలుగా బ్యారేజ్‌కు కుడి, ఎడమ వైపు కరకట్టలను పటిష్టం చేశారు. ఈ పనులకు రూ.88 కోట్లు ఖర్చు చేశారు. కాలయాపన.. కమీషన్లు రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కార్ నెల్లూరు బ్యారేజ్ పనులను తీవ్ర నిర్లక్ష్యం చేసింది. పాత ఆనకట్టను పూర్తిగా తొలగించి బ్యారేజీ నిరి్మస్తున్న ప్రాంతానికి 20 మీటర్ల ఎగువన కాఫర్ డ్యామ్ నిర్మించి ఆయకట్టుకు నీళ్లందిస్తూ బ్యారేజ్ నిర్మించాలని 2014లో ప్రభుత్వానికి నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చి ంది. 2016 వరకూ టీడీపీ సర్కార్ దీన్ని కనీసం పరిశీలించలేదు. ఆ తరువాత అంచనా వ్యయాన్ని రూ.274.83 కోట్లకు సవరించి కాంట్రాక్టర్ నుంచి కమీషన్లు అధికంగా రాబట్టుకోవడానికి సులభంగా చేసే పనులకే ప్రాధాన్యం ఇచ్చి ంది. 2019 మే 29 వరకూ రూ.60.19 కోట్లను ఖర్చు చేసి బ్యారేజీలో 57 ఫియర్లను (కాంక్రీట్ దిమ్మెలు) పునాది కంటే ఒక మీటర్ ఎత్తు వరకు మాత్రమే చేయగలిగింది. ఆయకట్టుకు సమృద్ధిగా సాగునీరు కరోనా, పెన్నా వరదలు లాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ సీఎం జగన్ ఆదేశాల మేరకు ప్రాధాన్యతగా చేపట్టి నెల్లూరు బ్యారేజీని పూర్తి చేశాం. ఆయకట్టుకు సమృద్ధిగా నీటిని అందిస్తున్నాం. బ్యారేజీలో నిత్యం 0.4 టీఎంసీలను నిల్వ చేయడం ద్వారా భూగర్భ జలమట్టం పెరుగుతుంది. సాగు, తాగునీటి సమస్యను సీఎం జగన్ శాశ్వతంగా పరిష్కరించారు. – సి.నారాయణరెడ్డి, ఈఎన్సీ, జలవనరుల శాఖ ఆయకట్టు సస్యశ్యామలం.. పాదయాత్ర హామీని నిలబెట్టుకుంటూ నెల్లూరు బ్యారేజ్‌ను సీఎం జగన్ రికార్డు సమయంలో పూర్తి చేశారు. బ్యారేజీ పూర్తయ్యాక ఆయకట్టంతంటికీ సమృద్ధిగా నీళ్లందుతున్నాయి. 2022 నుంచి ఏటా రెండు పంటలు పండిస్తూ ఏడు ఎకరాల్లో వరి సాగు చేస్తున్నాం. మంచి దిగుబడులు వస్తున్నాయి. ధాన్యానికి గిట్టుబాటు ధర లభించడంతో ప్రయోజనం పొందుతున్నాం. బ్యారేజీ మీదుగా నెల్లూరుకు సులభంగా వెళ్లి వస్తున్నాం. – తన్నీరు అనిల్, రైతు, ఇందుకూరుపేట, నెల్లూరు జిల్లా నాడు కల.. నేడు నిజం నెల్లూరు బ్యారేజీ ఒక కల. ఈ పనులను మహానేత వైఎస్ ప్రారంభిస్తే సీఎం జగన్ పూర్తి చేశారు. బ్యారేజ్ పూర్తికాక ముందు ఆయకట్టుకు నీళ్లందకపోవడంతో 3.5 ఎకరాల్లోనే పంటలు సాగు చేశా. ఇప్పుడు సొంత పొలంతోపాటు 20 ఎకరాలు కౌలుకు తీసుకుని వరి సాగుచేస్తున్నా. మంచి దిగుబడులు వస్తున్నాయి. గిట్టుబాటు ధర దక్కుతోంది. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుతానని పాదయాత్రలో ఇచ్చిన హామీని సీఎం జగన్ నిలబెట్టుకున్నారు. – వాకాటి మహేష్, ఇందుకూరుపేట, నెల్లూరు జిల్లా నెల్లూరు బ్యారేజీ స్వరూపం ఇదీ.. ఎక్కడ?: నెల్లూరు నగరానికి సమీపంలో పెన్నా నదిపై (మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజీకి 20 కి.మీ. దిగువన) పరీవాహక ప్రాంతం: 51,800 చదరపు కిలోమీటర్లు బ్యారేజీ పొడవు: 640 మీటర్లు (బ్యారేజీకి అనుబంధంగా రెండు వరుసల రోడ్ బ్రిడ్జి) గేట్లు: 51 (పది మీటర్లు ఎత్తు, 3 మీటర్ల వెడల్పుతో 43 గేట్లు.. 10 మీటర్లు ఎత్తు, 4.3 మీటర్ల ఎత్తుతో 8 స్కవర్ స్లూయిజ్ గేట్లు) గేట్ల మరమ్మతుకు సిద్ధం చేసిన స్టాఫ్‌లాగ్ గేట్లు: 6 గేట్ల నిర్వహణ: వర్టికల్ లిఫ్ట్ గరిష్ట నీటి మట్టం: 14.3 మీటర్లు గరిష్ట వరద విడుదల సామర్థ్యం: 10,90,000 క్యూసెక్కులు ఆయకట్టు: 99,525 ఎకరాలు గరిష్ట నీటి నిల్వ: 0.4 టీఎంసీలు అంచనా వ్యయం: రూ.274.83 కోట్లు వైఎస్సార్ హయాంలో చేసిన వ్యయం: రూ.85.82 కోట్లు కనీస నీటి మట్టం: 11.3 మీటర్లు టీడీపీ హయాంలో వ్యయం: రూ.60.19 కోట్లు (కాంట్రాక్టర్ నుంచి అధికంగా కమీషన్లు వసూలు చేసుకోవడానికి సులభమైన పనులను మాత్రమే చేపట్టారు) వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన వ్యయం: రూ.88 కోట్లు -
నెల్లూరు, సంఘం బ్యారేజీలకు కేంద్రం అవార్డులు..
-
నెల్లూరు బ్యారేజ్‌కు నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి పేరు
జిల్లా రాజకీయాల్లో మకుటం లేని మహారాజు దివంగత నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి. రాష్ట్ర స్థాయిలో రాజకీయాలను శాసించిన ధీరశాలి ఆయన. తన రాజకీయ వ్యూహంతో కేంద్రంలో కాంగ్రెస్ హైకమాండ్‌కే ముచ్చెమటలు పట్టించిన ఘనాపాటి. జిల్లా రైతాంగం కోసం ఆయన చేసిన కృషికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కీర్తి కిరీటం ధరింప చేశారు. నెల్లూరు బ్యారేజీకి నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి పేరును చరితార్థం చేశారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు: జిల్లా రాజకీయాలను శాసించిన కుటుంబాల్లో నల్లపరెడ్డి కుటుంబం ఒకటి. ఇప్పటికీ ఆ కుటుంబానికి విధేయులుగా నడుచుకునే అభిమానులు, రాజకీయ నాయకులు ఉన్నారు. నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి పేరు వింటేనే రాష్ట్రంలో ఎవరికైనా ఠక్కున గుర్తుకు వచ్చేది నెల్లూరు. రైతుల కష్టాలు ఎరిగిన శ్రీనివాసులురెడ్డి వారికి అండగా నిలిచారు. తెలుగు గంగ ప్రాజెక్ట్‌ను జిల్లాకు తీసుకురావడంతో పాటు, దానిని ఎనీ్టఆర్, ఎంజీఆర్‌లతో కలిసి రైతాంగానికి అంకితమిచ్చారు. సోమశిల నీటి సామర్థ్యాన్ని పెంపొందించే విషయంలో నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి సేవలు చిరస్మరణీయం. జిల్లాలో ఎక్కువగా డెల్టా ప్రాంతంలోని రైతులకు సాగునీటి కష్టాలు రాకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుని రెండు పంటల సాగుకు నీరందించే విధంగా చర్యలు తీసుకున్నారు. తెలుగు గంగ కాలువ ప్రారంభంలో ఎనీ్టఆర్, ఎమ్జీఆర్తో నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి (ఫైల్) రైతుల గుండెల్లో అజరామరం నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డిని జిల్లాలోని ప్రతి రైతు తమ గుండ్లెలో నింపుకున్నారు. రైతులు పడుతున్న సాగు నీటి కష్టాలను గుర్తించిన నల్లపరెడ్డి ప్రాజెక్ట్‌ల సాధన కోసం నిత్యం పోరాటాలు చేసి రైతుల పాలిట పోరాట యోధుడిగా పేరు తెచ్చుకున్నారు. జిల్లాలో తనకంటూ ప్రత్యేక రాజకీయ ముద్రను వేసుకున్న నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి రైతు బాంధువుడిగా నిలిచిచారు. ప్రస్తుత పెన్నాడెల్టా ఆధునికీకరణకు 1987లో నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి ప్రతిపాదనలు పంపారు. ఆయన భౌతికంగా లేకపోయినా.. రైతులు గుండెల్లో అజరామరుడిగా నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి నిలిచిపోయారు. నల్లపరెడ్డి పేరు శాశ్వతం గతేడాది అక్టోబరు 27వ తేదీ నెల్లూరు పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నెల్లూరు బ్యారేజీకి నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి పేరు నామకరణం చేయబోతున్నామని ప్రకటించారు. ఈ మేరకు బుధవారం రాష్ట్ర కేబినెట్ నెల్లూరు బ్యారేజీకి నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి పేరును పెడుతూ తీర్మానాన్ని ఆమోదించింది. జిల్లా రైతుల కోసం కష్టపడిన దివంగత నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి బ్యారేజీ ఉన్నంత వరకు.. చరిత్ర చెరిగిపోని వరకు బతికే ఉంటారు. నెల్లూరు బ్యారేజీకి నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి పేరు పెట్టడంపై పలువురు రాజకీయ విశ్లేషకులు, నాయకులు, రైతు సంఘాల నాయకులు, రైతులు హర్షం వ్యక్తం చేశారు. శ్రీనివాసులురెడ్డి రాజకీయ ప్రయాణం ఉమ్మడి నెల్లూరు జిల్లా కోట మండలంలోని కొత్తపట్నం గ్రామానికి చెందిన నల్లపరెడ్డి వీరరాఘవరెడ్డి కుమారుడు నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి. 1933 ఏప్రిల్ 30న జని్మంచారు. విశాఖపట్నంలో బీఎల్ పూర్తిచేసే సమయంలో రాజకీయ రంగ ప్రవేశం చేశాడు. 1961వ సంవత్సరంలో కోట సమితి అధ్యక్షుడిగా తొలిసారి రాజకీయ ఆరంగేట్రం చేశారు. 1972లో జనరల్ స్థానంగా ఉన్న గూడూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 1978లో వెంకటగిరి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించారు. ఆ తర్వాత నుంచి కోవూరు నియోజకవర్గాన్ని తన స్థానంగా శాశ్వతం చేసుకున్నారు. కోవూరు నియోజకవర్గం నుంచి 1983, 1985లో టీడీపీ తరఫున, 1989లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈ విధంగా జిల్లా అంతటా నల్లపరెడ్డి వర్గాన్ని సృష్టించుకున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి ముఖ్యమంత్రులు టి.అంజయ్య, మర్రి చెన్నారెడ్డి, ఎన్టీ రామారావు కేబినెట్లో మంత్రిగా పనిచేసి రాష్ట్ర ప్రజలు మన్ననలు అందుకున్నారు. రాజీ పడని రాజకీయ నేతగా.. ఎమ్మెల్యేగా ఒక్క రోజు కూడా గైర్హాజరు కాకుండా అసెంబ్లీ టైగర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ముఖ్యమంత్రి రుణం తీర్చుకోలేనిది నెల్లూరు బ్యారేజీకి తన తండ్రి నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి పేరు పెడుతూ కేబినెట్‌తో ఆమోదింప చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి జీవిత కాలం రుణపడి ఉంటాం. మా తండ్రి నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి జిల్లా ప్రజలకు, రైతులకు చేసిన సేవలకు ఇన్నాళ్లకు గుర్తింపు లభించింది. మా తండ్రి భౌతికంగా లేకపోయినా.. బ్యారేజీ పేరుతో రైతుల గుండెల్లో గుర్తిండిపోతారు. ఇది జీవితంలో మరచిపోలేని రోజు. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. – నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే -
Fact Check: ఆ బ్యారెజ్ల నిర్మాణంలో ఎవరి భాగస్వామ్యం ఎంత..?
ఆ రెండు ప్రాజెక్టులు నెల్లూరు జిల్లాకు మణిహారాల్లా నిలుస్తున్నాయి. ఈ మధ్యనే వాటిని ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వాటిని జాతికి అంకితం చేసి జలయజ్ఞం ప్రాజెక్టులను పూర్తి చేయడంలో తన ప్రభుత్వ చిత్తశుద్ధిని చాటారు. ఇంతవరకూ బాగానే వుంది. సీఎం ఆ రెండు ప్రాజెక్టులను ప్రారంభించారో.. ఆ వెంటనే ఆ ఘనత తమదేనని తెలుగుదేశం పార్టీ నేతలు చెప్పుకోవడం ప్రారంభించారు. మేకపాటి గౌతంరెడ్డి సంగం బ్యారేజ్, నెల్లూరు పెన్నా బ్యారేజ్ నిర్మాణంలో ఎవరి భాగస్వామ్యం ఎంత ...? సాక్షి ఫ్యాక్ట్ చెక్ చూద్దాం. ఈ మధ్యనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించిన సంగం , నెల్లూరు బ్యారేజీలివి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞం ప్రాజెక్టుల్లో భాగంగా వీటికి శంకుస్థాపన చేసి నిధులు కేటాయించి పనులు ప్రారంభించారు. అయితే రాష్ట్ర ప్రజల దురదృష్టం కొద్దీ ఆయన అకాల మరణం చెందారు. దాంతో కొంతకాలంపాటు మూలన పడిన జలయజ్ఞం ప్రాజెక్టుల్లో ఇవి కూడా వున్నాయి. 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏర్పడిన తెలుగుదేశంపార్టీ ప్రభుత్వం నెల్లూరు, సంగం బ్యారేజీలను పూర్తి చేస్తామని పదే పదే ప్రకటనలు చేశారుగానీ పూర్తి చేయలేదు. 2019లో వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చింది. వైఎస్సార్ స్ఫూర్తిని ప్రతి ఫలించేలా ప్రాధాన్యతా క్రమంలో జలయజ్ఞం పనులను ప్రారంభిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన మాట నిలబెట్టుకున్నారు. ఈ రెండు బ్యారేజీల నిర్మాణంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. కరోనా, వరదల్లాంటి ప్రతికూల పరిస్థితులున్నప్పటికీ ఎక్కడా వెనకడుగు వేయకుండా వీటిని పూర్తి చేయించారు. అవసరమైన నిధులను కేటాయించి పనులయ్యేలా చూశారు. దాంతో సంగం, నెల్లూరు బ్యారేజీలు రెండూ ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఇంతవరకూ బాగానే వుంది. రెండు జలయజ్ఞం ప్రాజెక్టులు కళకళలాడుతూ, ఐదు లక్షల ఎకరాలకు సాగునీరు... నెల్లూరు నగరానికి పుష్కలంగా తాగునీరు అందించడానికి సిద్ధం కావడం తెలుగుదేశం పార్టీకి మింగుడు పడడం లేదు. ఇక వెంటనే ఈ రెండూ పూర్తవ్వడం తెలుగుదేశం ఘనతే అని చెప్పుకోవడం ప్రారంభించారు. వారికి ఎల్లో మీడియా కూడా తానా అంటే తందాన అనేసింది. నెల్లూరు, సంగం బ్యారేజీల నిర్మాణం విషంలో తెలగుదేశం పార్టీ నేతలు, వారికి కొమ్ముకాసే పచ్చ మీడియా ప్రచారంలో ఎంత నిజం వుందో చూద్దాం. నెల్లూరు బ్యారేజీ నిర్మాణ సవరించిన అంచనా విలువ రూ. 274.83 కోట్లు. ఇందులో 2008-2014 వరకూ అంటే రాష్ట్ర విభజన కి ముందు రూ. 86.62 కోట్లు ఖర్చు చేశారు. ఇక చంద్రబాబు హయాంలో 2014-2019 వరకూ అంటే ఐదు సంవత్సరాల్లో రూ. 71.54 కోట్లు వ్యయం చేశారు. 2019లో వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడింది.. అప్పటినుంచీ ఇప్పటివరకు ఈ మూడేళ్లలో కరోనా ప్రతికూల పరిస్థితుల్లో రూ. 77.37 కోట్లు ఖర్చు చేసి నెల్లూరు బ్యారేజీని పూర్తి చేశారు. జాతికి అంకితం చేశారు.. మేకపాటి గౌతంరెడ్డి సంగం బ్యారేజీ నిర్మాణ వ్యయాన్ని చూద్దాం. ఈ ప్రాజెక్టు సవరించిన అంచనా విలువ రూ. 335.80 కోట్లు. ఇందులో 2008-2014 వరకూ అంటే రాష్ట్ర విభజన కి ముందు రూ. 30.85 కోట్లు ఖర్చు చేయగా 2014-2019 వరకూ అంటే చంద్రబాబు హయాంలో ఐదు సంవత్సరాల్లో రూ. 86.10 కోట్లు వ్యయం చేశారు. 2019లో వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడింది. అప్పటినుంచీ ఇప్పటివరకూ అంటే సంగం ప్రాజెక్ట్ ప్రారంభమయ్యేవరకూ ఈ మూడేళ్లలో కరోనా ప్రతికూల పరిస్థితుల్లో సైత రూ. 131.12 కోట్లు ఖర్చు చేశారు. ఇవీ వాస్తవాలు. అటు వైఎస్ఆర్ హయాన్ని, ఇటు వైఎస్ జగన్ హయాంను కలుపుకుంటే నెల్లూరు, సంగం బ్యారేజీలకోసం సింహభాగం డబ్బులు ఖర్చు చేశారు. ప్రాజెక్టులు పూర్తి కావడానికి చిత్తశుద్ధితో కృషి చేశారు. అంతే కాదు కరోనా, వరదల్లాంటి ప్రతికూల పరిస్థితుల్లో..అన్ని సమస్యలు పరిష్కరించి చకచకా పనులు చేసి ఈ రెండు ప్రాజెక్టులను అందుబాటులోకి తెచ్చారు సీఎం వైఎస్ జగన్. కళ్ల ముందు లెక్కలు తప్పులు చెప్పవు కదా.. కానీ చంద్రబాబు నాయుడు ఆయన కోటరీ మాత్రం ఈ రెండు ప్రాజెక్టులు మా ఘనతే అని చెప్పుకుంటున్నారు. ఇతరుల కష్టాన్ని తమ ఖాతాలో వేసుకోవడానికి ఏమాత్రం సందేహించకపోవడం వారి దిగజారుడు తనానికి నిదర్శనమనే విమర్శలు వస్తున్నాయి. -
రెండు బ్యారేజీలను జాతికి అంకితం చేసిన సీఎం జగన్
-
ప్రాజెక్టులన్నీ చకచకా
దేవుడి దయ వల్ల వరుసగా నాలుగో ఏడాది కూడా రాష్ట్రంలో మంచి వర్షాలు కురుస్తున్నాయి. రైతన్నల మొహంలో చిరునవ్వు కనిపిస్తోంది. గత మూడేళ్లలో రాష్ట్రంలో ఏ ఒక్క మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాల్సిన అవసరం రాలేదు. అంతటా ఒక మంచి వాతావరణం కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీని జాతికి అంకితం చేస్తున్నాం. ఈ రోజు ఈ రెండు ప్రాజెక్టులు మాత్రమే కాదు.. దేవుడి దయతో ప్రతి సాగునీటి ప్రాజెక్టునూ పూర్తి చేయడానికి అడుగులు ముందుకు వేస్తున్నాం. శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకు 26 ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో తీసుకున్నాం. ప్రతి ప్రాజెక్టును కూడా ఉరుకులు పరుగులు పెట్టిస్తామని హామీ ఇస్తున్నాను. మీ అందరి చల్లని దీవెనలతో దేవుడు మరింతగా మంచి చేసే అవకాశం ఇవ్వాలని.. తద్వారా రైతన్నలకు ఇంకా మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నాను. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి ప్రతినిధి, నెల్లూరు: సంగం, నెల్లూరు బ్యారేజీలు మాత్రమే కాకుండా, దేవుడి దయతో ప్రతి సాగునీటి ప్రాజెక్టునూ ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. సాగునీటి ప్రాజెక్టుల పట్ల నాన్నగారు ప్రదర్శించిన చిత్తశుద్ధిని అదే స్ఫూర్తితో కొనసాగిస్తూ.. 26 ప్రాజెక్టులనూ నిర్మిస్తామని చెప్పారు. మంగళవారం ఆయన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీలను జాతికి అంకితం చేశారు. సంగం, నెల్లూరు బ్యారేజీల వద్ద దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, సంగం బ్యారేజీ వద్ద దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డిల కాంస్య విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంగం బ్యారేజీ వద్ద ప్రజలనుద్దేశించి మాట్లాడారు. మనందరి ప్రభుత్వం వచ్చాక దాదాపు రూ.320 కోట్లు ఖర్చు చేసి.. సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీలను పూర్తి చేశామని చెప్పారు. ఈ రెండు ప్రాజెక్టుల ద్వారా దాదాపు 5 లక్షల ఎకరాలకు సాగు నీటిని స్థిరీకరించామని.. తద్వారా ఆత్మకూరు, నెల్లూరు రూరల్.. సర్వేపల్లి, కోవూరు, కావలి నియోజకవర్గాలకు మంచి చేసే కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టామన్నారు. 2019లో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 3.85 లక్షల ఎకరాలకు వరప్రదాయిని అయిన సంగం బ్యారేజీని ప్రాధాన్యతా ప్రాజెక్టుగా చేపట్టి, నిర్మాణంలో వేగం పెంచి పూర్తి చేశామని చెప్పారు. ‘మనం అధికారంలోకి వచ్చాక 9 నెలలు తిరక్క ముందే కోవిడ్ సమస్య వచ్చింది. మరోవైపు పెన్నా నదిలో వరుసగా రెండేళ్ల పాటు వరదలు వచ్చాయి. అయినా అన్ని ప్రతికూల పరిస్థితులకు ఎదురొడ్డి ఈ ప్రాజెక్టు పనుల మీద దృష్టి పెట్టి పూర్తి చేశాం’ అని తెలిపారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. చిత్రంలో మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి తదితరుల దివంగత సీఎం వైఎస్సార్ వల్లే మోక్షం ► దాదాపు 140 ఏళ్ల క్రితం బ్రిటీష్ వారి హయాంలో సంగం వద్ద కట్టిన ఆనకట్ట కాలక్రమేణా శిథిలావస్థకు చేరుకుంది. అయినా గత పాలకులెవరూ దీనిని పట్టించుకోలేదు. ఈ ప్రాజెక్టు చేపట్టి, నెల్లూరు జిల్లాకు మంచి చేయాలని ఆలోచించలేదు. ► దివంగత ముఖ్యమంత్రి, ప్రియతమ నాయకుడు రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మాత్రమే ఈ జిల్లాకు మోక్షం వచ్చింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తయ్యేందుకు అడుగులు ముందుకు పడ్డాయి. 2006లో సంగం బ్యారేజ్ పనులు, ఆ తర్వాత నెల్లూరు బ్యారేజీ పనులు ప్రారంభమయ్యాయి. ► 2009లో నాన్నగారు మన మధ్య నుంచి దూరమయ్యారు. ఆ తర్వాత ఈ రెండు ప్రాజెక్టులను కూడా పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఈ రోజు ఆ పెద్దాయనకు కొడుకుగా, ముఖ్యమంత్రిగా ఆయన ప్రారంభించిన ప్రాజెక్టు పనులను పూర్తి చేయగలిగానని చెప్పడానికి గర్వపడుతున్నాను. ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. టీడీపీ హయాంలో ముహూర్తాలు తప్ప పనుల్లేవు ► 2014లో రాష్ట్రం విడిపోయాక టీడీపీ ప్రభుత్వ హయాంలో.. సంగం బ్యారేజీ కోసం కేవలం రూ.30.85 కోట్లు మాత్రమే ఖర్చు చేసి చేతులు దులుపుకున్నారు. 2017 నాటికి పూర్తి చేస్తామని ఒకసారి.. 2018 నాటికి పూర్తి చేస్తామని మరోసారి.. 2019 నాటికి పూర్తి చేస్తామని ఇంకోసారి చెప్పారు. ఇలా ముహూర్తాల మీద ముహూర్తాలు మార్చుకుంటూ పోయారే తప్ప.. ప్రాజెక్టును పూర్తి చేయాలని ఏరోజూ ఆలోచన చేయలేదు. ► వారు చేసిందల్లా ప్రాజెక్టుల్లో రేట్లు పెంచేయడం, ఎస్కలేషన్ ఇచ్చేయడం.. ఆ తర్వాత కమీషన్లు దండుకోవడమే. చంద్రబాబు హయాం అంతటా ఇదే తీరున అడుగులు పడటం చూశాం. గౌతమ్ జ్ఞాపకార్థం ఈ ప్రాజెక్టుకు ఆయన పేరు.. ► మనందరి ప్రభుత్వం వచ్చాక ఒకవైపు కోవిడ్ సమస్యలు, మరోవైపు వరదల వంటి ప్రతికూల పరిస్థితులు. అయినా మూడేళ్లనే రూ.200 కోట్లకు పైగా ఖర్చు చేసి సంగం ప్రాజెక్టును పూర్తి చేశాం. నాకు మిత్రుడు, మంచివాడు, ఆత్మీయుడు అయిన మేకపాటి గౌతంరెడ్డి నిజానికి ఈరోజు ఇక్కడ మనందరి మధ్య ఈ ప్రాజెక్టును ప్రారంభించే ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాల్సింది. ► గౌతమ్ హఠాన్మరణంతో మనందరికీ దూరమయ్యాడు. ఆ రోజు గౌతమ్ సంస్మరణ సభలో చెప్పిన మాటను ఈ రోజు నిలుపుకున్నాం. అతని జ్ఞాపకార్థం సంగం బ్యారేజీకి మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజీ అని పేరు పెడుతున్నాం. తద్వారా గౌతమ్ చిరస్థాయిగా ఎప్పుడూ మన మనస్సులోనే ఉంటాడు. ఈ బ్యారేజ్ వల్ల ఇప్పుడు పెన్నా డెల్టా కనిగిరి కాలువ కింది 2.47 లక్షల ఎకరాలు, కనుపూరు కాలువ కింద మరో 63 వేల ఎకరాలు, కావలి కాలువ కింద మరో 75 వేల ఎకరాలు వెరసి.. 3.85 లక్షల ఎకరాల ఆయుకట్టు స్థిరీకరణ జరుగుతుంది. బ్యారేజీల ప్రారంభోత్సవ సభకు హాజరైన జనసందోహంలో ఓ భాగం నెల్లూరు బ్యారేజీకి వైఎస్సార్ శ్రీకారం ► 150 సంవత్సరాల క్రితం నిర్మించిన నెల్లూరు ఆనకట్ట శిథిలావస్థకు చేరితే, పట్టించుకునే నాథుడు లేక దాదాపు లక్ష ఎకరాలకు నీరందించలేని స్థితికి చేరింది. అప్పట్లో ఆ దివంగత నేత రాజశేఖరరెడ్డి చొరవ చూపడం వల్ల మాత్రమే ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అడుగులు ముందుకు పడ్డాయి. ► ఆనాడు ప్రాజెక్టు వ్యయం రూ.147 కోట్లుగా అంచనా వేస్తే.. రూ.86 కోట్లు ఖర్చు చేసి, ప్రియతమ నేత ప్రాజెక్టును పరుగులు తీయించగలిగారు. నాన్నగారు చనిపోయాక ఈ ప్రాజెక్టు మళ్లీ నిర్లక్ష్యానికి గురైంది. మనందరి ప్రభుత్వం వచ్చాక ఈ ప్రాజెక్టునూ పూర్తి చేసి.. జాతికి అంకితం చేస్తున్నాం. రూ.85 కోట్ల విలువైన పనులకు పచ్చజెండా ► సోదరుడు, ఎమ్మెల్యే విక్రమ్‌రెడ్డి నియోజకవర్గానికి సంబంధించి.. కొన్ని సమస్యలు చెప్పారు. జాతీయ రహదారి నుంచి సంగం బ్యారేజ్‌కు నేరుగా రహదారి నిర్మాణానికి రూ.15 కోట్లు అవుతుందన్నారు. అది మంజూరు చేస్తున్నాను. ► ఆత్మకూరు నియోజకవర్గంలో 12 ఇరిగేషన్ పనులకు సంబంధించి రూ.40 కోట్లు మంజూరు చేస్తున్నా. నియోజకవర్గంలో 25 ఊళ్లకు రహదారి నిర్మాణానికి రూ.14 కోట్లు, ఆత్మకూరు మున్సిపాల్టీకి స్పెషల్ గ్రాంట్ కింద రూ.12 కోట్లు, సంగం ప్రాజెక్టు నుంచి సంగం పంచాయతీకి నీటి సదుపాయం కోసం రూ.4 కోట్లు మంజూరు చేస్తున్నాం. మొత్తమ్మీద దాదాపు రూ.85 కోట్ల విలువైన ఈ పనులన్నింటికీ అనుమతులు మంజూరు చేస్తున్నాను. ► ఈ కార్యక్రమంలో దివంగత మేకపాటి గౌతమ్‌రెడ్డి కుటుంబ సభ్యులు, మంత్రులు అంబటి రాంబాబు, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఆదాల ప్రభాకర్‌రెడ్డి, బీదా మస్తాన్‌రావు, ఎమ్మెల్యేలు బాలినేని శ్రీనివాసులరెడ్డి, మేకపాటి విక్రమ్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, డాక్టర్ పి.అనిల్‌కుమార్ యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, మానుగుంట మహీధర్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య, వరప్రసాద్‌రావు, కమ్యూనిటీ డెవెలప్మెంట్ చైర్మన్ నేదురుమల్లి రాంకుమార్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, నెల్లూరు మేయర్ స్రవంతి, ఎమ్మెల్సీ పోతుల సునీత తదితరులు పాల్గొన్నారు. వరుణుడి ఆశీర్వాదం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంగం బ్యారేజీని ప్రారంభించి, నెల్లూరు బ్యారేజీ జాతికి అంకితం చేసేందుకు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. అప్పటి వరకూ ఎండ వేడిమితో ఉన్న ఆ ప్రాంతం ఒక్కసారిగా మేఘావృతమై చిరుజల్లులు మొదలయ్యాయి. నెల్లూరు పరిసర ప్రాంతాల్లో జోరున వర్షం ప్రారంభమెంది. సీఎం పర్యటన ముగిసే వరకు నెల్లూరులో వర్షం కురుస్తూనే ఉంది. బ్రిడ్జి కమ్ బ్యారేజీ ప్రారంభించి, సీఎం తిరుగు ప్రయాణం కాగానే అక్కడా వర్షం ఆరంభమైంది. సంగంలో సైతం బహిరంగ సభ తర్వాత వాన జల్లులు పడ్డాయి. ఇదంతా కళ్లారా చూసిన వారు.. ముఖ్యమంత్రికి దేవుడి చల్లని దీవెనలు ఉన్నాయని, వరుణ దేవుడూ ఆశీర్వదించారని చర్చించుకున్నారు. ఇదో అద్భుత సన్నివేశం సంగం, నెల్లూరు బ్యారేజ్‌లను సీఎం జగన్ ఒకేసారి ప్రారంభించడం అద్భుతమైన సన్నివేశం. వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు ఈ రెండిటికీ శంకుస్థాపన చేశారు. తండ్రి సంకల్పించిన ఈ రెండు ప్రాజెక్టులను తనయుడు సాకారం చేయడం చరిత్రలో అరుదుగా జరిగే విషయం. స్వాతంత్య్రానంతరం వృధాగా సముద్రంలో కలిసిపోతున్న నీటిని వినియోగించుకోవడానికి ఎవరూ పెద్దగా దృష్టి పెట్టలేదు. వైఎస్సార్ వచ్చాకే జలయజ్ఞం పేరుతో ఆ దిశగా అడుగులు పడ్డాయి. ఆ మహానేత మనందరి మధ్య నుంచి వెళ్లిపోయాక ఆయన తనయుడు, సీఎం వైఎస్ జగన్.. ప్రాధాన్యతా క్రమంలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేలా చర్యలు తీసుకున్నారు. – జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు -
నెల్లూరు జిల్లా బ్యారేజ్‌ల ప్రారంభోత్సవంలో సీఎం జగన్ (ఫొటోలు)
-
'వైఎస్సార్ ప్రారంభించిన ప్రాజెక్ట్‌ను పూర్తి చేసినందుకు గర్వపడుతున్నా'
సాక్షి, నెల్లూరు జిల్లా: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం నెల్లూరు జిల్లా పర్యటనలో సంగం వద్ద పెన్నానదిపై నిర్మించిన మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజీని, నెల్లూరు వద్ద నిర్మించిన నెల్లూరు బ్యారేజీను మేకపాటి కుబుంబ సభ్యులతో కలిసి ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు. ఐదు లక్షలు ఎకరాలకు.. ఆత్మకూరు, కోవూరు, సర్వేపల్లి, కావలి నియోజక వర్గాలకు మేలు చేకూరే విధంగా ఈ ప్రాజెక్ట్ ప్రారంభించామని సీఎం జగన్ తెలిపారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయి. గత మూడున్నర ఏళ్లుగా ఒక మండలం కూడా కరువు మండలంగా ప్రకటించలేదు అని పేర్కొన్నారు. ఈ రెండు ప్రాజెక్ట్‌లను రూ.320 కోట్లతో పూర్తి చేసినట్లు వివరించారు. ''సంగం ప్రాజెక్ట్‌ను ప్రాధాన్యత ప్రాజెక్ట్‌గా వేగం పెంచాం, పూర్తి చేశాం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడిగా ఈ ప్రాజెక్ట్‌లు పూర్తి చేసినందుకు గర్వ పడుతున్నా. నాన్నగారి హయాంలో ప్రారంభిస్తే, ఆయన మరణం తర్వాత నిర్లక్ష్యం చేశారు. గత ప్రభుత్వం సంగం బ్యారేజి కోసం రూ.30 కోట్ల 5 లక్షలు మాత్రమే ఖర్చు చేశారు. బాబు హయాంలో కమీషన్లు దండు కోవడమే వాళ్లు చేశారు. సంగం ప్రాజెక్టుకు మన ప్రభుత్వంలో రూ.200 కోట్లు ఖర్చు చేశాం. కోవిడ్ సమస్య, వరద సమస్య ఉన్న మూడేళ్లలో పూర్తి చేశాం. స్నేహితుడు మేకపాటి గౌతం రెడ్డి పేరు పెట్టాం. హఠాన్మరణంతో గౌతమ్ మనకు దూరం అయ్యాడు. సంగం బ్యారేజికి మేకపాటి గౌతం రెడ్డి పేరు పెట్టాం. గౌతం సంస్మరణ సభలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా. 3లక్షల 85 వేల ఎకరాలు అయకటు స్థిరీకరణ జరుగుతోంది. నెల్లూరు ప్రాజెక్ట్ రూ.147 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభిస్తే.. రూ.86 కోట్లు ఖర్చు చేశారు.. ఆయన మరణం తర్వాత వాటిని పట్టించు కోలేదు. జలయజ్ఞంలో పెట్టిన 26 ప్రాజెక్ట్‌లు ప్రాధాన్యత క్రమంలో తీసుకుని ప్రతి ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం'' అని సీఎం జగన్ స్పష్టం చేశారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: (CM Jagan Nellore Tour: దశాబ్దాల స్వప్నం సాకారం) ఆత్మకూరుపై వరాల వర్షం ఆత్మకూరు ఎమ్మెల్యే విక్రమ్‌రెడ్డి ప్రతిపాదనలకు సీఎం జగన్ బహిరంగ సభ వేదికగానే ఆమోదం తెలిపారు. రూ.15 కోట్లతో హైవే నుంచి సంగం బ్యారేజి వరకు రోడ్, రూ. 40 కోట్లతో ఇరిగేషన్ పనులకు కేటాయించారు. 25 గ్రామాలకు రోడ్లు వేయడానికి రూ.14 కోట్లు మంజూరు చేశారు. రూ.12 కోట్లు స్పెషల్ గ్రాంట్‌గా కేటాయించారు. సంగం పంచాయితీకి రూ.4కోట్లు ఇచ్చారు. మొత్తంగా రూ.85 కోట్లు నిధులను అక్కడికక్కడే కేటాయిస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. -
CM Jagan Nellore Tour: దశాబ్దాల స్వప్నం సాకారం