
సాక్షి, నెల్లూరు: పెన్నా బ్యారేజ్ పనులను మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్, జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అనిల్ మాట్లాడుతూ.. 'సంఘం, పెన్నా బ్యారేజ్‌లకు 2006లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేశారు. 16 సంవత్సరాల తర్వాత సీఎం వైఎస్ జగన్ చొరవతో బ్యారేజ్ పనులు పూర్తి అయ్యాయి. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి కన్న కలలు నెరవేరబోతున్నాయి.
వైఎస్సార్ మరణం తర్వాత రెండు బ్యారేజీల పనులు నత్తనడకన సాగాయి. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు మూడు సార్లు బ్యారేజీలను సందర్శించారు. పూర్తి చేస్తాం, ప్రారంభిస్తాం అని మాటలతో సరిపెట్టారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు తీసుకున్న తర్వాత పనుల్లో వేగం పెంచాము. ఈ నెల 30న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ ప్రాజెక్టులను ప్రారంభిస్తారు' అని మాజీమంత్రి అనిల్‌కుమార్ యాదవ్ తెలిపారు.
చదవండి: (పవన్ తనకు తాను పెద్ద పుడింగి అనుకుంటున్నాడు: మంత్రి రాజా)
Comments
Please login to add a commentAdd a comment