Penna barrage
-
ప్రారంభానికి సిద్ధమైన నెల్లూరు పెన్నా బ్యారేజ్
-
దివంగత నేత వైఎస్సార్ కలలు నెరవేరబోతున్నాయి: మాజీ మంత్రి అనిల్
సాక్షి, నెల్లూరు: పెన్నా బ్యారేజ్ పనులను మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్, జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అనిల్ మాట్లాడుతూ.. 'సంఘం, పెన్నా బ్యారేజ్‌లకు 2006లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేశారు. 16 సంవత్సరాల తర్వాత సీఎం వైఎస్ జగన్ చొరవతో బ్యారేజ్ పనులు పూర్తి అయ్యాయి. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి కన్న కలలు నెరవేరబోతున్నాయి. వైఎస్సార్ మరణం తర్వాత రెండు బ్యారేజీల పనులు నత్తనడకన సాగాయి. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు మూడు సార్లు బ్యారేజీలను సందర్శించారు. పూర్తి చేస్తాం, ప్రారంభిస్తాం అని మాటలతో సరిపెట్టారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు తీసుకున్న తర్వాత పనుల్లో వేగం పెంచాము. ఈ నెల 30న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ ప్రాజెక్టులను ప్రారంభిస్తారు' అని మాజీమంత్రి అనిల్‌కుమార్ యాదవ్ తెలిపారు. చదవండి: (పవన్ తనకు తాను పెద్ద పుడింగి అనుకుంటున్నాడు: మంత్రి రాజా) -
పెన్నా బ్యారేజీ పనులు పరిశీలించిన మంత్రులు
సాక్షి, నెల్లూరు: పెన్నా బ్యారేజీ పనులను మంత్రులు అంబటి రాంబాబు, కాకాణి గోవర్థన్‌రెడ్డి సోమవారం పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. పెన్నా, సంగం బ్యారేజీలను త్వరలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభిస్తారని అంబటి రాంబాబు తెలిపారు. వరద కష్టాల నివారణకు కుడా ఈ బ్యారేజీలు దోహద పడతాయన్నారు. చదవండి: సిద్ధవ్వ దోసెలు సూపర్.. రోడ్డు పక్కన హోటల్లో టిఫిన్ తిన్న ఎమ్మెల్యే చెవిరెడ్డి మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి మాట్లాడుతూ, పెన్నా ,సంగం బ్యారేజీ పనులు 90 శాతం పైనే పూర్తయ్యాయని తెలిపారు. దివంగత నేత మహానేత వైఎస్సార్ బ్యారేజీలకు శంకుస్థాపన చేశారన్నారు. టీడీపీ హయాంలో పనులు నత్తనడకన సాగాయని.. చంద్రబాబు అసలు పట్టించుకోలేదని కాకాణి మండిపడ్డారు. సీఎంగా వైఎస్ జగన్ అధికారం చేపట్టిన తర్వాత పనులు వేగవంతం అయ్యాయన్నారు. నెల్లూరు జిల్లా రైతుల కలను సీఎం జగన్ సాకారం చేయబోతున్నారని మంత్రి కాకాణి అన్నారు. -
పెన్నా బ్యారేజ్‌ను పరిశీలించిన మంత్రి అనిల్‌కుమార్
సాక్షి, నెల్లూరు: పెన్నా బ్యారేజ్‌ను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ శనివారం పరిశీలించారు. కాంక్రీట్ వాల్ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని మంత్రి ఆదేశించారు. పెన్నా, సంగం బ్యారేజ్ పనులు తుది దశకు వచ్చాయని.. ఏప్రిల్ నెలాఖరుకు పనులు పూర్తవుతాయన్నారు. మే నెలలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదగా ప్రారంభిస్తామని తెలిపారు. బ్యారేజ్‌కు గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజ్‌గా నామకరణం చేసి జాతికి అంకితం చేస్తామని తెలిపారు. రెండు బ్యారేజ్ పనులు పూర్తయితే సాగు, తాగు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తోందని మంత్రి అనిల్ అన్నారు. చదవండి: కేశినేని వర్సెస్ దేవినేని.. టీడీపీలో హాట్ టాపిక్.. -
పెన్నాపై మరో కొత్త బ్రిడ్జి: మంత్రి అనిల్
సాక్షి, నెల్లూరు: పెన్నా బ్యారేజీ పనులను మంత్రి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, వరదల వల్ల నాలుగు నెలల పాటు పెన్నా బ్యారేజీ పనులు ఆలస్యం అయ్యాయని మంత్రి అన్నారు. సాధ్యమైనంత త్వరలో బ్యారేజీ పూర్తి చేసి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభింపజేస్తామని తెలిపారు. చదవండి: నిమ్మగడ్డను బెదిరించాల్సిన అవసరం నాకు లేదు రెండేళ్లలో సిటీ నియోజకవర్గంలో రూ.350 కోట్లు వరకు పనులు జరుగుతున్నాయని వివరించారు. గత టీడీపీ ప్రభుత్వం ఎన్నికల చివరి ఆరు నెలల ముందు మాత్రమే హడావిడి చేసి, మొదటి రెండేళ్లలో నామమాత్రంగా పనులు చేశారని విమర్శించారు. పెన్నా పై మరో నాలుగు లైన్ల నూతన బ్రిడ్జి నిర్మాణానికి 150 కోట్లుతో కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్లు మంత్రి వెల్లడించారు. ఎక్కడ రాజీ పడకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పష్టంచేశారు.చదవండి:బాబు జమానాలో అంతులేని నిర్బంధకాండ -
పెన్నా పాపం టీడీపీదే
సాక్షి, నెల్లూరు : గత టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చూపడంతోనే పెన్నా బ్యారేజీ నిర్మాణ పనులు పూర్తి కాలేదని, రైతాంగానికి ఎంతో అవసరమైన ప్రాజెక్ట్‌ను ఏళ్ల తరబడి పూర్తి చేయలేకపోయిన పాపం టీడీపీదేనని ఇరిగేషన్ శాఖ మంత్రి పోలుబోయిన అనిల్‌కుమార్‌యాదవ్ పేర్కొన్నారు. నెల్లూరు పెన్నా బ్యారేజీ పనులను రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డితో కలిసి మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2007లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.127 కోట్లతో పెన్నా బ్యారేజీని మంజూరు చేయడం జరిగిందన్నారు. వైఎస్సార్ హయాంలోనే ప్రాజెక్టు పనులు ప్రాంభమయ్యాయన్నారు. దాదాపుగా పన్నెండేళ్లు గడిచినా ఇంత వరకు ప్రాజెక్టు పనులు పూర్తి కాకపోవడం సిగ్గుచేటన్నారు. గత టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పూర్తి చేయించడంలో విఫలమైందన్నారు. చంద్రబాబు నెల్లూరుకు వచ్చిన ప్రతిసారి పెన్నా బ్యారేజీని పూర్తి చేస్తామని చెప్పడమే తప్ప, పూర్తి చేయించలేదన్నారు. గత ప్రభుత్వం సరిగా నిధులు విడుదల చేయకపోవడంతో పాటు బ్యారేజీ పనులపై నిర్లక్ష్యం వహించడంతోనే ఈ పరిస్థితి నెలకొంది. రంగనాయకులపేట ఘాట్ పరిశీలన రంగనాయకులపేటలోని ఘాట్‌ను మంత్రి అనిల్‌కుమార్ పరిశీలించి పనులు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఘాట్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం సంతపేట మార్కెట్ ను పరిశీలించి వ్యాపారులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు, వైఎస్సార్సీపీ నాయకులు బిరదవోలు శ్రీకాంత్‌రెడ్డి, ముక్కాల ద్వారకానాథ్, వైవీ రామిరెడ్డి , కార్పొరేటర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏప్రిల్‌లోగా పూర్తి చేస్తాం లక్షల ఎకరాలకు సాగునీరు, నెల్లూరు నగర తాగునీటి అవసరాలకు ఎంతో పెన్నా బ్యారేజీ నిర్మాణం ఎంతో అవసరమని మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్ అన్నారు. ప్రస్తుతం బ్యారేజీలో నీరు లేకపోవడంతో భూగర్భజలాలు పూర్తిగా అడుగంటాయన్నారు. పెన్నా బ్యారేజీని వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి పూర్తిచేసి అంకితం చేస్తామన్నారు. పెన్నా బ్యారేజీ అందుబాటులోకి వస్తే రైతులతో పాటు నగర ప్రజల తాగునీటి అవసరాలు తీరుతాయన్నారు. ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో అవినీతికి తావులేకుండా చూస్తామన్నారు. తనకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇరిగేషన్ శాఖ అప్పగించారని, తప్పకుండా న్యాయం చేస్తామన్నారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలకమైన ఇరిగేషన్‌శాఖను అనిల్‌కుమార్‌యాదవ్‌కు ఇచ్చారన్నారు. పోలవరం ప్రాజెక్టుతో పాటు అన్ని సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించడం కూడా జరిగిందన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా అనిల్‌కుమార్‌ను అభినందించారన్నారు. త్వరతిగతిన పెన్నా బ్యారేజీ నిర్మాణాన్ని పూర్తి చేయాలని కోరారు. జిల్లా వాసుల పక్షాన మంత్రికి అభినందనలు తెలిపారు. -
మార్చి 31కి పెన్నా బ్యారేజ్ పూర్తి
మంత్రి నారాయణ నెల్లూరు(పొగతోట): నెల్లూరు పెన్నా బ్యారేజ్ నిర్మాణాన్ని వచ్చే ఏడాది మార్చి 31 లోపు పూర్తి చేసేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పి.నారాయణ సంబంధిత అ«ధికారులను ఆదేశించారు. శనివారం స్థానిక గోల్డన్‌జూబ్లీహాలులో ఇరిగేషన్, వ్యవసాయం, డీఆర్డీఏ, వైద్య ఆరోగ్య శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. నెల్లూరు బ్యారేజ్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. 51 గేట్లు ఏర్పాటు చేయవలసి ఉందన్నారు. సంఘం బ్యారేజ్ పనులు నిర్ధేశించిన సమయంలోపు పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్యాకేజ్ పనులు పూర్తి చేయాలన్నారు. ప్యాకేజ్ పనులు పూర్తి చేయడం వలన జిల్లాలో 2.50 లక్షలకుపైగా అదనపు ఆయకట్టు సాగులోకి వస్తుందని తెలిపారు. ప్యాకేజ్ పనులు నిర్ధేశించిన సమయంలోపు పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని కాంట్రాక్టర్లను ఆదేశించామన్నారు. నిమ్మ, బత్తాయి, కూరగాయాల సాగు విస్తీర్ణం పెరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. పర్యటక రంగం అభివృద్ధికి నిర్ధేశించిన పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. పింఛన్ల పంపిణీలో జాప్యం జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విధానం జిల్లాలో విజయవంతం అయితే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామన్నారు. ఎంఎల్సీ బీదా రవిచంద్ర మాట్లాడారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు, డీఎం అండ్ హెచ్ఓ డాక్టర్ వరసుందరం, వ్యవసాయ శాఖ జేడీ హేమమహేశ్వరరావు, హర్టికల్చర్ ఏడీలు అనురాధా, ఉమాదేవి, ఇరిగేషన్, టూరిజం అధికారి నాగభూషణం, డీఆర్డీఏ తదితర అధికారులు పాల్గొన్నారు. -
మార్చి నాటికి పెన్నా బ్యారేజీ పూర్తి
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట) : జలవనరులశాఖ సీఈ డి.సుధాకర్‌బాబు నెల్లూరు బ్యారేజీ పనులను మంగళవారం పరిశీలించారు. పనుల పురోగతిని, పనితీరును ఆయన అభినందించారు. మార్చి నెలాఖరులోగా బ్యారేజీపనులు పూర్తి చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లాలో శాఖలో జరుగుతున్న పలు నిర్మాణ పనులపై సమస్యాత్మక విషయాలను అధికారులతో చర్చించి నివేదికను పంపాలని కోరారు. తొలుత సర్వేపల్లి రిజర్వాయర్‌కు తాత్కాలిక ప్రాతిపదికన జరిగిన పనులను, కనుపూరు కాలువ పనులను ఆయన పరిశీలించారు. ఎస్ఈ కె.కోటేశ్వరరావు, ఈఈ రమణ, జేఈ సురేష్, నాగరాజులు ఆయన వెంట ఉన్నారు.