
సాక్షి, నెల్లూరు: పెన్నా బ్యారేజ్‌ను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ శనివారం పరిశీలించారు. కాంక్రీట్ వాల్ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని మంత్రి ఆదేశించారు. పెన్నా, సంగం బ్యారేజ్ పనులు తుది దశకు వచ్చాయని.. ఏప్రిల్ నెలాఖరుకు పనులు పూర్తవుతాయన్నారు. మే నెలలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదగా ప్రారంభిస్తామని తెలిపారు. బ్యారేజ్‌కు గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజ్‌గా నామకరణం చేసి జాతికి అంకితం చేస్తామని తెలిపారు. రెండు బ్యారేజ్ పనులు పూర్తయితే సాగు, తాగు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తోందని మంత్రి అనిల్ అన్నారు.
చదవండి: కేశినేని వర్సెస్ దేవినేని.. టీడీపీలో హాట్ టాపిక్..
Comments
Please login to add a commentAdd a comment