
నెల్లూరు జిల్లా: ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ గెలుపు నల్లేరుపై నడకలాంటిదని మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి స్పష్టం చేశారు. సీఎం జగన్ పాలనకు జనం నీరాజనాలు పలుకుతున్నారని ఈ సందర్భంగా కాకాణి పేర్కొన్నారు.
‘దివంగత మంత్రి గౌతం రెడ్డిపై నియోజకవర్గ వాసుల్లో చెక్కుచెదరని అభిమానం ఉంది. అలాగే సీఎం జగన్ పాలనకు జనం నీరాజనాలు పడుతున్నారు. ఈ రెండు అంశాలు విక్రమ్‌రెడ్డి ఘన విజయానికి సోఫానాలు కాబోతున్నాయి. కొన్ని పార్టీలకు అభ్యర్థులు కూడా చిక్కని పరిస్థితి వచ్చింది. లక్షకు పైగా మెజారిటీ సాధిస్తాం’ అని కాకాణి తెలిపారు. కాగా, ఆత్మకూరు ఉప ఎన్నికకు నేటితో నామినేషన్ల గడువు ముగిసింది. ఆత్మకూరు ఉప ఎన్నికకు మొత్తం 28 నామినేషన్లు దాఖలు కాగా, చివరిరోజు 13 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment