
సాక్షి, నెల్లూరు: మేకపాటి కుటుంబానికి రాజకీయాల్లో ఎలాంటి మచ్చ లేదని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి ఆ కుటుంబం ఎంతో కృషి చేసిందన్నారు. ఈ మేరకు బాలినేని మీడియాతో మాట్లాడుతూ.. ఆత్మకూరు అభ్యర్థి ఎంపికకు సంబంధించి రాజమోహన్‌రెడ్డి నిర్ణయానికి సీఎం జగన్ వదిలేశారు. లక్ష ఓట్ల మెజారిటీ తీసుకువచ్చి గౌతమ్‌కు ఘనమైన నివాళి ఇస్తాము. రెండేళ్లు మరింత కృషి చేసి 2024 ఎన్నికల్లో మరింత మెజారిటీ సాధిస్తామని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. కాగా, జూన్ 23వ తేదీన ఆత్మకూరు ఉప ఎన్నిక జరుగనుండగా, 26వ తేదీన ఫలితాలు వెల్లడించనున్నారు.
చదవండి: (ఆత్మకూరు ఉప ఎన్నిక: నామినేషన్ దాఖలు చేసిన విక్రమ్‌రెడ్డి)
Comments
Please login to add a commentAdd a comment