సాక్షి, నెల్లూరు: నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు ఉప ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రానికి ముగిసింది. దీంతో నియోజకవర్గంలో మైకులు మూగబోయాయి. 23న జరగనున్న పోలింగ్‌పై అధికారులు దృష్టిపెట్టారు. ఈ మేరకు ఆంధ్ర ఇంజినీరింగ్ కాలేజీలో రిటర్నింగ్ అధికారి హరేంద్రియ ప్రసాద్ ఈవీఎంల పంపిణీ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇక ఎన్నికల విధుల్లో 1300 మంది సిబ్బంది పాల్గొననున్నారు.
279 పోలింగ్ బూత్‌లను అధికారులను ఏర్పాటు చేయనున్నారు. 123 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను అధికారులు గుర్తించారు. 123 స్టేషన్ల నుంచి వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ ప్రక్రియపై నిఘా ఏర్పాటు చేశారు. ఎన్నికలకు మొత్తం 377 ఈవీఎంలను సిద్ధం చేశారు. మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment