సాక్షి, నెల్లూరు జిల్లా: ఆత్మకూరు ఉప ఎన్నికలో టీడీపీ, బీజేపీ మిలాఖత్ అయ్యాయి. సాంప్రదాయ పద్దతంటూ పోటీ నుంచి తప్పుకున్న టీడీపీ.. బద్వేల్ తరహాలో బీజేపీతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుంది. పోలింగ్ రోజు టీడీపీ బండారం బయటపడింది. ఆత్మకూరు, అనంత సాగరం, మర్రిపాడు, సంగం, ఏఎస్ పేట, చేజర్ల మండలాల్లో పలు చోట్ల టీడీపీ నేతలు.. బీజేపీ ఏజెంట్ల అవతారమెత్తారు.
చదవండి: మరోసారి మానవత్వాన్ని చాటుకున్న సీఎం జగన్
ఆత్మకూరు ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 6 గంటల నుంచే ఓటర్లు బారులు తీరారు. మహిళలు, వృద్ధులు ఉత్సాహంగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. పటిష్ట బందోబస్తు నడుమ ఆత్మకూరు బైపోల్ పోలింగ్ జరిగింది. పోలింగ్ పక్రియ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. నిర్ణీత సమయంలోపు పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఓటర్లను ఓటింగ్‌కు అధికారులు అనుమతిచ్చారు. ఉపఎన్నిక అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. ఈవీఎంలను ఆంధ్రా ఇంజనీరింగ్ కాలేజీలో స్ట్రాంగ్ రూమ్‌కు తరలించనున్నారు. ఈనెల 26న ఫలితాలు వెల్లడి కానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment