internal politics
-
విదేశీ గడ్డపై స్వదేశాన్ని విమర్శించడం తగదు: అమిత్ షా
పటన్: కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ విదేశీ పర్యటనల సమయంలో దేశాన్ని విమర్శించడం, అంతర్గత రాజకీయాలను గురించి మాట్లాడటాన్ని హోం మంత్రి అమిత్ షా తప్పుపట్టారు. ఇటువంటి వాటిపై రాహుల్ తన పూర్వీకుల నుంచి నేర్చుకోవాలని, దేశ ప్రజలు గమనిస్తున్నారని తెలుసుకోవాలని హితవు పలికారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం 9 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గుజరాత్‌లోని పటన్ జిల్లా సిద్ధ్‌పూర్‌లో శనివారం జరిగిన ర్యాలీలో అమిత్ షా ప్రసంగించారు. ‘దేశభక్తి ఉన్న ఎవరైనా భారత రాజకీయాల గురించి భారత్‌లోనే మాట్లాడాలి. ఏ రాజకీయ పార్టీ నేత అయినా సరే విదేశాల్లో ఉండగా దేశాన్ని విమర్శించడం, దేశ రాజకీయాలపై చర్చించడం సరికాదు. రాహుల్ బాబా.. దేశ ప్రజలు ఈ విషయాన్ని నిశితంగా గమనిస్తున్నారన్న విషయాన్ని గుర్తుంచుకోండి’అని ఆయన పేర్కొన్నారు. ‘వేసవి తీవ్రత నుంచి తప్పించుకునేందుకు రాహుల్ బాబా విదేశాలకు విహారయాత్రకు వెళ్తున్నారు. అక్కడున్న సమయంలోనూ దేశాన్ని విమర్శిస్తున్నారు. ఇది సరికాదన్న విషయాన్ని తన పూర్వీకుల నుంచి నేర్చుకోవాలని రాహుల్‌కు సలహా ఇస్తున్నా’అని అమిత్ షా వ్యాఖ్యానించారు. రాహుల్ ఇటీవల అమెరికా పర్యటన సందర్భంగా మోదీ ప్రభుత్వంపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. మోదీ ప్రభుత్వ హయాంలో దేశంలో పెను మార్పులు చోటుచేసుకున్నా కాంగ్రెస్ మాత్రం భారత్ వ్యతిరేక వ్యాఖ్యలు ఆపలేదని విమర్శించారు. -
ఆత్మకూరు పోలింగ్: బయటపడ్డ టీడీపీ బండారం
సాక్షి, నెల్లూరు జిల్లా: ఆత్మకూరు ఉప ఎన్నికలో టీడీపీ, బీజేపీ మిలాఖత్ అయ్యాయి. సాంప్రదాయ పద్దతంటూ పోటీ నుంచి తప్పుకున్న టీడీపీ.. బద్వేల్ తరహాలో బీజేపీతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుంది. పోలింగ్ రోజు టీడీపీ బండారం బయటపడింది. ఆత్మకూరు, అనంత సాగరం, మర్రిపాడు, సంగం, ఏఎస్ పేట, చేజర్ల మండలాల్లో పలు చోట్ల టీడీపీ నేతలు.. బీజేపీ ఏజెంట్ల అవతారమెత్తారు. చదవండి: మరోసారి మానవత్వాన్ని చాటుకున్న సీఎం జగన్ ఆత్మకూరు ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 6 గంటల నుంచే ఓటర్లు బారులు తీరారు. మహిళలు, వృద్ధులు ఉత్సాహంగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. పటిష్ట బందోబస్తు నడుమ ఆత్మకూరు బైపోల్ పోలింగ్ జరిగింది. పోలింగ్ పక్రియ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. నిర్ణీత సమయంలోపు పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఓటర్లను ఓటింగ్‌కు అధికారులు అనుమతిచ్చారు. ఉపఎన్నిక అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. ఈవీఎంలను ఆంధ్రా ఇంజనీరింగ్ కాలేజీలో స్ట్రాంగ్ రూమ్‌కు తరలించనున్నారు. ఈనెల 26న ఫలితాలు వెల్లడి కానున్నాయి. -
విశాఖ టీడీపీలో అంతర్గత కుమ్ములాట..
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: పురపాలక ఎన్నికల్లో రాష్ట్రమంతటా తుడిచిపెట్టుకుపోయినా... కొద్దోగొప్పో సీట్లు గెలిచి టీడీపీ పరువునిలబెట్టిన విశాఖ కార్పొరేటర్లను సైతం ఆ పార్టీ అధిష్టానం పొమ్మనలేక పొగబెడుతోందా...? గెలిచిన మెజారిటీ కార్పొరేటర్ల అభిప్రాయాన్ని కనీసంగా పరిగణనలోకి తీసుకోకుండా ఒంటెద్దు పోకడలు పోతోందా... ? అవుననే అంటున్నారు మెజార్టీ టీడీపీ కార్పొరేటర్లు ఎవరి అభిప్రాయం తీసుకోకుండా ఏకపక్షంగా జీవీఎంసీ టీడీపీ ఫ్లోర్ లీడర్‌గా పీలా శ్రీనివాసరావును నియమించడంపై భగ్గుమంటున్నారు. గతంలో కౌన్సిలర్లు, కార్పొరేటర్లుగా పనిచేసిన సీనియర్లను పరిగణనలోకి తీసుకోకుండా తొలిసారి గెలిచిన పీలాను ఎలా ఎంపిక చేస్తారంటూ ఆ పార్టీ సభ్యులు మండిపడుతున్నారు. విపక్షనేతగా ఎక్కడైనా సీనియర్ సభ్యులకే అవకాశం ఇస్తారని, కానీ ఇక్కడ మాత్రం ఏ మాత్రం అనుభవం లేని పీలాకి ఇచ్చారంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. బుధవారం టీడీపీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది వేలం పెట్టి మేయర్ అభ్యర్థిగా ప్రకటించినా... ఎన్నికల ప్రచారంలో స్వయంగా పార్టీ అధినేత చంద్రబాబునాయుడే జీవీఎంసీ టీడీపీ మేయర్ అభ్యరి్థగా పీలా శ్రీనివాసరావును ప్రకటించిన సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈ తతంగానికి ముందు చాలా హైడ్రామా నడిచినట్టు తెలుస్తోంది. టీడీపీ మేయర్ అభ్యరి్థగా మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ, ఎంబీసీ మాజీ చైర్మన్ కాకి గోవిందరెడ్డి తీవ్రంగా పోటీ పడ్డారు. అయితే మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి.. గండి బాబ్జీ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించగా.. టీడీపీ విశాఖ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు, గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు.. కాకి గోవిందరెడ్డి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించారు. మేయర్ అభ్యర్థిగా తనను ప్రకటిస్తే రూ.15 కోట్లు ఖర్చు పెడతానని బాబ్జీ, ఐదారు కోట్లు ఖర్చు పెట్టగలనని గోవిందరెడ్డి ముందుకొచ్చినా.. ఆ ఇద్దరి నేతల వ్యతిరేకతతో అధిష్టానం వీరిద్దరినీ పక్కనపెట్టి మధ్యేమార్గంగా పీలా శ్రీనివాసరావును తెరపైకి తీసుకొచ్చింది. దీంతో గండి బాబ్జీ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకోగా, గోవిందరెడ్డి మాత్రం కార్పొరేటర్‌గా పోటీకి దిగారు. పీలా శ్రీనివాసరావు వీరిద్దరి కంటే ఎక్కువ ఖర్చు పెడతానని వేలంపాటలో చెప్పుకొచ్చి... తీరా తన వార్డులో డబ్బు కుమ్మరించడం మినహా పెద్దగా ఎవ్వరికీ ఇవ్వలేదని అంటారు. సరిగ్గా పోలింగ్‌కు రెండు రోజుల ముందు పీలా శ్రీనివాసరావు ఎవరికీ దొరక్కుండా సెల్ స్విచాఫ్ చేసేశారని అంటారు. ఇదే విషయమై టీడీపీ అధిష్టానానికి పోలింగ్ ముగిసిన వెంటనే టీడీపీలో ఓ వర్గం ఫిర్యాదు కూడా చేసింది. అలాంటి పీలా శ్రీనివాసరావుకే మళ్లీ ఇప్పుడు ఫ్లోర్ లీడర్ పదవి ఎలా కట్టబెడతారంటూ బుధవారం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మెజార్టీ కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. క్యాష్–క్యాస్ట్ చూస్తే ఎలా? మెజారిటీ వార్డు కార్పొరేటర్ల అభిప్రాయం పరిగణనలోకి తీసుకోకుండా కేవలం విశాఖ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఇష్టానుసారం పీలా శ్రీనివాసరావును ఫ్లోల్ లీడర్‌గా నియమించడం... పార్టీకి చాలా నష్టదాయకమనే అభిప్రాయాన్ని నేతలు స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తోంది. ఈ దశలోనే టీడీపీ సీనియర్ నేత ఒకరు.. ఎన్నికల్లో ఖర్చు పెట్టినందుకే పీలాకి ఇచ్చారని చెప్పగా.. అలాగైతే రెండేళ్ల కిందట సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఎంపీ భరత్.. పెద్ద మొత్తంలో రూ.కోట్లు ఖర్చుపెట్టారని. మరి ఆయనకు అధ్యక్ష పదవి ఇవ్వకుండా పల్లా శ్రీనివాసరావుకు ఎలా ఇచ్చారని సూటిగా ప్రశ్నించినట్టు సమాచారం. డబ్బులు, వర్గాలతో పనిలేకుండా అధికారపక్షంలో సామాన్యులకి పెద్దపీట వేస్తుంటే... ఇంకా ఈ పారీ్టలో క్యాష్–క్యాస్ట్ చూస్తే ఎలాగని నిలదీసినట్టు తెలుస్తోంది. మొత్తంగా ఆదిలోనే మొదలైన టీడీపీ కార్పొరేటర్ల వర్గపోరు ఎటువైపు దారితీస్తుందో చూడాలి. ఆ ఐదుగురూ అభ్యంతరం.. పీలా శ్రీనివాసరావును ఫ్లోర్ లీడర్‌గా నియమించడంపై 69వ వార్డు కార్పొరేటర్ కాకి గోవిందరెడ్డి, 86వ వార్డు కార్పొరేటర్ లేళ్ల కోటేశ్వరరావు, 76వ వార్డు కార్పొరేటర్ గంధం శ్రీను, 67వ వార్డు కార్పొరేటర్ పల్లా శ్రీనివాసరావు, 97వ వార్డు కార్పొరేటర్ శేనాపతి వసంత బహిరంగంగానే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలిసింది. చదవండి: ఎవరికీ అనుమానం రాదు.. ఈ దొంగ ప్రత్యేకత ఇదే.. మేయరమ్మా... ఇదేంటమ్మా! -
దళితులకు కలగా సీఎం కుర్చీ
సాక్షి, బెంగళూరు: కన్నడనాట దళితుల పరిస్థితి విచిత్రంగా ఉంది. రాష్ట్రంలో రాజకీయంగా చైతన్యంగా ఉన్న దళిత నాయకులు, తమతమ పార్టీల విజయాల్లో కీలక భూమిక పోషిస్తున్నారు. పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో దళిత నేతలది కీలక పాత్ర అయినా వారు అందలానికి చేరుకోలేకపోయారు. ఇప్పటివరకు కర్ణాటక చరిత్రలో ఒక్క దళిత సీఎం లేరు. తొలినాళ్లలో వివక్షకు, అణచివేతకు గురైన దళితులు, రైతుల హక్కుల కోసం 1970, 1980 దశకాల్లో ఉద్యమాలు జరిగాయి. దీంతో ఆయా వర్గాల్లో రాజకీయ చైతన్యం వచ్చింది. రానురాను రాష్ట్రంలో దళిత నేతలు ఆవిర్భవించారు. వి.శ్రీనివాస ప్రసాద్, హెచ్‌సీ మహదేవప్ప, కేహెచ్ మునియప్ప, బి.సోమశేఖర్, గోవింద్ కారజోళ, రమేష్ జిగజిణగి వంటి దళిత నేతలు బాగా రాణించారు. వీరందరిలో ప్రస్తుతం లోక్‌సభలో కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే అగ్రగణ్యులుగా పేరుపొందారు. 26 శాతం జనాభా ఉన్నా... రాష్ట్ర జనాభాలో 26 శాతం ఉన్న దళితులను సంఘటితం చేయడంలో ఆయా నేతలు విఫలమయ్యారు. దీంతో ఏ దళిత నాయకుడూ సీఎం కాలేకపోయారు. దీంతో ఎన్నికల్లో, రాజకీయాల్లో ఆధిపత్య పోరు సాగింది. ఎవరికివారే బలమైన నాయకులుగా ఎదిగినా అంతర్గత కలహాల వల్ల సీఎం కాలేకపోయారు. దళిత సంఘర్ష సమితి వ్యవస్థాపకుడు బి.క్రిష్ణప్ప దళితుల హక్కుల కోసం పోరాడారు. దేవనూరు మహాదేవ్, సిద్ధలింగయ్య, చంద్రప్రసాద్ త్యాగి వంటి దళిత రచయితలు తమ సాహిత్యం ద్వారా దళితుల్లో చైతన్యం కలిగించారు. జనతా పరివార్ నుంచి బి.రాచయ్య అనే దళిత నేత మంత్రివర్గంలోని అన్ని పదవులనూ అలంకరించినప్పటికీ ముఖ్యమంత్రి పీఠాన్ని అందుకోలేకపోయారు. పార్టీలో చీలిక వచ్చిన సమయంలో ఎస్ఆర్ బొమ్మై కారణంగా ముఖ్యమంత్రి పదవి త్రుటిలో చేజారింది. కాంగ్రెస్ మరో మాజీ నేత కేహెచ్ రంగనాథ్ కూడా అన్ని శాఖల మంత్రిగా పనిచేయడంతోపాటు, కేపీసీసీ అధ్యక్షుడిగానూ రెండుసార్లు ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి కాలేకపోయారు. పార్టీలో అంతర్గత రాజకీయాలు నడపలేక ఆయనకు సీఎం పదవి అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. గత ఎన్నికల్లో అనూహ్యంగా చేజారింది ఎస్ఎం కృష్ణ మంత్రివర్గంలో దళిత నాయకుడు మల్లికార్జున ఖర్గేకు ఉప ముఖ్యమంత్రి పదవి వచ్చినట్లే వచ్చి చేజారింది. 2006లో ఖర్గే కేపీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన నేతృత్వంలో కాంగ్రెస్ 2008 ఎన్నికల్లో పరాజయం పాలైంది. ఆ తర్వాత మరో దళిత నాయకుడు జి.పరమేశ్వర్‌ను కేపీసీసీ అధ్యక్షుణ్ని చేయగా 2013లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అయితే ఆ ఎన్నికల్లో పరమేశ్వర్ ఘోరంగా ఓడిపోవడంతో ఆయనకు సీఎం పదవి దక్కలేదు. ఇప్పటి సీఎం సిద్ధరామయ్యను ఆ పీఠం వరించింది. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే మల్లికార్జునఖర్గేను సీఎం చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. -
పార్టీలో నా మీద కుట్ర చేసి తీసేశారు: మాజీ మంత్రి
ఆమ్ ఆద్మీ పార్టీలో అంతర్గత రాజకీయాలకు తాను బలైపోయానని ఢిల్లీ ఆహారశాఖ మాజీమంత్రి ఆసిఫ్ అహ్మద్ ఖాన్ చెప్పారు. ఓ బిల్డర్‌ను రూ. 6 లక్షల లంచం అడిగినట్లు వచ్చిన ఆరోపణల కారణంగా ఆయనను పదవి నుంచి తొలగిస్తున్నట్లు సీఎం అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం టీవీ లైవ్‌లో ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు తనను చంపుతానంటూ బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని కూడా ఖాన్ చెప్పారు. వాస్తవానికి తనను ఇరికించినట్లు చెబుతున్న టేపులో మధ్యవర్తిగా వినిపించిన గొంతు ఆమ్ ఆద్మీ పార్టీ మైనారిటీ విభాగం ఉపాధ్యక్షుడు షకీల్ మాలిక్దని అహ్మద్ ఖాన్ అన్నారు. తనను బలిపశువుగా చేసి పంపేశారని ఆయన మీడియాతో చెప్పారు. వేరే పెద్దవాళ్లను రక్షించడం కోసం తనను బలిచేశారన్నారు. ఇప్పుడు కొత్తగా మంత్రి పదవి చేపట్టిన ఇమ్రాన్ హుస్సేన్ ఏమంత గొప్పవాడని ఖాన్ ప్రశ్నించారు. ఢిల్లీ పోలీసులకు ఆయనపై పలు రకాల ఫిర్యాదులు అందాయని చెప్పారు.