ఆత్మకూరు: రాష్ట్రంలో మూడేళ్లుగా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో సంక్షేమ ఫలాలు వెల్లివిరుస్తున్న వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని సమైక్యంగా బలపరుద్దామని నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి కోరారు. త్వరలో జరగనున్న ఉప ఎన్నికల నేపథ్యంలో స్థానికంగా శ్రీధర్ గార్డెన్స్‌లో మంగళవారం నియోజకవర్గ స్థాయి వైఎస్సార్‌సీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు.
రాజమోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. గౌతమ్‌రెడ్డి ఆకస్మిక మృతితో ఉప ఎన్నికలు జరుగుతాయని కలలో కూడా అనుకోలేదని, ఇలాంటి దురదృష్టకరమైన పరిస్థితి వస్తుందని ఊహించలేదన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా మూడేళ్లుగా సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. కరోనా కష్టకాలంలోనూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిబాగా లేకున్నా సంక్షేమ పథకాలు ఆగలేదని గుర్తు చేశారు. మూడు మార్లు ఎంపీగా జిల్లా ప్రజలు తనను గెలిపించారని, ఆత్మకూరు నుంచి గౌతమ్‌రెడ్డికి రెండు సార్లు ఘన విజయం అందించారని ఈ రుణం తీర్చుకోలేనిదన్నారు.
ప్రస్తుతం జరగనున్న ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆశీస్సులతో విక్రమ్‌రెడ్డి పోటీ చేస్తున్నారని, ఆయన్ను నిండు మనస్సుతో ఆశీర్వదించాలని నియోజకవర్గ ప్రజలను కోరారు. తమ కోడలు శ్రీకీర్తి గౌతమ్‌రెడ్డి పేరుతో ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఉన్నారని, ఆ ఫౌండేషన్‌లో తామంతా సభ్యులమేనని, ప్రభుత్వం ద్వారా చేయలేని పనులను ఫౌండేషన్ ద్వారా ప్రజలకు సేవచేస్తామని అన్నారు.
2వ తేదీన నామినేషన్
గురువారం మేకపాటి విక్రమ్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నట్లు, నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని రాజమోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఉదయం 9 నుంచి నిరాడంబరంగా ఆర్డీఓ కార్యాలయం వరకు నాయకులతో కలిసి వెళ్లి 11 గంటల సమయంలో నామినేషన్ దాఖలు చేస్తారన్నారు.
ప్రభుత్వంపై నమ్మకం పెరిగింది: మేకపాటి విక్రమ్‌రెడ్డి
ఇటీవల పార్టీ ఆదేశాల మేరకు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని పలు మండలాల్లో నిర్వహించినప్పుడు లబ్ధిదారులు తమకు అందుతున్న సంక్షేమ పథకాలను తెలిపి ప్రభుత్వంపై తమకున్న నమ్మకాన్ని వెల్లిబుచ్చారని మేకపాటి విక్రమ్‌రెడ్డి అన్నారు. కార్యకర్తలు పారీ్టకి స్తంభాల్లాంటి వారని, వారు చేసిన కృషితోనే నాయకులు పదవుల్లోకి వస్తారని, వారి మేలు ఎప్పటికి మరచిపోలేమన్నారు. తొలుత దివంగత మంత్రి గౌతమ్‌రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులరి్పంచారు. రెండు నిమిషాలు మౌనం పాటించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల శ్రీహరినాయుడు, పార్టీ మండలాల కనీ్వ నర్లు అల్లారెడ్డి ఆనంద్‌రెడ్డి, పందిళ్లపల్లి సుబ్బారెడ్డి, రాపూరు వెంకటసుబ్బారెడ్డి, జితేంద్రనాగ్‌రెడ్డి, తూమాటి విజయభాస్కర్‌రెడ్డి, బొర్రా సుబ్బిరెడ్డి, నాయకులు గంగవరపు శ్రీనివాసులునాయుడు, కంటాబత్తిన రఘునాథరెడ్డి, ఎంపీపీలు కేతా వేణుగోపాల్‌రెడ్డి, బోయళ్ల పద్మజారెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు పీర్ల పార్థసారథి, మున్సిపల్ చైర్‌పర్సన్ గోపారం వెంకటమణమ్మ, వైస్ చైర్మన్లు డాక్టర్ కేవీ శ్రావణ్‌కుమార్, సర్దార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment