సాక్షి, హైదరాబాద్: పురపాలనలో పౌరుడే పాలకుడని, నూతన పుర చట్టం స్ఫూర్తి ఇదేనని పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. పౌర సేవలు పారదర్శకంగా, అవినీతికి తావు లేకుండా వేగంగా అందించడమే లక్ష్యంగా ఈ చట్టాన్ని రూపొందించామని తెలిపారు. వ్యక్తి కేంద్రీకృతంగా ఉన్న పాత చట్టం స్థానంలో వ్యవస్థ కేంద్రీకృతంగా నూతన చట్టం తీసుకొచ్చామన్నా రు. కొత్త మున్సిపల్ చట్టంపై మున్సిపల్ కమిషనర్ల రెండ్రోజుల సదస్సు ముగింపు సమావేశానికి హాజరైన కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రజలతో మమే కమై రాజకీయ జీవితాన్ని సాగిస్తున్న సీఎం కేసీఆర్ ప్రజలకు అవసరమైన పలు సంస్కరణలను ఈ చట్టం ద్వారా అందుబాటులోకి తెచ్చారని, 75 గజాల్లోపు ఇంటి నిర్మాణానికి అనుమతులు అవసరం లేకుండా చేయడం, భవన నిర్మాణాల కోసం సెల్ఫ్ సరి్టఫికేషన్ వంటి నూతన నిబంధనలు ఈ స్ఫూర్తిలోంచి వచి్చనవేనని తెలిపారు.
జాతీయ స్థాయి గుర్తింపు పొందేలా.. సిద్దిపేట, సిరిసిల్ల, వరంగల్, సూర్యాపేట, పీర్జాదిగూడ మున్సిపాలిటీలు ఇప్పటికే వివిధ అంశాల్లో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేలా పనిచేస్తున్నాయని, వాటిని పరిశీలించాలని మంత్రి కేటీఆర్ కమిషనర్లకు సూచించారు. దీంతో పాటు జాతీయస్థాయిలో పురపాలనలో వినూత్నమైన, అదర్శవంతమైన పద్ధతులను అనుసరిస్తున్న పట్టణాలను అధ్యయనం చేసేందుకు పంపుతామన్నారు. సాంకేతిక పరిజ్ఞానం జోడించడం ముఖ్యం గా సామాజిక మాధ్యమాలను వినియోగించడం ద్వారా పురపాలనను సాగించవచ్చన్నారు. ఈ సమావేశంలో వివిధ అంశాల్లో ఉత్తమ సేవలు అందించిన కమిషనర్లకు మంత్రి కేటీఆర్ పురస్కారాలను అందించారు. కార్యక్రమంలో నగర మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఎమ్మెల్సీ భాను ప్రసాదరావు, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కూమార్, డైరెక్టర్ టీకే శ్రీదేవి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment