రాష్ట్ర సివిల్‌ సర్వీసెస్‌ క్రికెట్‌ జట్టు ఎంపిక | state civil services cricket team selection | Sakshi
Sakshi News home page

రాష్ట్ర సివిల్‌ సర్వీసెస్‌ క్రికెట్‌ జట్టు ఎంపిక

Published Sun, Jan 29 2017 12:05 AM | Last Updated on Tue, Sep 5 2017 2:21 AM

state civil services cricket team selection

విజయవాడ స్పోర్ట్స్‌: ఈనెల 29 నుంచి ఫిబ్రవరి 5వ తేదీ వరకూ రాయ్‌పూర్‌(చత్తీస్‌గడ్‌)లో జరిగే ఆల్‌ ఇండియా సివిల్‌ సర్వీసెస్‌ క్రికెట్‌ జట్టును రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లింగరాజ్‌ పాణిగ్రాహి శనివారం ప్రకటించారు. జట్టులో ఎస్‌.సుబ్రహ్మణ్యం(కెప్టెన్‌), పి.అరుణ్‌బాబు(అడిషనల్‌ మున్సిపల్‌ కమిషనర్, విజయవాడ), ఎస్‌.నాగరాజు(సూపరింటెండెంట్‌), కె.రమేష్‌(అడిషనల్‌ వీసీ, ఉడా, విశాఖపట్నం), టి.చంద్రశేఖర్‌(సీనియర్‌ అసిస్టెంట్, సీటీవో), ఎం.రాఘవరావు (టైపిస్ట్, డీపీవో, గుంటూరు), కేవీ నాగరాజు(ఉప్పలపాడు జెడ్పీ హైస్కూల్‌, పీఈటీ), జి.బాపిరాజు(డెప్యూటీ తహసీల్దార్, రాజమండ్రి), కేవీ రాజేష్‌(సీనియర్‌ అసిస్టెంట్, కలెక్టరేట్, గుంటూరు), ఎ.సాయికుమార్‌(ఏఎస్‌ఓ), ఎం.మురళీమోహన్‌(అటెండర్, ఏడీఏ, కడప), ఎస్‌.శ్రీధర్‌(సీనియర్‌ అసిస్టెంట్, డీఎంఅండ్‌హెచ్‌వో, కర్నూలు), ఎస్‌కే ఫజుల్‌ రెహమాన్‌(జీటీవో, నెల్లూరు), ఆర్‌.కిషోర్‌ప్రభు(సీనియర్‌ అసిస్టెంట్, కలెక్టరేట్, గుంటూరు), టి.భాస్కర్‌(ఏసీటీవో, గుంటూరు), ఎం.ప్రవీణ్‌కుమార్‌(ఎస్‌జీటీ, వీరుపల్లి, అనంతపురం) ఎంపికయ్యారు. జట్టు మేనేజర్‌గా కేవీ సతీష్‌కుమార్‌రెడ్డి (ఏఎస్‌ఓ, ఏపీ సెక్రటేరియట్‌), కోచ్‌గా ఎంఎస్‌ ఉమాశంకర్‌(డీఎస్‌డీవో, వైఎస్సార్‌ కడప) వ్యవహరిస్తారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement