india level
-
ఇండియా రికార్డ్స్‌లో ‘వేదాన్షి’కి స్థానం!
కాకినాడ: రౌతులపూడి మండలంలోని ములగపూడి గ్రామానికి చెందిన యామల గజ్జన్నదొర, వరలక్ష్మి దంపతుల రెండున్నరేళ్ల కుమార్తె ‘వేదాన్షి’కి ఇండియా రికార్డ్స్–2023లో స్థానం లభించింది. ఈ విషయాన్ని చిన్నారి తండ్రి గజన్నదొర గురువారం విలేకర్లకు తెలిపారు. అతి చిన్న వయస్సులో జంతువులు, పండ్లు, కూరగాయలు, వాహనాలు, రంగులు, ఆకారాలు, శరీర అవయవాలు వంటి 26 రకాల పేర్లను సులభంగా గుర్తించి, పలకడంతో ఆమెకు ఇండియా రికార్‌ుడ్సలో స్థానం లభించినట్టు వివరించారు. ఈ మేరకు ఢిల్లీ నుంచి అవార్డును కొరియర్ ద్వారా అందుకున్నట్లు తెలిపారు. ఇండియా రికార్డ్స్‌లో స్థానం సాధించిన వేదాన్షి, ఆమె తల్లిదండ్రులను పలువురు అభినందించారు. -
శాంతిభద్రతలను గాడిలో పెట్టాం: డీజీపీ
నల్లగొండ: తెలంగాణ పోలీస్ దేశంలోనే గొప్ప పోలీస్ వ్యవస్దగా, అత్యంత నాణ్యతా ప్రమాణాలు కల్గిన వ్యవస్దగా పేరు గడించిందని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. తెలంగాణలో శాంతిభద్రతలను గాడిలో పెట్టామని, ఇకపై ప్రపంచంలోనే గొప్ప పటిష్టమైన వ్యవస్దగా రూపుదిద్దుతామని చెప్పారు. ఫలితంగా రాష్ట్రంలో పెట్టుబడులు వచ్చి పరిశ్రమలు నెలకొల్పి మన పిల్లలందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరకాలన్నదే పోలీస్ వ్యవస్ద తాపత్రయమని వివరించారు. జిల్లా పర్యటనకు వచ్చిన డీజీపీకి పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు సాదరంగా స్వాగతం పలికారు. హెడ్‌క్వార్టర్స్‌లో ఫోరెన్సిక్ ల్యాబ్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం నల్లగొండ, సూర్యాపేట జిల్లాల పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించి మీడియాతో మాట్లాడారు. తెలంగాణాలో నేరం చేస్తే వెంటనే దొరికిపోతాం.. శిక్ష పడుతుంది అన్న భయాన్ని నేరగాళ్ళలో కల్గించే విధంగా పోలీస్ వ్యవస్దను తీర్చిదిద్దామని చెప్పారు. విదేశాల్లో అంత్యంత పటిష్టమైన పోలీస్ వ్యవస్ద ఉంది కాబట్టే మన పిల్లల్ని చదువుల కోసం అక్కడికి నిర్భయంగా పంపిస్తాం.. అలాగే తెలంగాణలో ఉన్న అక్కడివారు, స్థానికులు నిర్భయంగా జీవించేందుకు కావాల్సిన వాతావరణాన్ని తీసుకొస్తున్నామని, 2018 టాస్క్‌ను ఏర్పాటు చేసుకుని పోలీస్ వ్యవస్దను నెంబర్ వన్ వ్యవస్దగా తీర్చిదిద్దుతున్నామని డీజీపీ తెలిపారు. -
రాష్ట్ర సివిల్ సర్వీసెస్ క్రికెట్ జట్టు ఎంపిక
విజయవాడ స్పోర్ట్స్: ఈనెల 29 నుంచి ఫిబ్రవరి 5వ తేదీ వరకూ రాయ్‌పూర్(చత్తీస్గడ్)లో జరిగే ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ క్రికెట్ జట్టును రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లింగరాజ్ పాణిగ్రాహి శనివారం ప్రకటించారు. జట్టులో ఎస్.సుబ్రహ్మణ్యం(కెప్టెన్), పి.అరుణ్‌బాబు(అడిషనల్ మున్సిపల్ కమిషనర్, విజయవాడ), ఎస్.నాగరాజు(సూపరింటెండెంట్), కె.రమేష్(అడిషనల్ వీసీ, ఉడా, విశాఖపట్నం), టి.చంద్రశేఖర్(సీనియర్ అసిస్టెంట్, సీటీవో), ఎం.రాఘవరావు (టైపిస్ట్, డీపీవో, గుంటూరు), కేవీ నాగరాజు(ఉప్పలపాడు జెడ్పీ హైస్కూల్, పీఈటీ), జి.బాపిరాజు(డెప్యూటీ తహసీల్దార్, రాజమండ్రి), కేవీ రాజేష్(సీనియర్ అసిస్టెంట్, కలెక్టరేట్, గుంటూరు), ఎ.సాయికుమార్(ఏఎస్ఓ), ఎం.మురళీమోహన్(అటెండర్, ఏడీఏ, కడప), ఎస్.శ్రీధర్(సీనియర్ అసిస్టెంట్, డీఎంఅండ్‌హెచ్‌వో, కర్నూలు), ఎస్కే ఫజుల్ రెహమాన్(జీటీవో, నెల్లూరు), ఆర్.కిషోర్‌ప్రభు(సీనియర్ అసిస్టెంట్, కలెక్టరేట్, గుంటూరు), టి.భాస్కర్(ఏసీటీవో, గుంటూరు), ఎం.ప్రవీణ్‌కుమార్(ఎస్జీటీ, వీరుపల్లి, అనంతపురం) ఎంపికయ్యారు. జట్టు మేనేజర్‌గా కేవీ సతీష్‌కుమార్‌రెడ్డి (ఏఎస్ఓ, ఏపీ సెక్రటేరియట్), కోచ్‌గా ఎంఎస్ ఉమాశంకర్(డీఎస్డీవో, వైఎస్సార్ కడప) వ్యవహరిస్తారు.