నల్లగొండ: తెలంగాణ పోలీస్ దేశంలోనే గొప్ప పోలీస్ వ్యవస్దగా, అత్యంత నాణ్యతా ప్రమాణాలు కల్గిన వ్యవస్దగా పేరు గడించిందని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. తెలంగాణలో శాంతిభద్రతలను గాడిలో పెట్టామని, ఇకపై ప్రపంచంలోనే గొప్ప పటిష్టమైన వ్యవస్దగా రూపుదిద్దుతామని చెప్పారు. ఫలితంగా రాష్ట్రంలో పెట్టుబడులు వచ్చి పరిశ్రమలు నెలకొల్పి మన పిల్లలందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరకాలన్నదే పోలీస్ వ్యవస్ద తాపత్రయమని వివరించారు. జిల్లా పర్యటనకు వచ్చిన డీజీపీకి పోలీస్ హెడ్క్వార్టర్స్‌లో జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు సాదరంగా స్వాగతం పలికారు. హెడ్క్వార్టర్స్‌లో ఫోరెన్సిక్ ల్యాబ్‌ను ఆయన ప్రారంభించారు.
అనంతరం నల్లగొండ, సూర్యాపేట జిల్లాల పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించి మీడియాతో మాట్లాడారు. తెలంగాణాలో నేరం చేస్తే వెంటనే దొరికిపోతాం.. శిక్ష పడుతుంది అన్న భయాన్ని నేరగాళ్ళలో కల్గించే విధంగా పోలీస్ వ్యవస్దను తీర్చిదిద్దామని చెప్పారు. విదేశాల్లో అంత్యంత పటిష్టమైన పోలీస్ వ్యవస్ద ఉంది కాబట్టే మన పిల్లల్ని చదువుల కోసం అక్కడికి నిర్భయంగా పంపిస్తాం.. అలాగే తెలంగాణలో ఉన్న అక్కడివారు, స్థానికులు నిర్భయంగా జీవించేందుకు కావాల్సిన వాతావరణాన్ని తీసుకొస్తున్నామని, 2018 టాస్క్‌ను ఏర్పాటు చేసుకుని పోలీస్ వ్యవస్దను నెంబర్ వన్ వ్యవస్దగా తీర్చిదిద్దుతున్నామని డీజీపీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment