సాక్షి, హైదరాబాద్: లాక్‌డౌన్ సమయంలో రాష్ట్రవ్యాప్తంగా విశేష సేవలు అందిస్తున్న పోలీస్ సిబ్బందికి తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి అభినందనలు తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మే 7 వరకు కంటైన్మెంట్ జోన్ల ప్రాంతాల్లో పటిష్టమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. హెల్త్, మున్సిపల్ శాఖ అధికారులతో కలిసి సమన్వయంతో పోలీస్ శాఖ పనిచేస్తుందని డీజీపీ తెలిపారు. లాక్‌డౌన్‌లో పోలీస్ సిబ్బంది కృషికి గుర్తింపుగా 10 శాతం ఇన్సెంటివ్స్ ఇచ్చినందుకు ముఖ్యమంత్రికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. యువత పనిలేకుండా రోడ్లపైకి రాకూడదని ఆయన హెచ్చరించారు. కరోనా నియంత్రణకు రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్లు కూడా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని.. ప్రతి కాలనీ వారు కేవలం ఒకే ఎంట్రీ ఎగ్జిట్ పెట్టుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డి సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment