Telangana Police Dept
-
IND Vs AUS: టి-20 మ్యాచ్‌కు భారీ బందోబస్తు
ఉప్పల్: ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెక్ స్టేడియంలో ఈ నెల 25న ఇండియా–ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగనున్న టీ–20 మ్యాచ్‌కు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. శుక్రవారం స్టేడియంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మల్కాజిగిరి డీసీపీ రక్షితా మూర్తి, ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్‌లతో కలిసి వివరాలు వెల్లడించారు. దాదాపుగా 40 వేలకు పైగా క్రీడాభిమానులు మ్యాచ్ వీక్షించే అవకాశం ఉందన్నారు. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే... క్రీడాకారులకు భారీ భద్రత గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని క్రీడాకారులు, మ్యాచ్ రిఫరీకి కూడా కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తాం. ఎలాంటి సంఘటనలు జరక్కుండా చూస్తాం. అభిమానులు మితిమీరి వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవు. సాయంత్రం 4.30 నుంచి అనుమతి ►ఆదివారం సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. క్రీడాభిమానులకు మధ్యాహ్నం 4.30 నుంచి స్టేడియంలోకి అనుమతి ఉంటుంది. పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు బెస్ట్ ►మ్యాచ్‌కు వచ్చేవారు వ్యక్తిగత వాహనాలు కాకుండా పబ్లిక్ ట్రాన్స్‌పోర్టును వినియోగించుకుంటే మంచిది. ►మ్యాచ్ సందర్భంగా మెట్రో రైల్ సంస్థ ఆదివారం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి ఒంటి గంట వరకు రైళ్లను నడుపుతుంది. ►ఆర్టీసీ అధికారులు కూడా వివిధ ప్రాంతాల నుంచి స్టేడియానికి ప్రత్యేక షటిల్స్‌ను నడుపుతారు. అడుగడుగునా నిఘా.. ►ఉప్పల్ స్టేడియం పరిసరాల్లో 2500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. 300 వరకు సీసీ కెమెరాలతో నిఘా ఉంటుంది. ►బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు వీటిని అనుసంధానం చేశాం. ►మొబైల్ ఫోన్, ఇయర్ ఫోన్లకు మాత్రమే స్టేడియంలోకి అనుమతి ఉంది. స్టేడియంలోకి ఇవి తేవొద్దు... ►హెల్మెట్, కెమెరాలు, బైనాక్యులర్స్, ల్యాప్‌ట్యాప్‌లు, సిగరెట్లు, తినుబండారాలు, ఆల్కాహాల్, మత్తు పదార్థాలు, సెల్ఫీ స్టిక్స్, హాల్‌పిన్స్, ఆయుధాలు, బ్లేడ్లు, చాకులు, మంచి నీటి బాటిల్స్‌ను స్టేడియంలోకి అనుమతించరు. ►ఏడు అంబులెన్స్‌లు అందుబాటులో ఉంచుతున్నాం. వీటితో పాటు మెడికల్ క్యాంపును కూడా ఏర్పాటు చేస్తున్నాం. ►జీహెచ్ఎంసీ తరపున ప్రత్యేకంగా మొబైల్ టాయిలెట్స్‌ను అందుబాటులో ఉంచుతాం. ►మ్యాచ్ టికెట్లను బ్లాక్ దందా చేసే వారిపై ప్రత్యేక నిఘా ఉంచుతున్నాం. అవసరమైతే 100కు డయల్ చేసి ఫిర్యాదు చేయొచ్చు. పార్కింగ్‌పై ప్రత్యేక దృష్టి ►గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి పార్కింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించినట్లు రాచకొండ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. మ్యాచ్ రోజు మధ్యాహ్నం నుంచి మరుసటి రోజు తెల్లవారు జాము వరకు ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందన్నారు. ►ఉప్పల్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే భారీ వాహనాలను అనుమతించమన్నారు. ►సికింద్రాబాద్ నుంచి, ఎల్బీనగర్ నుంచి ఉప్పల్ వైపు వచ్చే వాహనాలను కూడా అనుమతించమన్నారు. ►గేట్–1 వీఐపీ ద్వారం పెంగ్విన్ గ్రౌండ్లో దాదాపు 1400 కార్లు పార్కు చేసే విధంగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ►స్డేడియం నలువైపులా ఐదు క్రేన్లను అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. ►ద్విచక్ర వాహనాలను ఎన్జీఆర్ఐ గేట్–1 నుంచి నాలుగు వరకు రోడ్డుకు ఇరువైపులా పార్కింగ్ చేసుకోవచ్చన్నారు. దీంతోపాటు జెన్‌ప్యాక్ట్ వైపు రోడ్డులో కూడా ద్విచక్ర వాహనాలను పార్కు చేసుకోవచ్చన్నారు. రూట్ మ్యాప్‌నకు ప్రత్యేక యాప్ ►టికెట్లు బుక్ చేసుకున్నవారికి రూట్‌ను చూపించే యాప్ మెసేజ్ వస్తుందని, దీని ద్వారా ఏ గేట్‌కు వెళ్లి పార్కు చేసుకోవాలో డైరెక్షన్ చూపుతుందని ట్రాఫిక్ డీసీపీ తెలిపారు. -
ఏపీపీ పోస్టులకు నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల (ఏపీపీ)ల నియామకానికి నోటిఫికేషన్ వచ్చింది. ఆదివారం ఉదయం వివిధ న్యాయస్థానాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల పోస్టుల భర్తీకి రాష్ట్ర స్థాయి పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎల్ పీఆర్బీ) చైర్మన్ వీవీ శ్రీనివాస రావు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హతలు గలిగిన అభ్యర్థులంతా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. కొత్త జోనల్ వ్యవస్థకు కేంద్రం ఆమోదం తెలిపిన తరువాత ప్రభుత్వం వెలువరించిన తొలి నోటిఫికేషన్ ఇదే కావడం గమనార్హం. ఏపీపీల రిక్రూట్‌మెంట్‌ను పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చేపడుతుందని ‘సాక్షి’ (ఆదివారం నాటి సంచికలో) ముందే తెలిపిన సంగతి తెలిసిందే. అలాగే ఏ క్షణంలోనైనా పోలీసుశాఖలోని దాదాపు 19వేల పైచిలుకు పోస్టుల ఖాళీలకు రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ ఇవ్వనుంది. ఏపీపీ పోస్టుల వివరాలు ఇలా... 8 మొత్తం పోస్టులు: 151 వేతనం: రూ.54,220–రూ.1,33,630. వయోపరిమితి: 2021, జూలై 1 నాటికి 34 ఏళ్లు దాటకూడదు. కనీస విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బీ/ బీఎల్ లేదా ఇంటర్ తరువాత ఐదేళ్ల లా కోర్సు పూర్తిచేసి ఉండాలి. అనుభవం: జూలై 4 నాటికి కనీసం మూడేళ్లపాటు క్రియాశీలకంగా క్రిమినల్ కోర్టుల్లో అడ్వోకేటుగా పనిచేసి ఉండాలి. ఫీజు: తెలంగాణ స్థానికత కలిగిన ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు రూ.750. మిగిలిన అభ్యర్థులు (ఓసీ/బీసీ) అంతా రూ.1500. అభ్యర్థుల దరఖాస్తు ప్రకియ ఆదివారం నుంచే మొదలవడం విశేషం. ఎంపిక, వయోపరిమితి ఇతర వివరాల కోసం https://www.tslprb.in/లో సంప్రదించగలరు. కొత్త జోన్ల ఆధారంగా కేటాయింపులు.. ప్రస్తుతం వెలువడిన ఏపీపీ నోటిఫికేషన్ ను కొత్త జోనల్ వ్యవస్థకు అనుగుణంగా ప్రకటించడం గమనార్హం. మొత్తం 151 పోస్టుల్లో మల్టీజోన్ 1 పరిధిలో 68 పోస్టులు ఉండగా, మల్టీజోన్ –2 పరిధిలో 83 పోస్టులు ఉన్నాయి. అన్ని పోస్టుల భర్తీలోనూ జనరల్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, విమెన్ రిజర్వేషన్లతోపాటు, మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్, ఎకనమికల్లీ వీకర్ సెక్షన్, వికలాంగుల రిజర్వేషన్ లను పరిగణనలోకి తీసుకున్నారు. ఎస్సీ/ఎస్టీ/బీసీలకు ఐదేళ్ల వయోపరిమితి కల్పించారు. వికలాంగులకు గరిష్టంగా పదేళ్ల మినహాయింపు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐదేళ్లు (టీఎస్ఆర్టీసీ, కార్పొరేషన్లు, మున్సిపాలిటీ తదితరాలకు వర్తించదు) వయోపరిమితి, ఎక్స్ సర్వీస్‌మెన్ (మాజీ సైనికాధికారులు), ఎన్ సీసీలో సేవలందించిన వారికి వమోపరిమితిలో మూడేళ్లపాటు మినహాయింపు కల్పించారు. -
Telangana Police: ఆపదా.. మేమున్నాం పదా!
►సార్.. నా పేరు సంతోష్ కర్ణాటకలో బ్యాంకు ఉద్యోగిని. ఆడిటింగ్ కోసం ప్రతివారం హైదరాబాద్ రావాలి. ఎలా సార్.. అంటూ డీజీపీకి ట్వీట్ చేశాడు. నిమిషాల్లో డీజీపీ బృందం స్పందించింది. ఈ–పాస్ లింక్ పంపి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ►వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఉండే 9 నెలల గర్భవతి అయిన స్వర్ణ, ఆమె భర్త అశోక్ లాక్డౌన్ వల్ల సొంతూరికి వెళ్లలేక ఇబ్బందులు పడుతుంటే గమనించిన మామునూరు ఏసీపీ వెంటనే పోలీసు వాహనంలో వారిని ఇంటికి చేర్చారు. సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్ కఠినతరం చేసినప్పటి నుంచి, ఎవరికి ఏ సమయంలో ఆపద వచ్చి నా డీజీపీ ట్విట్టర్ హ్యాండిల్ @TelanganaDGP టీమ్ వెంటనే స్పందిస్తోంది. ఎక్కడి నుంచి ఏ సమస్యలపై ట్వీట్ వచ్చినా.. ఆయా జిల్లాల ఎస్పీలు, సీపీలను అప్రమత్తం చేస్తోంది. సాధ్యమైనంత త్వరగా వారి సమస్య పరిష్కారమయ్యేలా చూస్తోంది. ఆకస్మిక మరణాలు, వైద్య సాయం, రక్తదానం తదితర అత్యవసర అంశాలకు టీమ్ సభ్యులు తొలి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఒకవేళ పరిష్కారం కాని పక్షంలో కారణాలు వివరిస్తున్నారు. ఈ–పాస్ https//policeportal.tspolice.gov.in దరఖాస్తులను కూడా వెంటనే పరిష్కరిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 70 వేల మందికిపైగా ఈ–పాస్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అత్యవసరమైన వాటన్నిటినీ అనుమతిస్తూ మిగతావి తిరస్కరిస్తున్నారు. వివాహాలు, ఇతర శుభకార్యాల వంటి వాటికి సంబంధించి దరఖాస్తులు మాత్రం పెండింగ్‌లో ఉంటున్నాయి. సేవా ఆహార్ యాప్.. ఈ నెల 7న తెలంగాణ పోలీసులు.. వివిధ ఎన్జీవోలు, ఫుడ్ డెలివరీ సంస్థలతో కలిసి ప్రారంభించిన సేవా ఆహార్ యాప్‌కు మంచి స్పందన వస్తోంది. రోజుకు 2,200 మంది కరోనా పాజిటివ్ రోగులకు ఈ యాప్ ద్వారా ఆహారం అందజేస్తున్నారు. ఇప్పటిదాకా 40 వేల ప్లేట్ల భోజనం అందించినట్లు సమాచారం. ఈ నెల 27వ తేదీ నుంచి రోజూ అదనంగా మరో 200 ప్లేట్లు సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేశారు. సేవా ఆహార్‌యాప్ లేదా 77996 16163 వాట్సాప్ నంబరులో ఉదయం 6 గంటలలోగా ఆర్డర్ పెడితే మధ్యాహ్నానికల్లా ఆహారాన్ని ఇంటి వద్దకు లేదా ఆసుపత్రి వద్దకు వచ్చి అందజేస్తారు. రోగులు, మహిళలకు చేయూత ఉదయంపూట దారితప్పిన, రవాణా సౌకర్యా ల్లేక ఇబ్బందులు పడుతున్న రోగులు, వృద్ధు లను పోలీసులు క్షేమంగా వారి ఇళ్లకు చేరుస్తున్నారు. ఆపదలో ఉన్నవారిని ఆసుపత్రులకు తరలిస్తున్నారు. సోమవారం మీర్‌చౌక్ ఏసీపీ ఆనంద్ ఆసుపత్రికి వెళ్తున్న మహిళలను పోలీసు వాహనంలో తరలించి చికిత్స అందేలా చూశా రు. సకాలంలో ఇంటికి చేరుకోలేకపోయిన వారిని తమ వాహనం లేదా అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పంపుతున్నారు. సోమవారం అన్ని కమిషనరేట్, ఎస్పీ కార్యాలయాల్లో ఇలాంటి సహాయ కార్యక్రమా లు చేపట్టారు. దీనికితోడు డయల్ 100కి కాల్ చేసినా స్థానిక పోలీసుస్టేషన్‌కు సమాచారం అందించి సాయం అందేలా చూస్తున్నారు. -
లాక్డౌన్ పెట్టాలా లేదా అన్నది సీఎం నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా పరిస్ధితులపై పోలీస్ ఉన్నతాధాకారులతో చర్చించాం.. అయితే లాక్డౌన్ పెట్టాలా లేదా అన్నది సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారు అని తెలంగాణ హోం శాఖ మంత్రి మహమూద్ అలీ తెలిపారు. త్వరలో రాష్ట్రంలోని పరిస్థితులపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తారని చెప్పారు. సమీక్ష తర్వాత లాక్‌డౌన్‌పై సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు. అయితే లాక్డౌన్ పెట్టడం సీఎం కేసీఆర్‌కు ఇష్టం లేదని చెప్పారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, రాత్రికర్ఫ్యూ అమలుపై బుధవారం పోలీస్ శాఖ అధికారులతో హోంమంత్రి మహమూద్ అలీ సమీక్ష చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలిపారు. లాక్డౌన్ వల్ల ఆర్థిక ఇబ్బందులు చాలా వస్తాయని గుర్తుచేశారు. రాష్ట్రంలో కరోనా కేసులు, మరణాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేసులను అసరాగ చేసుకుని బ్లాక్ మార్కెట్ దందా విచ్చలవిడిగా కొనసాగుతుందని పోలీసుల అధికారులకు చెప్పారు. ఆక్సిజన్ నుంచి రెమిడిసివర్ ఇంజెక్షన్ వరకూ జరుగుతున్న బ్లాక్ మార్కెట్ దందాను అరికట్టేలా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. చదవండి: రాబోయే 3, 4 వారాలు చాలా కీలకం.. మరింత జాగ్రత్త చదవండి: కరోనా మూడో దశకు సిద్ధంగా ఉండాలె: కేంద్రమంత్రి వ్యాఖ్యలు పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న హోం శాఖ మంత్రి మహమూద్ అలీ -
కిడ్నీ, కాలేయం దానం: ఏఎస్సై పాడె మోసిన సజ్జనార్
సాక్షి, హైదరాబాద్: నిజాంపేట ఘటనలో చికిత్స పొందుతూ మృతిచెందిన ఏఎస్సై మహిపాల్ రెడ్డి మృతి కి పోలీస్ శాఖ కన్నీటి నివాళి అర్పించింది. అయితే బ్రెయిన్ డెడ్ కావడంతో మహిపాల్ రెడ్డి కిడ్నీలు, కాలేయం దానం చేసేందుకు కుటుంబసభ్యులు అంగీకరించారు. అవయన దానం అనంతరం కిస్మత్‌పూర్‌లోని మహిపాల్ రెడ్డి నివాసం వద్ద అంత్యక్రియలు జరిగాయి. మహిపాల్ రెడ్డి మృతదేహాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున గ్రామస్తులు, పోలీసులు వచ్చారు. అదనపు డీజీపీ సజ్జనార్ మహిపాల్ రెడ్డి మృతదేహానికి నివాళులర్పించి, కుటుంబసభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా పోలీసుల గౌరవ వందనంతో మహిపాల్ రెడ్డి అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఈ అంత్యక్రియల్లో మహిపాల్ రెడ్డి పాడెను సజ్జనార్ మోశారు. అంత్యక్రియల ఖర్చులకు సజ్జనార్ రూ.50 వేలు వ్యక్తిగత సహాయం చేశారు. మహిపాల్ రెడ్డి జీవితం నుంచి చాలా నేర్చుకోవాల్సినవి ఉన్నాయని సజ్జనార్ తెలిపారు. విధి నిర్వహణలో ఆయన ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం సేవించి వాహనాలు నడపొద్దని పదేపదే చెప్తున్నా వినడం లేదని, మహిపాల్ రెడ్డి మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. బాధిత కుటుంబానికి శాఖ తరపున అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. -
ఆ పని చేస్తేనే మహిళలపై వేధింపులు ఆగుతాయ్..
సాక్షి, హైదరాబాద్: చట్టాలను పకడ్బందీగా అమలు చేసినప్పుడే పని ప్రాంతాల్లో లైంగిక వేధింపులకు కళ్లెం పడుతుందని వివిధ రంగాల మహిళా ప్రముఖులు అభిప్రాయపడ్డారు. తెలంగాణ పోలీస్ మహిళా భద్రతా విభాగం వార్షికోత్సవం, మరోవైపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యంలో సోమవారం వెబినార్ ద్వారా వర్క్‌షాప్ జరిగింది. ఇందులో ‘పని ప్రాంతాల్లో మహిళలపై వేధింపులు-అధిగమించే మార్గాలు’ అనే అంశంపై వివిధ రంగాల మహిళా ప్రముఖులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. అడిషనల్ డీజీ స్వాతి లక్రా మాట్లాడుతూ.. పని ప్రాంతాల్లో వేధింపులు, గృహహింసకు సంబంధించి అధిక శాతం కేసులు నమోదు కావడం లేదన్నారు. కాగా, ఇటీవల వచ్చిన మీ-టూ ఉద్యమం నేపథ్యంలో పని ప్రాంతాల్లో వేధింపులపై పెద్ద ఎత్తున చర్చ జరిగిందని చెప్పారు. వర్క్‌ప్లేస్‌లో మహిళలపై వేధింపులు, ఇతర విధానాల్లో జరిగే వేధింపులపై నమోదయ్యే కేసుల దర్యాప్తును నిర్దిష్ట సమయంలో పూర్తి చేయాలని హిమాచల్ ప్రదేశ్‌లోని జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం వీసీ నిష్టా జైస్వాల్ వెల్లడించారు. పని ప్రాంతాల్లో వేధింపులను ఎదుర్కోవడం ఎలా అనే అంశంపై రూపొందించిన పుస్తకాన్ని ఈ సందర్భంగా స్వాతి లక్రా ఆవిష్కరించారు. కార్యక్రమంలో యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ జెండర్ విభాగం వైస్ చైర్మెన్ శృతి ఉపాధ్యాయ్, డీఐజీ సుమతి తదితరులు పాల్గొన్నారు. -
సీఐ శంకరయ్య ఇంట్లో విస్తుపోయే ఆస్తులు
సాక్షి, హైదరాబాద్: షాబాద్ సీఐ బి. శంకరయ్య ఇంట్లో సోదాలు చేసిన ఏసీపీ అధికారాలు విస్తుపోయే విషయాలను బయటపెట్టారు. శంకరయ్య బినామీల పేరుతో భారీగా ఆస్తుల కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు. భూ తగాదా కేసులో రూ.లక్షా 20వేలు లంచం తీసుకుంటూ సీఐ శంకరయ్య పట్టుబడిన విషయం తెలిసిందే. రెవెన్యూ విలువ లెక్కల ప్రకారం రూ.4.58 కోట్ల ఆస్తులుగా గుర్తించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఇక బహిరంగ మార్కెట్లో రూ.10కోట్లకు పైనే ఆస్తుల విలువ ఉంటుందని అంచనా వేస్తున్నారు. హైదరాబాద్‌లో రూ.కోటి ఐదు లక్షలు విలువ చేసే రెండు నివాసాలు ఉన్నట్లు తెలిపారు. రూ.2 కోట్ల 25 లక్షల విలువ చేసే 11 ప్లాట్ల పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. దాంతో పాటు నిజామాబాద్, చేవెళ్ల, మిర్యాలగూడలో 41 ఎకరాల వ్యవసాయ భూమి, కారు ఉన్నాయని తెలిపారు. రూ. 22 లక్షలు విలువ చేసే బంగారం, నగలు, రూ.17 లక్షలు నగదు స్వాధీనం చేసుకున్నట్లు అధికారలు పేర్కొన్నారు. అనంతరం శంకరయ్యకు ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి, ఏసీబీ కోర్టులో ప్రవేశ పెట్టినట్లు అధికారులు చెప్పారు. శంకరయ్య, ఏఎస్ఐ రాజేందర్‌లకు రిమాండ్ విధిస్తూ, చంచల్‌గూడ జైలుకు తరలించినట్లు అధికారులు తెలిపారు. -
శంకరయ్య ఇంట్లో సోదాలు.. భారీగా ఆస్తులు
సాక్షి, హైదరాబాద్: భూతగాదా కేసులో లక్షా 20వేల రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన షాబాద్ సీఐ శంకరయ్య ఇంట్లో ఏసీబీ సోదాలు ముగిశాయి. గురువారం మధ్యాహ్నం నుంచి జరిపిన సోదాల్లో భారీగా ఆస్తులను గుర్తించినట్లు శుక్రవారం రోజున ఏసీబీ అధికారులు వెల్లడించారు. రూ. 4కోట్ల విలువైన ఆస్తులను గుర్తించడంతో పాటు, విలువైన ఆస్తులకు సంబంధించిన పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కాగా.. ఇప్పటికే సీఐ శంకరయ్య, ఏఎస్ఐ రాజేందర్‌లకు ఏసీబీ కరోనా పరీక్షలు నిర్వహించింది. అనంతరం ఉస్మానియా ఆస్పత్రికి తరలించి వైద్యపరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం సీఐ, ఏఎస్ఐలను ఏసీబీ న్యాయమూర్తి ఎదుట ఏసీబీ అధికారులు ప్రవేశపెట్టారు. ఏసీబీ న్యాయమూర్తి షాబాద్ సీఐ శంకరయ్య, ఏఎస్ఐ రాజేందర్‌లకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. దీంతో వీరిద్దరిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. చదవండి: ఏసీబీ వలలో సీఐ, ఏఎస్ఐ -
పోలీస్ సిబ్బందికి డీజీపీ అభినందనలు
సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్ సమయంలో రాష్ట్రవ్యాప్తంగా విశేష సేవలు అందిస్తున్న పోలీస్ సిబ్బందికి తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి అభినందనలు తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మే 7 వరకు కంటైన్మెంట్ జోన్ల ప్రాంతాల్లో పటిష్టమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. హెల్త్, మున్సిపల్ శాఖ అధికారులతో కలిసి సమన్వయంతో పోలీస్ శాఖ పనిచేస్తుందని డీజీపీ తెలిపారు. లాక్డౌన్లో పోలీస్ సిబ్బంది కృషికి గుర్తింపుగా 10 శాతం ఇన్సెంటివ్స్ ఇచ్చినందుకు ముఖ్యమంత్రికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. యువత పనిలేకుండా రోడ్లపైకి రాకూడదని ఆయన హెచ్చరించారు. కరోనా నియంత్రణకు రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్లు కూడా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని.. ప్రతి కాలనీ వారు కేవలం ఒకే ఎంట్రీ ఎగ్జిట్ పెట్టుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డి సూచించారు. -
పోలీసు బిడ్డగా వారికి సెల్యూట్: చిరు
సాక్షి, హైదరాబాద్: రెండు తెలుగురాష్ట్రాల పోలీసుల పనితీరుపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసల జల్లు కురిపించారు. రాత్రింబవళ్లు ప్రజల కోసం కష్టపడుతున్నారని ప్రశంసించారు. కరోనా నియంత్రణలో పోలీసుల కృషి అమోఘమని కొనియాడిన చిరంజీవి సామాన్య జనం వారికి సహకరించాలని కోరారు. ఓ పోలీసు బిడ్డగా వారు చేస్తున్న విశేష కృషికి సెల్యూట్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం చిరు తన అధికారిక ట్విటర్లో ఓ వీడియో పోస్ట్ చేశారు. ‘రెండు తెలుగు రాష్ట్రాల పనితీరు అద్భుతం. నిద్రాహారాలు మాని వాళ్లు పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు. నేను హైదరాబాద్‌లో స్వయంగా చూస్తున్నాను. వారి పనితీరు వల్ల లాక్డౌన్ చాలా విజయవంతంగా జరిగిందనే చెప్పాలి. అలా జరగబట్టే ఈ కరోనా విజృంభణ చాలా వరకు అదుపులోకి వచ్చింది. అలాగే నేను ప్రతీ ఒక్కరికి వేడుకుంటున్నాను. సామాన్య జనం కూడా పోలీసులకు సహకరించాలి. ఈ కరోనాను తుదిముట్టించడంలో, ఆంతమొందించడంలో వారికి చేదోడు వాదోడుగా ఉండాలి సహకరించాలి. పోలీసు వారు చేస్తున్న అమోఘమైనటువంటి ఈ ప్రయత్నానికి పోలీసు బిడ్డగా వారికి చేతులెత్తి సెల్యూట్ చేస్తున్నా.. జైహింద్’అంటూ చిరు ఆ వీడియోలో పేర్కొన్నారు. కాగా, పోలీసులకు కృతజ్ఞతలు తెలుపుతు చిరంజీవి పోస్ట్ చేసిన వీడియోపై తెలంగాణ డీజీపీ కార్యాలయం ధన్యవాదాలు తెలిపింది. #SalutingCoronaWarriors @TelanganaDGP @TelanganaCOPs #UnitedAgainstCorona pic.twitter.com/9LOFWD9irk — Chiranjeevi Konidela (@KChiruTweets) April 10, 2020 చదవండి: చిరు ట్వీట్‌పై స్పందించిన పవన్ కల్యాణ్ అకీరా బర్త్‌డే.. చిరు ఆకాంక్ష అదే! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_881252745.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
మేమున్నామని.. మీకేంకాదని..
సాక్షి, మంచిర్యాల : హైదరాబాద్‌లో దిశ, హన్మకొండలో మానస, ఆసిఫాబాద్‌లో జిల్లాలో సమతలు మానవ మృగాల చేతుల్లో బలైన సంఘటనలు సంచలనం సృష్టించాయి. ప్రజల భద్రత కోసం పోలీస్ శాఖ ఎంతో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులో తెచ్చింది. ఆపద పొంచి ఉన్నప్పుడు, ఆటోలో, ట్యాక్సీలో ప్రయాణిస్తున్నప్పుడు 100 డయల్, హాక్–ఐ, షీ టీంలు ప్రజలకు ఎంతో ఉపయోగపడుతాయి. వీటి గురించి పోలీసులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని తద్వారా నేరాల నియంత్రణ సాధ్యమవుతుందని పోలీసులు సూచిస్తున్నారు. దీనిపై ప్రత్యేక కథనం.. నేర రహిత తెలంగాణ రాష్ట్రం సాధించేందుకు తెలంగాణ పోలీస్ శాఖ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ ఇప్పటికే నేర నియంత్రణలో శర వేగంగా దూసుకుపోతోంది. హాక్–ఐ, 100 డయల్ రాష్ట్రంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా సేవలు అందిస్తోంది. పోలీస్ అధికారులు హాక్–ఐ, 100 డయల్ సేవలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికి పూర్తిస్థాయిలో ప్రజలకు అవగాహన రాలేదు. ఫ్రెండ్లీ పోలీస్ విధానంతో ప్రజలకు దగ్గరవుతూ నేరరహిత సమాజం వైపు అడుగులు వేస్తున్నారు తెలంగాణ పోలీసులు. హాక్–ఐ యాప్‌ను స్మార్ట్ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకున్న వారు ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ.. అత్యవసర సమయాల్లో పోలీస్ సహాయం కోరడం కోసం ఏర్పాటు చేసిన పర్చువల్ బటన్ ‘ఎస్‌వోఎస్’ ప్రెస్ చేస్తే చాలు పోలీసులు స్పందిస్తారు. ఈ బటన్ ద్వారా లొకేషన్ తెలుసుకునే సౌకర్యం కూడా ఉండడంతో బాధితుల ఆచూకీ గుర్తించి, ఆయా ప్రాంతాలకు చెందిన స్థానిక పోలీసులను అప్రమత్తం చేసేందుకు అవకాశం ఉంది. ఈ తరహాలో ఇప్పటి వరకు రామగుండం పోలీస్ కమిషనర్ పరిధిలో సుమారు 20 కాల్స్‌కు పోలీసులు స్పందించారు. యాప్ డౌన్లోడ్ ఇలా.. ఆండ్రాయిడ్ మొబైల్ వినియోగించే వారు గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఐవోఎస్ ద్వారా హాక్–ఐ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అనంతరం యాప్‌ని ఓపెన్ చేయగానే రిపోర్ట్ స్టేషన్ టూ పోలీస్, ఉమెన్ ట్రావెల్ మూడ్ సేఫ్, రిజిష్టర్ డీటెయిల్స్ ఆఫ్ సర్వెంట్, వర్కర్, టెనెంట్, ఎస్‌వోఎస్, ఎమ్మర్జెన్సీ పోలీస్ కాంటాక్ట్, కమ్యూనిటీ పోలీసింగ్ అని స్క్రీన్ మీద కనిపిస్తాయి. వివిధ ఆప్షన్లు వస్తాయి. ► ఆప్షన్–1లో మూడు కేటగిరీలు ఉంటాయి. ఇందులో సెలెక్ట్ కేటగిరిలో ట్రాఫిక్, జరిగిన నేరం మహిళలపై జరుగుతున్న వేధింపులు, పోలీసులు చేసే ఉల్లంఘనలు, ఉత్తమ పోలీసింగ్ సలహాలు తీసుకోవడానికి ఆప్షన్లు పొందుపరిచారు. ► ఆప్షన్–2లో ఫొటో లేదా వీడియో సేవ్ సదుపాయం, ప్లేస్ ఆప్ బోర్డింగ్ అని ఉంటుంది. బాధితులు ఎక్కడ ఉన్నారో టైప్ చేయాలి, ఇది పూర్తిగా మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన ఆప్షన్. ► ఆప్షన్–3లో ఇంట్లో అద్దెకు దిగిన వారు, పని మనుషులు, ఎలక్ట్రికల్ బోర్డ్ రిపేర్లు చేసే వారి సమాచారాన్ని సేకరించడానికి దీన్ని ఏర్పాటు చేశారు. ► ఆప్షన్–4, ఎస్‌వోఎస్ అంటే సేవ్ అవర్ సెల్ఫ్ ఇది కూడా మహిళా భద్రతను దృష్టిలో ఉంచుకొని తయారు చేశారు. ► ఆప్షన్–5, ఇందులో రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల, పెద్దపెల్లి జిల్లాల పోలీస్స్టేషన్ల నంబర్లతో పాటు వివిధ పోలీసు అధికారుల నంబర్లు పొందుపరిచారు. ► ఆప్షన్–6, కమ్యూనిటీ పోలీసింగ్‌లో చేరాలనుకునే వారి కోసం ఈ ఆప్షన్ తయారు చేశారు. పేరు మొబైల్ నంబర్, ఈ మెయిల్ ఐడీ, చిరునామా పొందు పరిచారు. సంబంధిత పోలీస్‌స్టేషన్ పేరు నమోదు చేయాలి. ► ఆప్షన్–7, వివిద ఆప్షన్ల ద్వారా పోలీసులు చేసిన ఫిర్యాదు ఏ స్థాయిలో ఉందో తెలుసుకునేందుకు వీలుగా ఉండే ఆప్షన్ ఇది. ► ఆప్షన్–8, ఈ ఆప్షన్లో యాప్‌లో రిజిష్టర్ అయిన తర్వాత మళ్లీ ఏదైనా మార్పులు చేసుకునే విధంగా ఉపయోగ పడుతోంది. ఆపన్నహస్తం.. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో హాక్–ఐ యాప్ అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు 50వేల మంది ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు. దిశ ఘటనకు ముందు కమిషనరేట్ పరిధిలో 20వేల మంది యాప్‌ను డౌన్ లోడ్ చేసుకున్నారు. దిశ ఘటన అనంతరం 13రోజుల వ్యవధిలో 30వేల మంది యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు. ఈ యాప్ ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనలు మొదలు కొని ఇతర నేరాల వరకు ఉన్న చోట నుంచి నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. ఆపదలో ఉన్నప్పుడు అత్యవసరమైనప్పుడు పోలీసుల నుంచి సహాయం సైతం పొందేందుకు ఉపయుక్తంగా ఉండేలా డిజైన్ చేశారు. పోలీసింగ్‌ను మెరుగు పరిచేందుకు అవసరమైన సలహాలు సూచనలను సైతం ప్రజలు ఈ యాప్ ద్వారా చేసే అవకాశం ఉంది. తక్షణ సహాయం కోసం.. హాక్–ఐలో ఉన్న వివిధ ఆప్షన్స్‌లో ఎస్‌వోఎస్ కీలకమైనది. అత్యవసర సమయంలో ఫోన్ చేసి పూర్తిస్థాయి సందేశం పంపేందుకు అవకాశం లేనప్పుడు మీటా నొక్కడం ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ఉపయోగించే పర్చువల్ ఎమ్మర్జెన్సీ బటన్ ఇది. ఈ ఆప్షన్‌లోకి ప్రవేశించిన తర్వాత వినియోగదారులు తమ పేరు, ఫోన్ నంబర్ వంటివి ఎంటర్ చేయాలి. అత్యవసర సమయాల్లో ఎవరిని సంప్రదించాలని భావిస్తున్నామో వారి నంబర్లు సైతం పొందుపరుచాలి. గరిష్టంగా 5గురికి చెందిన సెల్ ఫోన్ నంబర్లు ఎంటర్ చేసుకునే అవకాశం ఉంది. దీంతో ఎమ్మర్జెన్సీ బటన్ యాక్టివేట్ అయినట్లే, అత్యవసన సమయాల్లో ఈ బటన్ నొక్కితే సరిపోయేలా యాప్ డిజైన్ చేశారు. ఎక్కడున్నా సరే... జీపీఎస్ పరిజ్ఞానంతో అనుసంధానమై ఉన్న యాప్‌లో ఎస్‌వోఎస్ బటన్ నొక్కితే వారు ఏ ప్రాంతంలో ఉన్నారనే విషయాన్ని తెలుసుకోవచ్చు. బటన్ నొక్కిన వెంటనే వీటిపై మ్యాప్‌లో బాధితుడు ఏ ప్రాంతంలో ఉన్నారనేది హాక్–ఐ మార్క్‌లోనే కనిపించడంతో పాటు ప్రత్యేక సైరన్ వస్తుంది. ఎస్‌వోఎస్ నొక్కిన తర్వాత బాధితుడు ఎటూ వెళ్లినా కమిషనరేట్ కంట్రోల్ రూంలో ఏర్పాటు చేసిన స్క్రీన్‌పై వివరాలు కనిపిస్తాయి. ముందుగా సంప్రదించేందుకు ప్రయత్నిస్తారు.. హాక్–ఐ ఎస్‌వోఎస్ ద్వారా సమాచారం వచ్చిన వెంటనే పోలీసులు ప్రాథమికంగా బాధితులు ఎక్కడ ఉన్నారో గుర్తిస్తారు. ఆపై ఫోన్ చేయడం, పూర్తి సందేశం పంపడం ద్వారా వారిని సంప్రదించే ప్రయత్నం చేస్తారు. గరిష్టంగా 2 నిమిషాలు వేచి చూసి ఈ రెండింటికి బాధితుల నుంచి స్పందన రాని పక్షంలో బాధితులు ఇబ్బందుల్లో ఉన్నట్లు నిర్ధారిస్తారు. సమీపంలో విధులు నిర్వహిస్తున్న రక్షక్, బ్లూకోట్స్ సిబ్బందిని బాధితులు ఉన్న ప్రదేశానికి పంపిస్తారు. క్యాబ్ ప్రయాణంలో.. మహిళలు ట్యాక్సీ, ఆటోల్లో ప్రయాణం చేస్తూ వాహనం నంబర్, వాహన వీడియో లేదా ఫొటో తీయాలి. వాహనం నంబర్ వెళ్తున్న ప్రదేశం, వెళ్లాల్సిన ప్రదేశం యాప్ ద్వారా పంపించాలి. దీంతో ప్రయాణం చేస్తున్న వాహనం పూర్తిగా పోలీసుల ఆధీనంలో ఉంటుంది. డయల్100.. నేరాల నియంత్రణకు సత్వర సమాచారం కోసం రాష్ట్ర పోలీస్ శాఖ డయల్ 100 నంబర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ నంబర్‌కు ఫోన్ చేస్తే సకాలంలో స్పందించి సేవలందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేశారు. 24 గంటలు ఇది పనిచేస్తుంది. విడతల వారీగా పోలీస్ సిబ్బంది వచ్చిన కాల్స్‌ను నమోదు చేసుకొని సంబంధిత పోలీస్స్టేషన్లకు సమాచారం అందజేస్తారు. టోల్ ఫ్రీ నంబర్లు.. దేశ వ్యాప్తంగా ప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి టోల్ ఫ్రీ నంబర్లను తెచ్చింది. 112, 1090, 1091 నంబర్లు సైతం వినియోగంలో ఉన్నాయి. వీటికి ఫోన్ చేసి పోలీస్‌ల నుంచి సహాయం పొందవచ్చు. షీ టీమ్ ఫిర్యాదులకు ప్రత్యేక నంబర్.. మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా షీ టీమ్ పోలీస్ బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. షీ టీమ్ పోలీసుల సహాయం కోసం 181 లేదా వాట్సాప్ నంబర్ 6303923700 మెసేజ్ చేసినా బాధితులకు తక్షణమే సహాయం అందుతోంది. సాంకేతికతతోనే నేరాల నియంత్రణ హాక్–ఐ, 100 డయల్ చేయడం ద్వారా నేరాల నియంత్రణ అత్యంత త్వరలోనే సాధ్యమవుతుంది. వీటి ద్వారా పోలీసులు సత్వరమే స్పందిస్తారు. యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని సద్వినియోగం చేసుకోవాలి. ఆపద పొంచి ఉన్నట్లు అనిపిస్తే వెంటనే 100 డయల్ చేయండి. ట్యాక్సిలో ప్రయాణిస్తున్న వారికి హాక్ –ఐ యాప్ ఎంతో ఉపయోగపడుతుంది. – వి. సత్యనారాయణ, పోలీస్ కమిషనర్, రామగుండం -
చిన్నమెసేజ్‌తో శ్రీరామ రక్ష
సాక్షి, హైదరాబాద్: మహిళల భద్రత కోసం పోలీసులు మరో వినూత్న ఆవిష్కరణకు రూపకల్పన చేశారు. క్యాబ్‌లలో ప్రయాణించే మహిళలు, పౌరుల భద్రతకు ఆ సర్వీసులను పోలీసు ప్యాట్రోల్ వాహనాల తో అనుసంధానించారు. దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో ఈ వ్యవస్థను ప్రవేశ పెట్టినట్లు సోమవారం జరిగిన మీడియా భేటీలో డీజీపీ మహేందర్‌రెడ్డి వెల్లడించారు. రాష్ట్రాన్ని నేర రహిత సమాజంగా మార్చే క్రమంలో ఈ ప్రక్రియ చేపట్టినట్లు చెప్పారు. నగరం విస్తరిస్తున్న దరిమిలా మ హిళా ఉద్యోగులు అన్ని వేళల్లోనూ విధులు నిర్వహిస్తున్నారని, వారికి భద్రత కలి్పంచడం మనందరి బాధ్యత అని అన్నారు. ఎలా పని చేస్తుందంటే..? ఆపద ఎదురైనా, ప్రమాదాల్లో చిక్కుకున్నా.. ఓలా, టోరా, రైడో, ఎం–వాలెట్, హాక్ ఐ యాప్‌ల్లో ఉన్న ఎస్ఓఎస్ (ఎమర్జెన్సీ) బటన్‌ను నొక్కితే చాలు సమీపంలోని ప్యాట్రోల్ వాహనాలు, బ్లూకోల్ట్స్, స్థానిక ఏసీపీ, డీసీపీ, స్టేషన్ ఎస్హెచ్ఓ, మహిళ బంధువులకు సమాచారం అందుతుంది. ఫలితంగా సదరు క్యాబ్ డ్రైవర్ వివరాలు ఫోన్ నంబర్, బయోడేటా మొత్తం పోలీసులకు వచ్చేస్తుంది. సమీపంలో ఉన్న గస్తీ వాహనాలు, పోలీసులు జీపీఎస్ ఆధారంగా ఘటనా స్థలానికి చేరుకుంటారు. ఇందుకోసం పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్‌లో ఓ ప్రత్యేకమైన బృందం 24 గంటలు పనిచేస్తుంది. ఈ ప్రక్రియంతా ముగిసిన తరువాత ఎవరు ఎలా పనిచేసారో తెలుసుకునేందుకు థర్డ్ పార్టీ సర్వే ప్రతినిధులు బాధితులకు ఫోన్ చేస్తారు. ప్రస్తుతం ఈ సదుపాయం నగరానికే పరిమితమైనా, క్రమంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తామని డీజీపీ మహేందర్‌రెడ్డి తెలియజేశారు. మిగిలిన క్యాబ్ సంస్థలూ ముందుకువచ్చి ఈ విధానంలో చేరాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మహిళలు, పౌరుల్లో హాక్ ఐ మీద అవగాహన పెరుగుతోందన్నారు. ఇప్పటివరకూ 22 లక్షల మంది హాక్ ఐని డౌన్లోడ్ చేసుకోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. -
ధర్నాకు అనుమతిస్తారో లేదో చెప్పండి
సాక్షి, హైదరాబాద్: ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద మే 7న మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) మహాధర్నా నిర్వహించుకోవడానికి అనుమతినిస్తారో లేదో తెలియచేయాలని హైకోర్టు శుక్రవా రం తెలంగాణ పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను సోమవారానికి (29కి) వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 27న తాము నిర్వహించతలపెట్టిన ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు బి.రమేశ్‌బాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై శుక్రవారం జస్టిస్ షావిలి విచారణ జరిపారు. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది ఎన్.హరినాథ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. శాంతియుతంగా ధర్నా చేసుకునేందుకు పోలీసులు అనుమతినివ్వడం లేదన్నారు. అనుమతి కోసం తాము పెట్టుకున్న దరఖాస్తులను తిరస్కరించారని తెలిపారు. ధర్నా సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరిగే బాధ్యత వహిస్తామంటూ పిటిషనర్‌ను ఈ కోర్టు ముందు అఫిడవిట్ దాఖలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్.శరత్‌కుమార్ కోరారు. సంబంధిత అధికారి ముందు అఫిడవిట్ దాఖలు చేసేందుకు ఆదేశాలు ఇస్తానని న్యాయమూర్తి చెప్పగా, అధికారి ముందు దాఖలు చేసే అఫిడవిట్ అమలుకు నోచుకోదని తెలిపారు. హామీ ఇచ్చి.. వాటిని ఉల్లంఘిం చిన ఘటనలు గతంలో అనేకం ఉన్నాయని ప్రస్తావించారు. ఎంత మంది ఈ ధర్నాకు హాజరవుతారు.. ఏ కారణంతో ఈ ధర్నా చేస్తున్నారు అన్న వివరాలను పిటిషనర్ చెప్పలేదని తెలిపారు. దీనికి హరినాథ్‌రెడ్డి స్పందిస్తూ.. ట్యాంక్‌బండ్‌పై 125 అడుగుల అంబేడ్క ర్ విగ్రహం పెడతామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని, ఆ హామీని నెరవేర్చనందుకు నిరసనగా ఈ ధర్నా చేస్తున్నామని చెప్పారు. ఈ శనివారం నిర్వహించే ధర్నాకు ఇంత తక్కువ వ్యవధిలో తగిన భద్రతా ఏర్పాట్లు చేయలేమని శరత్ తెలిపారు. అయితే మే 1 లేదా 7న ధర్నా నిర్వహించుకుంటామని, దీనికి అనుమతినిచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. -
ఆపరేషన్ అశోక్ ముమ్మరం
సాక్షి, హైదరాబాద్: డేటా చౌర్యం కేసులో కీలక నిందితుడు ఐటీ గ్రిడ్స్ ఎండీ డాకవరం అశోక్ కోసం సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. తమ డేటా కూడా చోరీ చేశారని ఆధార్ సంస్థ కూడా తాజాగా మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ వేగవంతం చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారిక ‘సేవా మిత్ర’యాప్ కోసం దాన్ని నిర్వహించే ఐటీ గ్రిడ్స్ సంస్థ ఆధార్ సర్వర్ నుంచే సమాచారాన్ని తస్కరించి ఉంటుందన్న అనుమానాలు తీవ్ర చర్చకు దారితీశాయి. తెలుగు రాష్ట్రాలతోపాటు ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల ప్రజల ఆధార్ సమాచారం కూడా ఐటీ గ్రిడ్స్ వద్ద ఉందని సిట్ బృందం గుర్తించింది. అశోక్ కోసం ప్రత్యేక బృందాలు.. గత ఫిబ్రవరి 27 తరువాత అశోక్ ఫోన్ స్విచ్చాఫ్ అయింది. అప్పుడే ఏపీకి పారిపోయిన అతను అక్కడ ఏపీ పెద్దల సంరక్షణలో ఉన్నాడన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే విచారణకు రావాలని పోలీసులు మూడుసార్లు నోటీసులు జారీ చేయడంతో పాటు పత్రికల్లో ప్రకటనలు కూడా ఇచ్చారు. అయినా ఫలితం లేకపోవడంతో సిట్ కొన్ని ప్రత్యేక బృందాలను ఏపీకి, కర్ణాటకకు పంపింది. ఐటీ గ్రిడ్స్ సంస్థలపై దాడులు చేసినప్పుడు పోలీసులు దాదాపు 60 హార్డ్ డిస్క్‌లు, పెన్‌డ్రైవ్‌లు, మెమొరీ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో చాలా వాటిలో సమాచారం డిలీట్ చేసి ఉంది. దాదాపు 40 హార్డ్ డిస్క్‌ల నుంచి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్ఎస్ఎల్) సమాచారాన్ని రీట్రైవ్ చేయగలిగింది. తెలంగాణ, ఏపీ ప్రజల ఆధార్ వివరాలు తీసుకున్నట్లు ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు తేల్చడంతో మిగిలిన డిస్క్‌ల్లో ఏముందోనన్న ఉత్కంఠ నెలకొంది. వాటిలో కీలక అంశాలు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. -
ఫైన్ పడుద్ది !
వరంగల్ క్రైం: వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో వాహనదారులు ఇకపై గీత దాటితే.. ఫైన్ పడుద్ది. హైదరాబాద్ తరహాలో వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను ఇకపై తూచ తప్పకుండా పాటిం చా ల్సిందే. సిగ్నల్ జంప్‌లు, త్రిబుల్ రైడింగులు, రాంగ్ రూట్ డ్రైవింగ్‌లకు ఇక కాలం చెల్లనుంది. వాహనదారులకు తెలియకుండానే జరిమానా నోటీస్ ఇంటికి అందే విధానాన్ని వరంగల్ పోలీసు కమిషనర్ డాక్టర్ విశ్వనాథ రవీందర్ శుక్రవారం సాయంత్రం కమిషనరేట్‌లో ప్రారంభించారు. ట్రాఫిక్ విభాగంలో పనిచేసే సిబ్బంది విధుల్లో మరింత పారదర్శకంగా ఉండేందుకు ఈ–చాలన్ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు ఆయన ప్రకటించారు. సమావేశంలో కమిషనర్ డాక్టర్ రవీందర్ మాట్లాడుతూ ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని ట్రాఫిక్ విభాగాన్ని మరింత ఆధునీకరించడం కోసం డిజిటలైజేషన్ దిశగా ముందుకు సాగుతున్నట్లు ఆయన ప్రకటించారు. ట్రాఫిక్ విధులను మరితం సులభతరం కోసం, ప్రజల్లో ట్రాఫిక్ పోలీసుల పట్ల నమ్మకం పెంచేందుకు , వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలు తెలియజేసేందుకు ఈ–చాలన్ విధానంను కమిషనరేట్‌లో అమలు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. నగదు రహిత జరిమానాలు.. ట్రాఫిక్ విభాగంలో ఇంతవరకు అధికారులు వాహనాలను అపి చాలన్ రాసే విధానానికి స్వస్తి పలికినట్లు సీపీ డాక్టర్ రవీందర్ ప్రకటించారు. అధికారులు వాహనాలను తనిఖీ చేసే క్రమంలో వాహనదారుల నుంచి ఎలాంటి వసూళ్లు చేయరని, వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించిన విధానాన్ని బట్టి జరిమానా విధిస్తారని ఆయన వెల్లడించారు. ఇందులో వాహనదారులు వెంటనే డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉండదని, వారం రోజుల్లో ఆన్లైన్, మీసేవ, ఈసేవ, పేటీఎం ద్వారా డబ్బులు చెల్లించవచ్చని సీపీ పేర్కొన్నారు. ఎవరైనా, ఎక్కడైన ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే అధికారులు ఫొటో తీసి వాహనదారుడు ఏ విధమైన ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడింది ఆన్లైన్లో నమోదు చేసి జరిమానకు సంబంధించిన రశీదు పంపిస్తారని ఆయన తెలిపారు. దీంతోపాటు ఆ వాహనదారుడి వివరాలు రోడ్డు రవాణా శాఖకు అనుసంధానం చేస్తారని వెల్లడించారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను ఎక్కడ ఉల్లంఘించారు, సమయం, తేదీ, జరిమానా ఎంత, జరిమాన విధించిన అధికారి తదితర వివరాలు డ్రైవర్‌తోపాటు ఓనర్‌కు మెస్సేజ్ రూపంలో సమాచారం అందుతుందని ఆయన వివరించారు. ప్రజలు అవగాహన కలిగి ఉండాలి. ట్రాఫిక్ నిబంధనల విషయంలో వాహనదారులతోపాటు ప్రజలు అవగాహన కలిగి ఉండాలని సీపీ డాక్టర్ రవీందర్ కోరారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ట్రాఫిక్ నియంత్రణ కోసం ఈ–చాలన్ విధానం ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఇంటికి వెళ్లాలనేది తమ లక్ష్యమని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం నగరంలో ఈ–చాలన్ విధానం అమలవుతోందని, ఆ తర్వాత కమిషనరేట్ మొత్తం అమలు చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఈ–చాలన్ ఏ విధంగా పనిచేస్తుందో కమిషనర్ వివరించారు. అనంతరం ట్రాఫిక్ ఎస్సైలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సమావేశంలో అడిషనల్ డీసీపీ, ట్రాఫిక్ ఇన్చార్జి డీసీపీ బిల్లా అశోక్‌కుమార్, ట్రాఫిక్ ఏసీపీ మజీద్, ఇన్స్పెక్టర్లు అంబటి నర్సయ్య, కిషోర్‌కుమార్, హనన్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
‘ఎస్సై’ రాతపరీక్ష ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: ఇటీవల తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించిన ఎస్సై (సివిల్) ప్రాథమిక రాత పరీక్ష ఫలితాలు వెల్లడయ్యాయి. మొత్తం 1,217 పోస్టులకుగాను ఈ ఏడాది ఆగస్టు 26న జరిగిన రాతపరీక్షకు 1,77,992 మంది హాజరు కాగా, అందులో 1,10,635 మంది ఉత్తీర్ణత సాధించినట్టు పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ వి.వి.శ్రీనివాసరావు ఆదివారం వెల్లడించారు. అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లను దిద్దిన అనంతరం సగటు మార్కులను 72.8గా నిర్ధారించామని, అత్యధికంగా 151 మార్కులు, అత్యల్పంగా 8 మార్కులు వచ్చాయని వెల్లడించారు. మోడల్ మార్కుగా నిర్ధారించిన 69 మార్కులను 4,776 మంది అభ్యర్థులు సాధించారని తెలిపారు. దేహదారుఢ్య పరీక్షలకు అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాతో పాటు అర్హత పొందని వారి జాబితాను కూడా వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని, అభ్యర్థులు వెబ్సైట్లోకి లాగిన్ అయి వివరాలు చూసుకోవచ్చని వెల్లడించారు. పార్ట్–2 దరఖాస్తుల ప్రక్రియ తేదీలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. అర్హులైన అభ్యర్థులంతా www.tslprb.in అనే వెబ్సైట్ ద్వారా అవసరమైన సర్టిఫికెట్లను స్కాన్ చేసి అప్లోడ్ చేయడం ద్వారా పార్ట్–2 దరఖాస్తును నింపాల్సి ఉంటుందని తెలిపారు. కాల్‌లెటర్ డౌన్లోడ్ చేసుకునే తేదీలను త్వరలో ప్రకటిస్తామని, ఏ రోజున ఎక్కడ దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తామో ఆయా లెటర్లలో వెల్లడిస్తామని తెలిపారు. అర్హులైన అభ్యర్థులకు నోటిఫికేషన్ నిబంధనల ప్రకారం ఒక్కసారి మాత్రమే దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నట్టు ఆయన వెల్లడించారు. -
శాంతిభద్రతలను గాడిలో పెట్టాం: డీజీపీ
నల్లగొండ: తెలంగాణ పోలీస్ దేశంలోనే గొప్ప పోలీస్ వ్యవస్దగా, అత్యంత నాణ్యతా ప్రమాణాలు కల్గిన వ్యవస్దగా పేరు గడించిందని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. తెలంగాణలో శాంతిభద్రతలను గాడిలో పెట్టామని, ఇకపై ప్రపంచంలోనే గొప్ప పటిష్టమైన వ్యవస్దగా రూపుదిద్దుతామని చెప్పారు. ఫలితంగా రాష్ట్రంలో పెట్టుబడులు వచ్చి పరిశ్రమలు నెలకొల్పి మన పిల్లలందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరకాలన్నదే పోలీస్ వ్యవస్ద తాపత్రయమని వివరించారు. జిల్లా పర్యటనకు వచ్చిన డీజీపీకి పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు సాదరంగా స్వాగతం పలికారు. హెడ్‌క్వార్టర్స్‌లో ఫోరెన్సిక్ ల్యాబ్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం నల్లగొండ, సూర్యాపేట జిల్లాల పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించి మీడియాతో మాట్లాడారు. తెలంగాణాలో నేరం చేస్తే వెంటనే దొరికిపోతాం.. శిక్ష పడుతుంది అన్న భయాన్ని నేరగాళ్ళలో కల్గించే విధంగా పోలీస్ వ్యవస్దను తీర్చిదిద్దామని చెప్పారు. విదేశాల్లో అంత్యంత పటిష్టమైన పోలీస్ వ్యవస్ద ఉంది కాబట్టే మన పిల్లల్ని చదువుల కోసం అక్కడికి నిర్భయంగా పంపిస్తాం.. అలాగే తెలంగాణలో ఉన్న అక్కడివారు, స్థానికులు నిర్భయంగా జీవించేందుకు కావాల్సిన వాతావరణాన్ని తీసుకొస్తున్నామని, 2018 టాస్క్‌ను ఏర్పాటు చేసుకుని పోలీస్ వ్యవస్దను నెంబర్ వన్ వ్యవస్దగా తీర్చిదిద్దుతున్నామని డీజీపీ తెలిపారు. -
రాంజీ ముఠా దొరికింది..!
ఖమ్మంక్రైం: అక్కడొక కారు ఆగింది. డ్రైవర్ వద్దకు ఎవడో వచ్చాడు. ‘‘ఇక్కడ నోట్లు పడిపోయాయి. మీవేనా సార్..’’ అన్నాడు. ఆ డ్రైవర్ కిందికి దిగాడు. కింద చెల్లాచెదరుగా పడిపోయిన 50 రూపాయల నోట్లను ఏరుకోసాగాడు. అవి తనవి కాకపోవచ్చేమోన్న అనుమానం ఆ డ్రైవర్‌కు ఏమాత్రం కలగలేదు. ఆ నోట్లన్నీ ఏరుకుని చూసేసరికి.. కారులోని సూట్ కేసు మాయమైంది. నోట్లు పడిపోయాయని చెప్పిన మాయగాడు.. మాయమయ్యాడు..! ఖమ్మంలోని భద్రాద్రి బ్యాంక్ వద్ద, వైరా రోడ్డులోని వాసన్ ఐ కేర్ వద్ద సోమవారం ఇవి జరిగాయి. బ్యాంక్ వద్ద మాయమైన సూట్‌కేసులో పాతికలక్షల విలువైన నగలున్నాయి. ఐ కేర్ వద్ద మాయమైన సూట్‌కేసులో ల్యాప్‌టాప్, ముఖ్యమైన పత్రాలు ఉన్నాయి. ఈ రెండుచోట్ల సూట్‌కేసులను మాయం చేసింది.. రాంజీ ముఠా..! ఈ ముఠాలోని నలుగురిని వెంటనే పట్టేశారు.. ఖమ్మం పోలీసులు..!! ఎక్కడిదీ ‘రాంజీ ముఠా’..? కరెన్సీ నోట్లను ఎరగా వేయడం, విలువైనవి (నగలు–నగదు) కాజేయడం.. ఈ ముఠాకు వెన్నతో పెట్టిన విద్య. రద్దీగా ఉండేచోట (బ్యాంకులు, నగల దుకాణాలు, ప్రధాన ప్రదేశాలు) ఈ ముఠా మాటు వేస్తుంది. ఎవరిని దోచుకుంటే గిట్టుబాటవుతుందో అంచనా వేస్తుంది. ఆ తరువాత పనిలోకి దిగుతుంది. క్షణాల్లో ముగిస్తుంది. నిముషాల్లో మాయమవుతుంది. దీని పేరే.. రాంజీ ముఠా. తమిళనాడు రాష్ట్రంలోని తిరుచినాపల్లి వద్ద ‘రాంజీనగర్’ అనే ప్రాంతం ఉంది. అక్కడికి చెందిన కొందరు దోపిడీ ముఠాగా ఏర్పడ్డారు. ఇదిగో.. ఇలా ఈ ముఠా దోపిడీలు సాగిస్తోంది. రాంజీనగర్ నుంచి వచ్చిన ఈ ముఠాకు అదే పేరు స్థిరపడింది. దోపిడీ ఎలా చేశారంటే.... ఈ ముఠా, దోపిడీ చేసిన తీరును గమనిస్తే.. సామాన్యులమైన మనకు ఆశ్చర్యమేస్తుంది. పట్టపగలు.. రద్దీ ప్రదేశంలో.. కేవలం కొన్ని క్షణాల్లోనే.. కారు అద్దం పగలగొట్టి/లాక్ చేసిన డోర్ తీసి, సూట్‌కేసుతో మాయమవడం.. అంత తేలికైన విషయం కాదు. ఇది ఈ ముఠా ప్రత్యేకత. లాక్ చేసిన కారు అద్దాలను ఏమాత్రం శబ్దం రాకుండా ఈ ముఠా పగలగొట్టగలదు. ఒక రకమైన పదార్థాన్ని ఉండలా చేసి, కారు అద్దానికి గట్టిగా కొడతారు. అంతే.. ఆ పదార్థం అంటుకున్నంత వరకు అద్దం ఏమాత్రం శబ్దం లేకుండా పగులుతుంది. అందులో చేయి పెట్టి కారు లాక్ తీస్తారు. లేదా.. చేతికందినవి తీస్తారు. ఖమ్మంలో ఇలాగే చేశారు. ఎలా పట్టుకున్నారు..? దోపిడీ జరిగిందని సమాచారం అందుకున్న వెంటనే పోలీసు అధికారులు అప్రమత్తమయ్యారు, శరవేగంగా కదిలారు. ఎంత వేగంగా అంటే... కేవలం గంటల్లోనే, జిల్లా సరిహద్దులు దాటక ముందే పట్టేశారు. దోపిడీ సమాచారం అందిన వెంటనే ఖమ్మం రూరల్ ఏసీపీ నరేష్‌రెడ్డి, అన్ని పోలీస్ స్టేషన్ల సిబ్బందిని అప్రమత్తం చేశారు. తాను రంగంలోకి దిగారు. నగరంలోని, పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లోని దృశ్యాలను పోలీసులు నిశితంగా పరిశీలించారు. అనుమానితులను గమనించారు. కోదాడ వైపు వెళుతున్న బస్సును ముదిగొండ వద్ద పోలీసులు ఆపారు. ఖమ్మం నుంచి అప్పటికే వారికి పక్కా సమాచారం అందింది. బస్సులోని ప్రయాణికులను తనిఖీ చేశారు. అంచనా తప్పలేదు..! నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారిని పోలీసు అధికారులు విచారించారు. తాము రాంజీ ముఠా సభ్యులమేనని ఆ నలుగురు ఒప్పుకున్నారు. ‘‘మేం మొత్తం పదిమందికి పైగా వచ్చాం. నగల సూట్‌కేసుతో మావాళ్లు వెళ్లిపోయారు. ఖమ్మంలో రెండుచోట్ల సూట్‌కేసులు మాయం చేసింది మేమే’’ అని చెప్పారు(ట). ఈ నెల 6వ తేదీన వరంగల్‌లో చోరీ చేసింది కూడా ఇదే ముఠా కావచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ‘సీసీసీ’లు.. వారెవ్వా...! ‘‘ఒకే ఒక్క సీసీసీ (క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరా)... వందమంది పోలీసులతో సమానం..!’’ ఇటీవల, ఓ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ సురేష్‌కుమార్ చెప్పిన అక్షర సత్యమన్న విషయం.. ఇక్కడ రుజువైంది. రాంజీ ముఠాను పట్టించింది.. ఈ నిఘా నేత్రాలే!! కమాండ్ కంట్రోల్లోని సీసీ కెమెరాల ద్వారా పోలీసులు గుర్తించారు. దోపిడీ జరిగిన రెండు ప్రాంతాలతోపాటు ఇతరచోట్ల కొన్న ?సీసీ కెమెరాలు అంత నాణ్యతగా లేవు. కమాండ్ కంట్రోల్లోని సీసీ కెమెరాల ద్వారా ముఠా కదలికలను పోలీసులు గుర్తించారు. అన్ని పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేశారు. చలో చెన్నై...! ఈ ముఠాలోని మిగతా వారిని పట్టుకునేందుకు పోలీసుల బృందం చెన్నైకి బయల్దేరినట్టు తెలిసింది. ఈ ముఠా మొత్తం చిక్కితే.. వీరి గుట్టంతా రట్టవుతుంది. ఎక్కడెక్కడ, ఎప్పుడెప్పుడు, ఎలా దోచుకుందీ తెలుస్తుంది. మింగినదంతా కక్కించేందుకు వీలవుతుంది. శరవేగంగా స్పందించి, అంతే వేగంగా దోపిడీ దొంగలను పట్టుకున్న ఖమ్మం కమిషనరేట్ పోలీసులకు నగర ప్రజలు సలాం చేస్తున్నారు. -
మహేంద్ర ముద్ర.. విప్లవాత్మక సంస్కరణలు
ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో ప్రజలకు చేరువ... టెక్నాలజీ వినియోగంతో నేరాలు, నేరగాళ్లకు అడ్డుకట్ట... పోలీస్ స్టేషన్లకు కొత్త రూపురేఖలు ఇవ్వడంలో నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి తనదైన ముద్ర వేశారు. మూడున్నరేళ్లలో నగర పోలీస్ విభాగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారంచుట్టి ప్రత్యేకత నిలుపుకొన్న మహేందర్‌రెడ్డి తెలంగాణ డీజీపీగా వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో నగర పోలీస్‌కమిషనర్‌గా ఆయన సేవలు.. సంస్కరణలపై ప్రత్యేక కథనం... సాక్షి, సిటీబ్యూరో: ప్రజలతో ప్రత్యక్షంగా సంబంధాలు కలిగి ఉండే, నిత్యం కంటి ముందు కనిపించే తొలి ప్రభుత్వోద్యోగి పోలీస్. అతని పనితీరు ఆధారంగానే ప్రజలకు ప్రభుత్వంపై ఓ అభిప్రాయం ఏర్పడుతుంది. ఠాణాల్లోని మౌలిక వసతుల్ని బట్టే బాధితుడికి ప్రాథమిక భరోసా వస్తుంది. టెక్నాలజీ వినియోగం, కఠిన చర్యలతోనే నేరాలు నియంత్రించడం, నేరగాళ్లకు కళ్లెం వేయడం సాధ్యం. ప్రజలతో పోలీసులు ఎంత స్నేహభావంతో, మర్యాదపూర్వకంగా నడుచుకుంటే.. ప్రజల్లో వారి ప్రతిష్ట అంతగా పెరుగుతుంది. గడిచిన మూడున్నరేళ్లలో ఇవన్నీ నగర పోలీస్ విభాగంలో కనిపించాయి. వీటికి కారణమైన ఒకేఒక్కరు పోలీస్ కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి. ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాల్లో పర్యటించిన, అక్కడి విధానాలు అ«ధ్యయనం చేసిన ఆయన.. హైదరాబాద్‌నూ వాటి సరసన చేర్చేందుకు తనవంతు కృషి చేశారు. ఇన్చార్జి డీజీపీ హోదాలో మహేందర్‌రెడ్డి సిటీని ‘విడిచి వెళ్తున్న’ నేపథ్యంలో పోలీసింగ్‌లో ఆయన చేపట్టిన సంస్కరణలు, తీసుకువచ్చిన మార్పులపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. రూపురేఖలు మారిన ఠాణాలు.. ఒకప్పుడు సిటీలోని చాలా ఠాణాలు భూత్‌బంగ్లాలను తలపించేవి. బాధితులు పోలీసుల వద్దకు వచ్చినప్పుడు ఆహ్లాదకరమైన, సౌకర్యవంతమైన వాతావరణం ఉండాలనే ఉద్దేశంతో మహేందర్‌రెడ్డి అనేక మార్పులకు శ్రీకారం చుట్టారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రిసెప్షన్ సెంటర్ సహా పలు సౌకర్యాలతో మోడల్ పోలీసుస్టేషన్లు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఆధునికీకరణకు అనువుగా లేని వాటిని కూల్చి కొత్తవి నిర్మించారు. ప్రస్తుతం కమిషనరేట్‌లో పనులు జరుగుతున్న 11 ఠాణాల మినహా మిగిలినవన్నీ ఆధునిక హంగులు సమకూర్చుకున్నవే. నేరగాళ్ల ‘ఆడిటింగ్’.. నగర పోలీసు విభాగం తీసుకున్న మరో కీలక నిర్ణయం నేరగాళ్ల ‘ఆడిటింగ్’. నేరాలు నిరోధించడంతో పాటు వారిపై నిఘా ఉంచే చర్యల్లో భాగంగా ఠాణాలో ఉండే కానిస్టేబుల్ నుంచి ఇన్స్పెక్టర్ వరకు ప్రతి అధికారీ పోలీసు రికార్డుల్లో ఉన్న స్థానిక నేరగాళ్ల ఇళ్లకు వెళ్లారు. దీంతో వారి చిరునామాలతో సహా మారిన వివరాలు అప్డేట్ అయ్యాయి. వీటిని జియో ట్యాగింగ్ చేయడం ద్వారా గస్తీ నిర్వహించే రక్షక్, బ్లూకోల్ట్ సిబ్బందితో పాటు ప్రతి అధికారీ విధిగా తమ పరిధిలో నివసించే ఎంఓ క్రిమినల్స్ ఇళ్లకు వెళ్లి తనిఖీ చేసేలా ఏర్పాటు చేశారు. ఆధారాలు ‘పదిలం’.. నేరం చేసిన నిందితుడిని పట్టుకోవడంలోనే కాదు... న్యాయస్థానంలో దోషిగా నిరూపించడంలోనూ క్లూస్ టీమ్స్ సేకరించే ఆధారాలదే కీలకపాత్ర. ఈ నేపథ్యంలోనే నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో క్లూస్‌టీమ్స్‌ను కొత్వాల్ మహేందర్‌రెడ్డి పరిపుష్టం చేశారు. ఒకప్పుడు ఒకే ఒక్క టీమ్ ఉండగా.. దేశంలోని మరే ఇతర నగరంలోనూ అందుబాటులో లేని విధంగా సబ్–డివిజన్ స్థాయిలో మొత్తం 17 బృందాలు ఏర్పాటు చేశారు. లక్ష దాటిన ‘నిఘా నేత్రాలు’.. మహేందర్‌రెడ్డి నగర పోలీసు కమిషనర్‌గా బాధ్యతలు తీసుకున్న తొలిరోజు నుంచీ సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి పెట్టారు. దీంతో మూడున్నరేళ్లలో నగరంలోని సీసీ కెమెరాల సంఖ్య 1.45 లక్షలకు చేరింది. వీటి ఏర్పాటులో ప్రజలకూ భాగస్వామ్యం కల్పిస్తూ ‘నేను సైతం’ అనే ప్రత్యేక ప్రాజెక్టు చేపట్టారు. సిటీలో నేరాలు తగ్గడానికి, నిందితులను పట్టించడంలో ఇవి కీలక భూమిక పోషిస్తున్నాయి. బిగిసిన ‘పిడి’కిలి.. గడిచిన మూడున్నరేళ్లలో నగరంలో నేరాలు 30 శాతం వరకు తగ్గాయి. ఒకప్పుడు గడగడలాడించిన చైన్‌స్నాచర్లు తోక ముడవడంతో ఈ కేసుల్లో 90 శాతం తగ్గుదల నమోదైంది. దీనికి సీసీ కెమెరాల ఏర్పాటు ఓ కారణమైతే.. పీడీ యాక్ట్ ప్రయోగం మరో కీలకాంశం. మహేందర్‌రెడ్డి హయాంలో దీన్ని 621 మందిపై ప్రయోగించారు. ‘షీ’కి ప్రత్యేక ‘భరోసా’.. ఈవ్ టీజర్ల పీచమణచడంతో పాటు అతివలకు ఎదురవుతున్న అన్ని రకాల ఇబ్బందులను పరిష్కరించడానికి సిటీలో ‘షీ–టీమ్స్’ను ఏర్పాటు చేయించారు. బస్సుల్లో మహిళలు, పురుషులు కూర్చునే/నిల్చునే ప్రాంతాలకు మధ్య మెష్ ఏర్పాటు ‘షీ–టీమ్స్’ సిఫార్సుతోనే అమలైంది. వివిధ రకాల కేసుల్లో బాధిత మహిళలకు సహాయ సహకారాలు అందాలనే ఉద్దేశంతో ‘భరోసా’ సెంటర్ ఏర్పాటు చేశారు. ఈ రెండూ ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయి. ప్రత్యేకంగా ‘శవాల’ బండి.. నగరంలో ఎక్కడైనా మృతదేహం కనిపిస్తే దాన్ని తరలించడం పోలీసులకు పెద్ద సమస్యగా ఉండేది. స్థానికంగా ఉంటే ఆటోట్రాలీ, వ్యాన్ డ్రైవర్లను బతిమాలో, భయపెట్టో తమ పని కానివ్వాల్సి వచ్చేది. దీన్ని గమనించిన కొత్వాల్ ఇలాంటి సందర్భాల్లో ఉపయోగపడటానికి ప్రత్యేక వాహనాన్ని డిజైన్ చేయించారు. ‘ఫొరెన్సిక్ కారŠప్స్ వెహికిల్’ పేరుతో అందుబాటులోకి తీసుకువచ్చారు. పోలీసులకూ ప్రోగ్రెస్ రిపోర్ట్.. నగర పోలీసులకూ ఓ ‘ప్రోగ్రెస్ రిపోర్ట్’ను ప్రవేశపెట్టారు మహేందర్‌రెడ్డి. దీన్ని అధికారులు తమ పరిధిలో నివసించే ప్రజలకు ‘అందించేలా’ ఏర్పాటు చేశారు. ఏడాదికోసారి ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి వార్షిక పనితీరు నివేదికను పోలీసులు ప్రజల ముందు ఉంచుతున్నారు. ఆయా సమావేశాలు జరిగినన్నాళ్లూ వాటి నిర్వహణ, ప్రగతిని ప్రతి రోజూ కొత్వాల్ స్వయంగా పర్యవేక్షించారు. ఉద్యోగాలకు ‘వారధి’గా వాహనం.. ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాలను అవలంబిస్తున్న నగర పోలీసులు ప్రజలకు మరింత చేరువకావడంతో పాటు వారికి ఉపయుక్తంగా ఉండేందుకు ఏర్పాటు చేసిందే ‘జాబ్ కనెక్ట్’ వాహనం. ఓ పక్క కమ్యూనిటీ పోలీసింగ్ విధానాలు ప్రచారం చేయడంతో పాటు నిరుద్యోగుల నుంచి వివరాలు సేకరించి, వారికి ఉద్యోగాలు చూపించడానికి దీన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ వాహనం ప్రతి రోజూ కొన్ని పోలీసుస్టేషన్ల పరిధిలో సంచరిస్తూ ఉంటుంది. దర్యాప్తు దిశానిర్దేశానికి ఐఎస్సీ.. ప్రస్తుత పోలీసు అధికారుల్లో అన్ని స్థాయిల వారికీ అన్ని రకాల నేరాల దర్యాప్తుపై పట్టు ఉండట్లేదు. ఇలాంటి పోలీసు అధికారులకు కేసుల దర్యాప్తులో సహకరించడానికి అవసరమైన సహాయ సహకారాలు, సలహాలు సూచనలు అందించడానికి ఇన్వెస్టిగేషన్ సపోర్ట్ సెంటర్ (ఐఎస్సీ) ఏర్పాటు చేశారు. ఇంకా మరెన్నో.. బంజారాహిల్స్‌లో నిర్మాణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్‌తో పాటు కమిషనరేట్‌లో ఆధునిక కంట్రోల్ రూమ్ నిర్మాణాలు. నగర వ్యాప్తంగా అన్ని పోలీసుస్టేషన్లు, డివిజన్లు, జోన్లను అనుసంధానిస్తూ వీడియో కాన్ఫరెన్సింగ్ వ్యవస్థ. హాక్–ఐ, లాస్ట్ రిపోర్ట్, హైదరాబాద్ కాప్, హైదరాబాద్ ట్రాఫిక్ లైవ్, వెరిఫై, 360 డిగ్రీస్ వ్యూ వంటి యాప్స్. ట్రాఫిక్ విభాగంలో క్యాష్‌లెస్ ఎన్ఫోర్స్మెంట్, చెస్ట్ మౌంటెడ్ కెమెరాల పరిచయం. సీసీ కెమెరాల ఏర్పాటు నేపథ్యంలో సిటీలోని అనేక జంక్షన్లను కాప్లెస్గా మార్పు. సైబర్, క్రైమ్ ల్యాబ్స్, ఐటీ సెల్, వీడియో ఎన్‌హ్యాన్స్‌మెంట్ ల్యాబ్ ఏర్పాటు. చిన్న చిన్న నేరాలు, ఉల్లంఘనలకు చెక్ చెప్పడానికి ఈ–పెట్టీ కేస్ విధానం. అధికారులు, సిబ్బందిని ప్రోత్సహించడానికి నెలవారీ కీ పెర్ఫామెన్స్ ఇండికేటర్ (కేపీఐ) అవార్డులు. సీసీ కెమెరా వ్యవస్థలో ఫేషియల్ రికగ్నైజేషన్ వంటి ఆధునిక పరిజ్ఞానంతో కూడిన ఎనలటిక్స్ ఏర్పాటు. గస్తీ వాహనాల జియో ట్యాగింగ్, అన్ని స్థాయిల సిబ్బందికి ట్యాబ్స్ జారీ. ప్రతి పోలీసుస్టేషన్‌లోనూ జిమ్‌తో పాటు ఠాణాలపై జాతీయ జెండాల ఏర్పాటు. కల్తీలపై ఉక్కుపాదం మోపడానికిఫోరెన్సిక్ అడాల్ట్రేషన్ క్లూస్ టీమ్‌కు రూపమిస్తున్నారు. పోలీసుల పని తీరు, ప్రజాభిప్రాయం తెలుసుకోవడానికి ప్రత్యేకంగా కాల్ సెంటర్ ఏర్పాటు. -
పోలీసు శాఖలో ఖాళీలు త్వరలో భర్తీ: కేసీఆర్
హైదరాబాద్: రాష్ట్రంలో పోలీసులు అద్భుతంగా పనిచేస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. పోలీసు శాఖపై శుక్రవారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో నేరాలు తగ్గాయని ఈ సందర్భంగా తెలిపారు. క్రైమ్ రేటు తగ్గడంతో రాష్ట్రానికి 2500 పరిశ్రమలు వచ్చాయన్నారు. పోలీసు శాఖలో ఖాళీలను త్వరలో భర్తీ చేస్తామని చెప్పారు. ఖాళీగా ఉన్న కానిస్టేబుళ్ల పోస్టుల భర్తీని త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. జస్టిస్ ఎన్వీ రమణకు పరామర్శ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నివాసానికి వెళ్లి ఆయనను కేసీఆర్ పరామర్శించారు. ఎన్వీ రమణ మాతృమూర్తి నూతలపాటి సరోజినీదేవి బుధవారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.