సాక్షి, హైదరాబాద్: షాబాద్ సీఐ బి. శంకరయ్య ఇంట్లో సోదాలు చేసిన ఏసీపీ అధికారాలు విస్తుపోయే విషయాలను బయటపెట్టారు. శంకరయ్య బినామీల పేరుతో భారీగా ఆస్తుల కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు. భూ తగాదా కేసులో రూ.లక్షా 20వేలు లంచం తీసుకుంటూ సీఐ శంకరయ్య పట్టుబడిన విషయం తెలిసిందే. రెవెన్యూ విలువ లెక్కల ప్రకారం రూ.4.58 కోట్ల ఆస్తులుగా గుర్తించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఇక బహిరంగ మార్కెట్లో రూ.10కోట్లకు పైనే ఆస్తుల విలువ ఉంటుందని అంచనా వేస్తున్నారు.
హైదరాబాద్‌లో రూ.కోటి ఐదు లక్షలు విలువ చేసే రెండు నివాసాలు ఉన్నట్లు తెలిపారు. రూ.2 కోట్ల 25 లక్షల విలువ చేసే 11 ప్లాట్‌ల పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. దాంతో పాటు నిజామాబాద్, చేవెళ్ల, మిర్యాలగూడలో 41 ఎకరాల వ్యవసాయ భూమి, కారు ఉన్నాయని తెలిపారు. రూ. 22 లక్షలు విలువ చేసే బంగారం, నగలు, రూ.17 లక్షలు నగదు స్వాధీనం చేసుకున్నట్లు అధికారలు పేర్కొన్నారు. అనంతరం శంకరయ్యకు ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి, ఏసీబీ కోర్టులో ప్రవేశ పెట్టినట్లు అధికారులు చెప్పారు. శంకరయ్య, ఏఎస్ఐ రాజేందర్‌లకు రిమాండ్ విధిస్తూ, చంచల్‌గూడ జైలుకు తరలించినట్లు అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment