సాక్షి, హైదరాబాద్: నిధుల దుర్వినియోగం వ్యవహారంలో.. సిటీ చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు అధికారిణి అనిశెట్టి శ్రీదేవిని ఏసీబీ అరెస్టు చేసింది. కరీంనగర్ కోర్టులో ఆమెను హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.
ఆదిలాబాద్ జిల్లా జైనూర్‌లో గతంలో సీడీపీవోగా పనిచేసిన సమయంలో శ్రీదేవి నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు గుర్తించామన్నారు. 322 అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించి దాదాపు రూ.65.78 లక్షల నగదును దారి మళ్లించినట్లు గుర్తించారు. ఆరోగ్యలక్ష్మి పాల సరఫరా ఖర్చులపై నకిలీ ఇండెంట్లను సృష్టించి నగదు కాజేసినట్లు దర్యాప్తులో తేల్చారు.
Comments
Please login to add a commentAdd a comment