ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: మహిళల భద్రత కోసం పోలీసులు మరో వినూత్న ఆవిష్కరణకు రూపకల్పన చేశారు. క్యాబ్‌లలో ప్రయాణించే మహిళలు, పౌరుల భద్రతకు ఆ సర్వీసులను పోలీసు ప్యాట్రోల్ వాహనాల తో అనుసంధానించారు. దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో ఈ వ్యవస్థను ప్రవేశ పెట్టినట్లు సోమవారం జరిగిన మీడియా భేటీలో డీజీపీ మహేందర్‌రెడ్డి వెల్లడించారు. రాష్ట్రాన్ని నేర రహిత సమాజంగా మార్చే క్రమంలో ఈ ప్రక్రియ చేపట్టినట్లు చెప్పారు. నగరం విస్తరిస్తున్న దరిమిలా మ హిళా ఉద్యోగులు అన్ని వేళల్లోనూ విధులు నిర్వహిస్తున్నారని, వారికి భద్రత కలి్పంచడం మనందరి బాధ్యత అని అన్నారు.
ఎలా పని చేస్తుందంటే..?
ఆపద ఎదురైనా, ప్రమాదాల్లో చిక్కుకున్నా.. ఓలా, టోరా, రైడో, ఎం–వాలెట్, హాక్ ఐ యాప్‌ల్లో ఉన్న ఎస్‌ఓఎస్ (ఎమర్జెన్సీ) బటన్‌ను నొక్కితే చాలు సమీపంలోని ప్యాట్రోల్ వాహనాలు, బ్లూకోల్ట్స్, స్థానిక ఏసీపీ, డీసీపీ, స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ, మహిళ బంధువులకు సమాచారం అందుతుంది. ఫలితంగా సదరు క్యాబ్ డ్రైవర్ వివరాలు ఫోన్ నంబర్, బయోడేటా మొత్తం పోలీసులకు వచ్చేస్తుంది. సమీపంలో ఉన్న గస్తీ వాహనాలు, పోలీసులు జీపీఎస్ ఆధారంగా ఘటనా స్థలానికి చేరుకుంటారు. ఇందుకోసం పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్‌లో ఓ ప్రత్యేకమైన బృందం 24 గంటలు పనిచేస్తుంది.
ఈ ప్రక్రియంతా ముగిసిన తరువాత ఎవరు ఎలా పనిచేసారో తెలుసుకునేందుకు థర్డ్ పార్టీ సర్వే ప్రతినిధులు బాధితులకు ఫోన్ చేస్తారు. ప్రస్తుతం ఈ సదుపాయం నగరానికే పరిమితమైనా, క్రమంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తామని డీజీపీ మహేందర్‌రెడ్డి తెలియజేశారు. మిగిలిన క్యాబ్ సంస్థలూ ముందుకువచ్చి ఈ విధానంలో చేరాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మహిళలు, పౌరుల్లో హాక్ ఐ మీద అవగాహన పెరుగుతోందన్నారు. ఇప్పటివరకూ 22 లక్షల మంది హాక్ ఐని డౌన్‌లోడ్ చేసుకోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment