మంచి చదువు కొందరికేనా? | special guest story on best education for poor people | Sakshi
Sakshi News home page

మంచి చదువు కొందరికేనా?

Published Fri, Nov 11 2016 12:21 AM | Last Updated on Mon, Sep 4 2017 7:44 PM

మంచి చదువు కొందరికేనా?

మంచి చదువు కొందరికేనా?

మద్యం అమ్మి లక్షల కోట్లు సంపాదిస్తున్న ప్రభుత్వాలు, భక్తుల నుంచి వేల కోట్లు ముడుపులుగా అందుకుంటున్న ఆలయ ధర్మకర్తలు కేంద్రీయ స్కూళ్ల స్థారుు చదువులు అందరికీ అందించడానికి ఎందుకు ముందుకు రావడం లేదు?

అందరికీ చదువు అందని సరుకుగా మారింది. కొందరు సంపన్నుల పిల్లలకు విలాస వంతమైన భవనాల్లో ఏసీ తర గతి గదుల్లో చదువు. ఇక సివిల్ సర్వీసు పరీక్షలు పాసై ఉన్నతా ధికారులైన వారి పిల్లలకు కేంద్రీయ విద్యా సంఘటన్ (కేవీఎస్) ద్వారా ప్రభుత్వమే అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యా సేవలను అందిస్తుంది. పైస్థారుు, మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి వారు ప్రైవేటు బడుల భారీ వసూళ్లతో సత మతమవుతూ ఉంటారు. అటు ప్రైవేటు చదువులను అందుకోలేని, సర్కారీ చదువులు చదువుకోలేని సందిగ్ధం పేదలది.

ప్రైవేటు స్కూళ్లు 25 శాతం సీట్లను వెనుకబడిన వారికివ్వాలని విద్యా హక్కు చట్టం నిర్దేశించింది. అయితే దాన్ని అరకొరగానే అమలు చేస్తున్నారు. ఒక వంక ప్రభుత్వాలు అందరికీ ఉచిత నిర్బంధ విద్యా హక్కుకు హామీని ఇస్తూ రాజ్యాంగాన్ని మార్చి, చట్టాన్ని తెచ్చాయి అమలు చేయాలని ప్రయత్నిస్తున్నాయి. మరో వంక కేవీఎస్ స్థారుు నాణ్యమైన విద్యను సర్కారీ ఉన్న తాధికారుల పిల్లలకే పరిమితం చేసి, మిగతా వారిని చదువుల దుకాణాల మేతకు వదిలేయడం ఎంత వరకు న్యాయం? రాజ్యాంగంలోని అధికరణం 14 అందరికీ సమానతను నిర్దేశిస్తున్నది.

మతం, కులం, జాతి ధనం తేడా లేకుండా అందరికీ సమాన, సమున్నత ప్రమా ణాల చదువు ఎందుకు చెప్పడం లేదు? మద్యం అమ్మి లక్షల కోట్లు సంపాదిస్తున్న ప్రభుత్వాలు, భక్తిని పెంచి భక్తుల నుంచి వేల కోట్ల రూపాయల ముడుపులు అందుకుంటున్న ఆలయ ధర్మకర్తలు కేవీఎస్ స్థారుు చదువులు ఇవ్వడానికి ఎందుకు ముందుకు రావడం లేదు? ఎన్నికలు రాగానే అనేక ఉచిత పథకాలు ప్రక టించే పార్టీలు అందరికీ ఉన్నత ప్రమాణాల విద్యను అందిస్తామని ఎందుకు ప్రమాణం చేయడం లేదు?

 ప్రభుత్వ అధికారుల పిల్లలందరినీ ప్రభుత్వ పాఠ శాలలకే పంపాలని ఆదేశించాలని అలహాబాద్ హైకోర్టు ఆ మధ్య సూచించింది. వినడానికి ఈ ఉత్తర్వు బాగానే ఉంది. కాని ప్రభుత్వమే కేవీఎస్ బడులను వారి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినప్పుడు ఈ తీర్పు అమలు కావడం సాధ్యం కాదు. దానికన్నా  కేవీఎస్ స్థారుు చదు వులు అందరికీ అందించాలనడం న్యాయం కదా! మంచి జీతాలు ఇచ్చి, అర్హులైన ఉపాధ్యాయులను  పార దర్శకంగా, న్యాయంగా ఎంపిక చేసి, మంచి భవనాలు నిర్మించి, అందులో శుభ్రమైన శౌచాలయాలను ఏర్పాటు చేసి, పుస్తకాలు తదితర అవసరాలు తీర్చి చదువులు చెప్పడానికి ఎందుకు వెనుకాడుతున్నారో అర్థం కాదు.

 ప్రభుత్వాలు ఈ పనులు చేయకపోవడం వల్ల ప్రైవేటు కార్పొరేటు బడి దుకాణాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారుు. ప్రైవేటు చదువును ఒక విలాసవంత మైన సరుకుగా మార్చేశారు. భారీ ిఫీజులను వసూలు చేసినా అందుకు తగ్గట్టు ఉన్నత ప్రమాణాలు గల  విద్యను అందిస్తున్నారా? అని అడగడానికి వీల్లేదు. సమాచారం అడిగితే మేం ఆర్టీఐ కిందికి రాబోమం టారు. ప్రభుత్వ విద్యాశాఖ అడిగితే చెప్పకుండా దాటే స్తారు లేదా రిట్లే స్తారు. వీటిని అదుపు చేసేదెవరు? వీరి విరాళాల వసూళ్ల ఆగడాలకు కళ్లెం వేసేదెవరు?

 ఫీజు చెల్లించలేదని ఢిల్లీలో ఒక ప్రైవేటు స్కూలు వారు పిల్లలను లైబ్రరీలో బంధించి, ఒకరోజు కదల నివ్వలేదని వార్తలు వచ్చారుు. తల్లిదండ్రులు తమ డిమాండ్లు నెరవేరే దాకా ఫీజు చెల్లించమని హెచ్చ రించారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో కూడిన ఒక కమిటీ ఉండాలనీ, విపరీత ఫీజులు వసూలు చేయ రాదని, తీసుకున్న అధిక మొత్తాలు తిరిగి ఇవ్వాలనీ వారు డిమాండ్ చేస్తున్నారు.

 ఢిల్లీ ప్రభుత్వం ఈ ప్రైవేట్ విద్యాలయాల ఆగ డాలను తట్టుకోవడానికి మూడు చట్టాలను తెచ్చింది. కానీ సంకుచిత రాజకీయాల వల్ల అవి చట్టాలుగా మారి, అమలయ్యే అవకాశం లేదు. ఢిల్లీ పాఠశాల విద్యా సవ రణ బిల్లు... ప్రవేశాలకు ఇంటర్వ్యూలను, భారీ విరాళా లను నిషేధించింది. ఢిల్లీ పాఠశాలల లెక్కల పరిశీలన, అధిక ఫీజుల వాపస్ బిల్లు తప్పు చేసిన బడులకు అంతకు పదింతల మొత్తాన్ని జరిమానాగా విధిస్తుంది. మూడు నుంచి 5 ఏళ్ల జైలు శిక్షలను కూడా నిర్దేశించింది.  విద్యా హక్కు చట్టాన్ని సవరించి విద్యార్థులు 9వ తరగతి వరకు ఏటా ఉత్తీర్ణతను సాధించడాన్ని తప్పనిసరి చేసేలా పథకాలు రూపొందించారు.

 చునౌతీ 2018 అంటే 2018 సవాల్ పేరుతో ఒక సంస్కరణను ప్రతిపాదించారు. కొన్ని భౌగోళిక మండ లాలకు పరిమితమైన టైంటేబుల్ రూపొందించాలని, కొందరు అంకితభావంతో పనిచేసే ఉపాధ్యాయులను ఎంచుకుని తరగతి గదుల్లో వెనుకబడిన వారి నేర్చుకునే శక్తిని పెంచాలని ప్రయత్నిస్తున్నారు. 6, 7, 8 తరగతుల పిల్లలకు నిశిత అనే పథకాన్ని, 9వ తరగతి పిల్లలకు విశ్వాస అనే పథకాన్ని రూపొందించారు. కేంద్రం, ఇతర రాష్ట్రాలు ఆలోచించవలసిన విషయం ఇది.

వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్
ఈ-మెయిల్: professorsridhar@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement