Central schools
-
ఈఎంఆర్‌లకు మహర్దశ
సాక్షి, హైదరాబాద్: ఏకలవ్య మోడల్ స్కూళ్ల (ఈఎంఆర్)కు మహర్దశ పట్టనుంది. ప్రస్తుతం ఈ స్కూళ్లను కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్నప్పటికీ.. త్వరలో పూర్తిగా కేంద్రం అధీనంలో పనిచేయనున్నాయి. ఇందుకు జాతీయ స్థాయిలో ప్రత్యేకంగా సొసైటీ ఏర్పాటు చేయాలని కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. కేంద్రీయ విద్యాలయ సంఘటన్, నవోదయ విద్యాలయ సొసైటీ తరహాలో ఈఎంఆర్ సొసైటీని అభివృద్ధి చేసేలా కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ క్రమంలో రాష్ట్రాల వారీగా ఉన్న పాఠశాలలు, వాటి అవసరాలు, ఖాళీలు, పోస్టుల భర్తీ తదితర పూర్తి సమాచారాన్ని పంపించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాసింది. వీలైనంత త్వరగా వివరాలు పంపిస్తే సొసైటీ ఏర్పాటు ప్రక్రియ వేగవంతమవుతుందని తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 6 ఈఎంఆర్ పాఠశాలలున్నాయి. ఈ ఏడాది జనవరిలో జరిగిన ఈఎంఆర్ నేషనల్ స్పోర్ట్స్ మీట్‌కు హైదరాబాద్ వేదికైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వేడుకల ముగింపు ఉత్సవాల్లో పాల్గొన్న కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి జూవల్ ఓరమ్ తెలంగాణకు కొత్తగా ఐదు స్కూళ్లను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. 2019–20 విద్యా సంవత్సరం నుంచి వీటిని అందుబాటులోకి తేవాలని, ఆలోపు అనుమతులన్నీ జారీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో ఇప్పటికే ప్రాథమిక అనుమతులు వచ్చినట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. సీబీఎస్ఈ సిలబస్.. దేశవ్యాప్తంగా ఉన్న ఈఎంఆర్ పాఠశాలల్లో చాలావరకు స్థానిక భాషకు అనుగుణంగా బోధన సాగుతోంది. వీటిని జాతీయ స్థాయి సొసైటీకి అనుసంధానిస్తే.. అన్ని పాఠశాలల్లో ఒకే తరహా బోధన, అభ్యాసన కార్యక్రమాలు నిర్వహించాలి. దీంతో అన్నింట్లో ఇంగ్లిష్ మీడియం బోధన నిర్వహించనున్నారు. అదేవిధంగా సీబీఎస్ఈ సిలబస్‌ను అమలు చేస్తారు. కేవీ, నవోదయ పాఠశాలలకు ధీటుగా వీటిని బలోపేతం చేస్తారు. దీనికి అవసరమైన నిధులన్నీ కేంద్రమే భరిస్తుంది. అదేవిధంగా ఈ పాఠశాలల్లో ఉద్యోగ ఖాళీల భర్తీ, జీతభత్యాల చెల్లింపులు తదితర ప్రక్రియంతా కూడా సొసైటీ అధీనంలో జరుగుతుంది. రాష్ట్రానికి కొత్తగా మంజూరైన 5 ఈఎంఆర్‌లకు గిరిజన మంత్రిత్వ శాఖ నిధులు ఇవ్వనుంది. ఇందుకు అవసరమైన ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం సమర్పించాల్సి ఉంటుంది. ఒక్కో ఈఎంఆర్‌కు గరిష్టంగా రూ.25 కోట్లు చొప్పున ఐదింటికి రూ.125 కోట్ల వరకు మంజూరు చేసే అవకాశముందని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. కొత్తగా మంజూరైన ఈఎంఆర్‌లకు నిధులు విడుదలైన వెంటనే చర్యలు చేపడతారు. -
‘విద్య’లో ముస్లింల వెనుకబాటు
ఓ కమిటీ అధ్యయనంలో వెల్లడి న్యూఢిల్లీ: విద్యపరంగా మైనార్టీలలో ముస్లింలు అత్యంత వెనుకబడి ఉన్నారని కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా నడిచే ఓ సంస్థ ఏర్పాటు చేసిన ప్యానెల్ వెల్లడించింది. కేంద్ర పాఠశాలలు, కమ్యూనిటీ కాలేజీలు, జాతీయస్థాయి విద్యాసంస్థలు మూడంచల్లో విద్యా సంస్థలను ఏర్పాటు చేయడం ద్వారా ముస్లింలలో సాధికారత వస్తుందని సూచించింది. వారికోసం 211 పాఠశాలలు, 25 కమ్యూనిటీ కాలేజీలు, 5 జాతీయ స్థాయి విద్యా సంస్థలను నెలకొల్పాలని పేర్కొంది. పాఠశాలలను కేంద్రీయ విద్యాలయాలు లేదా నవోదయ విద్యాలయాల మాదిరిగా నడపాలని సూచించింది. దీనిపై కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రి అబ్బాస్ నఖ్వీని ప్రశ్నించగా.. విద్య పరంగా మైనార్టీల సాధికారతపై కేంద్ర విధానాల్లో భాగంగా ఈ నివేదిక కూడా ఒకటని చెప్పారు. ‘ఈ నివేదికను పరిశీలిస్తున్నాం. నివేదికలోని అంశాలు ఆచరణీయమైనవని అనిపిస్తే వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి తీసుకొస్తాం’అని వివరించారు. మైనార్టీల స్థితిగతులపై అధ్యయనం చేసేందుకు కేంద్ర నిధుల ద్వారా నడిచే మౌలానా ఆజాద్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ గతేడాది డిసెంబర్ 29న 11 మంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి కేంద్ర మాజీ కార్యదర్శి అఫ్జల్ అమానుల్లా కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ కమిటీ ఇటీవల తన నివేదికను విడుదల చేసింది. -
నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయండి
► కొత్త జిల్లాల కోసం ప్రకాశ్ జవదేకర్‌ను కోరిన కడియం ► కేజీబీవీల్లో 12వ తరగతి వరకు విద్యనందించండి ► సర్వశిక్ష అభియాన్ నిధులు విడుదల చేయండి ► జిల్లాకు ఒకటి చొప్పున డైట్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన జిల్లాల్లో జిల్లాకొకటి చొప్పున నవోదయ, కేంద్రీయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌కు ఉప ముఖ్య మంత్రి మంత్రి కడియం శ్రీహరి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో మరిన్ని కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలలను ఏర్పాటు చేయాలని, వాటిల్లో 12వ తరగతి వరకు విద్యను అందించాలని కోరారు. మంగళవారం టీఆర్ఎస్ ఎంపీలు జితేందర్‌రెడ్డి, కొండా విశ్వేశ్వరరెడ్డి, సీతారాం నాయక్, జి.నగేశ్, బీబీ పాటిల్, కొత్త ప్రభాకర్లతో కలసి కడియం శ్రీహరి ఢిల్లీలో కేంద్ర మంత్రితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సర్వశిక్షా అభియాన్ నుంచి రాష్ట్రానికి రావా ల్సిన నిధులు, కస్తూర్బా పాఠశాలల ఏర్పాటుపై చర్చించారు. రాష్ట్రంలో మండ లాల సంఖ్య కూడా పెరగడంతో విద్యాప రంగా వెనుకబడిన 110 మండలాల్లో కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలు ఏర్పాటు చేయాలని జవదేకర్‌ను కోరారు. అనంతరం ఎంపీలతో కలసి కడియం మీడియాతో మాట్లాడారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచే కొత్త కస్తూర్బా గాంధీ పాఠశాలలను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రిని కోరినట్టు తెలిపారు. కస్తూర్బా పాఠశాలల్లో 8వ తరగతి వరకే కేంద్ర ప్రభుత్వం ఖర్చు భరిస్తోందని.. 9, 10వ తరగతుల విద్యార్థుల ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోందని తెలిపారు. ఈ పాఠశాలలు మంచి ఫలితాలను సాధిస్తుండడంతో కేంద్ర సాయాన్ని 12వ తరగతి వరకు అందించాలని కోరామన్నారు. బాలికల విద్యకు ఇది దోహదపడుతుందని, బేటీ బచావో బేటీ పఢావోకు తోడ్పడుతుందని వివరించామని కడియం తెలిపారు. ప్రతి జిల్లాకు ఒకటి చొప్పున టీచర్ ట్రైనింగ్ కేంద్రా (డైట్)లను మంజూరు చేయాలని కోరామన్నారు. అధికారులతో భేటీ... అనంతరం కేంద్ర మానవ వనరుల శాఖ కార్యదర్శితో కడియం, రాష్ట్ర విద్యాశాఖ ఉన్న తాధికారులు భేటీ అయ్యారు. మాధ్యమిక శిక్షా అభియాన్, సర్వశిక్షా అభియాన్ల కింద రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించారు. దీనిపై స్పందించిన మానవవనరులశాఖ కార్యదర్శి తెలంగాణకు రూ.500 కోట్లు విడుదల చేసేలా అధికారులకు ఆదేశాలి చ్చారని కడియం తెలిపారు. నిధులు విడుదల చేయండి.. సర్వశిక్షా అభియన్ కింద 2016-17కుగాను కేంద్రం ఇప్పటి వరకు కేవలం రూ. 217 కోట్లే విడుదల చేసిందని చెప్పారు. కానీ టీచర్ల జీతాల చెల్లింపుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.915 కోట్లు చెల్లించాల్సి ఉందని.. కేంద్రం నిధుల విడుదలలో చేస్తున్న జాప్యం వల్ల టీచర్లకు జీతాలు అందని పరిస్థితి ఏర్పడుతుందని స్పష్టం చేశామని తెలిపారు. ఆయా అంశాలన్నింటిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని కడియం వెల్లడించారు. నవోదయ, కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుపై చర్యలు తీసుకుంటామని, సర్వశిక్షా అభియన్ నిధుల విడుదలపై సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. దేశంలో 20 విద్యాలయాలకు ప్రపంచ స్థాయి విద్యాలయాల గుర్తింపు ఇచ్చేందుకు కేంద్రం ప్రతిపాదించిన నేపథ్యంలో... హైదరాబాద్‌లోని ఐఎస్బీ, ట్రిపుల్ ఐటీ, హైదరాబాద్ యూనివర్సిటీలు దరఖాస్తు చేసుకోవాలని కేంద్ర మంత్రి సూచించారని ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. -
మంచి చదువు కొందరికేనా?
మద్యం అమ్మి లక్షల కోట్లు సంపాదిస్తున్న ప్రభుత్వాలు, భక్తుల నుంచి వేల కోట్లు ముడుపులుగా అందుకుంటున్న ఆలయ ధర్మకర్తలు కేంద్రీయ స్కూళ్ల స్థారుు చదువులు అందరికీ అందించడానికి ఎందుకు ముందుకు రావడం లేదు? అందరికీ చదువు అందని సరుకుగా మారింది. కొందరు సంపన్నుల పిల్లలకు విలాస వంతమైన భవనాల్లో ఏసీ తర గతి గదుల్లో చదువు. ఇక సివిల్ సర్వీసు పరీక్షలు పాసై ఉన్నతా ధికారులైన వారి పిల్లలకు కేంద్రీయ విద్యా సంఘటన్ (కేవీఎస్) ద్వారా ప్రభుత్వమే అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యా సేవలను అందిస్తుంది. పైస్థారుు, మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి వారు ప్రైవేటు బడుల భారీ వసూళ్లతో సత మతమవుతూ ఉంటారు. అటు ప్రైవేటు చదువులను అందుకోలేని, సర్కారీ చదువులు చదువుకోలేని సందిగ్ధం పేదలది. ప్రైవేటు స్కూళ్లు 25 శాతం సీట్లను వెనుకబడిన వారికివ్వాలని విద్యా హక్కు చట్టం నిర్దేశించింది. అయితే దాన్ని అరకొరగానే అమలు చేస్తున్నారు. ఒక వంక ప్రభుత్వాలు అందరికీ ఉచిత నిర్బంధ విద్యా హక్కుకు హామీని ఇస్తూ రాజ్యాంగాన్ని మార్చి, చట్టాన్ని తెచ్చాయి అమలు చేయాలని ప్రయత్నిస్తున్నాయి. మరో వంక కేవీఎస్ స్థారుు నాణ్యమైన విద్యను సర్కారీ ఉన్న తాధికారుల పిల్లలకే పరిమితం చేసి, మిగతా వారిని చదువుల దుకాణాల మేతకు వదిలేయడం ఎంత వరకు న్యాయం? రాజ్యాంగంలోని అధికరణం 14 అందరికీ సమానతను నిర్దేశిస్తున్నది. మతం, కులం, జాతి ధనం తేడా లేకుండా అందరికీ సమాన, సమున్నత ప్రమా ణాల చదువు ఎందుకు చెప్పడం లేదు? మద్యం అమ్మి లక్షల కోట్లు సంపాదిస్తున్న ప్రభుత్వాలు, భక్తిని పెంచి భక్తుల నుంచి వేల కోట్ల రూపాయల ముడుపులు అందుకుంటున్న ఆలయ ధర్మకర్తలు కేవీఎస్ స్థారుు చదువులు ఇవ్వడానికి ఎందుకు ముందుకు రావడం లేదు? ఎన్నికలు రాగానే అనేక ఉచిత పథకాలు ప్రక టించే పార్టీలు అందరికీ ఉన్నత ప్రమాణాల విద్యను అందిస్తామని ఎందుకు ప్రమాణం చేయడం లేదు? ప్రభుత్వ అధికారుల పిల్లలందరినీ ప్రభుత్వ పాఠ శాలలకే పంపాలని ఆదేశించాలని అలహాబాద్ హైకోర్టు ఆ మధ్య సూచించింది. వినడానికి ఈ ఉత్తర్వు బాగానే ఉంది. కాని ప్రభుత్వమే కేవీఎస్ బడులను వారి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినప్పుడు ఈ తీర్పు అమలు కావడం సాధ్యం కాదు. దానికన్నా కేవీఎస్ స్థారుు చదు వులు అందరికీ అందించాలనడం న్యాయం కదా! మంచి జీతాలు ఇచ్చి, అర్హులైన ఉపాధ్యాయులను పార దర్శకంగా, న్యాయంగా ఎంపిక చేసి, మంచి భవనాలు నిర్మించి, అందులో శుభ్రమైన శౌచాలయాలను ఏర్పాటు చేసి, పుస్తకాలు తదితర అవసరాలు తీర్చి చదువులు చెప్పడానికి ఎందుకు వెనుకాడుతున్నారో అర్థం కాదు. ప్రభుత్వాలు ఈ పనులు చేయకపోవడం వల్ల ప్రైవేటు కార్పొరేటు బడి దుకాణాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారుు. ప్రైవేటు చదువును ఒక విలాసవంత మైన సరుకుగా మార్చేశారు. భారీ ిఫీజులను వసూలు చేసినా అందుకు తగ్గట్టు ఉన్నత ప్రమాణాలు గల విద్యను అందిస్తున్నారా? అని అడగడానికి వీల్లేదు. సమాచారం అడిగితే మేం ఆర్టీఐ కిందికి రాబోమం టారు. ప్రభుత్వ విద్యాశాఖ అడిగితే చెప్పకుండా దాటే స్తారు లేదా రిట్లే స్తారు. వీటిని అదుపు చేసేదెవరు? వీరి విరాళాల వసూళ్ల ఆగడాలకు కళ్లెం వేసేదెవరు? ఫీజు చెల్లించలేదని ఢిల్లీలో ఒక ప్రైవేటు స్కూలు వారు పిల్లలను లైబ్రరీలో బంధించి, ఒకరోజు కదల నివ్వలేదని వార్తలు వచ్చారుు. తల్లిదండ్రులు తమ డిమాండ్లు నెరవేరే దాకా ఫీజు చెల్లించమని హెచ్చ రించారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో కూడిన ఒక కమిటీ ఉండాలనీ, విపరీత ఫీజులు వసూలు చేయ రాదని, తీసుకున్న అధిక మొత్తాలు తిరిగి ఇవ్వాలనీ వారు డిమాండ్ చేస్తున్నారు. ఢిల్లీ ప్రభుత్వం ఈ ప్రైవేట్ విద్యాలయాల ఆగ డాలను తట్టుకోవడానికి మూడు చట్టాలను తెచ్చింది. కానీ సంకుచిత రాజకీయాల వల్ల అవి చట్టాలుగా మారి, అమలయ్యే అవకాశం లేదు. ఢిల్లీ పాఠశాల విద్యా సవ రణ బిల్లు... ప్రవేశాలకు ఇంటర్వ్యూలను, భారీ విరాళా లను నిషేధించింది. ఢిల్లీ పాఠశాలల లెక్కల పరిశీలన, అధిక ఫీజుల వాపస్ బిల్లు తప్పు చేసిన బడులకు అంతకు పదింతల మొత్తాన్ని జరిమానాగా విధిస్తుంది. మూడు నుంచి 5 ఏళ్ల జైలు శిక్షలను కూడా నిర్దేశించింది. విద్యా హక్కు చట్టాన్ని సవరించి విద్యార్థులు 9వ తరగతి వరకు ఏటా ఉత్తీర్ణతను సాధించడాన్ని తప్పనిసరి చేసేలా పథకాలు రూపొందించారు. చునౌతీ 2018 అంటే 2018 సవాల్ పేరుతో ఒక సంస్కరణను ప్రతిపాదించారు. కొన్ని భౌగోళిక మండ లాలకు పరిమితమైన టైంటేబుల్ రూపొందించాలని, కొందరు అంకితభావంతో పనిచేసే ఉపాధ్యాయులను ఎంచుకుని తరగతి గదుల్లో వెనుకబడిన వారి నేర్చుకునే శక్తిని పెంచాలని ప్రయత్నిస్తున్నారు. 6, 7, 8 తరగతుల పిల్లలకు నిశిత అనే పథకాన్ని, 9వ తరగతి పిల్లలకు విశ్వాస అనే పథకాన్ని రూపొందించారు. కేంద్రం, ఇతర రాష్ట్రాలు ఆలోచించవలసిన విషయం ఇది. వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ ఈ-మెయిల్: professorsridhar@gmail.com -
కేంద్రీయ విద్యాలయాల్లో బోధన డొల్ల
తెలంగాణలో 288, ఏపీలో 315 పోస్టులు ఖాళీ సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు బాగా డిమాండ్ ఉన్నప్పటికీ అందులో బోధన సిబ్బంది ఖాళీలు భారీ సంఖ్యలో ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. లోక్‌సభలో సోమవారం పలువురు సభ్యులు అడిగిన రాతపూర్వక ప్రశ్నకు కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ సమాధానం ఇచ్చారు. దీని ప్రకారం దేశవ్యాప్తంగా కేంద్రీయ విద్యాలయాల్లో 45,057 మంజూరైన పోస్టులు ఉండగా వాటిలో 10,644 పోస్టులు ఖాళీగా ఉండడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే 1,071 మంజూరైన పోస్టులు ఉండగా వీటిలో 315 ఖాళీ ఉన్నాయి. తెలంగాణలో 1,237 పోస్టులకుగాను 288 పోస్టులు ఖాళీ ఉండగా.. వీటిలో 5 ప్రిన్సిపల్ పోస్టులు, 13 పీజీటీ పోస్టులు, 119 టీజీటీ పోస్టులున్నాయి. -
కేంద్రీయ విద్యాలయాలకు పట్టని ఎండలు
♦ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను పాటించని యాజమాన్యాలు ♦ కొనసాగుతున్న తరగతులు.. ఎండలతో విద్యార్థులకు ఇబ్బందులు సాక్షి, హైదరాబాద్: ఒకవైపు ఎండలు మంట పుట్టిస్తున్నా రాష్ట్రంలోని కేంద్రీయ విద్యాలయాలు, కొన్ని సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) స్కూళ్లకు పట్టడం లేదు. రాష్ట్రంలో సీబీఎస్ఈ గుర్తింపుతో కొనసాగుతున్న పాఠశాలలు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను అమలు చేయడం లేదు. వేసవి ఎండల తీవ్రత, వడగాడ్పుల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 16 నుంచే అన్ని మేనేజ్మెంట్ల పాఠశాలలకు సెలవులు ప్రకటిం చింది. కానీ సీబీఎస్ఈ సిలబస్‌తో కొనసాగే కొన్ని ప్రైవేటు పాఠశాలలు, కేంద్రీయ విద్యాలయాలు ఈ ఆదేశాలను పట్టించుకోలేదు. కేంద్రీయ విద్యాలయాల సంస్థ (కేవీ) అధికారులు వేసవి తీవ్రత గురించి కేంద్రానికి తెలపలేదు. దీంతో స్కూళ్లను కొనసాగించాల్సి వస్తోందని కేవీ సిబ్బంది చెబుతున్నారు. దీంతో స్కూళ్లకు వెళ్లి వచ్చేందుకు విద్యార్థులు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. రాష్ట్రంలోని కేంద్రీయ విద్యాలయాలు, సీబీఎస్ఈ సిలబస్‌తో కొనసాగే ప్రైవేటు విద్యా సంస్థల్లో దాదాపు 40 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రస్తుతం ఎండలు మండుతున్నా వారంతా స్కూళ్లకు వెళ్లి రావాల్సి వస్తోంది. తమ అకడమిక్ కేలండర్ ప్రకారం మే 3 వరకు తరగతులను నిర్వహించాల్సి ఉందని, అందుకే కొనసాగిస్తున్నామని కేవీ అధికారులు చెబుతున్నారు. మరోవైపు హైదరాబాద్‌లోని కొన్ని ప్రైవేటు పాఠశాలలు పరీక్షల పేరుతో పాఠశాలలను కొనసాగిస్తున్నాయి. చివరకు పాఠశాల విద్యా డెరైక్టరేట్ పక్కనే ఉన్న హోంసైన్స్ స్కూల్లోనూ ఎల్కేజీ, యూకేజీ పరీక్షలను కొనసాగిస్తుండటం గమనార్హం. -
‘మీ తప్పుకు విద్యార్థులకెందుకు శిక్ష?’
న్యూఢిల్లీ: ‘ప్రస్తుత విద్యా సంవత్సరం మధ్యలో కేంద్రీయ విద్యాలయాల (కేవీలు) విద్యార్థులను ఎందుకు శిక్షిస్తారు? జర్మన్ భాష స్థానంలో సంస్కృతాన్ని ఈ విద్యా సంవత్సరంలో ప్రవేశ పెట్టకుండా ఉండే అంశాన్ని పరిశీలించండి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి మీ నిర్ణయాన్ని అమలు చేయండి’ అని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. కేంద్రం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కేవీ విద్యార్థుల తల్లిదండ్రులు దాఖలు చేసిన వ్యాజ్యంపై శుక్రవారం విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.