తెలంగాణలో 288, ఏపీలో 315 పోస్టులు ఖాళీ
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు బాగా డిమాండ్ ఉన్నప్పటికీ అందులో బోధన సిబ్బంది ఖాళీలు భారీ సంఖ్యలో ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. లోక్‌సభలో సోమవారం పలువురు సభ్యులు అడిగిన రాతపూర్వక ప్రశ్నకు కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ సమాధానం ఇచ్చారు. దీని ప్రకారం దేశవ్యాప్తంగా కేంద్రీయ విద్యాలయాల్లో 45,057 మంజూరైన పోస్టులు ఉండగా వాటిలో 10,644 పోస్టులు ఖాళీగా ఉండడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే 1,071 మంజూరైన పోస్టులు ఉండగా వీటిలో 315 ఖాళీ ఉన్నాయి. తెలంగాణలో 1,237 పోస్టులకుగాను 288 పోస్టులు ఖాళీ ఉండగా.. వీటిలో 5 ప్రిన్సిపల్ పోస్టులు, 13 పీజీటీ పోస్టులు, 119 టీజీటీ పోస్టులున్నాయి.
కేంద్రీయ విద్యాలయాల్లో బోధన డొల్ల
Published Tue, Apr 26 2016 2:58 AM | Last Updated on Sun, Sep 3 2017 10:43 PM
Advertisement