♦ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను పాటించని యాజమాన్యాలు
♦ కొనసాగుతున్న తరగతులు.. ఎండలతో విద్యార్థులకు ఇబ్బందులు
సాక్షి, హైదరాబాద్: ఒకవైపు ఎండలు మంట పుట్టిస్తున్నా రాష్ట్రంలోని కేంద్రీయ విద్యాలయాలు, కొన్ని సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్‌ఈ) స్కూళ్లకు పట్టడం లేదు. రాష్ట్రంలో సీబీఎస్‌ఈ గుర్తింపుతో కొనసాగుతున్న పాఠశాలలు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను అమలు చేయడం లేదు. వేసవి ఎండల తీవ్రత, వడగాడ్పుల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 16 నుంచే అన్ని మేనేజ్‌మెంట్ల పాఠశాలలకు సెలవులు ప్రకటిం చింది. కానీ సీబీఎస్‌ఈ సిలబస్‌తో కొనసాగే కొన్ని ప్రైవేటు పాఠశాలలు, కేంద్రీయ విద్యాలయాలు ఈ ఆదేశాలను పట్టించుకోలేదు. కేంద్రీయ విద్యాలయాల సంస్థ (కేవీ) అధికారులు వేసవి తీవ్రత గురించి కేంద్రానికి తెలపలేదు.
దీంతో స్కూళ్లను కొనసాగించాల్సి వస్తోందని కేవీ సిబ్బంది చెబుతున్నారు. దీంతో స్కూళ్లకు వెళ్లి వచ్చేందుకు విద్యార్థులు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. రాష్ట్రంలోని కేంద్రీయ విద్యాలయాలు, సీబీఎస్‌ఈ సిలబస్‌తో కొనసాగే ప్రైవేటు విద్యా సంస్థల్లో దాదాపు 40 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రస్తుతం ఎండలు మండుతున్నా వారంతా స్కూళ్లకు వెళ్లి రావాల్సి వస్తోంది. తమ అకడమిక్ కేలండర్ ప్రకారం మే 3 వరకు తరగతులను నిర్వహించాల్సి ఉందని, అందుకే కొనసాగిస్తున్నామని కేవీ అధికారులు చెబుతున్నారు. మరోవైపు హైదరాబాద్‌లోని కొన్ని ప్రైవేటు పాఠశాలలు పరీక్షల పేరుతో పాఠశాలలను కొనసాగిస్తున్నాయి. చివరకు పాఠశాల విద్యా డెరైక్టరేట్ పక్కనే ఉన్న హోంసైన్స్ స్కూల్లోనూ ఎల్‌కేజీ, యూకేజీ పరీక్షలను కొనసాగిస్తుండటం గమనార్హం.
కేంద్రీయ విద్యాలయాలకు పట్టని ఎండలు
Published Thu, Apr 21 2016 4:23 AM | Last Updated on Fri, Nov 9 2018 5:56 PM
Advertisement