విద్యలో సరికొత్త విప్లవం | A new revolution in education | Sakshi
Sakshi News home page

విద్యలో సరికొత్త విప్లవం

Published Fri, May 10 2024 5:55 AM | Last Updated on Sun, May 12 2024 11:48 AM

A new revolution in education

విద్యారంగానికి వెచ్చించిన నిధులు రూ.73వేల కోట్లు

బోధన, పాఠ్యాంశాల్లో సంస్కరణలు 

విద్యార్థుల చెంతకు డిజిటల్‌పాఠాలు సీబీఎస్‌ఈ బోధన 

మూడో తరగతి నుంచే టోఫెల్‌ శిక్షణ

ప్రపంచ వేదికలపై మెరిసేలా ఐబీ విద్య

» ఇదీ జగన్‌ బ్రాండ్‌ గవర్నెన్స్‌  
»    పేద విద్యార్థుల చెంతకు ఇంగ్లిష్‌ చదువులు 
»    ప్రస్తుత ప్రపంచంలో మన పిల్లలు రాణించేలా నైపుణ్య శిక్షణ 
»    అన్ని స్థాయిల్లోను యాక్టివిటీ బేస్డ్‌ పాఠ్యపుస్తకాల రూపకల్పన 
»    ఐటీ కోర్సుల్లో శిక్షణకు స్కిల్‌ ఎక్స్‌పర్ట్స్‌ నియామకం 
»    నిత్య జీవిత సమస్యలను అధిగమించేందుకు ‘సంకల్పం’ శిక్షణ 
»   డిజిటల్‌ విద్య కోసం 8వ తరగతి విద్యార్థులు, ఉపాధ్యాయులకు రూ.1,306 కోట్లతో 9,52,925 ఉచిత బైజూస్‌ కంటెంట్‌ ట్యాబ్‌ల పంపిణీ  
»   ఆరో తరగతి నుంచి ఆపైన రూ.838 కోట్లతో ప్రతి తరగతిలోను  62 వేల ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానెల్స్‌ (ఐఎఫ్‌పీ),ప్రాథమిక పాఠశాలల్లో 45 వేల స్మార్ట్‌ టీవీల ఏర్పాటు        

సోమవారం
హాట్‌ పొంగల్,  ఉడికించిన గుడ్డు లేదా వెజిటబుల్‌ పులావు, గుడ్డు కూర, చిక్కీ 
మంగళవారం
ఉదయం 10.20కు రాగిజావ, మధ్యాహ్నం 12.20కు చింతపండు పులిహోర, దొండకాయ పచ్చడి, ఉడికించిన గుడ్డు 
బుధవారం
వెజిటబుల్‌ అన్నం, ఆలూ కుర్మా, ఉడికించిన గుడ్డు, చిక్కీ 
గురువారం
ఉదయం రాగిజావ, మధ్యాహ్నం సాంబార్‌ బాత్‌/నిమ్మకాయ పులిహోర, టమాటా పచ్చడి, ఉడికించిన గుడ్డు 
శుక్రవారం
అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు, చిక్కీ 
శనివారం
ఉదయం రాగిజావ, మధ్యాహ్నం ఆకుకూరతో చేసిన అన్నం, పప్పుచారు, స్వీట్‌ పొంగల్‌
–సాక్షి, అమరావతి

మన ఇంగ్లిష్‌ విద్యపై ప్రశంసల జల్లు 
»  ‘‘ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బైలింగువల్‌ పాఠ్యపుస్తకాలను అందించడం గొప్ప పరిణామం– కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ కితాబు..’’ 
»  ‘‘ప్రాథమిక స్థాయి నుంచి నాణ్యమైన విద్య అందించడంలో పనితీరు అద్భుతంగా ఉంది: కేంద్ర పాఠశాల విద్య, అక్షరాస్యత శాఖ కార్యదర్శి సంజయ్‌ కుమార్‌’’ 
»  ‘‘మహారాష్ట్ర, ఒడిశా, అసోం, హరియాణా, ఛత్తీస్‌గఢ్, మిజోరాం, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, నాగాలాండ్, గుజరాత్, పుదుచ్చేరి, కేరళ, తెలంగాణ, అండమాన్‌ –నికోబార్, డామన్‌ డయ్యూ, దాద్రానగర్‌ హవేలీ విద్యాశాఖాధికారులు మన సంస్కరణలు అమలుకు సిద్ధం’’ 
»  ‘‘అమెరికాలోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై జరిగిన ఉన్నత స్థాయి సదస్సులో 140 దేశాల విద్యావేత్తలు మన విద్యా సంస్కరణలపై ప్రశంసలు’’

ప్రభుత్వ బడుల్లో చదువుతున్న విద్యార్థులకే గాక, ప్రైవేటు విద్యా సంస్థల్లో చదువుతున్న వారికీ అమ్మ ఒడి అమలు చేసి, 2022–23 విద్యా సంవత్సరం వరకు మొత్తం రూ.25,809.5 కోట్లు తల్లుల ఖాతాల్లో జమచేశారు.  
నాడు– నేడులో చేసిన ఖర్చు 
విడత        పాఠశాలలు    ఖర్చు (రూ.కోట్లలో) 
మొదటి         15,715          3,669 
రెండో            22,344            8,000  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement