Digital lessons
-
విద్యలో సరికొత్త విప్లవం
» ఇదీ జగన్ బ్రాండ్ గవర్నెన్స్ » పేద విద్యార్థుల చెంతకు ఇంగ్లిష్ చదువులు » ప్రస్తుత ప్రపంచంలో మన పిల్లలు రాణించేలా నైపుణ్య శిక్షణ » అన్ని స్థాయిల్లోను యాక్టివిటీ బేస్డ్ పాఠ్యపుస్తకాల రూపకల్పన » ఐటీ కోర్సుల్లో శిక్షణకు స్కిల్ ఎక్స్పర్ట్స్ నియామకం » నిత్య జీవిత సమస్యలను అధిగమించేందుకు ‘సంకల్పం’ శిక్షణ » డిజిటల్ విద్య కోసం 8వ తరగతి విద్యార్థులు, ఉపాధ్యాయులకు రూ.1,306 కోట్లతో 9,52,925 ఉచిత బైజూస్ కంటెంట్ ట్యాబ్‌ల పంపిణీ » ఆరో తరగతి నుంచి ఆపైన రూ.838 కోట్లతో ప్రతి తరగతిలోను 62 వేల ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ (ఐఎఫ్‌పీ),ప్రాథమిక పాఠశాలల్లో 45 వేల స్మార్ట్ టీవీల ఏర్పాటు సోమవారంహాట్ పొంగల్, ఉడికించిన గుడ్డు లేదా వెజిటబుల్ పులావు, గుడ్డు కూర, చిక్కీ మంగళవారంఉదయం 10.20కు రాగిజావ, మధ్యాహ్నం 12.20కు చింతపండు పులిహోర, దొండకాయ పచ్చడి, ఉడికించిన గుడ్డు బుధవారంవెజిటబుల్ అన్నం, ఆలూ కుర్మా, ఉడికించిన గుడ్డు, చిక్కీ గురువారంఉదయం రాగిజావ, మధ్యాహ్నం సాంబార్ బాత్/నిమ్మకాయ పులిహోర, టమాటా పచ్చడి, ఉడికించిన గుడ్డు శుక్రవారంఅన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు, చిక్కీ శనివారంఉదయం రాగిజావ, మధ్యాహ్నం ఆకుకూరతో చేసిన అన్నం, పప్పుచారు, స్వీట్ పొంగల్–సాక్షి, అమరావతిమన ఇంగ్లిష్ విద్యపై ప్రశంసల జల్లు » ‘‘ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బైలింగువల్ పాఠ్యపుస్తకాలను అందించడం గొప్ప పరిణామం– కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ కితాబు..’’ » ‘‘ప్రాథమిక స్థాయి నుంచి నాణ్యమైన విద్య అందించడంలో పనితీరు అద్భుతంగా ఉంది: కేంద్ర పాఠశాల విద్య, అక్షరాస్యత శాఖ కార్యదర్శి సంజయ్ కుమార్’’ » ‘‘మహారాష్ట్ర, ఒడిశా, అసోం, హరియాణా, ఛత్తీస్‌గఢ్, మిజోరాం, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, నాగాలాండ్, గుజరాత్, పుదుచ్చేరి, కేరళ, తెలంగాణ, అండమాన్ –నికోబార్, డామన్ డయ్యూ, దాద్రానగర్ హవేలీ విద్యాశాఖాధికారులు మన సంస్కరణలు అమలుకు సిద్ధం’’ » ‘‘అమెరికాలోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై జరిగిన ఉన్నత స్థాయి సదస్సులో 140 దేశాల విద్యావేత్తలు మన విద్యా సంస్కరణలపై ప్రశంసలు’’ప్రభుత్వ బడుల్లో చదువుతున్న విద్యార్థులకే గాక, ప్రైవేటు విద్యా సంస్థల్లో చదువుతున్న వారికీ అమ్మ ఒడి అమలు చేసి, 2022–23 విద్యా సంవత్సరం వరకు మొత్తం రూ.25,809.5 కోట్లు తల్లుల ఖాతాల్లో జమచేశారు. నాడు– నేడులో చేసిన ఖర్చు విడత పాఠశాలలు ఖర్చు (రూ.కోట్లలో) మొదటి 15,715 3,669 రెండో 22,344 8,000 -
ఆనందాల ఏలుబడి
ప్రభుత్వ బడుల్లో కల్పించిన సదుపాయాలు 1. నిరంతరం నీటి సరఫరాతో మరుగుదొడ్లు 2. శుద్ధి చేసిన తాగునీరు 3. పూర్తి స్థాయి మరమ్మతులు 4. ఫ్యాన్లు, లైట్లతో విద్యుదీకరణ 5. విద్యార్థులు, సిబ్బందికి ఫరి్నచర్ 6. గ్రీన్ చాక్‌బోర్డులు 7. భవనాలకు పెయింటింగ్ 8. ఇంగ్లిష్ ల్యాబ్ 9. కాంపౌండ్ వాల్; 10. కిచెన్ షెడ్ 11. అదనపు తరగతి గదుల నిర్మాణం సాక్షి, అమరావతి: ప్రభుత్వ విద్యకు జగనన్న ప్రభుత్వం పట్టం కట్టింది. అలా ఇలా కాదు.. అక్షరానికి అగ్రాసనం వేసి, సౌకర్యాలకు సమున్నత స్థానం కల్పించారు. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ లేనట్లుగా.. నిధులు కేటాయించి సర్కారు బడి రూపురేఖల్ని సమూలంగా మార్చింది. కార్పొరేట్ విద్యా రంగం ఈర‡్ష్యపడేలా కొత్త పాఠశాల భవనాలు.. టాయిలెట్ల నుంచి కాంపౌండ్ వాల్ వరకు 11 రకాల సదుపాయాలు కల్పించారు. నాడు–నేడు రెండు దశల్లో 44,617 ప్రభుత్వ పాఠశాలల్లో సమూల మార్పులు చేశారు. తెలుగు, ఇంగ్లిషులో టెక్టŠస్ బుక్స్ అందించి ప్రతి విద్యార్థి ఇంగ్లిష్‌ను సులభంగా నేర్చుకునేలా చర్యలు తీసుకున్నారు. కేవలం విద్యా సంస్కరణల కోసం జగనన్న ప్రభుత్వం జూన్ 2019 నుంచి ఫిబ్రవరి 2024 వరకు రూ.72,919 కోట్లు ఖర్చు చేసి విద్యా రంగంలో సంస్కరణల పట్ల తన నిబద్ధత చాటుకుంది. సర్కారు బడిలో డిజిటల్ శకం ఒకప్పుడు బ్లాక్ బోర్డులపై రాసే సుద్దముక్కలు లేక ఇబ్బందులు పడిన దశ నుంచి ప్రభుత్వ బడి డిజిటల్ బోధనతో సరికొత్త హంగులు సంతరించుకుంది. స్కూల్లో చదువుకునేందుకు అనువైన వాతావరణం ఉన్నప్పుడే చిన్నారులు ఆసక్తి చూపుతారన్న ఆలోచనతో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం మనబడి నాడు–నేడు పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందులో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 11 రకాల సదుపాయాలు కల్పించారు. సరికొత్తగా.. నాడు–నేడులో పాఠశాలల రూపురేఖలు మారాయి. ఈ పనులన్నీ పూర్తి పారదర్శకతతో కొనసాగేందుకు తల్లిదండ్రుల కమిటీని ఏర్పాటు చేశారు. నాడు–నేడు పనులు చేపట్టిన అన్ని ఉన్నత పాఠశాలల్లోను ఇంటర్నెట్తో పాటు 62 వేల ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానళ్లతో 3డీ డిజిటల్ పాఠాలను బోధిస్తున్నారు. ప్రా«థమిక పాఠశాలల్లో 45 వేల స్మార్ట్ టీవీలతో పాఠాలతో పాటు టోఫెల్ శిక్షణ అందిస్తున్నారు. నాలుగో తరగతి నుంచి ఇంటర్ వరకు బైజూస్ పాఠాలను ఉచితంగా బోధిస్తున్నారు. దేశంలో 25 వేలఐఎఫ్‌పీలు ఉంటే.. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే 62 వేల డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేయడం దేశ చరిత్రలో ఒక విప్లవం. . అమ్మ ఒడితో అండగా.. ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ అందించేందుకు, అంతర్జాతీయంగా రాణించాలన్న దీర్ఘకాలిక లక్ష్యంతో ప్రభుత్వం పాఠశాల విద్యకు అధిక ప్రాధాన్యం ఇచి్చంది. ‘మనబడి నాడు–నేడు’ కింద డిజిటల్ మౌలిక సదుపాయాలు, అదనపు తరగతి గదులతో పాటు జగనన్న అమ్మ ఒడి, విద్యాకానుక, గోరుముద్ద, పాఠ్యాంశాల సంస్కరణలు, ప్రతి పాఠశాలలో మరుగుదొడ్లు–వాటి నిర్వహణకు ప్రత్యేక నిధి వంటివి ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో మొత్తం 58,950 పాఠశాలలు ఉండగా, 72,20,633 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో 44,617 ప్రభుత్వ పాఠశాలల్లో 43.10 లక్షల మంది చదువుతున్నారు. వీరికి అత్యున్నత ప్రమాణాలతో విద్య కోసం 2019–20 విద్యా సంవత్సరంలోనే ప్రభుత్వం సంస్కరణలు మొదలుపెట్టింది. ఒకటి నుంచి ఇంటర్ వరకు చదివే పిల్లల తల్లుల ఖాతాల్లో ఏటా రూ.15 వేలు చొప్పున జమ చేశారు. టెక్ ప్రపంచంలో రాణించేలా.. ప్రస్తుత టెక్ ప్రపంచంలో మన విద్యార్థులు రాణించేందుకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉన్న టెక్నాలజీ కోర్సులపై స్కూల్ స్థాయిలోనే అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను భవిష్యత్ టెక్ నిపుణులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం 2024–25 విద్యా సంవత్సరం నుంచి ఫ్యూచర్ స్కిల్స్ కోర్సుల్ని ప్రవేశపెడుతోంది. ఆరు నుంచి ఇంటర్ వరకు మూడు దశల్లో విద్యార్థులకు ఫ్యూచర్ స్కిల్ శిక్షణ ఇవ్వనున్నారు. టెక్ అంశాల్లో విద్యార్థుల ఆలోచన శక్తిని విస్తరించడం, విజ్ఞానంలో ముందుండేందుకు ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్), 3డీ ప్రింటింగ్, గేమింగ్ వంటి 10 విభాగాల్లో శిక్షణ ఇస్తారు. కేవలం ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ లెర్నింగ్ కోసమే దాదాపు రూ.2400 కోట్లు ఖర్చు చేస్తోంది. నాస్కామ్, జేఎన్టీయూ నిపుణులు, ఏపీ ఎస్సీఈఆరీ్ట, స్వతంత్ర నిపుణులతో ఫ్యూచర్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌ను రూపొందించారు. ఈ కోర్సులను 6,790 ఉన్నత పాఠశాలల్లో బోధించేందుకు ఇంజినీరింగ్ చివరి సంవత్సరం విద్యార్థులను ఫ్యూచర్ స్కిల్స్ ఫెసిలిటేటర్స్‌గా నియమిస్తోంది. విద్యార్థుల ప్రతిభకు పట్టం విద్యా రంగంలో సంస్కరణల కొనసాగింపుగా, విద్యలో నాణ్యత, నైపుణ్యాన్ని పెంపొందించడంతో పాటు.. విద్యార్థుల కృషిని అభినందించి ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ ఏడాది మరో గొప్ప ముందడుగు వేసింది. ప్రభుత్వ స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో చదువుకుని ప్రతిభ చాటిన వారిని ‘జగనన్న ఆణిముత్యాలు’ పేరుతో సత్కరించింది. 2023 మార్చిలో ఇంటర్, పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో వివిధ ప్రభుత్వ మేనేజ్మెంట్లలో అత్యధిక మార్కులు సాధించి, మొదటి స్థానాల్లో నిలిచిన 22,768 మంది స్టేట్ బ్రిలియన్స్ అవార్డులు అందుకున్నారు. -
భాషా పాఠాలకూ 'డిజిటల్' రూపం
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బోధించే భాషా పాఠాలు డిజిటల్ రూపం సంతరించుకున్నాయి. 3వ తరగతి నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులకు అనువుగా ఈ–పాఠాలను ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సెల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎస్సీఈఆర్టీ) రూపొందించింది. ఇప్పటికే సబ్జెక్టు పాఠ్యాంశాలను ఈ కంటెంట్‌లో బోధిస్తుండగా, ఇప్పుడు తెలుగు, ఇంగ్లిష్, హిందీ డిజిటల్ పాఠ్యాంశాలను సైతం సిద్ధం చేసింది. ఆయా సబ్జెక్టుల్లో నిపుణులైన ప్రభుత్వ ఉపాధ్యాయులను ఎంపిక చేసి, వారి ద్వారా 3 నుంచి 10వ తరగతి వరకు ఆయా భాషల పాఠ్యాంశాలను తయారు చేసింది. పదో తరగతి మినహా మిగిలిన తరగతుల కంటెంట్‌ను ప్రభుత్వ పాఠశాలలకు అందించేందుకు విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఈ ఏడాది నుంచి ఉన్నత పాఠశాలల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్ల (ఐఎఫ్‌పీ) ద్వారా డిజిటల్ బోధనను అందుబాటులోకి తెచ్చిన ప్రభుత్వం.. సబ్జెక్టు పాఠాలను డిజిటల్ రూపంలోకి మార్చి విద్యా సంవత్సరం ప్రారంభంలోనే అందించింది. ఇప్పటివరకు ఒకటి నుంచి 9వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం పాఠాలను ఎస్సీఈఆర్టీ రూపొందించింది. వచ్చే ఏడాది పదో తరగతి ఇంగ్లిష్ మీడియం పూర్తిస్థాయిలో అమల్లోకి రానున్న నేపథ్యంలో ఆ తరగతి పాఠాలను సైతం డిజిటల్ రూపంలో సిద్ధం చేశారు. యూట్యూబ్‌లోనూ.. విద్యార్థుల్లో చదువుపై ఆసక్తి కలిగించేందుకు డిజిటల్ పాఠాలను డైరెక్ట్ టు హోమ్ (డీటీహెచ్) విధానంలో ‘ఈ–విద్య’ చానెళ్ల ద్వారా టీవీల్లో కూడా ప్రసారం చేస్తోంది. ఒకటి నుంచి ఐదు తరగతులకు ఒక చానెల్ ద్వారాను, ఆరు నుంచి 9వ తరగతి వరకు మరో చానెల్ ద్వారాను పాఠ్యాంశాలను టెలీకాస్ట్ చేస్తున్నారు. అలాగే యూట్యూబ్‌లోని ‘ఈ–పాఠశాల’ చానెల్ ద్వారా ఎప్పుడు కావాలన్నా పాఠాలు వినేందుకు అవకాశం కల్పిస్తూ అన్ని పాఠాలను అప్లోడ్ చేశారు. ఆన్లైన్లో కూడా విద్యార్థులు పాఠాలు చదువుకునేందుకు, ఉపాధ్యాయులు చెప్పినవి వినేందుకు అనువుగా ‘ఈ–పాఠశాల’ మొబైల్ యాప్‌ను సైతం అందుబాటులోకి తెచ్చారు. ఐఎఫ్‌పీ, ట్యాబ్, డీటీహెచ్, యూట్యూబ్, మొబైల్ యాప్.. అన్ని మాధ్యమాల్లోను ఒకే తరహా కంటెంట్, బోధన ఉండేలా వీడియోలను ఉంచారు. అందుబాటులోకి వీడియో కంటెంట్ పాఠశాల విద్యార్థులకు అవసరమైన సబ్జెక్టుల్లోని పాఠాల కంటెంట్‌ను ఇప్పటికే బైజూస్ రూపొందించి విద్యాశాఖకు అందించింది. వీటిని విద్యార్థులకు ఐఎఫ్‌పీల్లో బోధించడంతో పాటు, ట్యాబ్స్‌లోను అప్లోడ్ చేశారు. ప్రాథమిక, ఉన్నత పాఠశాల విద్యార్థులకు లాంగ్వేజెస్, కొన్ని సబ్జెక్టుల వీడియో పాఠాలను ఎస్సీఈఆర్టీ రూపొందించింది. ఇందులో ప్రధానంగా మూడో తరగతి విద్యార్థులకు తెలుగు, ఇంగ్లిష్, మ్యాథ్స్–ఈవీఎస్, నాలుగు, ఐదు తరగతులకు తెలుగు, ఇంగ్లిష్, ఆరు నుంచి తొమ్మిదో తరగతి వారికి తెలుగు, ఇంగ్లిష్, హిందీ సబ్జెక్టుల్లో వీడియో పాఠాల కంటెంట్‌ను అందుబాటులోకి తెచ్చారు. -
2డి, 3డి చిత్రాలు.. డిజిటల్ పాఠాలు
నానాజీ అంకంరెడ్డి, సాక్షి ప్రతినిధి: ఒక్కసారి వినగానే, చూడగానే విద్యార్థుల మదిలో నిలిచిపోయేలా.. ఎప్పుడు ఆ అంశం ప్రస్తావన వచ్చినా పుట్టుపూర్వోత్తరాలన్నీ గుర్తుకొచ్చేలా 2డి, 3డి చిత్రాలతో డిజిటల్ పాఠాలు బోధించడానికి రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు సిద్ధమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యలో విప్లవాత్మక టెక్నాలజీని అందుబాటులోకి తెస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక డిజిటల్ టెక్నాలజీతో విద్యా బోధనకు ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే నాడు–నేడుతో సర్కారీ స్కూళ్లను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దటంతోపాటు బైజూస్ కంటెంట్‌తో ట్యాబ్‌లను ఉచితంగా అందించిన రాష్ట్ర ప్రభుత్వం.. అగ్ర దేశాల్లో విద్యా బోధనకు వినియోగించే ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లు, స్మార్ట్ టీవీలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు కూడా అందుబాటులోకి తెస్తోంది. తొలివిడత నాడు–నేడు పూర్తయిన 15,713 ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలోనే వీటిని వినియోగించనున్నారు. వీటి వినియోగంపై జేఎన్టీయూ ప్రొఫెసర్లతో ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నారు. పాఠశాలలకు సమీపంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో కంప్యూటర్ సైన్స్ చదివే విద్యార్థులు కూడా వారానికి ఒకసారి ఆయా స్కూళ్లను సందర్శించి సాంకేతిక సమస్యలను పరిష్కరించనున్నారు. ఈ మేరకు స్వచ్ఛందంగా సేవలు అందించేలా ఉన్నత విద్యా మండలి ముందుకు వచ్చింది. చదువులకు అండగా నిలుస్తూ, విద్యార్థుల తల రాతను మార్చేలా నాలుగేళ్లలో విద్యా రంగంపై రూ.59 వేల కోట్లకు పైగా నిధులను రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించింది. గూగుల్ అసిస్టెంట్ సదుపాయం దశాబ్దాలుగా ఉపాధ్యాయులు నల్ల బోర్డుపై తెల్ల చాక్ పీస్తో బోధిస్తున్నారు. ఆధునిక విధానాలకు అనుగుణంగా విద్యార్థులు మెరుగ్గా రాణించేలా మనబడి నాడు – నేడు తొలి విడతలో తీర్చిదిద్దిన 5,675 ఉన్నత పాఠశాలలు, ప్లస్ 2 తరగతుల్లో అత్యాధునిక ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లు (ఐఎఫ్‌పీ) 30,212 తరగతి గదుల్లో అందుబాటులోకి రానున్నాయి. గూగుల్ అసిస్టెంట్ సదుపాయం కలిగిన ఇంటరాక్టివ్ స్మార్ట్ ప్యానెళ్లను ఆరు నుంచి 10వ తరగతి వరకు క్లాస్‌కు ఒకటి చొప్పున ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి స్క్రీన్కు ఇరువైపులా నాలుగు అడుగుల పొడవు, వెడల్పుతో గ్రీన్ చాక్‌పీస్ బోర్డులను కూడా అమరుస్తున్నారు. పాఠ్య పుస్తకాల్లో, ఎనిమిదో తరగతి విద్యార్థులకు ఇచ్చిన ట్యాబ్‌ల్లో, ఐఎఫ్‌పీ స్క్రీన్లలో ఒకే కంటెంట్ ఉండడంతో విద్యార్థికి మెరుగైన బోధన అందేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రస్తుతం నాడు – నేడు రెండో విడతలో మరో 15 వేల పాఠశాలల్లో సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఇందులో 3,800 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో పనులు పూర్తయిన వాటిల్లో ఐఎఫ్‌పీ స్క్రీన్లు ఏర్పాటు చేసి డిసెంబర్ నాటికి అన్ని స్కూళ్లల్లోను డిజిటల్ స్క్రీన్లు అందుబాటులోకి తేనున్నారు. మరో 10,038 పాఠశాలల్లో స్మార్ట్ టీవీలు మనబడి నాడు–నేడు ద్వారా ఒకటి నుంచి ఐదో తరగతి వరకు విద్యా బోధనను రాష్ట్ర ప్రభుత్వం నవీకరించింది. ప్రాథమిక పాఠశాలకు ఒకటి చొప్పున 10 వేల స్మార్ట్ టీవీలను అందించి గతేడాది ఇంగ్లిష్ ల్యాబ్‌లను అందుబాటులోకి తెచ్చింది. వీడియో పాఠాల ద్వారా బోధనతో మెరుగైన ఫలితాలు రావడంతో ఇప్పుడు కొత్తగా 10,038 ప్రాథమిక స్కూళ్లకు అంతే సంఖ్యలో స్మార్ట్ టీవీలను డిజిటల్ కంటెంట్‌తో ఏర్పాటు చేస్తోంది. మూడో తరగతి నుంచి ఐదో తరగతి విద్యార్థులకు ఈ ఏడాది ‘టోఫెల్– ప్రైమరీ’ శిక్షణ అందిస్తున్న నేపథ్యంలో అందుకు అవసరమైన కంటెంట్‌ను వీడియో, ఆడియో రూరంలో స్మార్ట్ టీవీల ద్వారా బోధించనున్నారు. ఇక నాడు – నేడు రెండో దశలో పనులు జరుగుతున్న మరో 11,200 ప్రాథమిక పాఠశాలల్లోనూ డిసెంబర్ నాటికి స్మార్ట్ టీవీలు రానున్నాయి. ఇక్కడ కనిపిస్తున్నది కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణం అయోధ్య రామాపురం మున్సిపల్ ఉన్నత పాఠశాలలోని తరగతి గది. తరగతి గదుల్లో బోధన అందిస్తూ, అక్కడే చదువుకుని అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను చూపించి పిల్లల్లో పోటీ తత్వాన్ని పెంచుతున్నారు. ఇదే మండలంలోని ఉండూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సైతం ఐఎఫ్‌పీ స్క్రీన్ డిజిటల్ బోధన ప్రారంభమైంది. ఇది పల్నాడు జిల్లా క్రోసూరు ఏపీ మోడల్ స్కూల్లోని తరగతి గది. విద్యార్థులకు డిజిటల్ విద్యాబోధన కోసం 165 సెం.మీ వైశాల్యం కలిగిన ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ (ఐఎఫ్‌పీ) బోర్డును సిద్ధం చేశారు. దీనికి 256 జీబీ డేటా పాఠ్యాంశాలతో ఎస్డీ కార్డును అనుసంధానించి స్మార్ట్ బోధన నిర్వహించవచ్చు. ఒకపక్క స్క్రీన్‌పై వీడియో పాఠాన్ని విద్యార్థులు చూస్తుండగా.. మరోపక్క అదే స్క్రీన్‌పై సందేహాలను ఉపాధ్యాయులు నివృత్తి చేయవచ్చు. పాఠాలను రికార్డు చేయవచ్చు. అవసరమైన వాటిని నేరుగా ప్రింట్ తీసుకోవచ్చు. -
‘డిజిటల్ లెర్నింగ్’ గురించి మీకీ విషయాలు తెలుసా?
డిజిటల్ లెర్నింగ్.. ఇప్పుడు దీని గురించి పెద్దగా తెలియని వారుండరు. కొంతకాలం క్రితం వరకూ.. కొన్ని విద్యాసంస్థలు మాత్రమే డిజిటల్ పాఠాలు చెప్పేవి. బ్లాక్ బోర్డు మీద చాక్‌పీస్‌తో రాసి.. బొమ్మలు గీసి.. పాఠ్యాంశాలను వివరించేవారు. కానీ ఇప్పుడు ప్రపంచం మొత్తం డిజిటల్ మయంగా మారింది. విద్యావ్యవస్థలో డిజిటల్ లెర్నింగ్‌కు ప్రాధాన్యం పెరిగింది. కరోనా కారణంగా ఆన్లైన్ లెర్నింగ్ తప్పనిసరిగా మారింది. ఇలాంటి తరుణంలో డిజిటల్ లెర్నింగ్ ప్రాధాన్యత.. ఈ లెర్నింగ్ ప్రయోజనాలపై ప్రత్యేక కథనం.. అదో గొడుగు డిజిటల్ లెర్నింగ్ అనేది గొడుగు లాంటిది. మనం నేర్చుకోవాలనుకున్నది ఏదైనా కూడా అందులో డిజిటల్ టెక్నాలజీ పాత్ర తప్పక ఉంటుంది. ఉదాహరణకు విద్యార్థులు ఆన్లైన్ కోర్సులు, ఆన్లైన్ క్లాసులను వీడియో ద్వారా వీక్షించడం.. అలాగే ఉపాధ్యాయులు డిజిటల్ టూల్స్ అంటే స్మార్ట్ బోర్డ్స్, టాబ్లెట్స్ ఆధారంగా బోధించడం. ఇలాంటివి అన్నీ డిజిటల్ లెర్నింగ్ కిందకు వస్తాయి. ఆన్లైన్ లెర్నింగ్ విద్యార్థులకు ఇంట్లోనే తరగతి గది లాంటి వాతావరణాన్ని కల్పించేదే ఆన్లైన్ లెర్నింగ్. ఇందులో విద్యార్థులు క్లాసులను వినడమే కాదు. ప్రత్యక్షంగా నేర్చుకుంటున్న పాఠ్యాంశాల్లో ఎలాంటి సందేహాలు ఉన్నా.. అడిగి వాటిని నివృత్తి చేసుకునే సౌకర్యం ఆన్లైన్ లెర్నింగ్ క్లాసుల ద్వారా సాధ్యమవుతుంది. విద్యార్థులు–టీచర్ మధ్య పరస్పర సంభాషణకు అవకాశం ఉన్న వేదికనే.. ఆన్లైన్ లెర్నింగ్! ఈ లెర్నింగ్ ఈ లెర్నింగ్‌ని వర్చువల్ లెర్నింగ్ అని కూడా అంటారు. ఇది ముఖ్యంగా ఇంటర్నెట్ ఆధారంగా.. ఏదైనా కోర్సు నేర్చుకోవాలనుకునే వారికి ఉపయోగపడుతుంది. ఉపాధ్యాయులు, విద్యార్థులు ప్రత్యక్షంగా కలవనవసరం లేకుండా.. ఇంటర్నెట్ ఆధారంగా అంటే ఈ–మెయిల్, చాటింగ్, వీడియోలు వంటివి ఈ–లెర్నింగ్‌కు దోహదపడతాయి. స్వయం చదువుకోవాలనే ఆలోచన ఉండాలేకాని ప్రస్తుతం మార్గాలు అనేకం. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే స్వయం ఆన్లైన్ కోర్సులను నేర్చుకోవడానికి విద్యార్థులను ప్రొత్సహిస్తుంది. జాతీయ స్థాయిలో ఆన్లైన్ విద్యను ప్రొత్సహించే ఉద్దేశంతో మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సు (మూక్స్) తరహాలో స్వయం పేరిట ఈ ఆన్లైన్ వేదికను ఏర్పాటు చేశారు. ఇది వివిధ కోర్సుల విద్యార్థులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఉచితంగానే నేర్చుకోవచ్చు కరోనా కారణంగా విద్యాసంస్థల మూసివేయడంతో ఆన్లైన్ కోర్సులకు డిమాండ్ ఏర్పడింది. పూర్తిగా ఉచితంగా కోర్సులను అందించడంతో ఎక్కువ మంది విద్యార్థులు ఆన్లైన్ విధానం వైపు వస్తున్నారు. ఎన్సీఈఆర్టీ ఆధ్వర్యంలోని దీక్ష, ఈ–పాఠశాలతోపాటు ఈతంత్ర, వర్చువల్ ల్యాబ్స్, స్పోకెన్ ట్యుటోరియల్, ఎన్పీటీఈఎల్ లాంటి వాటిని విద్యార్థులు ఉపయోగించుకుంటున్నారు. టీచర్లూ నేర్చుకోవచ్చు ఉపాధ్యాయలు సైతం ఆన్లైన్ వేదికగా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవచ్చు. ఆయా బోధనాంశాల్లో, పద్ధతుల్లో మరింత మెరుగవడానికి, ఆయా రంగాల్లో జరుగుతున్న మార్పులు, కొత్త పరిశోధనలు, పరిణామాలు తెలుసుకోవడానికి డిజిటల్ ప్లాట్‌ఫామ్ చక్కగా ఉపయోగపడతాయి. ఆన్లైన్ విద్యవైపు విద్యార్థులను ప్రోత్సహించడానికి డిజిటల్ లెర్నింగ్ దోహదపడుతుంది. ప్రోత్సహించాలి ప్రస్తుతం కొత్త జనరేషన్ మొత్తం ఆన్లైన్లో మునిగితేలుతోంది. చిన్నారులు స్కూల్ గ్రౌండ్లో ఆడే ఆటలకంటే.. మొబైల్ ఫోన్లలో వీడియో గేముల్లోనే ఎక్కువగా లీనమవుతున్నారు. నేర్చుకునే అవకాశం ఎక్కువగా ఉండే ఈ వయసులోనే విద్యార్థులను ఆన్లైన్ లెర్నింగ్ వైపు ప్రోత్సహించాలి. సమయాన్ని వృథా చేసుకోకుండా.. ఆన్లైన్ వేదికగా ఉన్న సౌకర్యాలను వినియోగించుకుంటూ.. సబ్జెక్టులపై అవగాహన పెంచుకునేలా చూడొచ్చు!! చదవండి: -
చైతన్య కేంద్రాలుగా డిజిటల్ వేదికలు
కరోనా వైరస్ మనందరినీ ఇళ్లలోనే నిర్బంధించడానికి ముందు, మార్చి నెల చివరలో భారతదేశవ్యాప్తంగా కొంతమంది ప్రజలు ఇతర ముఖ్యమైన క్యాంపెయిన్లలో నిమగ్నమై ఉండిపోయారు. పౌరులంటే ఎవరు, ఆధునిక ప్రజాతంత్ర సమాజంలో విశ్వవిద్యాలయం పాత్ర ఏమిటి? వంటి అంశాలపై జరిగిన క్యాంపెయిన్ ఇది. ఈ చర్చకు సంబంధించి కొత్త పదం కనిపెట్టడానికి నేను పౌరసత్వం, విద్యార్థి జీవితానికి మధ్య ఏదైనా సంబంధం ఉందా అని ప్రశ్నించాలనుకున్నాను. కానీ కరోనా లాక్డౌన్ మాలో చాలామంది కదలికలను నియంత్రించింది. ఇలా నిర్బంధంగా మేం వెనక్కు తగ్గాల్సి రావడం వల్ల మన కాలం సమస్యలపై అనేక ప్రశ్నలను సంధించడానికి మాకు మంచి అవకాశం ఇచ్చింది. గతంలో ఉపాధ్యాయురాలిగా పనిచేసిన మా బంధువుతో కొద్ది కాలంక్రితం నేను సంభాషణ జరిపాను. ఆమె జేఎన్‌యూ, జామియా మిలియా ఇస్లామియా, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీల తీరును, పౌరసత్వ సవరణ చట్టంపై విద్యార్థుల నిరసనలను వ్యతిరేకిస్తూ మాట్లాడారు. విద్యార్థులు రాజకీయాలను పక్కనపెట్టి తమ చదువులపై ఎందుకు దృష్టి పెట్టరు అని ఆమె ప్రశ్నించారు. విద్యార్థి అంటే కేవలం పాఠాలను గ్రహించడం మాత్రమే కాదని, సమాచార జ్ఞానాన్ని వారు పొందాలని, తదనుగుణంగా పరీక్షల్లో తమ పోటీతత్వాన్ని ప్రదర్శించాలని నేను ఆమెకు చెప్పాను. కేవలం సమాచారాన్ని నిల్వచేసుకోవడం, సమాచార జ్ఞానాన్ని నిర్వహించడం, తిరిగి పొందడం కంటే విద్యలో మరెన్నో అంశాలు దాగి ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభిప్రాయం ప్రకారం మనం ఆత్మనిర్భర్ లేక స్వావలంబన కలిగిన జాతిగా మారాలంటే, విద్యాబోధన నుంచి మనం పొందిన విజ్ఞానాన్ని ఒక సమాజంగా మనం మదింపు చేయకూడదా? మనం పంపిణీ చేస్తున్న జ్ఞానాన్ని పెంపొందించే జ్ఞాన మీమాంస మూలాలను మనం అంచనా వేయడం ఎలా? అంతర్జాతీయ నేపథ్యంలో జ్ఞాన సామర్థ్యతను, కార్యసాధకతను ముందుకు తీసుకుపోవడం ఎలా? దీన్ని స్వదేశీ, ఖాదీ అనే గాంధీ భావనల నేపథ్యంలో పరిశీలిస్తే, మన ఆర్థిక, రాజకీయ, తక్షణ నైతిక ఎంపికలను కూడా తాజాగా, స్వచ్ఛంగా ఉంచుకోవడానికి సాహసించాల్సిన సమయం ఇది. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ హిందుత్వ జాతీయ ఎజెండా.. భారతదేశాన్ని దాని పురాతన పౌరాణిక గతంలోకి తీసుకుపోవాలని చూస్తున్న నేపథ్యంలో.. మన ఆధునికతకు సంబంధించిన సమున్నత ఆకృతిని నిర్ణయించడంలో మన దేశీయతను గురించి నొక్కి చెప్పాల్సిన అవసరముంది. ఒకవైపు స్థానికంగా తయారయ్యే స్వదేశీ నూలుకు మరోవైపు అంతర్జాతీయ సాంకేతిక యవనిక, సమాచారం, కరెన్సీల మధ్య స్పష్టమైన రేఖను మనం ఎలా సమతుల్యం చేయాలనేది కీలకమైన అంశం. కోవిడ్–19 సాంక్రమిక వ్యాధి ప్రభావంతో జాతీయ ఆర్థిక వ్యవస్థ స్పష్టంగానే మునిగిపోతున్నట్లు కనిపిస్తుండగా, స్థానిక, అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో జాతిని ముందుకు నడిపించే సామర్థ్యం ఉన్న డైనమిక్ తరాన్ని రూపొందించేలా ప్రభుత్వం విద్యారంగానికి ఎలాంటి ఉద్దీపనను అందించబోతోంది? ఈ విషయంలో ఒక స్పష్టమైన ఉదాహరణ ఉంది. ప్రస్తుత విద్యాసంవత్సరాన్ని పూర్తి చేయడానికి విద్యాపరమైన సామగ్రిని ఆన్లైన్లో డెలివరీ చేయడానికి పలు ఉన్నత విద్యాసంస్థలు ఇప్పుడు త్వరత్వరగా ఇంటర్నెట్ అప్లికేషన్ అయిన జూమ్‌ను ఉపయోగించుకుంటున్నాయి. బహుళ జాతి సంస్థల క్లయింట్లను పొందే సాఫ్ట్‌వేర్‌గా జూమ్ అవతరించింది. ఏకకాలంలోనే ఆన్లైన్లో భేటీ అయి కార్యకలాపాలు నడపడానికి ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగులను ఒక చోటికి చేర్చాలని కార్పొరేషన్లు చూస్తున్నాయి. సంపన్నులైన పిల్లలకే కాకుండా కార్పొరేట్ సంస్థల ఆచరణ మన క్లాస్ రూమ్‌లలోకి వచ్చేసిన వాస్తవం విద్యారంగంలో జూమ్‌ను అధికారికంగానే ఉపయోగించడాన్ని సాధ్యం చేసింది. నిస్సందేహంగా ఖర్చు తగ్గింపు అనేదే ఇక్కడ నిర్ణయాత్మక అంశం. దేశ మంతటా పిల్లల ఎదురుగా నిలబడి విద్యను బోధిస్తున్న పద్ధతే అమలులో ఉంటున్న నేపథ్యంలో విభిన్నతరహాలో పిల్లల బోధన జరపడంలో ఉపయోగపడుతున్న అనేక ఇతర యాప్‌లు కూడా ఇప్పుడు రంగంలోకి వచ్చేశాయి. సులభంగా విద్యను అందిస్తున్నప్పటికీ ఆన్లైన్ విద్యాబోధనలో మరొక చిక్కు ఉంది. 2007లో కరేన్ మోస్బెర్గర్ రాసిన ‘డిజిటల్ పౌరసత్వం, ఇంటర్నెట్, సొసైటీ, భాగస్వామ్యం’ అనే రచనలో.. డిజిటల్ యాక్సెస్, డిజిటల్ స్కిల్, డిజిటల్ అక్షరాస్యత, డిజిటల్ పౌరసత్వం అనేవి ప్రపంచ వ్యాప్తంగా ఆధునిక సమాజాలకు అసలైన చిహ్నాలుగా ఉంటున్నాయని రాశారు. మరో నాలుగైదు వారాలపాటు సాంక్రమిక వ్యాధి మనల్ని లాక్డౌన్లో ఉంచుతున్నందున మనం విద్యకు సంబంధించి డిజిటల్ రంగానికి తరలేందుకు మంచి అవకాశాలు ఉంటున్నాయి. పౌరసత్వ భావనను తాజాగా పరిచయం చేసేందుకు మనం విద్యాపరమైన లక్ష్యాలను కూడా మెరుగుపర్చుకోగలిగాం. పౌరసత్వ సవరణ చట్టం 2019 గురించి ప్రజలతో సంభాషించడంలో పరిమితుల రీత్యా, దేశవ్యాప్తంగా విద్యార్థులు, కార్యకర్తలు, రాజకీయనేతలు దానిపై తీవ్ర విమర్శలు చేస్తూ వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఈ చట్టం అమలు కాస్త ప్రతిష్టంభనకు గురైనప్పటికీ సరిగ్గా సాంక్రమిక వ్యాధి విస్తరించడానికి ముందు దేశంలో, కేంద్రంలో, రాష్ట్రాల పరిధిలోని అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకత్వం ఈ చట్టంపై కాస్త సానుకూలతను ప్రదర్శించడం జరిగింది. విద్య అంటే సమాచారాన్ని నిల్వ చేయడం, నిర్వహించడం, తిరిగి పొందడం మాత్రమే కాదని ముందే చెప్పాను. కాబట్టి కరోనా అనంతరం ప్రపంచ డిజిటల్ అక్షరాస్యత వైపు విద్యార్థులను సన్నద్ధం చేయడానికి మన విద్యావ్యవస్థలోకి వేటిని చొప్పించాలన్నది ప్రశ్న. ఇది మన సోషల్ మీడియా ఖాతాలను నిర్వహించుకోవడం కంటే ప్రాధాన్యత కలిగిన విషయం. ముందుగా మనం పౌరసత్వాన్ని, విద్యార్థితత్వాన్ని అనుసంధించాల్సి ఉంది. మన విద్యార్థులకే కాకుండా విద్యావంతులం అని ప్రకటించుకుంటున్న వారికి కూడా పౌరవిధులకు సంబంధించి మంచి అలవాట్లును పెంపొందించాల్సి ఉంది. ఒక సంస్థ ద్వారా గుర్తింపు పొంది వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకుని, ప్రయోజనకరమైన ఉద్యోగం సంపాందించడంతో సరిపెట్టుకోకుండా విద్యావంత పౌరుల్లా మన సామాజిక బాధ్యతలలో కొన్నింటినైనా నెరవేర్చడం మన ఆచరణలో భాగం కావాలి. ఉన్నత విద్య ప్రయోజనాలు ఏమీ పొందనప్పటికీ ఢిల్లీలోని షహీన్ బాగ్‌లో నెలల తరబడి ఉద్యమించిన మహిళలు ఈ బాధ్యతను చాలాచక్కగా అర్థం చేసుకున్నారు. మరి పౌర చైతన్యం కల ఇతరులు దీన్ని ఎందుకు పాటించరు? ప్రముఖ సామాజిక శాస్త్రజ్ఞుడు టి.హెచ్ మార్షల్ 1987లోనే డిటిజల్ పౌరసత్వం అంటే ఏమిటని ప్రశ్నిస్తూ, సమాజంలోని సభ్యులందరూ రాజకీయాల్లో భాగస్వామ్యాన్ని పెంచుకుంటూనే సమానమైన ఆర్థిక కార్యకలాపాలను నిర్వహించడం అని నిర్వచనమిచ్చారు. ఆయన చెప్పిన పౌరుల అలవాట్లకు నేను మరొకటి చేర్చాలనుకుంటున్నాను. ఎన్నికలు జరుగుతాయా లేదా అనే దాంతో పనిలేకుండా మన ప్రజాప్రతినిధులు పాలనా వ్యవహారాలను ఎలా నిర్వహిస్తున్నారనే అంశంపై పౌరులందరూ శ్రద్ధపెట్టి పరిశీలించాలి. భూగర్భ జల మట్టాలపై ఆధారపడి తమ పంటలకు ఎంత నీరు కావాలి, ఎప్పుడు అవసరం ఉంటుంది అనే అంశాలపై మన రైతులు వృత్తిపరమైన సలహాల కోసం ఇప్పుడు సోషల్ మీడియాను ఉపయోగించుకుని భూగర్భ శాస్త్రజ్ఞులు, వాతావరణ శాస్త్రజ్ఞుల నుంచి సలహాలు పొందగలుగుతున్నారు. ఆన్లైన్ సామాజిక బృందాలను ఏర్పర్చుకోవడానికి డిజిటల్ మీడియా మనకు మంచి వనరులను అందిస్తోంది. ఈ అవకాశాలను వెతికి పట్టుకోవడానికి లాక్ డౌన్ మనకు తగినంత సమయాన్ని అందించింది. ఆధునిక భారతదేశం ఇప్పుడు డిజిటల్ పౌరసత్వం, డిజిటల్ స్టూడెంట్ షిప్ అనే కొత్త శకంలోకి ప్రవేశించింది. ఈ పరిస్థితుల్లో మన క్లాస్ రూమ్‌లను కేవలం సమాచారాన్ని పంపిణీ చేసే స్తబ్ద రంగంగా ఇకెంతమాత్రం కొనసాగించలేం. మన తరగతిగదులను, చాట్ రూమ్‌లను, ట్విట్టర్ ఫీడ్ బ్యాక్లను పరిశోధన, విశ్లేషణ, సంక్లిష్ట అంశాలను పోల్చడం వంటి సాధానాలతో కూడిన సరికొత్త ప్రజాస్వామిక రంగస్థలాలుగా పరివర్తన చెందించాల్సి ఉంది. ఆన్ లైన్ లెర్నింగ్ అనేది ఫ్యాకల్టీ నుంచి విద్యార్థికి కోర్స్ కంటెంట్‌ని డెలివరీ చేయడానికి మాత్రమే పరిమితం కాకూడదు. ఇది విద్యార్థుల మధ్య భావవ్యక్తీకరణ వాహకంగా ఉంటూ ఇతర డిజిటల్ పౌరులకు కూడా అందుబాటులో ఉండాలి. ఇతర పౌర సంస్థలతోబాటు కాలేజీలు, విశ్వవిద్యాలయాలు కూడా పురోగామి సమాజాన్ని రూపొందించే ప్రయోగశాలలుగా ఉండాలి. ఈసారి కూడా ఎవరైనా ప్రశ్నించవచ్చు. ఈ జేఎన్‌యూ తరహా విద్యాసంస్థలు ప్రతి విషయాన్ని రాజకీయంగా ఎందుకు మారుస్తున్నారని వారు అనవచ్చు. చరిత్ర, రాజనీతి శాస్త్రం, సోషియాలజీ, ఆంత్రోపాలజీ, న్యాయ శాస్త్రం, ప్రపంచ భాషలు సంస్కృతుల గురించి చదువుకునేవారు దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలను పట్టించుకోకూడదా అన్నదే నా ఎదురు ప్రశ్న. డిజిటల్ పౌరసత్వంలో రాజకీయ భాగస్వామ్యం కూడా ముఖ్యమైనదని గ్రహించాలి. స్వావలంబన కలిగిన పౌరులుగా మనం పరిణితి చెందిన ప్రపంచ శక్తిగా మారాలంటే పౌరుల రాజకీయ ఆకాంక్షలు ఫలించి ప్రజాస్వామ్య సంస్థల నిర్మాణంలో వారి భాగస్వామ్యం కూడా ఉండాలని డిమాండ్ చేయాలి. ఈ లాక్ డౌన్‌ను మనం నివసిస్తున్న స్థలం, జన్మదినంపై చర్చల నుండి పౌరసత్వం భావనవైవు సంభాషణను మరల్చుదాం. డిజిటల్ పౌరసత్వానికి మనముందున్న అవకాశాల్లో పౌరసత్వంపై చర్చ కూడా కీలకమైన అంశంగా ఉండాలి. (ది వైర్ సౌజన్యంతో) పూనమ్ ఆరోరా, ప్రొఫెసర్, హ్యుమానిటీస్, ఫ్రీలాన్స్ రైటర్ -
ప్రభుత్వ స్కూళ్లలో డిజిటల్ పాఠాలు
* ఈ విద్యా సంవత్సరం నుంచే అమలుకు విద్యాశాఖ ఏర్పాట్లు * ‘డిజిటల్ ఇండియా’ కింద 100 స్కూళ్లలో అమలు * మరో 2,157 స్కూళ్లలో అమలుకు కసరత్తు * ఇప్పటికే 4, 5 తరగతుల్లో సైన్స్ డిజిటల్ పాఠాలు * మిగతా తరగతుల కోసం పాఠాల రూపకల్పనకు చర్యలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ పాఠాలు బోధించే దిశగా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఈ విద్యా సంవత్సరం నుంచే దీనిని అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం ‘కంప్యూటర్ విద్య, డిజిటల్ పాఠాల’పై పాఠశాల విద్యా డెరైక్టర్ చిరంజీవులు అధికారులతో సమీక్షించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4, 5 తరగతుల్లో పర్యావరణ విద్యకు సంబంధించి కరీంనగర్‌కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు డిజిటల్ పాఠాలను రూపొందించారు. మిగతా తరగతులకు సంబంధించిన డిజిటల్ పాఠాలను కూడా రూపొందించే దిశగా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. జిల్లాకు 10 చొప్పున రాష్ట్రంలోని 100 స్కూళ్లలో కేంద్ర ప్రభుత్వ ‘డిజిటల్ ఇండియా’ పథకం కింద డిజిటల్ పాఠాలను బోధించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ స్కూళ్లలో కార్పొరేట్ సంస్థలు ఈ విద్యను అందించేలా చర్యలు చేపడుతున్నారు. వారి ఆధ్వర్యంలోనే ప్రభుత్వ టీచర్లకు కూడా డిజిటల్ పాఠాల రూపకల్పన, బోధనపైనా శిక్షణ ఇప్పించాలని విద్యాశాఖ భావిస్తోంది. తద్వారా ఇప్పటికే ఇంటర్నెట్ సదుపాయంతో కూడిన కంప్యూటర్లు అందుబాటులో ఉన్న 2,157 స్కూళ్లలో ‘డిజిటల్ పాఠాల’ను బోధించాలని నిర్ణయించింది. వీటిల్లోని 450 స్కూళ్లలో ప్రస్తుతం ప్రొజెక్టర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. మిగతా స్కూళ్లకు ప్రొజెక్టర్లను కొనుగోలు చేయనున్నారు. దీంతోపాటు ప్రభుత్వ టీచర్లకు స్పోకెన్ ఇంగ్లిషుపైనా 6 నెలలపాటు శిక్షణ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఇందులో 10 రోజులు నేరుగా తరగతులను నిర్వహిస్తారు, మిగతా రోజుల్లో ఆన్లైన్ ద్వారా శిక్షణ ఇస్తారు. దీనిద్వారా ప్రభుత్వ పాఠశాలల్లోని టీచర్లకు ఇంగ్లిషుతోపాటు డిజిటల్ పాఠాల బోధన కూడా సులభం అవుతుందని విద్యాశాఖ భావిస్తోంది.