
న్యూఢిల్లీ: సివిల్స్-2020 తుది ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) శుక్రవారం విడుదల చేసింది. మొత్తం 761 మంది అభ్యర్థులను ఎంపిక చేసింది. వీరిలో 545 మంది పురుషులు, 216 మంది మహిళలు ఉన్నారు. 263 మంది జనరల్, 229 ఓబీసీ, 122 ఎస్సీ, 61 ఎస్టీ, 86 మంది ఈడబ్య్లూఎస్ కేటగిరి అభ్యర్థులు ఎంపికయ్యారు.
సివిల్స్-2020 తుది ఫలితాల్లో ఐఐటీ బాంబే నుంచి బీటెక్(సివిల్ ఇంజనీరింగ్) చేసిన శుభం కుమార్‌కు మొదటి ర్యాంకు రాగా, భోపాల్ నిట్ నుంచి బీటెక్(ఎలక్రికల్ ఇంజనీరింగ్) చేసిన జాగృతి అవస్తికి రెండో ర్యాంకు వచ్చింది. మహిళల విభాగంలో అవస్తి టాపర్‌గా నిలవడం విశేషం. కాగా ఈ ఏడాది జనవరిలో సివిల్ సర్వీసెస్ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. మెయిన్స్ పరీక్షలో అర్హత సాధించిన వారికి ఇంటర్వ్యూలు నిర్వహించిన అనంతరం శుక్రవారం సాయంత్రం తుది ఫలితాలను యూపీఎస్సీ విడుదల చేసింది.
ఇక సివిల్స్‌లో సత్తా చాటిన తెలుగు విద్యార్థులు
► పి. శ్రీజకు 20వ ర్యాంకు
►మైత్రేయి నాయుడుకు 27వ ర్యాంకు
►జగత్ సాయికి 32వ ర్యాంకు
►దేవగుడి మౌనికకు(కడప) 75వ ర్యాంకు
►రవి కుమార్‌కు 84వ ర్యాంకు
►యశ్వంత్ కుమార్ రెడ్డికి 93వ ర్యాంకు
Comments
Please login to add a commentAdd a comment