ఓ మోడల్ గ్లామర్ రంగంలో రాణిస్తూ ప్రతిష్టాత్మకమైన సివిల్స్ ఎగ్జామ్ వైపుకి అడుగులు వేసింది. తొలి ప్రయత్నంలోనే విజయం సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. గ్లామరస్ రోల్‌కి విభిన్నమైన రంగంలోకి అడుగుపెట్టడమే గాక ఎలాంటి కోచింగ్ లేకుండా విజయ సాధించి అందరికీ స్పూర్తిగా నిలిచింది ఈ మోడల్. ఆమె ఎవరంటే..
రాజస్థాన్‌కు చెందిన ఐశ్వర్య షియోరాన్ సైనిక నేపథ్‌య కుటుంబానికి చెందింది. అందువల్లే ఆమె దేశానికి సేవ చేసే ఈ సివిల్స్ వైపుకి మళ్లింది. ఆమె తన ప్రాథమిక విద్యనంతా చాణక్యపురిలోని సంస్కతి పాఠశాల్లో పూర్తి చేసింది. ఇంటర్‌లో ఏకంగా 97.5 శాతం మార్కులతో పాసయ్యింది. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు మోడలింగ్ పోటీల్లో పాల్గొంది. అలా మొదలైన ఆమె ప్రస్థానం పలు మోడలింగ్ పోటీల్లో పాల్గొనడంతో సాగిపోయింది.
ఆ విధంగా ఆమె 2015లో మిస్ ఢిల్లీ కిరీటం, 2014లో మిస్ క్లీన్ అండ్ కేర్ ఫ్రెష్ ఫేస్, 2016లో మిస్ ఇండియా పోటీల్లో ఫైనలిస్ట్‌గా నిలిచింది. ఈ మోడలింగ్ అనేది ఆమె అమ్మకల అని అందుకే ఈ రంగంలోకి వచ్చానని తెలిపింది ఐశ్వర్య. ఆ తర్వాత కెరీర్‌పై పూర్తి ఫోకస్ పెట్టినట్లు తెలిపారు. 2018లో ఐఐఎం ఇండోర్‌కు ఎంపికైన తాను సివిల్స్ వైపే దృష్టి సారించినట్లు తెలిపారు. అలా 2018-2019లో సివిల్స్ ప్రిపరేషన్‌లో మునిగిపోయింది. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా తనకు తానుగా ప్రిపేర్ అయ్యింది. తొలి ప్రయత్నలోనే సివిల్స్ 2019లో విజయం సాధించి..93వ ర్యాంక్ సాధించారు.
తన ప్రిపరేషన్ గురించి మాట్లాడుతూ..ఇక తాను ఈ సివిల్స్ ప్రిపరేషన్ కోసం 10+8+6 టెక్నిక్ ఫాలో అయ్యానని చెప్పారు. అంటే పదిగంటలు నిద్ర, ఎనిమిది గంటలు నిద్ర, ఆరుగంటలు ఇతర కార్యకలాపాలు. ఇక కోచింగ్ దగ్గర కొచ్చేటప్పటికీ వారి వ్యక్తిగత అభిరుచికి సంబధించింది అని అన్నారు. ఎప్పుడైనా ఇలాంటి పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే ముందు సాధించగలమా లేదా అనేదానిపై పూర్తి అవగాహన ఉండాలి. అప్పుడే దిగాలి అని చెప్పుకొచ్చారు ఐశ్వర్య. ఇక ఆమె తండ్రి విజయ్ కుమార్ ఆర్మీలో కల్నల్.
ఆమె తల్లి సుమన్ షియోరాన్ గృహిణి. రాజస్థాన్‌లో జన్మించిన ఐశ్వర్య ఢిల్లీలో ఉన్నత విద్యను పూర్తి చేసింది. ఈ మధ్యే తెలంగాణలో రాష్ట్రం కరీంనగర్‌కు బదిలీ అయ్యింది. కల్నల్ అజయ్ కుమార్ కరీంనగర్ ఎన్‌సీసీ తొమ్మిదో బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్. ప్రస్తుతం ఐశ్వర్య ఐఎఫ్‌ఎస్ ఆఫీసర్‌గా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో పనిచేస్తోంది. మోడల్ నుంచి ప్రజలకు సేవ చేసే అత్యున్నత రంగంలోకి రావడమే గాక కేవలంలో ఇంట్లోనే జస్ట్ పదినెల్లలో ప్రిపేర్ అయ్యి సివిల్స్‌లో విజయం సాధించింది. తపన ఉంటే ఎలాగైనా సాధించొచ్చు అనేందుకు స్ఫూర్తి ఐశ్వర్యనే అని చెప్పొచ్చు కదూ..!
(చదవండి: కేబినెట్ మంత్రి చిరాగ్ పాశ్వాన్ ఇష్టపడే రెసిపీ ఇదే..!)
Comments
Please login to add a commentAdd a comment