రాజ్యాంగ నిర్మాణ సభలో ఆనాటి సభ్యులు చాలామంది ఐసీఎస్‌ను రద్దు చేయాలని సూచించారు! పాలనకు ఆయువు పట్టయిన భారత సివిల్ సర్వీసు (ఐసీఎస్) లను రద్దు చేయాలని వారు సూచించడానికి తగిన కారణమే ఉంది. స్వాతంత్య్రానికి పూర్వం నుంచీ ఉన్న ఈ వ్యవస్థలో ఆనాటి ఐసీఎస్ అధికారులు అనేకమంది నిరంకుశంగా తమ అధికారాన్ని చెలాయిస్తూ ప్రజలపై పెత్తనం సాగిస్తుండేవారు. అయితే రద్దు అనేది పరిష్కారం కాదనీ, ఐసీఎస్‌ను కొనసాగించడమే మేలని సర్దార్ వల్లభాయ్ పటేల్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఐసీఎస్ ఒక్కటే కాదు.. ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్‌ఎస్, ఐఎఫ్‌ఓఎస్ వంటి సర్వీసులను కూడా సమర్థంగా ఉపయోగించుకోవడం ద్వారా ఆర్థిక, సామాజిక, మానవహక్కుల సాధన సుళువు అవుతుందని పటేల్ భావించారు. బ్రిటిష్ ఇండియాలో ఐసీఎస్ 1854లో ప్రారంభం అయింది. అందుకు నేపథ్యం.. ప్రతిభ ఆధారంగా ఎంపిక చేసే అధికారులను ఇండియన్ సివిల్ సర్వీసులలో నియమించాలని బ్రిటిష్ అధికారి మెకాలే ప్రతిపాదించడం.
ఆ ప్రతిపాదనతో ఆయన పార్లమెంటుకు నివేదికను సమర్పించిన అనంతరం సివిల్ సర్వీస్ కార్యరూపం దాల్చింది. 1855లో బ్రిటన్‌లో తొలి ఐసీఎస్ పరీక్ష జరిగింది. తర్వాత 1922 లో తొలిసారి భారతదేశంలోనే ఈ పరీక్షను నిర్వహించారు. అమృతోత్సవాలు జరుగుతున్న ఈ తరుణంలో సివిల్ సర్వీసుల వ్యవస్థను మరింత మెరుగ్గా ప్రజాప్రయోజనార్థం సంస్కరించేందుకు సమాలోచనలు జరుగుతున్నాయి.
(చదవండి: నేను నమ్ముతున్నాను)
Comments
Please login to add a commentAdd a comment