న్యూఢిల్లీ: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2022 ఇంటర్వ్యూలు ఇటీవల ముగిసిన సంగతి తెలిసిందే. యూపీఎస్సీ సివిల్స్ ఫైనల్ ఫలితాలను మే 22వ తేదీలోపు ఎప్పుడైనా విడుదల చేసే అవకాశం ఉంది.
ఈసారి యూపీఎస్సీ 861 సివిల్ సర్వీసెస్ ఉద్యోగాల భర్తీకి నోటీఫికేషన్ విడుదల చేయగా, ఈసారి తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులు సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూలకు హాజరైనట్లు తెలుస్తోంది. దేశం మొత్తం మీద 2,529 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూకి అర్హత సాధించారు. యూపీఎస్సీ సివిల్స్ ఫైనల్ ఫలితాలు విడుదలైన తర్వాత టాప్ ర్యాంకర్ల ఇంటర్వ్యూలను సాక్షి ఎడ్యుకేషన్.కామ్ (www.sakshieducation.com)లో చూడొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment