- రూ.25 లక్షల వైద్య పరికరాల పంపిణీ
- ఆస్పత్రిని సందర్శించిన ఈడీ మహాపాత్ర
ప్రభుత్వాస్పత్రికి ఎన్టీపీసీ చేయూత
Published Sat, Aug 13 2016 10:57 PM | Last Updated on Mon, Sep 4 2017 9:08 AM
కోల్‌సిటీ : గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రికి రామగుండం ఎన్టీపీసీ చేయూత అందిస్తోంది. ఎన్టీపీసీ ఈడీ ప్రశాంత్‌కుమార్ మహాపాత్ర శనివారం ప్రభుత్వాస్పత్రిని సందర్శించారు. ఐసీయూ, ఎస్‌ఎన్‌సీయూ విభాగాలను పరిశీలించిన ఈడీ ఆస్పత్రి అధికారులను అభినందించారు. ఎన్టీపీసీ, సీఎస్‌ఆర్ విభాగం ద్వారా రూ.25 లక్షలతో కొనుగోలు చేసిన రెండు ఐసీయూ వెంటిలేటర్లు, నాలుగు మల్టీప్యారా మీటరు, వైద్య పరికరాలను ఈడీ ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ సూర్యశ్రీకి అందజేశారు. పేదలకు కార్పొరేట్ స్థాయి సేవలందాలనే ఉద్దేశంతో చేయూతను అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సీఎస్‌ఆర్ హెచ్‌ఆర్ ఏజీఎం ఎం.ఎస్.రమేష్‌తోపాటు రఫిక్ ఇస్తాం, రాంకిషన్, విఠల్‌కుమార్, ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
Advertisement
Advertisement