కొత్త ఏడాది అనంగానే పలువురు రాబోయే ఏడాదిలో ఏమి జరుగుతుందో తమదైన శైలిలో భవిష్యత్తు గురించి చెప్పేస్తుంటారు జ్యోతిష్యులు. అందరూ కూడా తమకు ఈ కొత్త ఏడాదిలో మంచి జరగాలని రకరకాలుగా సెలబ్రేషన్స్ జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో రష్యా మాజీ అధ్యక్షుడు, పుతిన్ సన్నిహితుడు, రష్యా భద్రతామండలి డిప్యూటీ చైర్మన్ దిమిత్రి మెద్వేదేవ్ ఏకంగా 2023లో అమెరికా ఎలా ఉంటుందో జోస్యం చెప్పారు. ఈ మేరకు మెద్వెదేవ్ ట్విట్టర్‌లో.. అమెరికాలో అంతర్యుద్ధం జరుగుతోందని, ఫలితంగా కాలిఫోరియా, టెక్సాస్ రాష్టాలు స్వతంత్ర రాష్టాలుగా విడిపోయే పరిస్థితి ఏర్పడుతుందంటూ..సంచలన విషయాలు చెప్పారు.
దీంతో అధ్యక్ష ఎన్నికల్లో ట్విట్టర్ బాస్ ఎలన్ మస్క్ అమెరికా అధ్యక్షుడవుతారని ట్విట్టర్ వేదికగా జోస్యం చెప్పారు. అంతేగాదు ఆంగ్లో సాక్సన్ స్నేహితులకు వారి పిల్లలకు న్యూ ఇయర్ శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. ఒక రష్యా అత్యున్నతాధికారి ఇలా వింతగా జోస్యం చెప్పడం నెటిజన్లను ఆశ్చర్యచకితులను చేసింది. ఈ ట్విట్టర్ పోస్ట్ నెట్టింట దావానలంలా వైరల్ అయ్యింది.
ఈ పోస్ట్ ఎలన్ మస్క్ దృష్టికి రావడమే కాదు ఆయన ఈ విషయంపై వెంటనే స్పందించారు కూడా. ఈ మేరకు మస్క్ రష్యా అధికారి మెద్వెదేవ్ ఒక పురాణకథను వల్లించారంటూ సెటైర్ వేశారు. తెలివితేటల పరంగానూ, రాజీకయపరంగానూ చూసినా.. ఇది అత్యంత అవాస్తవమైనా, అసంబద్ధమైన అంచనా. ఇది అతని అవగాహన లేమికి నిదర్శనం అంటూ ఎలన్ మస్క్ రష్యా మాజీ అధ్యక్షుడు మెద్వెదేవ్‌కి గట్టి కౌంటరిచ్చారు.
8. Civil war will break out in the US, California. and Texas becoming independent states as a result. Texas and Mexico will form an allied state. Elon Musk’ll win the presidential election in a number of states which, after the new Civil War’s end, will have been given to the GOP
— Dmitry Medvedev (@MedvedevRussiaE) December 26, 2022
(చదవండి: బయల్దేరే సమయానికి మంచు తుపాను...ఏకంగా 18 గంటల పాటు కారులో)
Comments
Please login to add a commentAdd a comment