Dmitry Medvedev
-
మరో ఆప్షన్ లేదు.. జెలెన్స్కీని మట్టుబెట్టాల్సిందే!
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను డ్రోన్లతో హత్య చేయడానికి ఉక్రెయిన్ పన్నిన కుట్రను.. భద్రతా సిబ్బంది భగ్నం చేశాయి. అధ్యక్ష నివాసంలో పుతిన్ ఉంటున్న ఫ్లోర్‌కు అతి సమీపంగా రెండు డ్రోన్లు వెళ్లాయని, వాటిని నేల కూల్చినట్లు బుధవారం క్రెమ్లిన్ వర్గాలు ప్రకటించాయి. దీనికి ప్రతీకారంగా మాస్కో వర్గాలు.. ఉక్రెయిన్ రాజధాని నగరం కీవ్‌లో ఉన్న అధ్యక్ష భవనాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ దాడితో తమకేం సంబంధం లేదని ఉక్రెయిన్ అంటోంది. మరోవైపు పుతిన్‌పై హత్యాయత్నానికి రష్యా తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం వచ్చిందని అంటున్నారు ఆ దేశ మాజీ అధ్యక్షుడు, పుతిన్‌కు ఆప్తుడు దిమిత్రి మెద్వెదేవ్. ఉక్రెయిన్ ఉగ్రదాడికి కౌంటర్‌గా.. ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీని మట్టుబెట్టాల్సిందేనని రష్యా బలగాలకు సూచిస్తున్నాడు ఆయన. ప్రస్తుతం రష్యా భద్రతా మండలి డిప్యూటీ చైర్మన్‌గా ఉన్న మెద్వెదేవ్ తాజా పరిణామాలపై స్పందిస్తూ.. ‘‘రష్యా అధ్యక్షుడిపై జరిగిన హత్యాయత్నం ద్వారా ఉక్రెయిన్ ఉగ్రచర్యలకు దిగింది. ఇలాంటి పరిస్థితుల్లో రష్యా ముందు ఒకేఒక్క ఆప్షన్ ఉంది. అది జెలెన్స్కీని మట్టుబెట్టడమే. ఇక ఆ హిట్లర్(జెలెన్స్కీని ఉద్దేశించి..) లొంగిపోవాల్సి అవసరం లేదు. ఎలాంటి షరతులు లేకుండా లొంగిపోతానని వచ్చినా ఉపేక్షించాల్సిన అవసరం లేదు. మాస్కో ముందు మరో ప్రత్యామ్నాయమూ అక్కర్లేదు. అతన్ని భౌతికంగా లేకుండా చేయడమే ఇప్పుడు రష్యా బలగాలు చేయాల్సిన పని అని మెద్వెదేవ్ చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. మంగళవారం అర్ధరాత్రి పుతిన్ అధ్యక్ష అధికారిక నివాసం క్రెమ్లిన్‌పై ఉక్రెయిన్ UAV(మానవ రహిత) దాడులకు తెగబడిందని, వాటిని చాకచక్యంగా నేలకూల్చామని, ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లలేదని మాస్కో వర్గాలు ప్రకటించాయి. ఆ సమయంలో పుతిన్ ఇంట్లో లేడని వెల్లడించిన ఆయన సిబ్బంది.. మాస్కోలోని తన నివాసం నుంచే ఆయన తన కార్యకలాపాలను యథావిధిగా కొనసాగిస్తారని తెలిపింది. అంతేకాదు మే 9వ తేదీన రెడ్ స్క్వేర్ వద్ద జరిగే విక్టరీ డే పరేడ్‌పై ఈ డ్రోన్ ఎటాక్ ప్రభావం ఉండబోదని స్పష్టం చేసింది. జెలెన్స్కీ ఏమన్నారంటే.. ఇదిలా ఉంటే.. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ.. రష్యా ఆరోపణలను ఖండించారు. పుతిన్‌పై గానీ, మాస్కోపైగానీ ఉక్రెయిన్ దళాలు ఎలాంటి దాడులకు యత్నించలేదని స్పష్టత ఇచ్చారు. ఇలాంటి దాడులకు సరిపడే ఆయుధ సంపత్తి ఉక్రెయిన్ వద్ద లేదని చెబుతున్నారాయన. మేం మా దేశ సరిహద్దులోనే పోరాడుతున్నాం. మా గ్రామాలను, నగరాలను రక్షించుకుంటున్నాం. మా వద్ద అలాంటి దాడులు చేయాలన్నా.. అందుకు తగ్గ ఆయుధాలు లేవు. అంతేసి ఖర్చు చేసే పరిస్థితుల్లోనూ లేం అని చెబుతున్నారు. ఇదీ చదవండి: మొసలి కడుపులోకి ఎలాగ వెళ్లాడంటే.. -
అమెరికాలో అంతర్యుద్ధం..అధ్యక్షుడిగా ఎలన్ మస్క్!
కొత్త ఏడాది అనంగానే పలువురు రాబోయే ఏడాదిలో ఏమి జరుగుతుందో తమదైన శైలిలో భవిష్యత్తు గురించి చెప్పేస్తుంటారు జ్యోతిష్యులు. అందరూ కూడా తమకు ఈ కొత్త ఏడాదిలో మంచి జరగాలని రకరకాలుగా సెలబ్రేషన్స్ జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో రష్యా మాజీ అధ్యక్షుడు, పుతిన్ సన్నిహితుడు, రష్యా భద్రతామండలి డిప్యూటీ చైర్మన్ దిమిత్రి మెద్వేదేవ్ ఏకంగా 2023లో అమెరికా ఎలా ఉంటుందో జోస్యం చెప్పారు. ఈ మేరకు మెద్వెదేవ్ ట్విట్టర్లో.. అమెరికాలో అంతర్యుద్ధం జరుగుతోందని, ఫలితంగా కాలిఫోరియా, టెక్సాస్ రాష్టాలు స్వతంత్ర రాష్టాలుగా విడిపోయే పరిస్థితి ఏర్పడుతుందంటూ..సంచలన విషయాలు చెప్పారు. దీంతో అధ్యక్ష ఎన్నికల్లో ట్విట్టర్ బాస్ ఎలన్ మస్క్ అమెరికా అధ్యక్షుడవుతారని ట్విట్టర్ వేదికగా జోస్యం చెప్పారు. అంతేగాదు ఆంగ్లో సాక్సన్ స్నేహితులకు వారి పిల్లలకు న్యూ ఇయర్ శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. ఒక రష్యా అత్యున్నతాధికారి ఇలా వింతగా జోస్యం చెప్పడం నెటిజన్లను ఆశ్చర్యచకితులను చేసింది. ఈ ట్విట్టర్ పోస్ట్ నెట్టింట దావానలంలా వైరల్ అయ్యింది. ఈ పోస్ట్ ఎలన్ మస్క్ దృష్టికి రావడమే కాదు ఆయన ఈ విషయంపై వెంటనే స్పందించారు కూడా. ఈ మేరకు మస్క్ రష్యా అధికారి మెద్వెదేవ్ ఒక పురాణకథను వల్లించారంటూ సెటైర్ వేశారు. తెలివితేటల పరంగానూ, రాజీకయపరంగానూ చూసినా.. ఇది అత్యంత అవాస్తవమైనా, అసంబద్ధమైన అంచనా. ఇది అతని అవగాహన లేమికి నిదర్శనం అంటూ ఎలన్ మస్క్ రష్యా మాజీ అధ్యక్షుడు మెద్వెదేవ్కి గట్టి కౌంటరిచ్చారు. 8. Civil war will break out in the US, California. and Texas becoming independent states as a result. Texas and Mexico will form an allied state. Elon Musk’ll win the presidential election in a number of states which, after the new Civil War’s end, will have been given to the GOP — Dmitry Medvedev (@MedvedevRussiaE) December 26, 2022 (చదవండి: బయల్దేరే సమయానికి మంచు తుపాను...ఏకంగా 18 గంటల పాటు కారులో) -
యూఎస్ ఇలానే ఆయుధాలు సరఫరా చేస్తే.. విధ్వంసకర దాడి చేస్తాం!
మాస్కో: రష్యా యుద్ధాన్ని కొనసాగిస్తుందే తప్ప ఆపదు! అని రష్యా భద్రత డిప్యూటీ చైర్మన్, మాజీ అధ్యక్షుడు డిమిత్రి మెద్వెదేవ్ వ్యాఖ్యానించారు. ఒక వేళ ఉక్రెయిన్ నాటోలో చేరనని అధికారికంగా ప్రకటించిన రష్యా తన నిర్ణయాన్ని మార్చుకోదు అని కరాఖండిగా చెప్పేశారు. ఈ మేరకు ఆయన ఫ్రెంచ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ..."తాము ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్ స్కీతో చర్చలు జరిపినప్పుడు కొన్ని షరతులు గురించి చెప్పాం. ఆఖరికి ఫిబ్రవరిలో యుద్ధం ప్రారంభించడానికి ముందు కూడా నాటోలో చేరడాన్ని తాము అంగీకరించం అని చాలా స్పష్టంగా ఉక్రెయిన్‌కి చెప్పాం. అయినా ఇప్పుడూ ఉక్రెయిన్‌కి నార్త్ అట్లాంటిక్‌లో భాగస్వామ్యం కానని ప్రకటించడం తప్ప మరో మార్గం లేదు. అయినప్పటికీ ఇరు దేశాల మధ్య అల్లకల్లోలంగా ఉన్న ఈ పరిస్థితుల్లో తిరిగి శాంతి నెలకొల్పడం కూడా కష్టమే. పైగా రష్యా కూడా తన లక్ష్యాన్ని చేరుకునేంత వరకు ఈ యుద్ధాన్ని ఆపదు." అని తేల్చి చెప్పారు. తమ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ లక్ష్యం ఉక్రెయిన్‌ని నాటోలో చేరుకుండా చేయడమేనని చెప్పారు. యుద్ధం ప్రారంభమైన తర్వాత కూడా పలు దఫాలుగా ఇరు దేశాల మధ్య చర్చలు సాగాయి, కానీ వాటిలో పెద్దగా పురోగతి కనిపించలేదన్నారు. ఇరు దేశాల మధ్య మరోసారి చర్చలు జరిగే అవకాశం కూడా లేకపోలేదన్నారు. ఐతే ఈ చర్చలు ఎలా సాగుతాయనే దానిపైనే ఆధారపడి ఉందని చెప్పారు. తాము కూడా జెలెన్స్కీతో మరోసారి చర్చలు సాగించేందుకు సుమఖంగానే ఉన్నామని మెద్వెదేవ్ చెబుతున్నారు. ఉక్రెయిన్‌కి యూఎస్ ఆయుధాల సరఫరా చేసిన విషయం గురించి ప్రస్తావిస్తూ.... తాము ప్రయోగించిన బహుళా రాకెట్ లాంచెర్ ఉక్రెయిన్‌లో ఇంకా పెను విధ్వంసాని సృష్టించలేదు. కానీ యూఎస్ ఇలానే ఆయుధాల సరఫరాను కొనసాగిస్తే మాత్రం కచ్చితంగా ఆ విధ్వంకర దాడి జరుగుతుందని హెచ్చరించారు. (చదవండి: అది రష్యాకు వ్యతిరేకంగా ఓటేసినట్లు కాదు.. జెలెన్స్కీకి సపోర్ట్‌పై భారత్ ‘టెక్నికల్’ వివరణ) -
అప్పటి వరకు యుద్దం ఆగదు.. బాంబ్ పేల్చిన మాజీ ప్రధాని
మాస్కో: ఉక్రెయిన్‌పై రష్యా దాడుల నేపథ్యంలో అమెరికా, ఈయూ సహా కొన్ని దేశాలు రష్యాపై కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పుతిన్ సైతం ఆంక్షలను లెక్కచేయకుండా దాడులను ఉధృతం చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఉక్రెయిన్ మిత్ర దేశాలను సైతం హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. రష్యా మాజీ ప్రధాని, రష్యా భద్రతా మండలి డిప్యూటీ హెడ్ దిమిత్రి మెద్వెదెవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యాపై విధించిన అద్భుతమైన ఆంక్షలతో ఉక్రెయిన్‌లో పరిస్థితులపై మార్పును ఆశించవద్దని తెలిపారు. పుతిన్ తన లక్ష్యాలను సాధించే వరకు సైనిక దాడులు కొనసాగుతూనే ఉన్నాయని స్పష్టం చేశారు. కాగా, శనివారం రష్యా బలగాలు కీవ్ సహా ఇతర ప్రాంతాలపై దాడులు కొనసాగిస్తున్న క్రమంలో ఆయన ఈ కామెంట్స్ చేయడం ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు గురి చేసింది. ఈ క్రమంలోనే 2008లో జరిగిన జార్జియా-రష్యా దాడిని మిద్వెదెవ్ మరోసారి గుర్తు చేశారు. అప్పటి పరిస్థితులే ఇప్పుడు కూడా కొనసాగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంక్షలు అనేవి తాత్కాలికమంటూ బాంబ్ పేల్చారు. -
రష్యా ప్రధాని సంచలన నిర్ణయం!
మాస్కో: రష్యా ప్రధాన మంత్రి దిమిత్రి మెద్వెదేవ్ తన పదవికి రాజీనామా చేసినట్లు టాస్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. దిమిత్రితో సహా రష్యా ప్రభుత్వ మంత్రిమండలి మొత్తం పదవుల నుంచి వైదొలగినట్లు పేర్కొంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బుధవారం జాతిని ఉద్దేశించి మాట్లాడిన క్రమంలో దిమిత్రి రాజీనామా ప్రకటన చేయడం గమనార్హం. పుతిన్ మాట్లాడుతూ... రాజ్యాంగాన్ని సవరించాల్సిన అవసరం ఉందని.. ఈ మేరకు ప్రధాని, మంత్రుల అధికారాలను మరింత బలోపేతం చేయాల్సిన ఆవశ్యకత ఉందంటూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ప్రధాని దిమిత్రి తన పదవికి రాజీనామా చేయడం గమనార్హం. ఈ మేరకు దిమిత్రి మాట్లాడుతూ... ‘దేశ భవిష్యత్తుకై అధ్యక్షుడు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కల్పించాల్సిన అవసరం ఉంది. ఇకపై తదుపరి నిర్ణయాలు ఆయనే తీసుకుంటారు’ అని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా... దిమిత్రి మెద్వెదేవ్ ప్రధానిగా తన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తించారని పుతిన్ కొనియాడారు. అయితే ఆయన కేబినెట్ మాత్రం లక్ష్యాలు చేరుకోవడంలో విఫలమైందని పేర్కొన్నారు. కాగా పుతిన్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరొందిన దిమిత్రి 2012 నుంచి ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు. ఇక ఆయనను జాతీయ భద్రతా మండలి డిప్యూటీగా పుతిన్ నియమించినట్లు సమాచారం. -
వీసా లేకుండా రష్యా వెళ్లొచ్చు..
మాస్కో: రష్యా వెళ్లే భారతీయులకు ఇకపై వీసా అవసరం ఉండదు. ఈ అవకాశాన్ని రష్యా 18 దేశాలకు కల్పించింది. ఇందులో ఇండియా కూడా ఒకటి. ఈ విషయాన్ని ఆదేశ ప్రధానమంత్రి మెద్వెదేవ్ స్వయంగా ప్రకటించారు. ఇండియాతోపాటు యూఏఈ, అల్జీరియా, బహ్రెయిన్, బ్రూనే, కువాయిట్, ఇరాన్, ఖతార్, చైనా, ఉత్తరకొరియా, మొరాకో, మెక్సికో, ఒమన్, సౌదీ అరేబియా, సింగపూర్, ట్యునీసియా, టర్కీ, జపాన్ దేశాల నుంచి రష్యా తూర్పును ఉన్న నగరాలు, పట్టణాలకు వెళ్లే పర్యాటకులు, వ్యాపారవేత్తలకు ఈ వెసులుబాటు వర్తించనుంది. తూర్పు రష్యాలో పెట్టుబడులను ఆకర్షించటంతోపాటు పర్యాటక రంగ ఆదాయం పెంచుకునే ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ నిర్ణయంపై సానుకూలంగా స్పందించే దేశాలతో వీసా-ఫ్రీ ఒప్పందాలు కుదుర్చుకుంటామని చెప్పారు. ఈ మేరకు ఆయా దేశాల నుంచి వచ్చేవారికి సంబంధించిన పూర్తి వివరాలతో ప్రత్యేక వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇంతేకాకుండా, ఈ ప్రాంతంలోనే ఉన్న వ్లాడివోస్టోక్ నౌకాశ్రయంలో ఎటువంటి వీసా అవసరం లేకుండా పర్యటించేందుకు మార్చి నుంచి వీలు కల్పించినట్లు వివరించారు. -
ఇరుదేశాల సంబంధాలు మరింత బలపడుతాయి: మోడీ
నే పీ: భారత ప్రధాని నరేంద్రమోదీ, రష్యా ప్రధాని దిమిత్రి మెద్వెదేవ్ లు భేటి అయ్యారు. ఇరుదేశాల సంబంధాలు మరింత బలపడుతాయని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. భారత, రష్యాల మధ్య సంబంధాలు బలపడుతాయని బలంగా నమ్ముతున్నాను అని మెద్వెదేవ్ కు పంపిన సందేశంలో మోడీ పేర్కొన్నారు. తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ ప్రకటన ఇరుదేశాల మధ్య సంబంధాలు మెరుపడుతాయని భావిస్తున్నారు. ప్రస్తుతం మియన్మార్ లో ప్రధాని పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. మాకు భారత దేశం సన్నిహితమైన, విలువైన భాగస్వామ్య దేశం అని మెద్వెదేవ్ ఓ సందేశంలో తెలిపారు.