2008 నాటి జార్జియా ఫైల్ ఫొటో
మాస్కో: ఉక్రెయిన్‌పై రష్యా దాడుల నేపథ్యంలో అమెరికా, ఈయూ సహా కొన్ని దేశాలు రష్యాపై కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పుతిన్ సైతం ఆంక్షలను లెక్కచేయకుండా దాడులను ఉధృతం చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఉక్రెయిన్ మిత్ర దేశాలను సైతం హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా.. రష్యా మాజీ ప్రధాని, రష్యా భద్రతా మండలి డిప్యూటీ హెడ్ దిమిత్రి మెద్వెదెవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యాపై విధించిన అద్భుతమైన ఆంక్షలతో ఉక్రెయిన్‌లో పరిస్థితులపై మార్పును ఆశించవద్దని తెలిపారు. పుతిన్ తన లక్ష్యాలను సాధించే వరకు సైనిక దాడులు కొనసాగుతూనే ఉన్నాయని స్పష్టం చేశారు.
కాగా, శనివారం రష్యా బలగాలు కీవ్ సహా ఇతర ప్రాంతాలపై దాడులు కొనసాగిస్తున్న క్రమంలో ఆయన ఈ కామెంట్స్ చేయడం ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు గురి చేసింది. ఈ క్రమంలోనే 2008లో జరిగిన జార్జియా-రష్యా దాడిని మిద్వెదెవ్ మరోసారి గుర్తు చేశారు. అప్పటి పరిస్థితులే ఇప్పుడు కూడా కొనసాగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంక్షలు అనేవి తాత్కాలికమంటూ బాంబ్ పేల్చారు.
Comments
Please login to add a commentAdd a comment