విస్తృత అవగాహనతో ముందుకు... | Key role in victory Civil Subject Economy | Sakshi
Sakshi News home page

విస్తృత అవగాహనతో ముందుకు...

Published Thu, Jun 26 2014 3:23 AM | Last Updated on Sat, Sep 2 2017 9:23 AM

విస్తృత అవగాహనతో ముందుకు...

విస్తృత అవగాహనతో ముందుకు...

 సివిల్స్ మహాయజ్ఞంలో మొదటి అంకమైన ప్రిలిమ్స్ ఈ ఏడాది ఆగస్టులో యూపీఎస్సీ నిర్వహించనుంది. విజయానికి తొలి అడుగైన ఈ పరీక్షలో నెగ్గి మెయిన్స్ ముంగిట నిలవాలని అభ్యర్థులు పరితపిస్తున్నారు. పరీక్ష రోజు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుబాటులో ఉన్న కొద్దిరోజులను సిలబస్ పునశ్చరణకు సద్వినియోగపరుచుకుంటున్నారు. అయితే ప్రిలిమినరీ పేపర్‌లో ప్రధాన సబ్జెక్ట్, కొంచెం క్లిష్టమైన దిగా భావించే ఎకానమీ అంశాన్ని ఏ విధంగా చదవాలి? ఏ అంశాలపై ఎక్కువ దృష్టిపెడితే పరీక్షను  పభావవంతంగా రాయవచ్చనే విషయాలపై ప్రత్యేకం.
 
 సివిల్స్ విజయంలో కీలక పాత్ర పోషించే సబ్జెక్ట్‌లలో ఎకానమీ ఒకటి.. ప్రిలిమ్స్‌తోపాటు మెయిన్స్‌లో కూడా ఎకానమీ ప్రధాన భూమిక పోషిస్తుంది.. కాబట్టి ఈ సబ్జెక్ట్‌లో సాధించే మార్కులు చివరి అంకంగా నిలిచే ఇంటర్వ్యూకు అర్హత సాధించడంలో కీలకంగా ఉంటాయి.
 
 ప్రాధాన్యత:
 ప్రిలిమ్స్‌లో భాగమైన జనరల్ స్టడీస్ పేపర్‌లోని ఎకానమీ సబ్జెక్ట్ ప్రాధాన్యత మెయిన్‌‌సలోనూ కనిపిస్తుంది. గత ప్రశ్నాపత్రాలను పరిశీలిస్తే... ప్రిలిమ్స్‌లో ఎకానమీ సంబంధిత అంశాలపై సగటున 15-20 ప్రశ్నల వరకు అడగడాన్ని గమనించవచ్చు. ప్రిలిమ్స్‌కు సన్నద్ధమయ్యే విద్యార్థులు మెయిన్‌‌సలో జనరల్ స్టడీస్‌లో భాగంగా ఉన్న ఎకానమీ సిలబస్‌ను పరిశీలిస్తూ ఆ దిశగా అధ్యయనాన్ని కొనసాగించడం ఉత్తమం. గత ప్రశ్న పత్రాలను గమనిస్తే... ప్రశ్నలు అధికంగా ఉపాధి, ప్రణాళికలు, అభివృద్ధి, ద్రవ్యం, బ్యాంకింగ్, విదేశీ వాణిజ్యం, వ్యవసాయం, అవస్థాపనా సౌకర్యాలు, ప్రభుత్వ విత్తం, జనాభా, పేదరికం లాంటి అంశాల నుంచి ఎక్కువగా ఇస్తున్నారు.
 
 కాన్సెప్ట్‌ల ఆధారంగా:
 2013 ప్రిలిమ్స్‌లో ఎకానమీకి సంబంధించి అడిగిన ప్రశ్నలన్నీ కాన్సెప్ట్స్ ఆధారంగా ఉన్నవే. దీన్ని బట్టి చూస్తే ప్రిలిమ్స్‌కు హాజరయ్యే విద్యార్థులు సంబంధిత అంశాల్లోని ప్రాథమిక భావనల (కాన్సెప్ట్స్) పట్ల విస్తృత అవగాహన ఏర్పరచుకుంటే మెరుగైన ఫలితం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. ప్రాథమిక భావనలపై అవగాహన కోసం ఎన్‌సీఈఆర్‌టీ 6వ తరగతి నుంచి 12వ తరగతి పుస్తకాలను అధ్యయనం చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది. మరో కీలక అంశం.. పేపర్-1కు సంబంధించి ప్రశ్నలను కాన్సెప్ట్యువల్ బేస్డ్‌గా అడుగుతున్నారు. కాబట్టి ఒక అంశాన్ని చదివేటప్పుడు దాని నేపథ్యం నుంచి తాజా పరిణామాల వరకు అన్నిటినీ సమన్వయం చేసుకుంటూ చదవాలి.
 
 అధ్యయనం చేయాల్సినవి:
 ప్రిలిమ్స్‌కు హాజరయ్యే విద్యార్థులు ఎకానమీ అధ్యయనంలో భాగంగా వివిధ కమిటీలు- నివేదికలు, వ్యవసాయ రంగం, పారిశ్రామికరంగం, సేవారంగం, బ్యాంకింగ్, పన్నుల వ్యవస్థ, జాతీయాదాయం, యుఎన్‌డీపీ మానవాభివృద్ధి నివేదిక, 12వ ప్రణాళిక, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ప్రపంచ వాణిజ్య సంస్థ, అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్), ప్రపంచ బ్యాంక్, ద్రవ్యం-బ్యాంకింగ్, పేదరికం, సాంఘిక భద్రత, సుస్థిర అభివృద్ధి, ద్రవ్యోల్బణం వంటి అంశాలను అధ్యయనం చేయాలి. ఈ అంశాలపై విద్యార్థులకు ఉన్న అవగాహన మెయిన్స్‌లోనూ ఉపకరించే అవకాశం ఉంది. విదేశీ వాణిజ్యం, ప్రణాళికలు, పన్నుల వ్యవస్థ, పేదరికం, సుస్థిర వృద్ధి లాంటి అంశాలకు సంబంధించిన ప్రశ్నలు మెయిన్స్‌లోనూ తరచుగా ఉండటాన్ని ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి.
 
 అధ్యయనంలో భాగంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
 తరుచుగా సబ్జెక్ట్ పట్ల విసృ్తత అవగాహన పెంపొందించుకోవడానికి ప్రయత్నించాలి.పరీక్ష ప్రక్రియకు అనుగుణంగా సబ్జెక్ట్‌ను అధ్యయనం చేయాలి.ఎప్పటికప్పుడు నోట్స్ రూపొందించుకోవాలి. మోడల్ పేపర్లలో ఇచ్చిన ప్రశ్నలను క్షుణ్నంగా పరిశీలించాలి. తద్వారా గత కొంత కాలంగా అడుగుతున్న ప్రశ్నల సరళిపై అవగాహన వస్తుంది.
 
 ప్రతి అంశాన్ని పరిశీలించేటప్పుడు విమర్శనాత్మక విశ్లేషణను పెంపొందించుకోవడం వల్ల ప్రిపరేషన్ ప్రభావవంతంగా ఉంటుంది.ప్రిపరేషన్ స్థాయిని తెలుసుకునేందుకు అభ్యర్థి తన నిష్పాదన (పర్‌ఫార్మెన్‌‌స)ను ఎప్పటికప్పుడూ సమీక్షించుకోవాలి. ఈ దశలో విజయం లేదా అపజయం లాంటి విషయాల గురించి ఆలోచన తగ్గించుకోవాలి.బహుళైచ్ఛిక ప్రశ్న (ఆబ్జెక్టివ్ క్వశ్చన్)లలో ఒకే విధమైన ఐచ్ఛికాలు (ఆప్షన్‌‌స) ఉండే ప్రశ్నల పట్ల అవగాహన పెంచుకోవాలి.ప్రశ్నను పూర్తిగా అర్థం చేసుకోవడానికి ప్రతి ఐచ్ఛికాన్ని పూర్తిగా చదవడం నేర్చుకోవాలి.
 
 మెయిన్స్, ప్రిలిమినరీ రెండింటికీ:
 కొన్ని అంశాలు ప్రిలిమ్స్‌తోపాటు మెయిన్స్‌లోనూ ఉపకరిస్తాయి. వీటిపై అవగాహన పెంచుకోవడంతో ప్రిలిమ్స్, మెయిన్స్‌కు ఏకకాలంలో ప్రిపరేషన్ సాగించవచ్చు.
 
 ప్రణాళిక ఇలా:
 ప్రణాళిక వృద్ధి-ఆర్థికాభివృద్ధి అనే అంశంపై అధ్యయనం చేసే క్రమంలో ముఖ్య పదకోశాలైన ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధి, ప్రణాళిక సంఘం, మల్టీ లెవల్ ప్లానింగ్, కేంద్రీకృత ప్రణాళిక లాంటి అంశాలను అవగాహన చేసుకుంటూ నోట్స్ రూపొందించుకోవాలి. కాన్సెప్ట్‌లతో పాటు ప్రణాళికలు, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ, ప్రభుత్వ రంగం, ప్రణాళిక లక్ష్యాలు, వికేంద్రీకృత ప్రణాళిక ప్రాధాన్యత, ఆర్థిక సంస్కరణలు లాంటి అంశాలపై అధ్యయనం అవసరం. మెయిన్స్‌లోను జనరల్ స్టడీస్-3లో ఈ అంశాలను ఎకానమీ సిలబస్‌లో భాగంగా ఇవ్వడం జరిగింది.
 
 పన్ను వ్యవస్థపై పట్టు:
 భారత్‌లో పన్నుల వ్యవస్థలో భాగంగా వివిధ పదకోశాలైన రెవెన్యూ రాబడి, రెవెన్యూ వ్యయం, మూలధన రాబడి, మూల ధన వ్యయం, ప్రణాళికా వ్యయం, ప్రణాళికేతర వ్యయం, ద్రవ్యలోటు, ప్రాథమిక లోటు లాంటి అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలి. ప్రామాణిక పుస్తకాల నుంచి ఆర్థిక సంఘం, విలువ ఆధారిత పన్ను (వాల్యూ యాడెడ్ ట్యాక్స్-వ్యాట్), వస్తువులు, సేవలపై పన్ను, ప్రభుత్వ రుణం- ఆర్థిక వ్యవస్థపై ప్రభావం లాంటి టాపిక్స్‌ను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. మెయిన్స్ జనరల్ స్టడీస్‌లో ఎకానమీలో భాగంగా పన్నుల వ్యవస్థను పొందుపరిచారు. మెయిన్స్ జనరల్ స్టడీస్-3లో జనరల్ బడ్జెటింగ్ పేరుతో ఈ సిలబస్‌ను పొందుపరిచారు.
 
 సమగ్ర నోట్స్:
 పేదరికం, సాంఘిక భద్రత, సుస్థిర వృద్ధికి సంబంధించిన అంశాలపై అవగాహన ప్రిలిమ్స్, మెయిన్స్ రెండింటికీ ఉపయోగపడుతుంది. ఈ క్రమంలో సమ్మిళిత వృద్ధి, మానవాభివృద్ధి, పేదరికం-సమ్మిళిత వృద్ధి, ఉపాధి, సాంఘిక భద్రత, గ్రామీణ అవ స్థాపనా సౌకర్యాలు, విద్య, ఆరోగ్యం, మహిళ, శిశుసంక్షేమ అభివృద్ధి, అసమానతలు లాంటి అంశాలకు సంబంధించి సమగ్రమైన నోట్స్ రూపొందించుకోవాలి. మెయిన్స్ జనరల్ స్టడీస్-3లో సమ్మిళిత వృద్ధికి సంబంధించిన అంశాలను సిలబస్‌గా పొందుపరచడం జరిగింది. జనరల్ స్టడీస్-2లోనూ సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన సిలబస్‌లో భాగంగా పై అంశాల పట్ల అవగాహన అవసరం.
 
 వ్యవసాయం:
 వ్యవసాయ రంగానికి సంబంధించి ప్రిలిమ్స్‌లో పలు అంశాలపై అధ్యయనం మెయిన్స్‌లోనూ ఉపకరిస్తుంది. మెయిన్స్‌లో జనరల్ స్టడీస్-2, జనరల్ స్టడీస్-3లో ఈ రంగానికి సంబంధించిన వివిధ అంశాలను సిలబస్‌లో పొందుపరిచారు. వ్యవసాయ రంగం అధ్యయనంలో భాగంగా భూ సంస్కరణలు, హరితవిప్లవం, మద్దతుధరలు, ఆహారభద్రత, ఆహార రాయితీలు, ఈ-చౌపల్, జాతీయ ఆహార భద్రతామిషన్, జాతీయ వ్యవసాయ విధానం, వ్యవసాయ బీమా, ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యు.టి.ఒ), వ్యవసాయ రాయితీలకు సంబంధించి సమగ్ర నోట్స్ సిద్ధం చేసుకోవాలి. ప్రతి అంశాన్ని క్షుణ్నంగా అధ్యయనం చేయాలి.
 
 పరిశ్రమలు:
 పరిశ్రమలు, అవస్థాపనా సౌకర్యాలకు సంబంధించి పారిశ్రామిక తీర్మానాలు, పెట్టుబడుల ఉపసంహరణ, నూతన తయారీ విధానం, ఎలక్ట్రానిక్‌పై నూతన విధానం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, భారత నిర్మాణరంగం (ఇన్‌ఫ్రాస్ట్రక్చర్), ఫైనాన్స్ కంపెనీకి సంబంధించి విషయ పరిజ్ఞానం అవసరం. ఈ అంశాలతో కూడిన సిలబస్‌ను మెయిన్స్ జనరల్ స్టడీస్-3లోనూ గమనించవచ్చు.


 విదేశీ వాణిజ్యం - అవగాహన:
 ప్రిలిమ్స్‌లో భాగంగా విదేశీ వాణిజ్యం పట్ల అవగాహన అవసరం. భారత్ ఎగుమతులు, దిగుమతులు, చెల్లింపుల శేషం, వాణిజ్య విధానం, వర్తక నిబంధనలు, స్థిర వినిమయ రేటు, అస్థిర వినిమయ రేటు, కరెంట్ అకౌంట్ లోటు, రూపాయి మూల్యహీనీకరణ లాంటి అంశాలపై అవగాహన అవసరం. మెయిన్స్ జనరల్ స్టడీస్-3లో ప్రపంచీకరణ అంశాన్ని పొందుపరిచారు. వివిధ పదకోశాలపై అవగాహన మెయిన్‌లోనూ ఉపయుక్తంగా ఉంటుంది. ప్రిలిమ్స్‌లో భాగంగా ద్రవ్యం, బ్యాంకింగ్‌కు సంబంధించిన అంశాలను పరిశీలించాలి. ద్రవ్యమార్కెట్, ఎన్.ఎ. ఎఫ్.సిలు, కేంద్ర బ్యాంక్ పరపతి విధానం, సెక్యూరిటీ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబి), బ్యాంకింగ్ సంస్కరణలు, బీమా సంస్కరణలు, సి.ఎ.ఆర్, బేస్‌రేటు, ఎం.ఎస్. ఎఫ్, మ్యూచువల్ ఫండ్స్‌లాంటి అంశాలను పరిశీలించాలి.
 
 ఇవి చదివితే మేలు
  కరెంట్ అఫైర్‌‌సలో భాగంగా:

 ప్రిపరేషన్‌లో కేవలం సిలబస్‌కే పరిమితం కాకుండా సంబంధిత అంశాలను సమకాలీన సంఘటనల (కరెంట్ అఫైర్స్)తో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలి. తద్వారా ప్రిపరేషన్ అర్థవంతంగా ఉంటుంది. సమకాలీన అంశాల్లో భాగంగా పరిశీలించాల్సినవి..
 
     కార్పొరేట్ గవర్నెన్‌‌సపై సెబీ జారీ చేసిన మార్గదర్శకాలు
     ఇటీవల టోకు ధరల సూచీ (గ్కిఐ), వినియోగదారుని ధరల సూచీ (ఇ్కఐ)
     2013-14 ఆర్థిక సంవత్సరంలో వివిధ రాష్ట్రాల వృద్ధి రేట్లు, ద్రవ్య లోటు
     సామాజిక అభివృద్ధి సూచిక (సోషల్ ప్రోగ్రెస్ ఇండెక్స్)
     ఏషియన్ డెవలప్‌మెంట్ అవుట్‌లుక్ -2014
     కేంద్ర బ్యాంకు కొత్త బ్యాంకులకు సంబంధించిన లెసైన్స్‌ల మంజూరు
     కేంద్ర బ్యాంకు ద్రవ్య విధానంలో భాగంగా విధాన రేట్లలో మార్పు
     బేసల్ -3 (ఆ్చట్ఛఐఐఐ ) నియమాలు
     పీఎఫ్‌నకు సంబంధించి యూనివర్సల్ అకౌంట్ నంబర్
     ఎన్నికల వ్యయం
     కరెంట్ అకౌంట్ లోటు
     రూపాయి మూల్యహీనీకరణ
 
 రిఫరెన్స్ బుక్స్
     జనరల్ స్టడీస్: ఎస్‌సీఈఆర్‌టీ 6నుంచి 12వ తరగతి పుస్తకాలు
     ఇండియా ఇయర్‌బుక్
     ఇండియా ఎకనమిక్ సర్వే
     ఇండియన్ ఎకానమీ-ఎస్‌కే మిశ్రా అండ్ పూరి
     ఇండియన్ ఎకానమీ- ఉమా కపిల
     ఇండియాస్ ఎకానమీ ఇన్ ద 21 సెంచరీ -
 రాజ్ కపిల అండ్ ఉమా కపిల
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement