సాక్షి, హైదరాబాద్: ఆడుతూపాడుతూ సన్నద్ధమైన ఓ యువతి ఇప్పుడు దేశంలోనే అత్యున్నత సర్వీస్ అయిన సివిల్స్‌లో మెరిసింది. టాప్ 20 ర్యాంక్ సాధించి సత్తా చాటింది. అది కూడా తొలి ప్రయత్నంలోనే సాధించడం విశేషం. ఆమెనే తెలంగాణకు చెందిన శ్రీజ. సివిల్స్‌లో ఆలిండియా 20వ ర్యాంకు వచ్చిన పి.శ్రీజ స్వస్థలం వరంగల్. హైదరాబాద్‌లోని ఉప్పల్ సమీపంలోని సాయినగర్‌లో నివాసం ఉంటున్నారు.
తండ్రి శ్రీనివాస్ హబ్సిగూడలోని వాహనాల షోరూంలో సేల్స్ మేనేజర్‌గా పనిచేస్తుండగా.. తల్లి శ్రీలత నర్సుగా పనిచేస్తున్నారు. శ్రీజ ఉస్మానియా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ చదివింది. తాజాగా తన తొలి ప్రయత్నంలోనే సివిల్స్‌లో 20వ ర్యాంకు సాధించింది. ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ఎంబీబీఎస్ చేశానని.. పేదలకు మరింత సేవ చేయాలన్న ఆలోచనతో సివిల్స్‌కు సిద్ధమయ్యానని శ్రీజ తెలిపింది.
(చదవండి: మా సంస్థ అంకిత భావాన్ని గుర్తించి ఈ అవార్డును అందించినందుకు మనసారా కృతజ్ఞతలు: స్వేరోస్)
‘‘పెద్దగా ఒత్తిడికి గురికాకుండా ఆడుతూపాడుతూ సివిల్స్ పరీక్షలకు సిద్ధమయ్యా. అన్ని అంశాలపై అవగాహన పెంచుకోవడంతో ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షల్లో.. ఇంటర్వ్యూలో ఎలాంటి తడబాటు లేకుండా నిలిచా. కోచింగ్, తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహం నా విజయానికి తోడ్పడ్డాయి..’’ అని పేర్కొంది.
(చదవండి: అవార్డు మరింత స్ఫూర్తినిస్తుంది: అరుణ్ డేనియల్ ఎలమటి)
Comments
Please login to add a commentAdd a comment